వెలలేని వజ్రాల
నిధిని నీకై తెస్తే
రంగురాళ్ళంటూ దాన్ని
రచ్చ చేశావ్ కదూ
ఎడారిలో నీకోసం
చెట్టునై నిలిస్తే
చీకటంటూ నీడను
ఛీదరించావ్ కదూ
మంచి పండు నిద్దామని
రుచి చూచి నీకిస్తే
ఎంగిలంటూ దాన్ని
ఎక్కిరించావ్ కదూ
ఎదనిండు ప్రేమతో
ఎదురేగి నేనొస్తే
కామమంటూ నన్ను
కాలదన్నావ్ కదూ
నీ ఘోష వినలేక
నీ ఇంటికే వస్తే
బయటకే పొమ్మంటూ
బహిష్కరించావ్ కదూ
నీ బాధ కనలేక
నిను హత్తుకుంటే
పిడిబాకుతో వెన్ను
పెళ్ళగించావ్ కదూ
నీ కొరకు పాడిన
ఈ ప్రేమ గీతాన్ని
పిచ్చి వాగుడని భలే
మెచ్చుకున్నావ్ కదూ
నిను చూడగా నేను
జాబిల్లినై వస్తే
తలుపు తీయక నన్ను
తల్లడించావ్ కదూ
నీకోసమిచ్చిన
వెలలేని బహుమతిని
చెత్తకుప్పల పైన
చేరవేశావ్ కదూ
ప్రేమ పొంగే కనుల
నీవైపు నే చూస్తె
కోరికంటూ దాన్ని
కొక్కిరించావ్ కదూ
అమృతపు హృదయాన్ని
నీ చేతిలో పెడితే
పనికిరానిదని దాన్ని
పారవేశావ్ కదూ
వేవెలుగు దీపాన్ని
నీకొరకు వెలిగిస్తే
వెలుగెక్కువైందని
ఆర్పివేశావ్ కదూ
ఆకలిని తీర్చగల
అన్నమై నేనొస్తే
అవసరం లేదని
అవమానించావ్ కదూ
పాముల బొరియల
పాడుకొంపల నుంచి
పారిరమ్మని చెబితే
పాపమన్నావ్ కదూ
కాలిపోయే నిన్ను
కాపాడుతానంటే
కాలసర్పమై నన్ను
కాటు వేశావ్ కదూ
ముద్దుగా నిను చూచి
మురిసి పోతూ ఉంటె
కామపిశాచి వంటూ
కస్సుమన్నావ్ కదూ
నా ప్రేమరత్నాన్ని
నీకివ్వబోతుంటే
బిచ్చగాణ్ణని నాకు
భిక్షమేశావ్ కదూ
నాటకాలాపేసి
నాతోటి రమ్మంటే
నయవంచనంటూ
నింద వేశావ్ కదూ
చావునే దాటించు
సత్యాన్ని వివరిస్తే
మోజుపడుతూ చేసే
మోసమన్నావ్ కదూ
దాహాన్ని తీర్చగల
అమృతపు భాండాన్ని
విషపు కుండవంటూ
విసుక్కున్నావ్ కదూ
నా మనసు గదిలోకి
నిను చేర రమ్మంటే
కట్లతో నిను నువ్వు
కట్టుకున్నావ్ కదూ
నిర్వాణ నిఖిలాన్ని
నీకివ్వ బోతుంటే
సంసార సంకెళ్ళు
సౌఖ్యమన్నావ్ కదూ
నిను కోరుతూ స్వర్గం
నీ ఎదురుగా ఉంటే
నినువదలి రాలేక
నీల్గుతున్నావ్ కదూ
నీ కోసమే నేను
దివినుంచి దిగివస్తే
పగటి వేషమంటూ
ఫక్కుమన్నావ్ కదూ
నిధిని నీకై తెస్తే
రంగురాళ్ళంటూ దాన్ని
రచ్చ చేశావ్ కదూ
ఎడారిలో నీకోసం
చెట్టునై నిలిస్తే
చీకటంటూ నీడను
ఛీదరించావ్ కదూ
మంచి పండు నిద్దామని
రుచి చూచి నీకిస్తే
ఎంగిలంటూ దాన్ని
ఎక్కిరించావ్ కదూ
ఎదనిండు ప్రేమతో
ఎదురేగి నేనొస్తే
కామమంటూ నన్ను
కాలదన్నావ్ కదూ
నీ ఘోష వినలేక
నీ ఇంటికే వస్తే
బయటకే పొమ్మంటూ
బహిష్కరించావ్ కదూ
నీ బాధ కనలేక
నిను హత్తుకుంటే
పిడిబాకుతో వెన్ను
పెళ్ళగించావ్ కదూ
నీ కొరకు పాడిన
ఈ ప్రేమ గీతాన్ని
పిచ్చి వాగుడని భలే
మెచ్చుకున్నావ్ కదూ
నిను చూడగా నేను
జాబిల్లినై వస్తే
తలుపు తీయక నన్ను
తల్లడించావ్ కదూ
నీకోసమిచ్చిన
వెలలేని బహుమతిని
చెత్తకుప్పల పైన
చేరవేశావ్ కదూ
ప్రేమ పొంగే కనుల
నీవైపు నే చూస్తె
కోరికంటూ దాన్ని
కొక్కిరించావ్ కదూ
అమృతపు హృదయాన్ని
నీ చేతిలో పెడితే
పనికిరానిదని దాన్ని
పారవేశావ్ కదూ
వేవెలుగు దీపాన్ని
నీకొరకు వెలిగిస్తే
వెలుగెక్కువైందని
ఆర్పివేశావ్ కదూ
ఆకలిని తీర్చగల
అన్నమై నేనొస్తే
అవసరం లేదని
అవమానించావ్ కదూ
పాముల బొరియల
పాడుకొంపల నుంచి
పారిరమ్మని చెబితే
పాపమన్నావ్ కదూ
కాలిపోయే నిన్ను
కాపాడుతానంటే
కాలసర్పమై నన్ను
కాటు వేశావ్ కదూ
ముద్దుగా నిను చూచి
మురిసి పోతూ ఉంటె
కామపిశాచి వంటూ
కస్సుమన్నావ్ కదూ
నా ప్రేమరత్నాన్ని
నీకివ్వబోతుంటే
బిచ్చగాణ్ణని నాకు
భిక్షమేశావ్ కదూ
నాటకాలాపేసి
నాతోటి రమ్మంటే
నయవంచనంటూ
నింద వేశావ్ కదూ
చావునే దాటించు
సత్యాన్ని వివరిస్తే
మోజుపడుతూ చేసే
మోసమన్నావ్ కదూ
దాహాన్ని తీర్చగల
అమృతపు భాండాన్ని
విషపు కుండవంటూ
విసుక్కున్నావ్ కదూ
నా మనసు గదిలోకి
నిను చేర రమ్మంటే
కట్లతో నిను నువ్వు
కట్టుకున్నావ్ కదూ
నిర్వాణ నిఖిలాన్ని
నీకివ్వ బోతుంటే
సంసార సంకెళ్ళు
సౌఖ్యమన్నావ్ కదూ
నిను కోరుతూ స్వర్గం
నీ ఎదురుగా ఉంటే
నినువదలి రాలేక
నీల్గుతున్నావ్ కదూ
నీ కోసమే నేను
దివినుంచి దిగివస్తే
పగటి వేషమంటూ
ఫక్కుమన్నావ్ కదూ