“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

14, ఏప్రిల్ 2017, శుక్రవారం

Suhani Raat Dhal Chuki - Mohammad Rafi


సితార్ మీటుతూ
Suhani Raat Dhal Chuki 
Na Jane Tum Kab Avoge

అంటూ మహమ్మద్ రఫీ గళంలో నుంచి సుతారంగా జాలువారిన ఈ గీతం 1949 లో వచ్చిన Dulari అనే సినిమాలోది.అంటే దాదాపు 70 ఏళ్లనాటి పాటన్నమాట. అయినా సరే ఈ నాటికీ ఈపాటకు సాటివచ్చే పాట ఇదే. ఈ పాటకు సాహిత్యాన్ని షకీల్ బదయూని అందించగా సంగీతాన్ని నౌషాద్ అందించారు. ఇదొక అద్భుతమైన పాట. ఈ పాట తనకు చాలా ఇష్టమైన పాటని రఫీ స్వయానా తన ఇంటర్యూలలో చెప్పాడు.

ఈ పాటకు ముందు అంతా రఫీ, సైగల్ స్టైల్ ను అనుకరించేవాడు. అప్పట్లో ఎవరైనా సరే సైగల్ ను రోల్ మోడల్ గా తీసుకోవలసిందే. సైగల్ ప్రభావం అంతలా ఉండేది. ఈ పాట నుంచీ రఫీ తనదైన స్వరాన్నీ స్టైల్ నీ మార్చుకుంటూ వచ్చాడు. ఆ ప్రభావాన్ని స్పష్టంగా ఈ గీతంలో చూడవచ్చు. ఈ పాటను సింపుల్ గా చెప్పాలంటే 'రఫీ ఇన్ ది మేకింగ్' అని చెప్పవచ్చు.

రాధారాణి అనే అభిమాని కోరిక మేరకు ఈ పాటను అమెరికా నుంచి పాడుతున్నాను. థాంక్యూ రాధారాణి ! ఈ పాటను అడిగినందుకు !!

వినండి మరి. 

Movie:--Dulari (1949)
Lyrics:--Shakeel Badayuni
Music:--Noushad
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------------------------------
Suhani raat dhal chuki - Na jane tum kab aavoge
Zaha ki rut badal chukee ee ee ee ee 
Na jane tum kab aavoge

Nazare apni mastiyaa - Dikha dikha ke so gaye
Sitare apni roshnee - Luta luta ke so gaye
Har ek shamma jal chuki - Na jane tum kab aavoge
Suhani raat dhal chuki - Na jane tum kab aavoge

Tadap rahe hai ham yahaa - 2
Tumhare intzaar me -2
Khiza ka rang aa chala hai Mousm - e- bahaar me-2
Mousm - e- bahaar me
Hawa bhi rukh badal chuki - Na jane tum kab aavoge

Suhani raat dhal chuki - Na jane tum kab aavoge
Zaha ki rut badal chukee ee ee ee ee 
Na jane tum kab aavoge
Suhani raat dhal chuki - Na jane tum kab aavoge

Meaning

The beautiful night is gone
Don't know when you will come
The season of the world has changed
Don't know when you will come

The ambiance around has shown its beauty and faded away
The stars gave away their lustre through the whole night
and went to sleep now
All the other lights also have exhausted themselves
But I don't know when you will come

For you, I am desperately waiting here
The lovely weather of spring is giving way
to the cold winter
The wind too is changing its face
But I don't know when you will come

The beautiful night is gone
Don't know when you will come
The season of the world has changed
Don't know when you will come

తెలుగు స్వేచ్ఛానువాదం

మధురమైన రాత్రి గతించిపోయింది
నువ్వెప్పుడొస్తావో తెలియదు
లోకపు ఋతువు మారిపోయింది
అయినా నువ్వెప్పుడొస్తావో తెలియదు

ప్రకృతి తన అందాలని చూపించి చూపించి నిద్రపోయింది
చుక్కలు తమ వెలుగులను దోచి ఇచ్చి నిద్రపోయాయి
మిగిలిన అన్ని దీపాలూ వెలిగి ఆరిపోయాయి
అయినా నువ్వెప్పుడొస్తావో తెలియదు

నీకోసం నేనిక్కడ విరహంతో వేచి ఉన్నాను
వసంతపు శోభలోనికి హేమంతం ప్రవేశిస్తోంది
గాలి కూడా తన ముఖాన్ని మళ్లిస్తోంది
అయినా నువ్వెప్పుడొస్తావో తెలియదు

మధురమైన రాత్రి గతించిపోయింది
నువ్వెప్పుడొస్తావో తెలియదు
లోకపు ఋతువు మారిపోయింది
అయినా నువ్వెప్పుడొస్తావో తెలియదు...