Pages - Menu

Pages

17, మే 2017, బుధవారం

రెండవ అమెరికా యాత్ర - 36 (గాంగెస్ రెండవ రిట్రీట్ హోమ్)

పరాశక్తి ఆలయంలో కార్యక్రమం అయిపోయింది గనుక మళ్ళీ మన కధలోకి వద్దాం.

గాంగెస్ లో మేము తీసుకున్న రెండో రిట్రీట్ హోమ్ మొదటి ఇంటికి దాదాపు అయిదు మైళ్ళ దూరంలో ఉన్నది. ఆ ఇంటి గురించే ఈ పోస్ట్.

ఈ ఇల్లు అడవిలో చెట్ల మధ్యన నిర్మానుష్యంగా ఉన్నది. దగ్గరలో ఎక్కడా వేరే ఇల్లే లేదు. Cabin in the woods లాగా ఉంది. రోడ్డు నుంచి ఒక మూడు వందల మీటర్లు అడవిలోకి పోతే అక్కడ ఈ ఇల్లు కనిపిస్తుంది. చెట్లు అడ్డుగా ఉండటం వల్ల రోడ్డుమీదకు కనిపించదు.

మైళ్ళ తరబడి చుట్టూ ఎవరూ లేని ఆ నిర్మానుష్య పరిసరాలలో, సెక్యూరిటీ లేకుండా అంతపెద్ద ఇళ్ళల్లో అసలు వీళ్ళేలా ఉంటారో అర్ధం కాదు. కానీ ఉంటున్నారు.

ఈ ఇంట్లో పైన మూడు బెడ్రూములు, పెద్ద హాలూ, కిచెనూ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో పెద్ద హాలూ, ఒక రీడింగ్ రూమూ, ఒక బెడ్ రూమూ, హీటింగ్ సిస్టమూ, స్టోర్ రూమూ ఉన్నాయి. ముందూ వెనకా బోలెడంత ఖాళీ చోటు పచ్చిక బయళ్ళూ ఉన్నాయి. మనం శబ్దం చేస్తే తప్ప అక్కడ ఏ శబ్దమూ వినిపించదు.

చూడండి మరి.