“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

25, జనవరి 2016, సోమవారం

నాకూ మొగుడు కావాలి - Sports and Cultural Meet -2016 నాటిక

జనవరి 22,23,24 తేదీలలో సికింద్రాబాద్ లో జరిగిన స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ -2016 లో గుంటూరు డివిజన్ తరఫున ఒక హాస్యనాటికను ప్రదర్శించాము.ఈ నాటిక పేరు  "నాకూ మొగుడు కావాలి".

దీనిని నేనే వ్రాసి,దర్శకత్వం వహించడమే కాక,ఇందులో ముఖ్యపాత్రను కూడా పోషించాను.ఈ పాత్రపేరు రాణి.ఇది ఒక హిజ్రా వేషం.ఈ వేషం వెయ్యడానికి ఎవరూ ముందుకు రాలేదు.అందుకని నేనే ఈ పాత్రను ధరించి ప్రేక్షకులను మెప్పించాను.ఈ వేషధారణకూ, నటనకూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ముందుగా పంజాబీ డ్రస్ వేసుకుందామని అనుకున్నా.కానీ దానికంటే చీరే బాగుంటుందని చీరే కట్టుకున్నాను.

నేను సికింద్రాబాద్ వచ్చానని తెలిసి మన శిష్యులు అభిమానులు కొందరు వచ్చి రోజంతా నాతోనే ఉన్నారు. ఇంకొందరు వారి వారి ఉద్యోగం మధ్యలో కొంచం వెసులుబాటు చేసుకుని వచ్చి కలిశారు.వారితో తీయించుకున్న రాణి వేషంలోని ఫోటోలను కొన్నింటిని ఇక్కడ చూడవచ్చు.

ఈ వేషంతో గ్రీన్ రూమ్ లో కూచుని ఉంటే, లోపలికొచ్చి చూసిన నా క్లోజ్ స్నేహితులూ కొలీగ్సే నన్ను గుర్తుపట్టలేదు.ఎవరోలే అనుకుని వెనక్కు వెళ్లిపోతుంటే నేనే పిలిస్తే అప్పుడు గుర్తుపట్టారు.

మొత్తమ్మీద ఆ రోజంతా ఒకటే నవ్వులు జోకులతో చాలా సరదాగా గడిచింది.