Cord around the neck of fetus |
Cord as a thread around the body |
ప్రపంచంలో ఏదీ కాకతాళీయం కాదు.ప్రకృతిలోని ప్రతి సంఘటనకూ, కనీసం ఒక పిట్ట అరిచినా సరే, దానికీ ఒక అర్ధం ఉంటుంది.ఈ అవగాహన నుంచీ పరిశీలన నుంచీ పుట్టినదే శకున శాస్త్రం. శకునాలు చాలామంది నమ్మరు కానీ అవి నిజాలే. వాటిని సరిగ్గా అర్ధం చేసుకుని తద్వారా మనం ప్రవర్తించడం నేర్చుకుంటే ఎన్నో ప్రమాదాల నుంచి మనం తప్పుకోవచ్ఛు.
మనం మూఢ నమ్మకాలని భావించేవి నిజానికి ఎంతో పరిశీలన నుంచి పుట్టిన వాస్తవాలు.వాటిని అంత తేలికగా కొట్టి పారవెయ్యడానికి వీలులేదు.ప్రకృతిలో ఏదీ వేస్ట్ కాదు. మనకు అర్ధంకాని ప్రతిదానినీ మూఢనమ్మకం అనుకోవడమే పెద్ద మూఢనమ్మకం.
జ్యోతిషశాస్త్ర ప్రకారం ఇలాంటి జననం కలిగిన శిశువుల జాతకాలలో రాహుకేతువుల దోషాలు తప్పకుండా ఉంటాయి. సామాన్యంగా వారి వంశాలలో నాగదోషాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక సర్పం శిశువు మెడ చుట్టూ చుట్టుకుని బిగించి ఊపిరి ఆడకుండా చేసినట్లుగా ఇది ఉంటుంది. ఇదే నాగదోష ప్రభావానికి సూచన.
సూక్ష్మంగా గమనిస్తే ఇలాంటి శిశువులు పెరిగి పెద్దయే కొద్దీ వారికి వచ్ఛే రోగాలకూ, ఈ నాళీవేష్టిత జననానికి సంబంధాలు చక్కగా కనిపిస్తాయి. మోడరన్ మెడిసిన్ కూడా ఈ లింకులను ఇప్పుడు ఒప్పుకుంటున్నది.
శిశువు మెడచుట్టూ బొడ్డుత్రాడు గట్టిగా బిగుసుకున్నప్పుడు అమ్మ పొట్టలోని ఆ శిశువుకు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పటికి శ్వాస క్రియ లేకున్నప్పటికీ ఆ శిశువుకు ఊపిరాడనట్లు ఫీలింగ్ ఉంటుంది. అదొక ట్రామా కండిషన్ వంటిది. గర్భంలో ఉన్నప్పుడు గాని, లేదా డెలివరీ టైం లో గాని ఇలాంటి ట్రామా కండిషన్ ఎదుర్కొన్న శిశువులు సామాన్యంగా పెరిగి పెద్దయ్యాక ఆస్త్మా పేషంట్స్ గా, బీపీ పేషంట్స్ గా, హార్ట్ పేషంట్స్ గా మారతారు.ఏదైనా విపత్కర పరిస్థితి వారి జీవితంలో ఎదురైనప్పుడు వారికి ఊపిరి అందదు. ఛాతీని చేత్తో పట్టుకుని కూచుండి పోతారు.లేదా ఎగశ్వాస పెడతారు. మెట్లెక్కేటప్పుడు కూడా ఇలాంటి వారికి ఆయాసం వస్తుంది.ఇది ఒకరకమైన హార్ట్ కండిషనే. దీనికంతా కారణం పుట్టుక సమయంలో వారికి కలిగిన ఊపిరాడని పరిస్థితే. ఆ జ్ఞాపకం వారి అంతచ్ఛేతనలో నిక్షిప్తమై పోయి ఇలాంటి పరిస్థితులను వారి భవిష్యత్ జీవితంలో కల్పిస్తుంది. ఏదైనా క్రైసిస్ వారి జీవితంలో వఛ్చినపుడు నేటల్ ట్రామా మెమరీ మళ్ళీ ట్రిగ్గర్ చెయ్యబడుతుంది. ఇదంతా "బొడ్డుత్రాటి ఉరి" ప్రభావమే.ఇదంతా నిజమేనని ఇప్పుడు మోడరన్ మెడిసిన్ కూడా ఒప్పుకుంటున్నది.ఇటువంటి రోగాలు రావడానికి కూడా జాతకంలోని నాగదోష ప్రభావమే కారణం.
మీకెవరికీ తెలియని ఒక రహస్యాన్ని ఇప్పుడు తేటతెల్లం చేస్తున్నాను. ఇది యోగదృష్టి ఉన్నవారికి మాత్రమే అర్ధమయ్యే నిజం.
పుట్టుక సమయంలో బొడ్డుత్రాడు మెడచుట్టూ చుట్టుకొని నీలంగా మారి పుట్టిన పిల్లలు, గత జన్మలో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నవారై ఉంటారు. ఇది వారి జాతకంలో స్పష్టంగా దర్శనమిస్తుంది.జాతకచక్రాన్ని సరిగ్గా డీకోడ్ చెయ్యడం చేతనైతే ఈ విషయాన్ని ఆయా జాతకాలలో స్పష్టంగా చూడవచ్చు.చనిపోయేటప్పుడు ఉన్న పరిస్థితే మళ్ళీ తిరిగి పుట్టే సమయంలో కూడా ఉంటుందనేది మన భగవద్గీతతో సహా ఎన్నో మార్మిక విజ్ఞానగ్రంధాలు చెబుతున్న వాస్తవం. అందుకనే, చనిపోయే సమయంలో ఉరితో ఊపిరాడక చనిపోయినవారు ఈ జన్మలో ఈ విధంగా బొడ్డుత్రాడు మెడచుట్టూ బిగింపబడి ఊపిరాడని పరిస్థితిలో పుడతారు.
జీవియొక్క జన్మ పరంపరలలో ఏ అనుభవమూ ఎక్కడా మిస్ అవదు.గతజన్మ అనుభవాలే ఈ జన్మలో మళ్ళీ కంటిన్యూ అవుతాయి. ఎక్కడా బ్రేక్ అనేది రాదు.ఇవన్నీ సూక్ష్మమైన మార్మిక కర్మరహస్యాలు.
మీరు దిమ్మెరపోయే ఇంకొక రహస్యాన్ని ఇప్పుడు మీకు చెబుతాను.
Surukuku Snake found in South America |
నాగదోషంతో పుట్టిన పిల్లల జీవన్మరణ సమస్యకు సర్పవిషంతో తయారైన ఔషధమే జీవితాన్ని ప్రసాదించడం విచిత్రంగా లేదూ? ఇదే జ్యోతిష్యశాస్త్రానికి హోమియోపతికీ ఉన్న రహస్యమైన లింక్. ఈ రెండు శాస్త్రాలలో ఇలాంటి కర్మ రహస్యాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. మచ్ఛుకు ఒకటి మాత్రం మీకు పరిచయం చేశాను.
నాళీవేష్టిత జననం అనేది ఖఛ్చితంగా నాగదోషమే అందులో ఏమీ అనుమానం లేదు.తెలివిలేనివారు నమ్మకపోవచ్చుగాక. కానీ ఇది వాస్తవమే. ఇలాంటి పిల్లల జీవితాలు పరిశీలిస్తే,ముందు ముందు వారికి ఎదురయ్యే సమస్యలు గాని, వారికి వచ్ఛే రోగాలు గాని, దీనికి అనుగుణంగానే ఉంటాయి. ఇది నూటికి నూరు శాతం నిజం. సరిగ్గా గమనించడం చేతనైతే, ఈ దోషాన్ని వీరి జీవితాలలో అనేక సందర్భాలలో మనం చూడవచ్చు.
నాగదోషం అనేది నిజమే. ఇది మనిషిని ఎన్నో రకాలుగా వెంటాడుతుంది.నాస్తికులు హేతువాదులు నమ్మినా నమ్మకపోయినా ఇందులో నిజం ఉన్నది.మన దేశంలో మూలమూలలా ఉన్న నాగారాధన ఊరకే పనీపాటా లేనివాళ్ల సృష్టి కాదు. ఎన్నో వేల సంవత్సరాల పరిశీలనా పరిశోధనా దీనివెనుక ఉన్నాయన్నది వాస్తవం.
ఇలా వ్రాసినంత మాత్రం చేత నేను కుహనా జ్యోతిష్కుల మోసాలనూ, పల్లెల్లో నాగదోషం పేరు చెప్పి మోసగాళ్లు చేసే మోసాలనూ సమర్ధిస్తున్నానని అనుకోకండి. అలాంటి వేషాలను నేనస్సలు సమర్ధించను. అంతమాత్రం చేత నాగదోషం మూఢనమ్మకమంటే కూడా నేను ఒప్పుకోను. ఇది మూఢనమ్మకం కాదు.సూక్ష్మ పరిశీలనలో మాత్రమే అందే నిజం.
Disclaimer:-- ఈ పోస్ట్ చదివి, అప్పుడే పుట్టిన పిల్లలకు 'లేకసిస్' మందును పొరపాటున కూడా వెయ్యకండి. దీనిని అనుభవం ఉన్న వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. ఒకవేళ ఎవరైనా ఆ సాహసానికి ఒడిగడితే అప్పుడు జరిగే దుష్పరిణామాలకు నాకు బాధ్యత లేదని గమనించండి.
హోమియోపతి అనేది ఒక విశిష్ట వైద్య విధానం.ఇందులో ఈ రోగానికి ఈ మందు అని స్పెసిఫిక్స్ ఉండవు.రోగం ఒకటే అయినా మనిషిని బట్టి మందు మారిపోతుంది.కనుక ఈ కండిషన్ కు లేకసిస్ ఒక్కటే మందు అని భ్రమించకండి.