నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

5, అక్టోబర్ 2016, బుధవారం

నువ్వూ అంతేనా???

ఈ హృదయంతో ఎందఱో క్రూరంగా ఆడుకున్నారు
ఈ సదనాన్ని ఎందఱో ఘోరంగా దోచుకున్నారు
నువ్వూ అంతేనా?

ఈ మనస్సు ఎందరినో పిచ్చిగా నమ్మింది
వారందరూ నమ్మకంగా దీన్ని మోసగించారు
నువ్వూ అంతేనా?

ఈ శిరస్సు ఎందరి భుజాలమీదనో ప్రేమగా వాలింది
వారందరూ నవ్వుతూ దీనికి వెన్నుపోటు పొడిచారు
నువ్వూ అంతేనా?

ఈ పిచ్చిప్రాణం కొందరి నుంచి ఎంతో ఆశించింది
కానీ వారంతా దానిని ఎంతో నిరాశపరచారు
నువ్వూ అంతేనా?

ఈ ఆత్మ ఎంతోమందికి తనను అర్పించుకుంటానంది
కానీ అందరూ దీనిని తిరస్కరించారు
నువ్వూ అంతేనా?