నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

28, డిసెంబర్ 2015, సోమవారం

2nd Martial Arts Class Photos

ముందే ప్లాన్ చేసినట్లు, రెండవ తంత్ర - మార్షల్ ఆర్ట్స్ క్లాస్ 27-12-2015 న జయప్రదంగా జరిగింది.నాతో గత నాలుగైదు ఏళ్ళుగా సన్నిహితంగా ఉంటున్న నా శిష్యులను మాత్రమే ఈ క్లాస్ కు ఎంపిక చెయ్యడం జరిగింది.

ఈ క్లాస్ లో "ఐకిడో" విద్యను పరిచయం చేస్తూ దానినుండి కొన్ని టెక్నిక్స్ ను వీరికి నేర్పడం జరిగింది.

అన్ని వీరవిద్యలలోకీ "ఐకిడో" అనేది చాలా రిఫైండ్ మార్షల్ ఆర్ట్ అని చాలామంది అభిప్రాయపడతారు.కారణమేమంటే - వింగ్ చున్ కుంగ్ఫూ లోవలె ఇందులోకూడా మినిమం మూమెంట్ తో మేక్జిమం ఎఫెక్ట్ రాబట్టడం ఉంటుంది.అంతేగాక ప్రత్యర్ధికి ఎక్కువ హాని జరగకుండా మానవతా దృక్పథంతో అతన్ని ఎంతవరకు కంట్రోల్ చెయ్యాలో అంతవరకు మాత్రమే చేసే విద్య ఇది.

ఇందులో 'కి' లేదా ప్రాణశక్తి కి సంబంధించిన అభ్యాసాలు ఉంటాయి.అయితే అవి సీనియర్స్ కి మాత్రమే నేర్పబడతాయి.

ఐ-కి-డో అనే జపనీస్ పదంలో మూడు మాటలున్నాయి.

ఐ - శబ్దానికి, కలయిక అని అర్ధం.
కి - శబ్దానికి ప్రకృతిలో ఉన్న ఎనర్జీ అని అర్ధం.
డో - అనే శబ్దానికి దారి లేదా మార్గం అని అర్ధం.

కనుక ఈ పదానికి - ప్రకృతిలోనూ తనలోనూ ఉన్న ప్రాణశక్తితో అనుసంధానం అవడం అనే అర్ధం వస్తుంది.

జపనీస్ విద్యలలో చాలావాటికి చివరలో 'డో' అనే పదం వస్తుంది. అంటే అదొక మార్గం లేదా ప్రత్యేకమైన విద్య అని అర్ధం.ఉదాహరణకు - జూడో - కెండో - నగినాట డో - కరాటే డో -బుషి డో మొదలైనవి. 

ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.

వచ్చే పోస్ట్ లో వీడియో క్లిప్స్ చూడండి.