అసలు మనిషి జీవితమే ఒక పెద్దయుద్ధం. పొద్దున్న లేచిన దగ్గర నుంచీ ఈ యుద్ధం మొదలౌతుంది. ఉదయం మూడింటికి లేచి ధ్యానానికి కూచున్న వెంటనే మనస్సుతో యుద్ధం మొదలు. ఆ తర్వాత రోజంతా లోకంతో మనుషులతో యుద్ధం. ఈ విధంగా మనిషి జీవితం ఒక కనిపించని యుద్ధమే.ఈ యుద్ధంలో మనం ఎక్కడికి పోతున్నామో చివరకు ఏమౌతున్నామో ఎవరికీ తెలియదు.
మనం ఎందుకు ఈ లోకంలోకి వచ్చామో తెలియదు.ఎలా వచ్చామో తెలియదు.ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు.ఎక్కడికి పోతామో తెలియదు.పోయిన తర్వాత ఏమౌతుందో తెలియదు.తిరిగి ఇక్కడికి వస్తామో లేదో తెలియదు.ఒకవేళ వస్తే ఏ ఆకారంలో వస్తామో అదీ తెలియదు.అసలీ ఆటంతా ఎందుకో అది అసలే తెలియదు.తెలియని ఆట ఆడుతూ,అవసరం లేని యుద్ధం చేస్తూ,మనిషి ఈ లోకంలో బ్రతుకుతున్నాడు.అతని Identification ఏమిటో అతనికే తెలియదు.
నేను చాలా కాలేజీలలో లెక్చర్లు ఇవ్వడానికి వెళుతూ ఉంటాను. అక్కడ విద్యార్థులను ఇదే అడుగుతాను.Can you identify yourself? అని. ఈ ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జవాబు చెబుతూ ఉంటారు.నేను ఫలానా. నా పేరు ఇది. మా అమ్మా నాన్నల పేర్లు ఇవి. అంటూ. నాకు మీ బయోడేటా అవసరం లేదు. మీ Identification కావాలి. కనీసం మీరైనా చెప్పగలరా? అని లెక్చరర్స్ ని ప్రిన్సిపాల్ ని అడుగుతాను. వారూ చెప్పలేరు.వారికే తెలియనిది ఇక వారి విద్యార్థులకు ఏమి చెప్పగలరు?
ఈ ప్రపంచంలో నాది అని నువ్వు అనుకుంటున్నది ఏదీ నీది కాదు.నీ శరీరం మీ అమ్మానాన్నల నుంచి వచ్చింది. నీ చదువు ఇతరులు చెబితే నేర్చుకున్నది. నీ తిండిని ప్రకృతి ఇస్తున్నది. నీ సంస్కారం పెద్దల నుంచి వఛ్చినది. ఈ మొత్తంలో నీ Contribution ఏంటి? అసలేమైనా ఉందా? అని ఆలోచిస్తే ఏమీ లేదని తేలుతుంది. మరి ఏమీ లేనప్పుడు నువ్వెంటి? పల్లెటూరి పొలాలలో గడ్డితో కూరి నిలబెట్టే దిష్టిబొమ్మవా నువ్వు?
నువ్వు లోకానికి ఇతరులకి నిస్వార్ధంగా కొత్తగా ఏదైనా చెయ్యగలిగితే అది మాత్రమే నీ Contribution. ఈ లోకంలో మనుషులూ జంతువులూ పక్షులూ అన్ని ప్రాణులూ స్వార్థంతోనే నిండి ఉన్నాయి. దానికి భిన్నంగా నిస్వార్ధంగా సాటి మనిషికి నువ్వేదైనా చేస్తే అదొక్కటే నీ Contribution. అదొక్కటే చివరకు నీతో వస్తుంది. ఇంకేదీ రాదు.
ఎంతసేపూ ఇతరుల దగ్గర అన్నీ తీసుకుంటూ నువ్వు హాయిగా బ్రతకటం అసలు జీవితమే కాదు.వారికోసం నువ్వేం చేసావు? అన్నదే అసలైన విషయం.
ఎంతసేపూ ఇతరుల దగ్గర అన్నీ తీసుకుంటూ నువ్వు హాయిగా బ్రతకటం అసలు జీవితమే కాదు.వారికోసం నువ్వేం చేసావు? అన్నదే అసలైన విషయం.
అయితే, ఈ పని నువ్వు చెయ్యాలంటే నీకు వ్యక్తిత్వం ఉండాలి.ఇదొక్కటే నువ్వు. మిగిలింది ఏదీ నువ్వు కాదు.అందుకే శీలనిర్మాణం లేని విద్య విద్యే కాదని వివేకానందస్వామి అన్నారు. అందుకే నేడు యూనివర్సిటీలలో ఎక్కడ చూచినా monsters తయారు అవుతున్నారు గాని మానవులు తయారు కావడం లేదు. Character లేకపోవడమే ఈ అంతటికీ కారణం.
మీకు మీరే ఆలోచించుకోండి. ఇప్పటిదాకా మీకోసం మీరు బ్రతికారు గాని ఇంకొకరికి మీరు చేసినది ఏమైనా ఉన్నదా? తమ కోసం తాము బ్రతకడం జంతువులు కూడా చేస్తున్నాయి. మనిషిగా నీ ప్రత్యేకత ఏమిటి?
ఒకరి కంటే ఎక్కుగా డబ్బు సంపాదించడం ఎక్కువ సుఖాలు పొందటం గొప్ప కాదు. అదీ జంతువులు చేసే పనే. అది జంతుప్రవృత్తి కంటే ఎక్కువేమీ కాదు.
నాన్న చెప్తాడు నువ్వు డాక్టర్ అవ్వు అని. అమ్మ చెప్తుంది నువ్వు ఇంజనీర్ అవ్వు అని.మామయ్య చెప్తాడు నువ్వు లాయర్ అవ్వు అని. తెలిసిన వాళ్ళు చెప్తారు నువ్వు చార్టర్డ్ ఎకౌంటెంట్ అవ్వు అని. కానీ ఎవ్వరూ కూడా నువ్వు ముందు ఒక మంచి మనిషివి అవ్వు అని చెప్పరు. ఇవన్నీ తర్వాత. ముందు మంచి మనిషివి అవ్వాలి.ఆ తర్వాత మిగతావి.

మనిషి పుట్టినప్పుడు జరిగేది లాలింపు. పోయినప్పుడు చేసేది ఊరేగింపు. ఈ మధ్యలో రావాలి గుర్తింపు. అయితే ఆ గుర్తింపు మంచిగా రావాలి. చెడ్డవాళ్లకు కూడా వస్తుంది గుర్తింపు. అది కాదు కావాల్సింది.
డబ్బు, సుఖాలూ విలాసాలూ పదవులూ వస్తాయి పోతాయి. అవి శాశ్వతాలు కావు.అసలు ఈ శరీరమే శాశ్వతం కాదు. ఇక ఆ పైవి ఎంత? కానీ వీటన్నిటి వెనకాల ఉన్న 'నువ్వు' శాశ్వతం. ఆ 'నువ్వు'లో అశాంతి, అలజడి, డొల్లతనం,విసుగు, చిరాకు, అసంతృప్తి ఉంటే ఆ పైన ఎన్ని ఉన్నా ఏమిటి ఉపయోగం? నీ లోపలా సరిగా లేక బయట మనుషులతోనూ సరిగా లేకపోతే ఇక నీ జీవితం ఎందుకు?
'ఇదే విషయాన్ని నేను ఎక్కడ లెక్చర్ ఇవ్వడానికి పోయినా చెబుతూ ఉంటాను.' అంటూ మాట్లాడసాగారు స్వామి.
(ఇంకా ఉంది)