“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

11, ఏప్రిల్ 2017, మంగళవారం

Phir Wohi Shaam Wohi Gam - Talat Mehmood


Phir Wohi Shaam Wohi Gam Wohi Tanhaayi Hai

Dil Ko Samjhane Teri Yaad Chali Aayi Hai

అంటూ తలత్ మహమూద్ తన సున్నిత స్వరంతో ఆలపించిన ఈ గీతం 1964 లో వచ్చిన Jahan Ara అనే సినిమాలోది. 1960 ప్రాంతాలు సంగీత పరంగా చాలా అద్భుతమైనవి. ఆ సమయంలోనే మంచి మంచి భావుకులైన గీత రచయితలూ, సంగీత దర్శకులూ, గాయకులూ పుట్టుకొచ్ఛారు.ఎవరో గంధర్వులు ఒక బృందంగా ఈ భూమిమీద అవతరించి కొన్ని ఏళ్ళు ఉండి మాయమైనట్లుగా ఆనాటి కళాకారులు కనిపిస్తారు.

ఈ గీత రచయిత రాజేంద్ర క్రిషన్, సంగీతం ఇచ్చినది మదన్ మోహన్, పాడినది తలత్ మెహమూద్. ఇప్పటికీ ఇది మరపురాని మధురగీతమే.

అమెరికాకు వచ్చాక పాడిన మొదటి పాట ఇది. ఇదొక విరహ గీతం. ప్రియురాలిని తలచుకుంటూ పాడుకునే మధుర గీతం. ఇది నాకు చాలా ఇష్టమైన పాట.

ఈ సున్నా డిగ్రీల వాతావరణంలో, వాన పడుతూ ఉండగా, గాజు కిటికీ లోనుంచి బయట పడుతున్న వర్షాన్ని చూస్తూ, ఈ పాటను ఆలపిస్తూ ఉంటె ప్రాణం మరో లోకంలోకి తేలిపోయింది. ఆ మత్తులో ఎంతసేపు అలా ఉన్నానో నాకే తెలియదు. ఇలాంటి వాతావరణం, ఇలాంటి సంగీతం, ఇలాంటి ధ్యానం నాకెంతో ఇష్టం మరి !!

నా స్వరంలో కూడా ఈ  సుమధుర విరహగీతాన్ని వినండి.

-------------------------------------

Movie:-- Jahan Ara (1964)
Lyrics:--Rajendra Krishan
Music:--Madan Mohan
Singer:--Talat Mehamood
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------------------
Phir Wohee sham Wohi gham wohi tanhaayee hai
Dilko Samjhaane Teri yaad chali aayee hai
Phir wohee sham

Phir tasavvur tere pehelu me bithaa jayegaa -2
Phir gayaa vaqt ghadee bhar ko palat aayega
Dil bahal jaayega Aakhir kotho soudaayee hai
Phir wohee sham

Jaane ab tujhse mulaaqaat kabhee hoke na ho -2
Jo adhoori rahi Vo baath kabhee hoke na ho
Meri manzil teri manzil se bichad aayee hai
Phir wohee sham
  
Phir Wohee sham Wohi gham wohi tanhaayee hai
Dilko Samjhaane Teri yaad chali aayee hai
Phir wohee sham….

Meaning

Again, It is the same evening
the same sadness and the same loneliness
However, your memories have resurfaced
to lighten my heart's agony

My imagination allows me
to relax in your arms again
For a moment, those beautiful moments
are coming alive again
Only then my heart is having peace

I don't know if I will ever meet you again
Or if those unspoken words between us
will ever be spoken again
It seems your destiny and mine
took very different routes

Again, it is the same evening
the same sadness and the same loneliness
However, your memories have resurfaced
to lighten my hearts agony

తెలుగు స్వేచ్ఛానువాదం

మళ్ళీ అదే సాయంత్రం
అదే వేదన
అదే ఒంటరితనం
నన్ను ఓదార్చడానికి నీ జ్ఞాపకాలు
నా మదిలో పొంగి వస్తున్నాయి

నీ కౌగిలిలో ఒదిగిపోవడానికి
నా ఊహలే నాకు సహాయపడుతున్నాయి
ఈ విధంగా ఆ మధురక్షణాలను మళ్ళీ ఆస్వాదిస్తున్నాను
అప్పుడు గాని నా మనస్సు శాంతించడం లేదు
ఏం చెయ్యను?


మళ్ళీ అదే సాయంత్రం
అదే వేదన
అదే ఒంటరితనం
నన్ను ఓదార్చడానికి నీ జ్ఞాపకాలు
నా మదిలో పొంగి వస్తున్నాయి

ఈ జన్మలో నిన్ను మళ్ళీ కలుస్తానో లేదో నాకే తెలియదు
నీతో నేను చెప్పాలనుకున్న మాటలను
చెప్పగలనో లేదో తెలియదు
ఏం చేస్తాం... 
మన దారులు ఈ విధంగా వేరై పోయాయి


మళ్ళీ అదే సాయంత్రం
అదే వేదన
అదే ఒంటరితనం
నన్ను ఓదార్చడానికి నీ జ్ఞాపకాలు
నా మదిలో పొంగి వస్తున్నాయి

మళ్ళీ అదే సాయంత్రం...