హేమంత్ ముఖర్జీ పాడిన "అమాయ్ ప్రోశ్నో కొరే" బెంగాలీ పాటకు ఇది రీమిక్స్ సాంగ్.
పాత మధురగీతాలను ఎలెక్ట్రానిక్ బీట్ తో మోడరన్ సాంగ్స్ గా తెచ్చే ప్రయత్నం చాలా భాషల్లో చాలా పాటల్లో జరిగింది. వాటిల్లో కొన్ని బాగుంటాయి.కొన్ని బాగుండవు.
ఒక పాత పాటను పాడే విధానం వేరు.అదే పాటను ఒక రీమిక్స్ పాటగా పాడే విధానం వేరు.అదే రాగమే అయినా బీట్ కు తగినట్లుగా దానిని కొంత విరుస్తూ పాడవలసి వస్తుంది.దీనివల్ల శాస్త్రీయ రాగం చెడిపోయే మాట వాస్తవమే.కానీ రక్కెస పొదల్లో కూడా ఒక విధమైన అందం ఉన్నట్లు మోడరన్ బీట్ సాంగ్స్ లో కూడా ఒక రకమైన బ్యూటీ ఉంటుంది.
పాత పాటల్లో రాగానికి ప్రాధాన్యత ఉంటుంది.రీమిక్స్ పాటల్లో బీట్ కు ప్రాధాన్యం ఉంటుంది. పాతా కొత్త పాటల మధ్యన తేడాను చూపడం కోసమే ఈ రీమిక్స్ సాంగ్ ను పాడాను.
వినండి మరి.