జీవితంలో నాకు నచ్చని విషయాలు చాలా ఉన్నాయి.వాటిల్లో ఒకటేమిటంటే - ఆడాళ్ళు వంటింట్లో మగ్గిపోతుంటే మనం హాల్లో కూచుని అది చెయ్యి ఇది చెయ్యి అని ఆర్డర్లు వెయ్యడం. అలా చేసే మగాళ్ళని చూస్తె నాకు అరికాలి మంట నెత్తికి ఎక్కుతుంది. బహుశా జీవితాంతం వంటింటికే ఆహుతై పోయిన మా అమ్మ తరం ఆడవారిని చూచి అనుకుంటాను నాలో ఈ ధోరణి బాగా పాతుకుపోయింది. అందుకే అవకాశం వస్తే చాలు వంటింట్లో దూరి ఆడాళ్ళకు సాయం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాను. మా అమ్మ బ్రతికి ఉన్నంతవరకూ ఆ అవకాశాన్ని నాకు ఇవ్వలేదు. ఆ తర్వాత మాత్రం అప్పుడప్పుడూ నేనూ శక్తి కొద్దీ చెయ్యి కాల్చుకుంటూ ఉంటాను.
జొన్న చపాతీలు (రొట్టెలు) తినడం మన అలవాటు. లేదంటే మనం చేసే వ్యాయామాలకు దేహానికి శక్తి చాలదు.ఇక్కడ వీరికేమో అవి చెయ్యడం రాదు. అందుకని అమెరికాలో నా శిష్యురాళ్ళకు జొన్న చపాతీలు ఎలా చెయ్యాలో నేర్పుతూ ఉండగా తీసిన ఫోటోలు ఇవి.
చూచి తరించండి మరి.
NB:-- ఇందులో ఆధ్యాత్మికం ఏముందీ? అని అనుమానం వస్తే నా తత్త్వం మీకు ఏమాత్రం బోధపడలేదని అర్ధమన్నమాట. నేను ఏపని చేసినా అది ఆధ్యాత్మికమే. అది ధ్యానమే. చెయ్యడం ఎలాగో తెలిస్తే లెట్రిన్ క్లీన్ చేస్తూ కూడా ధ్యానస్థితిలో ఉండవచ్చు. అది చేతకాకపోతే, మడి కట్టుకుని దేవుడి ముందు కళ్ళు మూసుకుని కూచుని కూడా ఛండాలపు మెంటల్ స్టేట్ లో ఉండవచ్చు. ఏదైనా మన మనస్సులో ఉంది, చేసే పనిలో లేదన్నది నేనాచరించే బోధలలో ఒకటి.
ప్రతిపనినీ ధ్యానంగా మార్చుకోవడం నా సాధనా విధానంలో మొదటి మెట్టు. అర్ధమైందనుకుంటాను !!! ఇప్పటికీ అర్ధం కాకపోతే కనీసం ఇప్పుడైనా తెలుసుకోండి మరి.

ముందుగా హాండ్ వాష్ తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి |
జొన్న పిండిని గిన్నెలోకి తీసుకోవాలి |
ఉప్పు వేసిన వేడినీళ్ళు పోసి ముద్దగా చేసుకోవాలి |
ఉండలను చేతితో తడుతూ జొన్న రొట్టెలు చెయ్యాలి |
పెనం మీద వేసిన జొన్న రొట్టెలను నీళ్ళతో తడపాలి |
ఆ విధంగా జొన్న చపాతీలు (రొట్టెలు) తయారు చేసుకుని మనకిష్టమైన కూరతో తినాలి |