“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

24, ఆగస్టు 2016, బుధవారం

జ్యోతిశ్శాస్త్రం సత్యమే - ఇవిగో మరిన్ని ఋజువులు

జ్యోతిశ్శాస్త్రం సత్యమే అనడానికి నిత్యజీవితం లోనుంచి ఎన్ని కావాలంటే అన్ని ఋజువులు నేను చూపించగలను.కానీ దీనిని ఒప్పుకోవాలంటే మీకు ఓపన్ మైండ్ ఉండాలి. ప్రిజుడిస్ తో కూడిన మైండ్ ఉంటే, మీరు ఈ విషయాలు ఒప్పుకోలేరు.మీ మైండ్ మీ ఇష్టం గనుక మీ ఖర్మకు మిమ్మల్ని వదిలేస్తూ, కొన్ని విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నాను.

ప్రస్తుతం ఖగోళంలో ఒక ముఖ్యమైన గ్రహయోగం నడుస్తున్నది. దాని ఫలితాలు స్పష్టంగా భూమిమీద కనిపిస్తున్నాయి.కొంత వివరణతో నేను చెబుతున్నది నిజమేనని మీకు అర్ధమౌతుంది.

మొన్న 20 తేదీ నుంచీ రేపు 26 వరకూ ఒక వారం పాటు ఈ యోగం నడుస్తుంది.అదేంటంటే - శని కుజుల డిగ్రీ సంయోగం, మరియు గురు బుధుల డిగ్రీ సంయోగం.ఈ వారం వరకూ వీళ్ళు ఒకే నక్షత్ర పాదంలో ఉంటున్నారు.అంటే నవాంశలో కూడా ఒకే రాశిలో వీరు ఉంటారు.ఈ సంయోగం భూమిమీదా మనుషుల జీవితాల లోనూ స్పష్టమైన ఫలితాలను ఖచ్చితంగా చూపిస్తుంది.

శనికుజుల కలయిక భయంకరమైన ప్రమాదాలను యాక్సిడెంట్ లను ఇస్తుందని గతంలో లెక్కలేనన్ని సార్లు నేను చెప్పాను. ఉదాహరణలతో సహా రుజువు చేశాను.ప్రస్తుతం ఏం జరుగుతున్నదో చూద్దామా?

>> బార్డర్లో పాకిస్తాన్ ఆగడాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో చైనా ఆగడాలు కూడా శృతి మించుతున్నాయి.

>>మహారాష్ట్రాలో రోగులను చంపుతున్న 'సంతోష్ పోల్' అనే డాక్టర్ ఇదే సమయంలో పట్టుబడ్డాడు.

>> కేరళలో ఇద్దరు మహిళలు వీధి కుక్కల దాడిలో గాయపడి మరణించారు.ఇది బీచ్ పక్కన ఉన్న పార్కులో జరిగింది. వీధి కుక్కలు దేశ పౌరులను ఎటాక్ చేసి చంపడం మన దేశంలోనే చూడగలం !!

>> మద్యప్రదేష్, రాజస్థాన్, ఉత్తరాఖండ్  రాష్ట్రాలలో తీవ్రమైన వర్షాలు కురిసి జనజీవనం అతలాకుతలం అయ్యింది.కనీసం 50 మంది చనిపోయారు. 'రోహిణీ శకట భేదనం' గురించి రెండు వేల ఏళ్ళక్రితం వరాహ మిహిరుడు ఏమన్నాడో అది మళ్ళీ ఇప్పుడు జరగడం కళ్ళారా చూస్తున్నారు కదా !!

>>జమ్మూ కాశ్మీర్ లో అల్లర్లు హింసా తీవ్ర రూపం దాల్చి, ప్రతిపక్షాలు దేశాధ్యక్షుడిని జోక్యం చేసుకొమ్మని అడిగేంత వరకూ వెళ్ళాయి.

>>ఖమ్మం దగ్గర హైవే మీద నుంచి కింద నున్న NSP canal లోకి బస్సు పడిపోయి 10 మంది చనిపోయారు.

>> ధార్వాడ్ జిల్లాలో బస్సు కారు గుద్దుకుని బస్సు తిరగబడి అందులో ఉన్న 33 మంది తీవ్రగాయాల పాలయ్యారు.

అంతర్జాతీయం

>> రోమ్ లో భూకంపం వచ్చి కనీసం పదిమంది చనిపోయారు.అనేక ఇళ్ళు కూలిపోయాయి.వరాహ మిహిరుని వ్యాఖ్య మళ్ళీ నిజం అయింది.

>> తాయిలాండ్ లో బాంబు పేలుళ్లు జరిగి అనేకమంది చనిపోయారు.

>> ఫిలిప్పీన్స్ లో జరిగిన యాంటి-డ్రగ్ డ్రైవ్ లో ఒక్క వారంలో 2,000 మంది చంపబడ్డారు.

>>గాజా స్ట్రిప్ లో ఇజ్రాయెల్ విమాన దాడులు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి.

>>టర్కీలో IS దాడిలో 51 మంది మరణించారు.

>>ఇరాక్ 36 మంది జిహాదీలను ఉరితీసింది.

>> నైజీరియాలో బోకో హరాం ఇస్లామిక్ తీవ్రవాదులు కనీసం 13 మందిని చంపేశారు.ఇంకో 15 మందికి కిడ్నాప్ చేసి పట్టుకుపోయారు.

>>పాకిస్తాన్ లో MQM తీవ్రవాదులు టీవీ స్టేషన్ ను ఎటాక్ చేసి ఒకరిని చంపేశారు.

ఉచ్చ స్థితిలో ఉన్న బుధుడిని, గురువు చేరడం అనే యోగం వల్ల క్రీడాకారులకు కళాకారులకు సన్మానాలు, సంబరాలు, పెద్ద ఎత్తున ఉత్సవాలు, ఇంటలెక్చువల్ వ్యాసంగాలు,వ్యాపార ఒప్పందాలు జరుగుతాయి.

>>ఇదే సమయంలో - ఒలింపిక్స్ లో - మన తెలుగమ్మాయి అయిన సింధు సిల్వర్ మెడల్ గెలిచింది.అదే విధంగా దీపా కర్మాకర్ కూడా ఒలింపిక్ జిమ్నాస్టిక్స్ లో ప్రతిభను కనబరిచింది.

>>ఇదే సమయంలో బలూచిస్తాన్ మీద మన ప్రధాని మోడీ ఒక వ్యూహాత్మకమైన ఇంటలెక్చువల్ ప్రకటన చేశాడు.దీనివల్ల అంతర్జాతీయ వేదికలమీద పాకిస్తాన్ మన దేశంపైన కక్కుతున్న విషానికి చెక్ పడుతుంది.

>>ఇదే సమయంలో ఒలింపిక్స్ ముగింపు సంబరాలు జరిగాయి.అదే విధంగా మన ఆంధ్రాలో కృష్ణా పుష్కర ముగింపు సంబరాలు పెద్ద ఎత్తున జరిగాయి.

ఇలాంటి వన్నీ ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయని అనేవారు అనవచ్చు.అన్నీ ప్రతిరోజూ జరగవు. కొన్ని కొన్ని సమయాలలోనే కొన్ని కొన్ని సంఘటనల ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది.అలాంటి సమయంలో ఖగోళంలో దానికి సరిపోయే గ్రహస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. స్టాటిస్టికల్ గా కూడా ఈ విచిత్రం చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది.

ఉదాహరణకు మొన్న, నిన్నలలో గమనించండి. మనుషులలో మానసిక అలజడి, రెస్ట్ లెస్ అవ్వడం,ఇంటలెక్చువల్ యాక్టివిటీలు చాలా ఎక్కువగా ఉంటాయి.చాలామంది కుటుంబాలలో ఇదే సమయంలో గొడవలు జరిగి ఉంటాయి. చాలామందికి ప్రమాదాలు జరిగి చిన్నవో పెద్దవో దెబ్బలు తగిలి ఉంటాయి.మనుషులు డిప్రెషన్ లోకి వెళ్ళడం, కొందరి జీవితాలలో ఊహించని మార్పులు జరగడం జరుగుతుంది.

మీ జీవితాన్నీ మీ చుట్టుపక్కల వారి జీవితాలనూ నిశితంగా గమనించండి, విషయాలు మీకే అర్ధమౌతాయి.

ఇదంతా చూస్తున్న తర్వాత కూడా, గ్రహ సంచారానికీ భూమి మీద సంఘటనలకూ సంబంధం ఉండదని ఇంకా మీరు భావిస్తున్నారా? అలా భావిస్తుంటే, మీ అజ్ఞానానికి నేనేం చెయ్యగలను చెప్పండి??