ముకేష్ చంద్ర మాధుర్ (ముకేష్) పాడినవి అనేక మధుర గీతాలున్నాయి.వాటిల్లోంచి ఏ పాట పాడదామా అని ఆలోచిస్తుంటే,' ప్రస్తుతం వర్షాకాలమేగా? వర్షాలు పడినా పడకపోయినా, ఆయన పాడిన ఒక మాంచి రొమాంటిక్ వానపాట ఉన్నది పాడతావా? సీజనూ మూడూ రెండూ కలిసొస్తాయి?' అంటూ చిలిపిగా అడిగింది కర్ణపిశాచి.
సాధ్యమైనంత సీరియస్ గా దానివైపో సారి చూచి - 'సరే అలాగే' అంటూ 'మరి ట్రాకో?' అన్నా ముక్తసరిగా. దానితో ఎక్కువ మాట్లాడకూడదు. మాటలు పొడిగిస్తే లేనిపోని తంటా వస్తుంది.
'ఇదుగో ఇప్పుడే క్షణంలో తెస్తా' అంటూ మాయమై పోయి అన్నట్లుగా ఒకే ఒక్క క్షణంలో ట్రాక్ తో వచ్చి ప్రత్యక్షమైంది కర్ణపిశాచి.ట్రాక్ రెడీగా ఉంటే మనం పాడటం ఎంతసేపు? ఒరిజినల్ ఒక్కసారి వినేశా. పాడేశా.
'వర్ష' అనే సంస్కృత పదానికి అపభ్రంశ రూపమే 'బర్ఖా'. అయితేనేం ఆ మాట కూడా మధురంగానే ఉంటుంది.
ఈ పాట అలా వచ్చిందన్నమాట.
బర్ఖా రానీ జరా జం కే బర్సో మేరా దిల్ బర్ జాన పాయే ఝూం కర్ బర్సో..
అంటూ ముకేష్ స్వరంలో మధురంగా పలికిన ఈ పాట SABAK అనే సినిమాలోది.ఈ సినిమా 1973 లో వచ్చింది.
వర్షాకాలం అనేది అతి ప్రాచీనకాలం నుంచీ కూడా ప్రేమకాలంగా కవులచేత వర్ణించబడుతూ వచ్చింది.ఇది మనకు జూన్ జూలై నెలలలో వస్తుంది.కాళిదాసు అంతటివాడే తన అమరకావ్యమైన 'మేఘదూతం'లో వర్షాకాలపు ప్రేమికుల విరహవేదనను మధురాతి మధురంగా వర్ణించాడు.
ఈ పాట రెండు చరణాల చిన్న పాటే.కానీ దీని భావం చాలా మనోజ్ఞమైనది.అందులోనూ దీనికి సావన్ కుమార్ తాక్ ఇచ్చిన సాహిత్యమూ, ఆ సాహిత్యానికి ఉషాఖన్నా ఇచ్చిన రాగమూ, దానిని ముకేష్ పాడిన తీరూ కలసి ఈ పాటను ఒక మరపురాని మధురగీతంగా మలిచాయి.
అప్పట్లో ఈపాట ఒక సూపర్ హిట్ సాంగ్.
ఈ పాట మహత్యమో ఏమో గాని, దీనిలో నటించిన శత్రుఘ్న సిన్హా, పూనం ధిల్లాన్ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.అలాగే - ఈపాటను వ్రాసిన సావన్ కుమార్, సంగీతం సమకూర్చిన ఉషా ఖన్నా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
ఆ విధంగా ఈ పాట నిజంగానే ఒక రొమాంటిక్ సాంగ్ గా నిలిచింది.
ఈ పాటను ఈ సినిమాకు ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ అయిన జుగల్ కిషోర్,జయశ్రీల మీద మొదటగా చిత్రీకరించారు.కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఈ పాట సూపర్ హిట్ అవ్వడంతో, మళ్ళీ ఒక వానపాటగా శత్రుఘ్న సిన్హా, పూనం ల మీద చిత్రీకరించారు.
అయితే, శత్రుఘ్నసిన్హా నిజంగా ప్రేమించిన వర్షరాణి - భార్యయైన పూనం కాదు.ప్రేయసి అయిన రీనారాయ్ అని చాలామంది అంటారు.నిజానిజాలు దేవుడికెరుక.మనకు తెలీదు.
పోతే - ఈ పాటను వింటేనే బాగుంటుంది. వీడియో చూస్తే అస్సలు బాగుండదు.
వీడియో చూడకుండా ఈ పాటను వింటే, ఒక చక్కని సీన్ మన మనసు ముందు సాక్షాత్కరిస్తుంది.
ప్రియుని ఇంటికి ప్రేయసి ఏదో పనిమీద వచ్చింది.వెంటనే వెళ్ళిపోతానని అంటోంది. కానీ ఆమె అలా వెళ్ళిపోవడం అతనికి ఇష్టం లేదు.తనతోనే ఉండిపోవాలని అతని బాధ.ఇంతలో వర్షం మొదలైంది.వర్షాన్ని చూచిన ప్రేయసి, తడుస్తూ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక, అక్కడే కూచుండి పోయింది. ఇదీ ఈ పాట వెనుక ఉన్న భావం.
వెంటనే వర్షరాణిని వేడుకోవడం మొదలు పెట్టాడు ప్రియుడు.
'నువ్వు ఆపకుండా అలా కురుస్తూనే ఉండు.ఈ వర్షంలో తడవడం ఇష్టంలేక నా ప్రేయసి నాతోనే ఎప్పటికీ ఉండిపోతుంది' అంటాడు. "యూ బరస్ బరసో బరస్ ఏ ఉమ్ర్ భర్ నా జాయెరే.."--అంటాడు.
కవులకు భలేభలే భావాలు కలుగుతాయి. ఎలా వ్రాస్తారో ఏమో?
ఈ పాటను ఏకాగ్రతగా వింటే మంచి ఫీల్ వస్తుంది. కానీ సినిమాలో చూస్తే మాత్రం ఆ ఫీల్ అంతా పోయి పరమ దరిద్రంగా అనిపిస్తుంది. ఈ పాటను మంచి సెట్టింగ్ లో ఎంత రొమాంటిక్ గా తియ్యవచ్చో? కానీ చండాలంగా ఒక మామూలు సాదాసీదా వానపాటగా చిత్రీకరించారు.
ఏం చేస్తాం? సినిమా పాటలలో చాలావరకూ ఇలాగే ఏడుస్తాయి.భావంలో గాని రాగంలో గాని పాట చాలా అద్భుతంగా ఉంటుంది.కానీ చిత్రీకరణలోకి ఆ భావాన్ని తేవడంలో మాత్రం ఫెయిల్ అవుతారు.ఇలాంటి పాటను అద్భుతంగా తియ్యాలంటే,దర్శకునికీ కెమెరా మాన్ కీ, చాలా మంచి రొమాంటిక్ టేస్ట్ ఉండాలి.కానీ చాలాసార్లు అవి ఉండవు. అందుకే,ఇలాంటి పాటలను విని ఆనందించాలేగాని చూడకూడదు.
మొత్తంమీద చాలా మంచిసాంగ్.
ఏడుపు పాటలే పాడగలడు అనుకునే ముకేష్ ఒక అద్భుతమైన ప్రేమభావాన్ని కూడా తన స్వరంలో చక్కగా పలికించగలడు అని నిరూపించిన పాట.
ఏడుపు పాటలే పాడగలడు అనుకునే ముకేష్ ఒక అద్భుతమైన ప్రేమభావాన్ని కూడా తన స్వరంలో చక్కగా పలికించగలడు అని నిరూపించిన పాట.
ముకేష్ జన్మదినం రోజున, నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.
Movie:--SABAK (1973)
Lyrics:--Sawan Kumar Tak
Music:--Usha Khanna
Singer:--Mukesh Chandra Madhur aka MUKESH
Karaoke Singer:--Satya Narayana Sarma aka SATYA
Enjoy
----------------------------------------
[Barkha rani - Zara jam ke barso
Mera dilbar jaa na paaye - Jhumkar barso
Barkha rani] – 2
Ye abhi to aaye hai - Kahate hai ham jaae hai]-2
Yun baras baraso baras - Ye umr bhar na jaaye re
Barkha rani - Zara jam ke
baraso
Mera dilabar jaa na paye - Jhumakar baraso
Barkha rani
Mast sawan kee ghata - Bijuriya chamka zara]-2
Yaar mera dar ke mere - Seene se lag jaaye re
Barkha rani - Zara jam ke barso
Mera dilbar jaa na paye - Jhumkar barso
Barkha rani] – 2
Meaning
Oh Rain queen
Meaning
Oh Rain queen
Just pour down left and right
Don’t let my sweetheart go home
Pour down more and more heavily
She has come just now
And says –‘I want to go home’
You keep raining for years and years
So that she cannot leave me for her lifetime
Oh dark monsoon clouds
You send out streaks of dazzling lightning
So that, my darling, frightened by your thunders
Rushes to my bosom and hugs me tight
O Rain queen
Just pour down left and right
Don’t let my sweetheart go home
Pour down more and more heavily
తెలుగు స్వేచ్చానువాదం
ఓ వర్ష రాణీ, ఇంకా గట్టిగా కురువు
నీ ధాటి చూచి నా ప్రేయసి ఇంటికి వెళ్ళలేక
నాతోనే ఉండిపోవాలి
తను ఇప్పుడే వచ్చింది
వెంటనే వెళ్ళిపోతానని అంటోంది
ఏళ్ళ తరబడి నువ్విలా కురుస్తూనే ఉండు
జీవితమంతా నా ప్రేయసి నాతో ఇలాగే ఉండిపోవాలి
ఓ వర్షాకాలపు మేఘాల్లారా
ఇంకా గట్టిగా మెరిసి ఉరమండి
ఆ ఉరుములు విని నా ప్రేయసి బెదిరిపోయి
నా ఛాతీపైన వాలిపోవాలి
ఓ వర్ష రాణీ, ఇంకా గట్టిగా కురువు
నీ ధాటి చూచి నా ప్రేయసి ఇంటికి వెళ్ళలేక
నాతోనే ఉండిపోవాలి...