“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

12, మే 2017, శుక్రవారం

Ruk Jana Nahi Tu Kahi Haar Ke - Kishore Kumar


Ruk Jana Nahi Tu Kahi Haar ke
Kaaton Se Chalke Milenge Saaye Bahaar Se

అంటూ కిషోర్ కుమార్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1974 లో వచ్చిన Intehaan అనే సినిమాలోది. ఎవరూ నీతో తోడుగా రాకపోయినా, లోకం నిన్ను మెచ్చక పోయినా, నీవారు నిన్ను వదలివేసినా, ఏది ఏమైనా సరే, నీ పయనం ఆపవద్దనీ, నీ దారిలో నువ్వు సాగిపొమ్మనీ ఈ గీతం చెబుతుంది.

కొన్ని కొన్ని సినిమా పాటలు కూడా చాలా అద్భుతమైన అర్ధాన్ని కలిగి ఉంటాయి. ఎంతో ఉత్తేజాన్నిస్తాయి. అలాంటి పాటలలో ఇదీ ఒకటి.

మొన్న గాంగెస్ రిట్రీట్ కు బయలు దేరుతున్నప్పుడు వినోద్ ఖన్నా చనిపోయాడని వార్త తెలిసింది. అప్పుడు జర్నీలో ఉన్నాం. అందుకే ఈ పాటను పోస్ట్ పోన్ చేసాను.

ఇది నాకు బాగా ఇష్టమైన ఫిలాసఫికల్  పాటల్లో ఒకటి. అర్ధం చదివాక మీరూ నాతో ఏకీభవిస్తారని నా నమ్మకం.

అమెరికానుంచి పాడుతున్న నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి.

Movie:-- Intehaan (1974)
Lyrics:-- Mahrooh Sultanpuri
Music:-- Laxmikant Pyarelal
Singer:-- Kishore Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------------------------------
Ruk jana nahin tu kahin haar ke
Kaanton pe chalke
Milenge saaye bahaar ke
Ruk jana nahin tu kahin haar ke
Kaanton pe chalke
Milenge saaye bahaar ke
O raahi, o raahi x 4

Sooraj dekh ruk gaya hai
Tere aage jhuk gaya hai
Sooraj dekh ruk gaya hai
Tere aage jhuk gaya hai
Jab kabhi aise koi mastana
Nikle hai apni dhun mein deewana
Shaam suhani ban jaate hain
Din intezar ke
O raahi, o raahi x 2
Ruk jana nahin tu kahin haar ke
Kaanton pe chalke
Milenge saaye bahaar ke
O raahi, o raahi x 4

Sathi na karvan hai
Yeh tera imtihaan hai
Sathi na karvan hai
Yeh tera imtihaan hai
Yoon hi chala chal dil ke sahare
Karti hai manzil tujhko ishare
Dekh kahin koi rok nahin le
Tujhko pukaar ke
O raahi, o raahi x 2
Ruk jana nahin tu kahin haar ke
Kaanton pe chalke
Milenge saaye bahaar ke
O raahi, o raahi x 4

Nain aansu jo liye hain
Yeh raahon ke diye hain
Nain aansu jo liye hain
Yeh raahon ke diye hain
Logon ko unka sab kuchh deke
Tu to chala tha sapne hi leke
Koi nahin to tere apne hain
Sapne yeh pyaar ke
O raahi, o raahi
Ruk jana nahin tu kahin haar ke
Kaanton pe chalke
Milenge saaye bahaar ke
O raahi, o raahi x 4


Meaning

O traveller ! Never stop your journey
Never give up your effort
You need to walk on thorns
to reach the roses of spring

Look the Sun has stopped in the sky
and saluting you
Whenever a man of determination
walks out into the world with zeal and energy
the evenings look more lovely
and the days are full of waiting

Though you have no companions
and no groups to accompany you
Just keep walking
this is a test for you
Your heart shows you the way
and the way beckons you with suitable hints
Beware of those who call you back to stop you
Never stop

The tears in your eyes 
are the lamps that light up your path
You gave to people what they own
and walked out only with your dreams as your support
Dont worry if no one loves you
Your dreams are your companions
Just walk on

O traveller ! Never stop your journey
Never give up your effort
You need to walk on thorns

to reach the roses of spring

తెలుగు స్వేచ్చానువాదం

ఓ యాత్రికుడా ! నీ పయనం ఆపకు
నిరాశకు లోను కాకు
వసంతాన్ని చేరుకోవాలంటే
ముళ్ళమీద నువ్వు నడవక తప్పదు

చూడు ! సూర్యుడు కూడా తన పయనాన్ని ఆపి
నీవైపు చూస్తున్నాడు
ఎప్పుడైతే ఒక ఉత్సాహవంతుడు ధైర్యంగా
ఈలోకంలోకి అడుగు వేస్తాడో
అప్పుడు సాయంత్రాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి
రోజులు అతనికోసం వేచి చూస్తాయి

నీకు తోడుగా ఎవరూ లేకపోయినా
ఏ గుంపూ నీతో రాకపోయినా
నీ నడకను ఆపకు
తెలుసుకో ఇది నీకొక పరీక్ష
నీ హృదయమే నీకు దారి చూపిస్తుంది
దారే నిన్ను చేతులు సాచి ఆహ్వానిస్తుంది
నిన్ను వెనక్కు లాగేవాళ్ళూ ఆపాలని చూచేవాళ్ళూ ఉంటారు
వారివైపు చూడకు
నీ నడకను ఆపకు

నీ కన్నులలో నీటి బిందువులే
నీ దారిని వెలిగించే దీపాలు
మనుషులతో నీకున్న బాకీలన్నీ తీర్చేశావు
నీ స్వప్నాలే ఆధారంగా లోకంలోకి అడుగు వేశావు
నిన్నెవరూ ప్రేమించకపోతే పోనీ
నిరుత్సాహ పడకు
నీ స్వప్నాలే నీకు తోడు
నీ నడకను ఆపకు


ఓ యాత్రికుడా ! నీ పయనం ఆపకు
నిరాశకు లోను కాకు
వసంతాన్ని చేరుకోవాలంటే
ముళ్ళమీద నువ్వు నడవక తప్పదు...