ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా?
ఓహో మాటాడదే బొమ్మా
అంటూ ఘంటసాల, రేణుక పాడిన ఈ పాట 1962 లో వచ్చిన గాలిమేడలు అనే చిత్రంలోనిది. ఈ పాటను జూనియర్ సముద్రాల వ్రాయగా టీజీ లింగప్ప సంగీతాన్ని సమకూర్చారు. ఇది ఈనాటికీ ఎవర్ గ్రీన్ రొమాంటిక్ గీతమే.
శ్రీలలిత, నేను కలసి పాడిన ఈ పాటను మా స్వరాలలో కూడా వినండి మరి. అమెరికా నుంచి నేను పాడుతున్న నాలుగో పాట ఇది.
ఈ పాటలో NTR తలపాగా కట్టాడని నేను కూడా అదే వేషం వేశా.
వినండి మరి.
వినండి మరి.
Movie:--Gali Medalu (1962)
Lyrics:--Jr. Samudrala
Music:--TG. Lingappa
Singers:--Ghantasala, Renuka
Karaoke Singers:-- Sri Lalitha, Satya Narayana Sarma
Enjoy
--------------------------------------------------
ఆమె -- ఈ మూగ
చూపేలా బావా మాటాడగా నేరవా
అతడు -- ఓహోమాటాడదే బొమ్మా నీదరి నేచేరిమాటాడనా
ఆమె -- ఓహో.. ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా
అతడు – ఓహో మాటాడదే బొమ్మా
ఆమె – రేప్పేయకుండా
ఒకే తీరునా నువూ చూస్తె నాకేదో సిగ్గౌతదీ
అతడు -- ఓ ఓ ఓ
ఆమె -- రేప్పేయకుండా
ఒకే తీరునా నువూ చూస్తె నాకేదో సిగ్గౌతదీ
అతడు -- ఈ సిగ్గు
ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే -2
చేయీ చేయి చేరా
విడి పోవులే
ఆమె -- ఈ మూగ
చూపేలా బావా మాటాడగా నేరవా
అతడు -- ఓహోమాటాడదే బొమ్మా
ఆమె -- చల్లగ నీ
చేయి నన్నంటితే చటుకున నామేను జల్లంటదీ
అతడు -- ఓ ఓ ఓ
ఆమె -- చల్లగ నీ
చేయి నన్నంటితే చటుకున నామేను జల్లంటదీ
అతడు -- నా ముందు
నిలుచుండి నువ్వు నవ్వితే నా మనసే అదోలాగ జిల్లంటదీ
ఆమె -- ఈ మూగ
చూపేలా బావా మాటాడగా నేరవా
అతడు -- ఓహోమాటాడదే బొమ్మా
ఆమె -- జాగర్త బావా
చెయీ గాజులూ ఇవే కన్నె చిన్నారి తొలి మోజులూ
అతడు -- ఓ ఓ ఓ
ఆమె -- జాగర్త బావా
చేయీ గా జులూ ఇవే కన్నె
చిన్నారి తొలి మోజులూ
అతడు -- చాటేనే
ఎలుగెత్తి ఈ గాజులే -2
ఈ వేళా మరేవేళ మన
రోజులే
ఆమె -- ఈ మూగ
చూపేలా బావా మాటాడగా నేరవా
అతడు -- ఓహో మాటాడదే బొమ్మా ...