నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

17, ఫిబ్రవరి 2017, శుక్రవారం

Yaha Mai Ajnabi Hoo - Mohammad Rafi


Yaha Mai Ajnabi Hoo...

అంటూ మహమ్మద్ రఫీ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1965 లో వచ్చిన Jab Jab Phool Khile అనే సినిమా లోది. రఫీ పాడిన ఆణిముత్యాల వంటి ఎన్నో పాథోస్ పాటలలో ఇదొక మరపురాని పాట. ఈ ఒక్క పాట వింటే చాలు మనం రఫీ అభిమానులం, కళ్యాన్ జీ ఆనంద్ జీ అభిమానులం తప్పకుండా అయిపోతాం.

ఇది విషాద గీతం కాదుగాని దాదాపుగా అలాంటి ఛాయలున్న పాటే. చాలామంది విషాద గీతాలను ఇష్టపడరు. కానీ వీటిల్లో ఉన్న మజా హుషారుగా సాగే పాటల్లో ఉండదు.హుషారు పాటల్లో అందరూ తమను తాము చూచుకోలేరుగాని ఇలాంటి పాటలు ప్రతివారినీ వారి గుండెల ఏదో ఒక మూలలో కదిలిస్తాయి. ఏడిపిస్తాయి.

నాకెంతో ఇష్టమైన రఫీ పాటల్లో ఇది మొదటి వరుసలో ఉంటుంది. నేను ఇష్టపడే ప్రతిపాటలో లోతైన అర్ధం ఉంటుంది. పైపైకి ఇదొక ప్రేమికుల మధ్యన సాగే నిష్టుర గీతంలా అనిపిస్తుంది. కానీ నేను చూచే దృష్టి అది కాదు.

ప్రతి జీవీ ఈ లోకంలోకి ఒంటరిగానే వచ్చింది. ఈ లోకం దాని అసలైన నివాస స్థానం కాదు. ఇదొక లాడ్జి లాంటిది. రెండు మూడు రోజులు ఉండి ఆ తర్వాత ఖాళీ చేసి తన సొంత ఇంటికి ప్రతి జీవీ పోవలసిందే. సరిగ్గా గమనిస్తే త్వరలోనే ఈ లోకం ఎవరికైనా చాలా విసుగనిపిస్తుంది.తన ఇంటికి తాను వెళ్లిపోదామనిపిస్తుంది. అప్పుడు ప్రతి హృదయంలోనూ ఇదే పాట ప్రతిధ్వనిస్తుంది.

ఈ పాటలోని ప్రతి చరణమూ చాలా గొప్ప అర్ధంతో కూడుకున్నట్టిది.


ఏమిటీ వింతైన ఉదయాలూ సాయంత్రాలూ?
నా పాత రాత్రులూ పగళ్ళూ ఏవి?
నా హృదయగత భావాలకు ఇదంతా విరుద్ధంగా ఉంది
ఇక్కడ పద్ధతి అంతా కొత్తది,  అనవసరమైనది
నేను చాలా పాతకాలపు మనిషిని
ఇవన్నీ నాకు సరిపోవడం లేదు


ఈ లోకపు పద్ధతులు మనకు నచ్ఛేవి కావు. ఈ మనుషులూ మనకు నచ్చరు.ఇదంతా ఏదో కృత్రిమంగా, వికృతంగా మనకు కనిపిస్తుంది. మన సహజ ప్రకృతిలోనికి మనం వీలైనంత త్వరగా పోదామని అనిపిస్తుంది.

నీ కౌగిలిలో నేనున్నప్పుడు
అవి నీ చేతులలా అనిపించడం లేదు
ఆ పాత అమాయక ప్రేమ దృక్కులను ఎక్కణ్ణించి మళ్ళీ తేగలను?
ఇదంతా ఒక విచిత్రమైన నాట్యంలా ఉంది
ఇలాంటి సంస్కృతిని నేనెలా ఆమోదించగలను?


ఈలోకంలో మనుషుల ప్రేమలన్నీ నటనలే. ఇక్కడేదీ నిజం కాదు. అంతా స్వార్ధమే. నిజమైన అమాయకమైన ప్రేమ మనకెక్కడైనా దొరుకుతుందా అసలీ లోకంలో? బహుశా ఎప్పటికీ సాధ్యం కాకపోవచ్చు. 

నా దగ్గరా నీమీద ఫిర్యాదు ఉన్నది
నీ హృదయం బాధపడటానికి కూడా కారణం ఉన్నది
అసలిదంతా మన ప్రేమ వల్లే వచ్చింది 
అవి కలవవలసిన రీతిలో
తూర్పూ పడమరా ఎప్పుడైనా కలిశాయా అసలు?

అసలు మనమీ లోకంలోకి ఎందుకు రావాలి? దీనిని వదల్లేక ఈ బాధంతా ఎందుకు? దీనిపైన మనకున్న వ్యామోహమేగా దీనికంతటికీ కారణం? మనం ఎలా ఉండాలని దైవం భావించిందో అలా ఉంటున్నామా అసలు? ఎందుకలా ఉండలేకపోతున్నాం?

అనే మౌలికమైన ప్రశ్నలను ఈ గీతం మనకు సంధిస్తుంది. జవాబులు చెప్పమని మనల్ని వేధిస్తుంది.


నా స్వరంలో కూడా ఈ మధుర గీతాన్ని వినండి మరి. 

Movie:--Jab Jab Phool Khile (1965)
Lyrics:--Anand Bakshi
Music:--Kalyanji Anandji
Singer:-- Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------------
Kabhee Pehle Dekha Nahee…..Ye sama
Ye Me Bhool Se - Aagaya hu kahaa

Yaha mai ajnabi hoo -2
Mai jo hu – Bas Vohi hoo -2
Yaha Mai ajnabi hoo – 2

Kaha shaam-o-shehar ye  - kaha din raat mere
Bahut rusavaa huye hai – Yaha jajbaat mere
Nayee tehjeeb hai ye – Naya hai ye zamana
Magar mai aadmi hoo – Vahi sadiyon purana
Me kya jaanu ye baaten – Zara insaaf karna
Meri gustahiyon ko – Khudara maaf karnaa
Yaha mai ajnabi hoo -2

Teri Baahon me dekhu – Sanam gairon ki baahen
Me laavoongaa kahaase – Bhala aisi nigahen
Ye koyee raks hoga – Koi dastoor hoga
Mujhe dastoor aisa – Kaha manjoor hoga
Bhala ye kaise mera – Lahu ho jaaye paani
Mai kaise bhool jaavoo – Mai hoo Hindoostani
Yaha mai ajnabi hoo -2

Mujhe bhi hai shikayat – Tujhe bhi tho gila hai
Yahee shikve hamaari – Mohabbat kaa sila hai
Kabhi magrib se mashrik – Mila hai jo milega
Jaha ka phool hai jo – Vahi pe vo khilega
Tere oonche mahal me – Nahi mera gujaara
Mujhe yaadaa raha hai – Vo chota saa shikaraa
Yaha mai ajnabi hoo -2
Mai jo hu – Bas Vohi hoo -2
Yaha Mai ajnabi hoo – 2

Meaning

Never before have I seen such a place
Oh...Like a fool, where did I land up finally?

I am a stranger here
I am what I am..I am enough unto myself
I am a stranger here

What kind of mornings and evenings these are?
Where are my earlier days and nights?
What a disgrace upon my true feelings !
This is a new environment altogether
An unwanted edification and a totally new world
But I am a human being
I belong to the old distant past
What do I know of all these new customs?
Please do some justice to me
and forgive my blunders, for God's sake
I am a stranger here, I am a stranger 

While in your arms,
I don't feel your arms anymore, but a stranger's
Where can I bring back those innocent and loving glances from?
May be this is a strange dance
how can I accept such a strange culture?
How can I like all this without my blood turning into water?
How can I forget I am an Indian?
I am a stranger here, I am a stranger 

I too have a complaint with me..
You too have your own pain
These are all rewards of our love
Has the West really met the East in such a way that it should meet?
The flowers blossom only where they truly belong,
not at all places, just like that.
Your palace is not the right place for me
I keep remembering my small boat house

I am a stranger here, I am a stranger
I am what I am, I am enough unto myself
I am a stranger here, I am a stranger...

తెలుగు స్వేచ్చానువాదం

ఇలాంటి వాతావరణం ఎప్పుడూ చూడలేదు
ఇలాంటి చోటకు ఎప్పుడూ రాలేదు
పొరపాటున ఇక్కడకు వచ్చానేమో నేను....

ఇక్కడ నేనొక ఒంటరివాడిని
ఇక్కడ నేనొక ఒంటరివాడిని
నాకిది అక్కర్లేదు...నేను నేనుగా ఉన్న పాతరోజులే నాకు చాలు
ఇక్కడ నేనొక ఒంటరివాడిని

ఏమిటీ వింతైన ఉదయాలూ సాయంత్రాలూ?
నా పాత రాత్రులూ పగళ్ళూ ఏవి?
నా హృదయగత భావాలకు ఇదంతా విరుద్ధంగా ఉంది
ఇక్కడ పద్ధతి అంతా కొత్తది,  అనవసరమైనది
నేను చాలా పాతకాలపు మనిషిని
ఇవన్నీ నాకు సరిపోవడం లేదు
నా తప్పుల్ని మన్నించండి, నాకు న్యాయం చెయ్యండి
ఇక్కడ నేనొక ఒంటరివాడిని
ఇక్కడ నేనొక ఒంటరివాడిని

నీ కౌగిలిలో నేనున్నప్పుడు
అవి నీ చేతులలా అనిపించడం లేదు
ఆ పాత అమాయక ప్రేమ దృక్కులను ఎక్కణ్ణించి మళ్ళీ తేగలను?
ఇదంతా ఒక విచిత్రమైన నాట్యంలా ఉంది
ఇలాంటి సంస్కృతిని నేనెలా ఆమోదించగలను?
ఇదంతా చూస్తుంటే నా రక్తం నీరై పోతోంది
నేనొక భారతీయుడినని ఎలా మరచిపోగలను?
ఇక్కడ నేనొక ఒంటరివాడిని
ఇక్కడ నేనొక ఒంటరివాడిని

నా దగ్గరా నీమీద ఫిర్యాదు ఉన్నది
నీ హృదయం బాధపడటానికి కూడా కారణం ఉన్నది
అసలిదంతా మన ప్రేమ వల్లే వచ్చింది 
అవి కలవవలసిన రీతిలో
తూర్పూ పడమరా ఎప్పుడైనా కలిశాయా అసలు?
వాటి సహజసిద్ధమైన తోటలోనే పూలు వికసిస్తాయి
ఎక్కడ పడితే అక్కడ కాదు
నీ రాజభవనం నాకు తగిన చోటు కాదు
నా చిన్ని పడవ ఇల్లే నాకు గుర్తొస్తోంది

ఇక్కడ నేనొక ఒంటరివాడిని
ఇక్కడ నేనొక ఒంటరివాడిని
నాకిది అక్కర్లేదు...నేను నేనుగా ఉన్న పాతరోజులే నాకు చాలు
ఇక్కడ నేనొక ఒంటరివాడిని...