Once you stop learning, you start dying

3, మే 2017, బుధవారం

రెండవ అమెరికా యాత్ర - 23 (గాంగెస్ రిట్రీట్ - మొదటి రోజు)



































మరుసటి రోజు ఉదయమే 6.30 కు క్రింద సెల్లార్లో అందరం సమావేశమైనారు. ఉదయం నాలుగుకే సాధన మొదలు పెడదామని అనుకున్నా గానీ, రాత్రి అందరూ నాకోసం ఒంటిగంట వరకూ మేలుకుని ఉన్నారు గనుక కొంచం సమయాన్ని రిలాక్స్ చేశాను.

9.00 వరకూ సాధన సాగింది. ఆ తర్వాత పైన హాల్లో సమావేశమై కొంచం మాట్లాడుకున్నాం. ఆ సమయంలో వారికి నా విధానంలో సాధన ఎలా ఉంటుంది? అందులోని మెట్లు మెలకువలు ఎలా ఉంటాయి? అన్న విషయాల గురించి వివరించాను.

అదే సమయంలో బ్రేక్ ఫాస్ట్ ముగించి అందరం కలసి గాంగేస్ ఆశ్రమానికి బయలుదేరాము.