“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

23, ఏప్రిల్ 2017, ఆదివారం

Ee mooga choopela bava - Ghantasala, Renuka


 ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా?
ఓహో మాటాడదే బొమ్మా

అంటూ ఘంటసాల, రేణుక పాడిన ఈ పాట 1962 లో వచ్చిన గాలిమేడలు అనే చిత్రంలోనిది. ఈ పాటను జూనియర్ సముద్రాల వ్రాయగా టీజీ లింగప్ప సంగీతాన్ని సమకూర్చారు. ఇది ఈనాటికీ ఎవర్ గ్రీన్ రొమాంటిక్ గీతమే.

శ్రీలలిత, నేను కలసి పాడిన ఈ పాటను మా స్వరాలలో కూడా వినండి మరి. అమెరికా నుంచి నేను పాడుతున్న నాలుగో పాట ఇది.

ఈ పాటలో NTR తలపాగా కట్టాడని నేను కూడా అదే వేషం వేశా. 

వినండి మరి.

Movie:--Gali Medalu (1962)
Lyrics:--Jr. Samudrala
Music:--TG. Lingappa
Singers:--Ghantasala, Renuka
Karaoke Singers:-- Sri Lalitha, Satya Narayana Sarma
Enjoy
--------------------------------------------------
ఆమె -- ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా
అతడు --  ఓహోమాటాడదే   బొమ్మా నీదరి నేచేరిమాటాడనా
ఆమె --  ఓహో.. ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా
అతడు – ఓహో మాటాడదే బొమ్మా

ఆమె – రేప్పేయకుండా ఒకే తీరునా నువూ చూస్తె నాకేదో సిగ్గౌతదీ
అతడు -- ఓ ఓ ఓ
ఆమె -- రేప్పేయకుండా ఒకే తీరునా నువూ చూస్తె నాకేదో సిగ్గౌతదీ
అతడు -- ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే -2
చేయీ చేయి చేరా విడి పోవులే
ఆమె -- ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా
అతడు --  ఓహోమాటాడదే   బొమ్మా

ఆమె -- చల్లగ నీ చేయి నన్నంటితే చటుకున నామేను జల్లంటదీ
అతడు -- ఓ ఓ ఓ
ఆమె -- చల్లగ నీ చేయి నన్నంటితే చటుకున నామేను జల్లంటదీ
అతడు -- నా ముందు నిలుచుండి నువ్వు నవ్వితే నా మనసే అదోలాగ జిల్లంటదీ
ఆమె -- ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా
అతడు --  ఓహోమాటాడదే   బొమ్మా

ఆమె -- జాగర్త బావా చెయీ గాజులూ ఇవే కన్నె చిన్నారి తొలి మోజులూ
అతడు -- ఓ ఓ ఓ
ఆమె -- జాగర్త బావా చేయీ గా జులూ ఇవే కన్నె చిన్నారి తొలి మోజులూ
అతడు -- చాటేనే ఎలుగెత్తి ఈ గాజులే -2
ఈ వేళా మరేవేళ మన రోజులే
ఆమె -- ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా
అతడు --  ఓహో మాటాడదే   బొమ్మా ...