Once you stop learning, you start dying

26, డిసెంబర్ 2017, మంగళవారం

సత్యం ఎవరికి కావాలి?

నిన్న క్రీస్తు పుట్టలేదు కానీ లోకమంతా క్రిస్మస్ జరుపుకుంది మనిషిని చంపమని ఇస్లాం చెప్పలేదు కానీ కాఫిర్లను వాళ్ళు చంపుతూనే ఉంటారు కొత్తకొత్త దేవుళ్ళను సృష్టించమని హిందూమతం అనలేదు కానీ వాళ్ళాపనిని రోజూ చేస్తూనే ఉంటారు 'నన్ను పూజించండి' అని బుద్దుడు చెప్పలేదు పైగా ఆ పని వద్దన్నాడు కానీ బౌద్ధులు దానినే ఆచరిస్తున్నారు మహావీరుడు బట్టలు వదిలేశాడు జీవితమంతా అలాగే బ్రతికాడు జైనులు మాత్రం బట్టల వ్యాపారమే చేస్తున్నారు మతాలు చెప్పినదాన్ని మతస్థులే...
read more " సత్యం ఎవరికి కావాలి? "

23, డిసెంబర్ 2017, శనివారం

మా పుస్తకాలు - శ్రీలలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక

పంచవటి పబ్లికేషన్స్ నుంచి మూడవ ప్రింట్ పుస్తకంగా, మరియు నాలుగో ఈ బుక్ గా ఈ మధ్యనే రిలీజైంది - శ్రీలలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక. లలితా సహస్ర నామాలకు అనేకములైన వ్యాఖ్యానాలు ఇప్పటికే ఉన్నాయి. వీటిలో 'సౌభాగ్య భాస్కరము' అనబడే "భాస్కరరాయ మఖి" గారి భాష్యం నుంచీ ఈ మధ్యకాలపు రచయితలు వ్రాసిన భాష్యాల వరకూ అనేకం మనకు లభిస్తున్నాయి. మరి ఈ గ్రంధపు ప్రత్యేకత ఏమిటి? ప్రతిపదార్ధాల జోలికి పోకుండా,...
read more " మా పుస్తకాలు - శ్రీలలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక "

18, డిసెంబర్ 2017, సోమవారం

కలబురిగి కబుర్లు - 4 (బుద్ధవిహార్)

కలబురిగిలో చూడదగిన ప్రదేశాలు ఏమున్నాయని మావాళ్ళను అడిగాను. ఏవేవో గుళ్ళూ గోపురాలూ చెప్పారు. వాటికి పోవాలని నాకేమీ అనిపించలేదు. కానీ ఒక ప్రదేశం మాత్రం చూడాలనిపించింది. అదే, గుల్బర్గా యూనివర్సిటీ వెనుకగా ఊరికి దూరంగా ఉన్న ' బుద్ధ విహార్ '. ఎనిమిదేళ్ళ క్రితం కర్నాటక అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో దీనిని రూపకల్పన జరిగింది. దీనిని 2009 లో రాష్ట్రపతి ప్రతిభా...
read more " కలబురిగి కబుర్లు - 4 (బుద్ధవిహార్) "

13, డిసెంబర్ 2017, బుధవారం

5th Astro Work Shop

పంచవటి సభ్యులలో జ్యోతిశ్శాస్త్రం అంటే శ్రద్ధ ఉన్నవారు జ్యోతిశ్శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం గావిస్తూ మంచి జ్యోతిష్కులుగా రాణిస్తున్నారు. వీరందరూ బాగా చదువుకున్నవారూ, మంచి ఉద్యోగాలలో ఉన్నవారూ కావడంతో 'సైంటిఫిక్ ఆస్ట్రాలజీ' ని త్వరగా నేర్చుకుంటూ శాస్త్రీయ దృక్పధంతో ఎదుగుతున్నారు. పుస్తకావిష్కరణ రోజున జరిగిన 'అయిదవ జ్యోతిశ్శాస్త్ర సమ్మేళనం' (5th Astro work shop) లో పంచవటి సభ్యులైన జ్యోతిశ్శాస్త్రవేత్తలు...
read more " 5th Astro Work Shop "

'శ్రీ లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక' పుస్తకావిష్కరణ - మరికొన్ని ఫోటోలు

"పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్" ఒక ప్రేమపూరితమైన ఆధ్యాత్మిక కుటుంబంగా వేగంగా రూపుదిద్దుకుంటున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి ముఖాలలో ఆనందం. అకారణ సంతోషం. జీవితంలో ఇన్నాళ్ళకు ఒక అర్ధం పరమార్ధం కలుగుతున్నాయన్న సంభ్రమం. అద్భుతమైన గమ్యాన్ని చేరుకునే క్రమంలో అడుగులు వేస్తున్నామన్న ఆత్మసంతృప్తి. ఇన్నాళ్ళూ వేచి చూచిన ఒక Spiritual fulfillment కలుగుతున్నదన్న ఉత్సాహం. దేశంలోని నలుమూలల నుంచీ ఇక్కడకు...
read more " 'శ్రీ లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక' పుస్తకావిష్కరణ - మరికొన్ని ఫోటోలు "