“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

13, ఏప్రిల్ 2016, బుధవారం

Khilte Hai Gul Yaha - Kishore Kumar




ఖిల్తే హై గుల్ యహా మిల్కే బిఖర్ నే కో...మిల్తే హై దిల్ యహా మిల్కే బిచడ్ నే కో...

అంటూ కిషోర్ కుమార్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1971 లో వచ్చిన "షర్మీలీ"  అనే సినిమాలోది.ఇది ఎప్పటికీ మరపురాని మధురగీతాలలో ఒకటి.

ఈ పాట అంతా ఉమర్ ఖయాం తాత్త్విక చింతనతో నిండి ఉంటుంది.అందుకే ఇది నాకు బాగా నచ్చిన పాటల్లో ఒకటి.రెండేళ్ళ క్రితం మొట్ట మొదటి పాటగా నేను పోస్ట్ చేసినది కూడా ' పూచెను సుమములే..' అంటూ ఈ రాగానికి నేను అల్లిన గీతమే.

ఈ గీతం ప్రేమను గురించి చెబుతుంది.లోకం యొక్కా, జీవితం యొక్కా క్షణభంగురత్వాన్ని గురించీ అశాశ్వతత్వాన్ని గురించీ చెబుతుంది.జీవితం అనుక్షణం నీ చేతిలోనుంచి జారిపోతున్నది.రోజులు నెలలు ఏళ్ళూ దొర్లిపోతున్నాయి.మరణం నిన్ను అనుక్షణం సమీపిస్తున్నది.ఆలస్యం చెయ్యకు.ఉన్న నాలుగు రోజులు ప్రేమను చవిచూడు.జీవితాన్ని ఆనందంగా గడుపు - అంటూ ఈ గీతం ఉద్బోధిస్తుంది.

This song represents a wonderful philosophy of life.

నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని వినండి మరి.

Movie:--Sharmeelee (1971)
Lyrics:--Neeraj
Music:--S.D.Burman
Singer:--Kishore Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------
Khilte hai gul yahaa - Khilke bikharne ko
Milte hai dil yaha - Milke Bichadne ko
Khilte hai gul yahaa

Kal rahe na rahe - Mousam ye pyar ka
Kal ruke na ruke - Dola bahar ka
Char pal mile jo aaj - Pyar me gujar de

Khilte hai gul yahaa

Jeelo ke hoton par - Meghon ka raag hai
Phoolon ke seene me - Thandi thandi aag hai
Dil ke aayine me too - Ye sama utaar de

Khilte hai gul yahaa

Pyaasa hai dil sanam - Pyasi ye raat hai
Hoton me dabi dabi - Koyi meethi baat hai
In lamhon pe aaj tu - Har khushi nisar de

Khilte hai gul yahaa - Khilke bikharne ko
Milte hai dil yaha - Milke Bichadne ko
Khilte hai gul yahaa

Meaning:

Roses blossom here
Only to wither away
Hearts meet here
Only to get separated

This weather of love
may or may not remain tomorrow
This swing of beautiful spring season
may or may not remain with us tomorrow
If you get a few minutes today
Spend them in love

On the lips of the lake yonder
there flows the music of clouds
In the bosom of flowers
there is a cold cold fire
In my hearts mirror
You enjoy this beautiful moment

This heart is thirsty
this night is thirsty too
On my lips, there quiver
a few sweet words
In these lovely moments
Sacrifice your everything

Roses blossom here
Only to wither away
Hearts meet here
Only to get separated

తెలుగు స్వేచ్చానువాదం

గులాబీలు ఇక్కడ పూస్తాయి
వాడిపోవడానికే
హృదయాలు ఇక్కడ కలుస్తాయి
విడిపోవడానికే

నేటి ప్రేమ వాతావరణం
రేపటికి ఉంటుందో ఉండదో
నేటి వసంతపు ఊయల
రేపటికి ఉంటుందో ఉండదో
నేడు నీచేతిలో ఉన్న నాలుగు నిముషాలు
ప్రేమించడంలో గడుపు

నది పెదవుల(అలల) మీద
మేఘాల రాగాలు నర్తిస్తున్నాయి
పూల హృదయాలలో
చల్లని మంటలు మండుతున్నాయి
నా హృదయం అనే అద్దంలో
ఈ మధుర సమయాన్ని ఆవిష్కరించు

నా హృదయం దాహంతో ఉంది
ఈ రాత్రి కూడా దాహంతో ఉంది
నా పెదవులమీద మధురమైన
మాటలు కొన్ని నర్తిస్తున్నాయి
ఈ క్షణంలో నీ సర్వం ఆహుతి కానీ

గులాబీలు ఇక్కడ పూస్తాయి
వాడిపోవడానికే
హృదయాలు ఇక్కడ కలుస్తాయి
విడిపోవడానికే