నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

13, డిసెంబర్ 2015, ఆదివారం

Kaisa Pyar Kaha Ki Mohabbat - Chandru Atma


కైసా ప్యార్ కహాకి మొహబ్బత్
బాతే హై బెహలానే కీ...

అంటూ చంద్రు ఆత్మా ఆలపించిన ఈ మధురగీతం దాదాపు 60 ఏళ్ళనాటిది.ఈ గీతం మధురమైనదే గాక గొప్ప వాస్తవిక భావాన్ని కూడా కలిగి ఉన్నది.

మనిషి జీవితం అంతా స్వార్ధమయమే.ఇక్కడ ప్రేమ అనేది లేనేలేదు.కలిసి జీవిస్తున్నవారి మధ్యకూడా ఉండేది స్వార్ధపరమైన అనుబంధాలే గాని ప్రేమ కాదు.ప్రేమ అనేది ఎక్కడో నూటికో కోటికో ఒకచోట మాత్రమే చీకట్లో నక్షత్రంలా మినుకుమినుకు మంటూ ఉంటుంది.మిగతాదంతా స్వార్ధమే. లోకులు ప్రేమగా భ్రమిస్తున్నది కూడా స్వార్ధమే తప్ప ఇంకేమీ కాదు.మనిషి జీవితం మొత్తం స్వార్ధమయమే.మనిషి జీవితంలో అవసరం అవకాశం స్వార్ధం తప్ప ఇంకేమీ లేవు.ఉండవు.ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది నిజం.ఈ నగ్నసత్యాన్నే ఈ గీతం తేటతెల్లం గావిస్తుంది.

ఇది చంద్రు ఆత్మా పాడిన ప్రైవేట్ గీతం. ఈపాటలో మొదటిది చివరది రెండే చరణాలున్నాయి. "పానీ బర్సే ఊపర్ సే ఫిర్"- అనే చరణాన్ని నేను వ్రాసి ఈ పాటలో కలిపాను.

ఈ రాగం వింటుంటే - పి.సుశీల పాడిన 'రాధకు నీవేర ప్రాణం' -అనే ఒక తెలుగు పాట మీకు లీలగా గుర్తు రావాలి. ఈ రెండు పాటలూ ఒకే రాగచ్చాయలోనివే.

Song:--Kaisa Pyaar Kaha Ki Mohabbat
Singer:--Chandru Atma
Karaoke Singer:--Satya Narayana Sarama
Enjoy
-------------------
Kaisa pyar kahan ki mohabbat
baate hai bahelaane kee-2
Kaisa pyar kahan ki mohabbat
baate hai bahelaane kee-2

[Chaar kadam chal kar har saathi
Baad me yu dhal jaaye}-2
Jaise Subon Ko Suraj Nikle-2
Shaam Samay Dhal jaaye ho

Kaisa pyar kahan ki mohabbat
baate hai bahelaane kee-2

[Paanee barse oopar se phir
saagar me mil jaaye]-2
logon ne is raah me mil kar-2
kahaa bichadke jaaye ho

Kaisa pyar kahan ki mohabbat
baate hai bahlaane kee-2

[Hasne ka anjaam ronaa
chaahat kaa rusvaayee]-2
Doonda jab dil saath kiseeka-2
Milee hame tanhayee ho

Kaisa pyar kahan ki mohabbat
baate hai bahlaane kee-2
---------------------------------
Meaning:--
What is Love?Where is love?
It is just a soothing word
Thats all...

In this world
people just walk four steps together
then they go their ways
Just like the Sun rises in the morning
and sets in the evening
It is similar

What is Love?Where is love?
It is just a soothing word
Thats all...

Water falls from the sky
and ends up with the ocean
On the path of life,people just meet
then after some time, they depart,
Nobody knows where.

What is Love?Where is love?
It is just a soothing word
Thats all...

Laughter originates from weeping
and desire from evil
I searched for a companion on my path
but met only loneliness

What is Love?Where is love?
It is just a soothing word
Thats all...
----------------------------------

తెలుగు స్వేచ్చానువాదం

ఈ లోకంలో ప్రేమ ఎక్కడుంది?
లేనేలేదు
అది ఉత్త మాట మాత్రమే
ఇక్కడున్నది స్వార్ధం ఒక్కటే...

లోకులు నాలుగడుగులు కలసి నడుస్తారు
ఆ తర్వాత ఎవరిదారిన వారు విడిపోతారు
సూర్యుడు పొద్దున్నే ఉదయిస్తాడు
సాయంత్రానికి మాయమౌతాడు
ఇదీ అంతే

పైనుంచి వర్షపు నీరు భూమిని చేరుతుంది
చివరకు సముద్రంలో కలుస్తుంది
జీవనపథంలో మనుషులు కూడా ఇంతే
కలుస్తారు విడిపోతారు
చివరకు ఎక్కడకు పోతారో ఎవరికీ తెలియదు

ఏడుపునుంచే నవ్వు పుడుతుంది
మాలిన్యం నుంచే కోరిక పుడుతుంది
నాదారిలో ఒక తోడు కోసం వెదికాను
ఒంటరితనమే నా తోడుగా దొరికింది

ఈ లోకంలో ప్రేమ ఎక్కడుంది?
లేనేలేదు
అది ఉత్త మాట మాత్రమే
ఇక్కడున్నది స్వార్ధం ఒక్కటే...