మా "పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్" కు రెండు వెబ్ సైట్స్ ఉన్నాయి. ఇండియా ఫౌండేషన్ కు ఒకటి. అమెరికా ఫౌండేషన్ కు ఒకటి. ఇండియా వెబ్ సైట్ చాలా కాలం నుంచీ ఉంది.నా ఇండియా శిష్యులు ఈ మధ్యనే దీనికి కొత్తగా మార్పులు చేర్పులు చేసి కొంగ్రొత్త రూపాన్నిచ్చారు.వాళ్ళే దాన్ని మెయింటైన్ చేస్తున్నారు.
మేమేం తక్కువ తిన్నామా అంటూ నా అమెరికా శిష్యులు శిష్యురాళ్ళు కలసి USA Foundation Web Site ను చాలా కష్టపడి తయారు చేశారు. అది ఈరోజు ప్రారంభం చెయ్యబడింది. దీని వెనుక ఎంతో ప్లానింగ్, ఎంతో శ్రమా దాగి ఉన్నాయి.సైట్ డిజైన్, ఫీచర్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ పాజెక్ట్ లో పాలు పంచుకున్న USA Team Members అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మొదట్లో ఒకే వెబ్ సైట్ ఉంటె బాగుంటుందని అనుకున్నాం. కానీ ఇండియా పౌండేషన్ కార్యక్రమాలు వేరు. అమెరికా ఫౌండేషన్ కార్యక్రమాలు వేరు, రెండింటి కార్యవర్గ సభ్యులు వేర్వేరు గనుక ప్రస్తుతానికి రెండు సైట్స్ గా ఉంచడం జరిగింది. ఎప్పటికప్పుడు మేం చేస్తున్న కార్యక్రమాలు ఆయా సైట్స్ లో ఆడియో వీడియోలుగా ఫోటోలుగా ఉంచబడతాయి.
USA web site ను చూడటం కోసం ఇక్కడ నొక్కండి.