నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

17, జులై 2016, ఆదివారం

జూలై 2016 పౌర్ణమి ప్రభావం - టర్కీలో తిరుగుబాటు, అమృత్ సర్ లో భూకంపం

ఎల్లుండే పౌర్ణమి. అంటే మనం ప్రస్తుతం పౌర్ణమి ఛాయలో ఉన్నాం.

ఖగోళంలో కొనసాగుతున్న గురుచండాల యోగ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.అదీగాక కుజుని వక్రత్యాగమూ తిరిగి వేగంగా తనదైన వృశ్చిక రాశిలో ఉన్న వక్రశనీశ్వరుని వద్దకు చేరడమూ,చంద్రుని నీచస్థితీ ఇవన్నీ కలసి ప్రపంచవ్యాప్తంగా ఘోరాలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.

నిన్న టర్కీలో తిరుగుబాటు జరిగింది. అధ్యక్షుడు దేశంలో లేని సమయం చూచుకొని సైన్యంలో ఒక వర్గం తిరుగుబాటు చేసి ప్రజలను భయభ్రాంతులను చేసి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించింది.కానీ ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సైన్యాన్ని ఎదుర్కొని దేశాన్ని కాపాడుకున్నారు.సైన్యాన్ని ఎదుర్కొనే ప్రక్రియలో వందలాది జనం చనిపోయారు.ఈలోపల మిగతా సైన్యం వచ్చి తిరుగుబాటు వర్గాన్ని అదుపులోకి తెచ్చింది.ప్రస్తుతం ఒక 6000 మందిని ఈ కుట్రకు దోషులుగా భావించి విచారిస్తున్నారు.

ఒక మంచి విషయం ఏమంటే - టర్కీ ప్రజలలో ఐకమత్యం ఏడిసింది. అదే మన దేశంలో గనక ఇలాంటిది జరిగితే, ఇదే అదనని ప్రజలే బరితెగించి 'సందట్లో సడే మియా' - అంటూ దోపిడీలూ దొంగతనాలూ రేపులూ యధేచ్చగా చేసేసేవారు.

రేపంటే గుర్తొచ్చింది.

రెండురోజుల క్రితం మహారాష్ట్రాలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక మైనర్ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి, ఆమె కాళ్ళూ చేతులూ నరికేసి మొండాన్ని రోడ్డు మీద పారేశారు ముగ్గురు నరరూప రాక్షసులు.వాళ్ళలో కొందరికి రాజకీయ పలుకుబడి కూడా ఉందట.ఆయనగారి ఫేస్ బుక్ ఎకౌంట్లో మంత్రిగారితో దిగిన ఫోటో కూడా ఉందట.యధావిధిగా అన్నీ జరిగాక రాజకీయులు గోలగోల చేస్తున్నారు. అసలు డిల్లీ కేస్ జరిగినప్పుడే కఠినమైన చర్యలు తీసుకుని నిందితుల్ని పబ్లిక్ గా ఎన్ కౌంటర్ చేసేసి ఉంటే ఆ తర్వాత ఇవన్నీ జరిగేవే కావు. ఏం చేస్తాం? ఈ దేశంలో అమ్మాయిలకు రక్షణ రావడానికి ఇంకా ఎన్ని శతాబ్దాలు పడుతుందో? అయ్యా గాంధీ చూస్తున్నావా పైనుంచి నువ్వు తెచ్చిన స్వాతంత్రం ఎంత అందంగా ఉందో?

కొసమెరుపు ఏమంటే టర్కీలో కుట్రకు కారకుడు ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుని ఉన్న ఒక ఇస్లాం మతబోధకుడు.ఆయనగారి రెచ్చగొట్టుడు బోధనల ఫలితమే ఈ తిరుగుబాటు. ఇది కూడా ఇస్లాం స్థాపిస్తున్న శాంతే.

పౌర్ణమి ప్రభావం ఇంకా ఉంది. అప్పుడే అయిపోలేదు.

ఈరోజున అమృత్ సర్ లో భూకంపం వచ్చింది.ఈ ప్రకంపనలు పంజాబ్ లోని ఇంకా కొన్ని ప్రాంతాలలో కూడా వచ్చాయి. 4-5 మధ్య స్కేల్ లో ఈ భూకంపం ఉంది.దాని ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉంది.

గ్రహాల ప్రభావం భూమ్మీద ఏమీ ఉండదని ఇంకా నమ్ముతున్నారా మీరు?