“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

19, ఫిబ్రవరి 2017, ఆదివారం

Jo Tumko Ho Pasand Vohi Baat Kahenge - Mukesh


Jo Tumko Ho Pasand Vohi Baat Kahenge...

అంటూ ముకేష్ స్వరంలోనుంచి మధురంగా జాలువారిన ఈ గీతం Safar (1970) అనే చిత్రంలోనిది. ముకేష్ స్వరంలో ఒక గమ్మత్తుంది. ఆయన హుషారు పాటలు పాడినా ఏదో ఏడుస్తూ పాడినట్లే అనిపిస్తుంది. కానీ పాట చిత్రీకరణ చూస్తే రొమాంటిక్ గా ఉంటుంది.అదీ విచిత్రం. సరే ఏదేమైనా మనమేం చేస్తాం? దేవుడు ఆయనకు ఒక విధమైన మధుర స్వరాన్నిచ్చాడు. విని ఆనందిద్దాం.

అసలీ పాటను ఎందుకు పాడానో ముందుగా చెబుతాను.

నా శిష్యులలో పాపం కొందరున్నారు.వాళ్ళు నేనేమంటే అదేనంటారు.అస్సలు ఎదురు చెప్పరు.నేను నంది అంటే అది నందే. పంది అంటే అది పందేనంటారు.ఎంత అదృష్టవంతులో వాళ్ళు !! లేకపోతే అంత నమ్మకం అంత విశ్వాసం ఎలా ఉంటాయి మరి? ప్రతిదాన్నీ అనుమానించే నేటి మనుషులలో నామీద అంత అచంచలమైన నమ్మకం ఉందంటే వారి మనసులు ఎంత స్వచ్చమైనవో కదా? అని ఆలోచిస్తుంటే, ఒక అమెరికా శిష్యురాలు అదే సమయానికి ఫోన్ చేసి, "వాళ్లకు ఈ పాట సరిగ్గా సరిపోతుంది, పాడి వినిపించండి పాపం"-- అని చెప్పింది. ఆలోచిస్తే నాకూ నిజమే అనిపించింది. అప్పుడీ పాటను ఎత్తుకున్నాను.

ఈ పాటను అలా పాడవలసి వచ్చిందన్న మాట. దేనికైనా ముందుగా చరిత్ర చెప్పుకోవాలి కదా మనం !!

అసలు విషయం ఏమంటే - తన ప్రేయసిని ఉద్దేశించి ప్రియుడు పాడుతున్న పాటలా ఇది కనిపించినప్పటికీ, నిజానికీ పాట ఒక లోతైన ఆధ్యాత్మిక గీతం. జీవుడు తన ఇష్టదైవాన్ని ఉద్దేశించి పాడిన పాట ఇది.అంత గట్టి శరణాగతీ, అంత విశ్వాసమూ, అంత ప్రేమా లేనిదే ఎవ్వరూ ఆధ్యాత్మిక జీవితంలో ఒక్క అడుగు కూడా వెయ్యలేరు. ఈ విషయాన్ని చెప్పడమే ఈ పాట పాడటంలో నా ఉద్దేశ్యం. అదీ అసలైన సంగతి !!

నిజానికి ఇదొక సూఫీ గీతం. భక్తుని యొక్క పరిపూర్ణ శరణాగతికి పరాకాష్ఠ ఈ గీతం !!

నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని వినండి మరి.

Movie:--Safar (1970)
Lyrics:--Indeevar
Music:--KalyanJi Anandji
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------------------------------
Jo tumko ho pasand vohee baat kahenge - 2
Tum din ko ag ar raat kaho - raat kahenge
Jo tumko ho pasand vohee baat kahenge

Dete naa aap saath tho – Mar jaathe -- ham kabhee ke - 2
Poore huye hai aap se – Armaan zindagi ke
Ham zindgi ko aap ki –3
Sougaat kahenge
Tum din ko agar raat kaho, raat kahenge
Jo tumko ho pasand vohee baat kahenge

Chaahenge Nibahenge Sarahenge aap hee ko - 2
Aakhon me nam hai jab takk - Dekhenge aap hee ko
Apnee zubaane aapke –3
Jajbaath kahenge
Tum din ko agar raat kaho - raat kahenge
Jo tumko ho pasand vohee - baat kahenge - 2

Meaning

I will speak only those words which you like
If you refer to day as night, I will agree without a second thought

I would have been no more, if I had not had your friendship
In my life, all my desires are fulfilled through you
I will say - 'this life is just your gift'
I will speak only those words which you like
If you refer to day as night, I will agree without a second thought

I will seek, obey and praise only you always
As long as I have light in my eyes
I will look only at you
I will disclose my heart's deepest feelings only to you
If you refer to day as night, I will agree without a second thought

I will speak only those words which you like
If you refer to day as night, I will agree without a second thought...
I will speak only those words which you like....

తెలుగు స్వేచ్చానువాదం

నీకిష్టమైన మాటలే నేను మాట్లాడతాను
పగటిని చూపించి ఇది రాత్రి అని నువ్వంటే
మారు మాట్లాడకుండా నేను ఔనంటాను

నీ తోడు లేకుంటే నాపని ఏనాడో అయిపోయి ఉండేది
నా జీవితంలోని కోరికలన్నీ నీద్వారా తీరుతున్నాయి
ఈ జీవితం నీ బహుమతి అని నేనంటాను
నీకిష్టమైన మాటలే నేను మాట్లాడతాను
పగటిని చూపించి ఇది రాత్రి అని నువ్వంటే
మారు మాట్లాడకుండా నేను ఔనంటాను

నేను ఎల్లప్పుడూ నిన్నే స్మరిస్తాను, నిన్నే స్తుతిస్తాను, నీకే తల ఒగ్గుతాను
నా కనులలో వెలుగు ఉన్నంతవరకూ నిన్నే చూస్తూ ఉంటాను
నా హృదయపు నిగూఢ రహస్యాలను నీకు మాత్రమే చెబుతాను
నీకిష్టమైన మాటలే నేను మాట్లాడతాను
పగటిని చూపించి ఇది రాత్రి అని నువ్వంటే
మారు మాట్లాడకుండా నేను ఔనంటాను

నీకిష్టమైన మాటలే నేను మాట్లాడతాను...