Pages - Menu

Pages

3, జనవరి 2016, ఆదివారం

Tu Kahi Bhi Rahe - Ghulam Ali




మనకిష్టమైన ఘజల్స్ జోలికి పోయి చాలా రోజులైంది కనుక ఈరోజున గులాం అలీ పాడిన ఈ ఘజల్ ను సమర్పిస్తున్నాను.

అన్ని ఘజల్స్ కూ రెండు మూడు అర్దాలుంటాయని గతంలోనే చెప్పాను.ఈ ఘజల్ కు కూడా అంతే.

తన ప్రియురాలిని ఉద్దేశించి పాడుతున్నట్లు దీనిని అనుకోవచ్చు.లేదా దైవాన్ని గురించి పాడుతున్నట్లుగా కూడా భావించవచ్చు.ఏ రకంగా చూచినా ఈ పాట భావం చక్కగా సరిపోతుంది.

"చేతిగీతలను చెరుపుకోవడం ఎవరికీ సాధ్యంకాదు.అవి చెరిపినా చెరిగిపోవు. నీచేతి గీతల్లోనే నా పేరు వ్రాసి ఉంది.నువ్వు నన్ను మరచిపోవాలని ప్రయత్నించినా మర్చిపోలేవు".అని తన ప్రియురాలిని ఉద్దేశించి ఈ ఘజల్ పాడుతాడు.

"నువ్వు నన్ను స్వీకరించినా స్వీకరించకపోయినా,నువ్వు చేసిన అన్యాయం మాత్రం నీ నొసటివ్రాతగా మిగిలిపోతుంది.అది ఎన్నటికీ చెరిగిపోదు.నన్ను మర్చిపోవడం నీవల్ల కాదు." అంటాడు ఈ గాయకుడు.

ఇదొక నిష్ఠుర ప్రేమగీతం. వినండి.

Song:--Tu Kahi Bhi Rahe Sar Par Tere Ilzamm To Hai
Singer:--Ghulam Ali
Karaoke Singer--Satya Narayana Sarma.
Enjoy
--------------------------
Tu kahi bhi rahe sar par tere ilzaam to hai
Tu kahi bhi rahe sar par tere ilzaam to hai
Tere hathon ki lakeeron me mera naam to hai
Tu kahi bhi rahe sar par tere ilzaam to hai

Mujhko tu apna bana yana bana tereee khushi-3
Too Zamane me mere - naam se badnaam to hai
Tu kahi bhi rahe sar par tere ilzaam to hai

Mere hisse me koi Jaam na aaya hi sahi-3
Tere mehfil me mere – naam-- koee shaam to hai
Tu kahi bhi rahe sar par tere ilzaam to hai

Dekh kar log mujhe naam - tera lete hai-3
Ispe me khush hu Moha - bbat ka ye anzaam to hai
Tu kahi bhi rahe sar par tere ilzaam to hai

Wo sitamgar hi sahi dekhke usko saabir-3
Shukar hai is dile - bimaar ko aaraam to hai
Tu kahi bhi rahe sar par tere ilzaam to hai
Tere hathon ki lakeeron me mera naam to hai

Tu kahi bhi rahe sar par tere ilzaam to hai-3
Meaning:--
------------
Where ever you may be, your head carries my blame
My name is written on the lines of your hand
You cannot get rid of it
Where ever you may be, your head carries my blame

To make me your own or not
is purely your choice
But the world knows our relation
So,It blames you anyway for leaving me

I might not have got my share of your wine
So what?
In your silent evenings
My name certainly flashes in your mind
It is enough for me.

On seeing my condition,people will blame you
I am happy at this,because
Somehow, love shows its effect, you see !

You might be cruel,so what?
On seeing you at least once
my sorrowful heart feels happy
may be ! just for a moment
That is enough for me.

Where ever you may be, your head carries my blame
My name is written on the lines of your hand
You cannot get rid of it
Where ever you may be, your head carries my blame


తెలుగు స్వేచ్చానువాదం

నువ్వెక్కడున్నా సరే
నా నిందను మాత్రం మొయ్యక తప్పదు
నీ చేతిగీతల నుంచి నా పేరును చెరిపెయ్యడం
నీవల్ల కానే కాదు 
నువ్వెక్కడున్నా సరే
నా నిందను మొయ్యక తప్పదు

నన్ను నీవాడిగా అంగీకరించడం
లేదా తిరస్కరించడం
అది నీ ఇష్టం
కానీ
ప్రపంచానికి మన సంగతి ఎప్పుడో తెలుసు

నీ మధువులో నాకు భాగం లేకపోవచ్చు
కానీ నన్ను తలచుకోకుండా నువ్వు ఉండలేవు
నీ సాయం సమయాల స్మృతిపధంలో
నేను తప్పక మెదులుతాను
నాకది చాలు

నా పరిస్థితిని చూచి లోకులు నిన్ను నిందిస్తారు
అది నాకు సంతోషాన్నే కలిగిస్తుంది
ఎందుకంటే ప్రేమ తన ప్రభావాన్ని
ఏదో రకంగా తప్పకుండా చూపిస్తుంది కదా

నువ్వెంత క్రూరాత్మురాలవైనా సరే
ఒక్కసారి నిన్ను చూస్తే చాలు
కుమిలిపోతున్న నా గుండెకు
ఆనందం క్షణకాలమైనా దక్కుతుంది

నీ చేతి గీతల నుంచి నా పేరును చెరిపెయ్యడం
నీవల్ల కానే కాదు 
నువ్వెక్కడున్నా సరే
నా నిందను మాత్రం మొయ్యక తప్పదు