వాకిట్లోంచి ఆమె లోపలి వస్తున్నప్పుడే -'ఈయనే మా గురూజీ' అంటూ శ్రీనివాస్ నన్ను పరిచయం చేశారు. నేను "నమస్తే" అని చేతులు జోడించాను. ఆమె కూడా చేతులు జోడించి "నమస్తే" అని తలవంచి అన్నారు. అలా అంటూ ఆమె ఇంకా ఇలా అన్నారు.
'నేనెవ్వరికీ పాదాలు తాకి నమస్కారం చెయ్యను. ఎందుకంటే నా తలను ఎప్పుడో జగజ్జనని శారదామాత పాదాల వద్ద సమర్పించేశాను. కనుక ఏ మనిషి కాళ్ళకూ నా తలను ఎప్పుడూ తాకించను.'
ఆమె భావాన్ని అర్ధం చేసుకున్న నేను నవ్వుతూ ఇలా అన్నాను.
'నేనూ అంతే. ఈ విషయంలో మనిద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం.'
ఆమె తన మాటలను కొనసాగించింది.
కానీ నేను అన్ని మతాలనూ గౌరవిస్తాను. ఠాకూర్ (శ్రీరామకృష్ణులు) ఆ విధంగానే బోధించారు. ఆయన్ను పూజించే మనం ఆయన చెప్పినట్లుగా ఉండాలి. ఉదాహరణకు మా అమ్మాయి చదువుకునేటప్పటి నుంచీ ఒక కేథలిక్ చర్చిలో కేంటర్ గా ఉంది. కేంటర్ అంటే ఏమిటో మీకు తెలుసా? క్రిష్టియన్ కాయర్ లో ప్రధాన సింగర్ ని కేంటర్ అంటారు. మామూలుగా క్రిష్టియన్స్ లో కేతలిక్స్ అనేవాళ్ళు చాలా ఆర్దోడాక్స్ గా ఉంటారు. పైగా, అమెరికన్స్ మనల్ని అంత తొందరగా కలుపుకోరు. మనల్ని దూరంగా ఉంచుతారు. అలాంటి ఆర్దోడాక్స్ చర్చిలో ఒక హిందూ అమ్మాయి కేంటర్ గా ఉండేది? ఇదెలా సాధ్యం?
ఇదే విషయాన్ని ఒక క్రిష్టియన్ ఫాదర్ నన్ను అడిగాడు. ఆయనకు నేనిలా చెప్పాను.
'మన డ్రస్సులు వేరు కావచ్చు. కానీ మనసులు కాదు.'
ఈ మాట విని ఆయన అదిరిపోయాడు.
'ఏంటమ్మా మీరు ఏమన్నారు? ఇంత సింపుల్ గా దేవుడిని గురించి ఎవరూ చెప్పగా నేను ఇంతవరకూ వినలేదు' అన్నాడాయన.
అప్పటినుంచీ నన్ను 'సిస్టర్' అని ఆయన పిలిచేవాడు. సామాన్యంగా ఒక క్రిష్టియన్ అమెరికన్ బయట వాళ్ళనెవరినీ బ్రదర్ సిస్టర్ అని చస్తే పిలవడు. కానీ ఆయన పిలిచేవాడు. ఆయన ఇంకా ఇలా అనేవాడు.
'నా సొంత చెల్లెలు కంటే నువ్వే నాకు ఎక్కువ. ఎంత బాగా చెప్పావు ఆ మాటని?'
చాలామంది చాలా ప్రవచనాలు ఉపన్యాసాలు వింటూ ఉంటారు. అలా వినేవాళ్ళు వారివారి మతమే అన్ని మతాలలోకీ గొప్పదని అనుకుంటూ ఉంటారు. మన హిందువులు కూడా అలా అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ అది నిజం కాదు. నేనెప్పుడూ అలా అనను. ఠాకూర్ ఎప్పుడైనా హిందూ ధర్మమే అన్నింటి కంటే గొప్పదని చెప్పారా? లేదు. ఆయన అలా ఎప్పుడూ అనలేదు.
మనందరం ఒకే దైవం నుంచి వచ్చాం. చివరకు మళ్ళీ అక్కడకే పోతాం. కానీ మధ్యలో మనం చేసుకున్న పనులకు తగిన మూల్యం చెల్లిస్తాం. అంతే ! అదే కర్మఫలం అంటే. ఠాకూర్ కూడా "అంతా కర్మే" అనేవారు. ఇప్పుడు అమెరికన్స్ కూడా చాలామంది కర్మను నమ్ముతున్నారు. వాళ్ళు నాతో ఇలా అంటారు. ' మాషీ ! అంతా కర్మఫలం ! అంతే !'
బెంగాలీలో మాషీ అంటే ఆంటీ అని అర్ధం. సామాన్యంగా తల్లి చెల్లెలిని మాషీ అని బెంగాలీలు పిలుస్తారు. మాషీమా అంటే పిన్నమ్మా అని అర్ధం.
వయసుతో సంబంధం లేకుండా ఇక్కడ అమెరికన్స్ ఎవరినైనా సరే వాళ్ళ ఫస్ట్ నేమ్ తో పిలుస్తారు. ఇది మనకు నచ్చదు. అందుకే నేను వాళ్ళతో ఇలా చెబుతూ ఉంటాను. "మీ వయసును బట్టి నన్ను పిలవండి - మాషీ, దీదీ, లేదా గ్రాండ్ మా - ఏదో ఒకటి. ఊరకే నా పేరుతో నన్ను పిలవకండి. అది మా దేశపు విధానం కాదు. మేము వరసలతో ఆప్యాయంగా పిలుచుకుంటాం. పేర్లతో పిలుచుకోం".
ఇప్పుడు వాళ్ళు నన్ను అలాగే పిలుస్తున్నారు.
మనం ఎదుటివారిని వారి వయస్సు ఎంతో అడగవలసిన పని లేదు. వాళ్ళు కన్పించే తీరును బట్టి మనం పిలవవచ్చు. నాకు జుట్టంతా తెల్లబడి పోయింది. ఒక చిన్న పిల్లవాడు వచ్చి నన్ను 'మంజూ' అని పేరుతో పిలిస్తే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది? ఇక్కడ అమెరికన్స్ కు అదే చెబుతూ ఉంటాను.
నేను ప్రస్తుతం డయాబెటిస్ కొలెస్ట్రాల్ లకు బార్డర్ లైన్లో ఉన్నాను. అందుకని మాల్ లో వాకింగ్ కోసం ప్రతిరోజూ వెళుతూ ఉంటాను. అక్కడ అందరూ నాకు పరిచయమే. వారు నన్ను మాషీ అనన్నా పిలుస్తారు లేదా గ్రాండ్ మా అనన్నా పిలుస్తారు. లేదా "మిసెస్ బసు" అనన్నా అంటారు.
'అదీ అలా పిలవండి. ఇంకో రకంగా పిలిచారో మీ తోలు వలుస్తాను' అని వాళ్ళను బెదిరిస్తూ ఉంటాను. వాళ్ళూ ఏమీ అనుకోరు. చివరకు అక్కడి సెక్యూరిటీ గార్డులకు కూడా నేనంటే భయమే. ఎందుకంటే, వాళ్ళనలా అరవాలంటే అది ప్రేమనుంచే సాధ్యమౌతుంది. ఆ విషయం వాళ్ళకూ తెలుసు.' అంటూ ఆమె పెద్దగా నవ్వేసింది.
బాగా గొంతు తగ్గించి ఏదో రహస్యం చెబుతున్నట్లు ఆమె ఇలా అంది.
'ఈ లోకంలో ఏ హృదయపు తలుపు నైనా తెరవాలంటే అది ఒక్క 'ప్రేమ' అనే తాళంచెవి వల్లనే సాధ్యమౌతుంది. ఇంక ఏ విధంగానూ అది సాధ్యం కాదు. కానీ ఆ ప్రేమనేది హృదయం నుంచి రావాలి. మనస్ఫూర్తిగా రావాలి. అప్పుడే అది ఆ అద్భుతాన్ని చెయ్యగలుగుతుంది'.
చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు - 'మీరెందుకు ఈ వయసులో కూడా ఆస్పత్రి రిసెప్షన్ లో పనిచేస్తున్నారు?' అని. అక్కడ కూచోవడం నాకు బాగుంటుంది. నేను అక్కడ ఊరకే కూర్చుని వచ్చే పోయేవారిని చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటాను. అది వాళ్లకు ఎంతో ధైర్యాన్నిస్తుంది.
మనం ఎదుటివారికి గొప్పగొప్ప బహుమతులు, నగలు ఇవ్వనక్కరలేదు. మనస్ఫూర్తిగా నవ్వుతూ వారితో మాట్లాడితే చాలు. అదే వారికి ఎంతో స్వాంతనను కలిగిస్తుంది. "ఈ జనసముద్రంలో కూడా మనల్ని పట్టించుకునే వారు ఒకరున్నారు" అన్నదే ఈ రోజులలో ఎవరికైనా సరే కావలసిన ముఖ్యమైన ఆసరా.
అంతమాత్రం చేత నేను పూర్తిగా నిస్వార్ధపరురాలిని కాను. అలా అనుకోవద్దు. స్వార్ధం అనేది అస్సలు ఉండకూడదని చాలామంది బోధకులు చెబుతూ ఉంటారు. అది నిజం కాదు. ఎందుకంటే - అది జరిగే పని కాదు. కావాలంటే మిమ్మల్ని మీరే పరిశీలించి చూచుకోండి.
మీరు నాతో ఎంతో ప్రేమగా ఉన్నప్పుడు, నేను మిమ్మల్ని హర్ట్ చేసే ఒక మాటంటే మీకు బాధ కలుగుతుందా లేదా? తప్పకుండా కలుగుతుంది. నేను అలా అన్నాకూడా మీరు నవ్వుతూ మనసులో ఏమీ లేకుండా నాతో ఉండగలరా? సాధ్యం కాదు. మీరు నాతో మర్యాదగా ఉన్నప్పుడు, నానుంచి ఏమి ఆశిస్తారు? నగలూ డబ్బూ కాదు. ఒక చక్కని ప్రవర్తననే మీరు నా నుంచి ఆశిస్తారు. అంతే కదా ! మనం అలా ఉండగలిగితే చాలు. అదే అసలైన సెల్ఫ్ లెస్ ప్రవర్తన అని నేనంటాను.
చాలామంది నన్ను ఎమోషనల్ అంటారు. అందులో తప్పు లేదని నేనంటాను. ఎమోషనల్ కాకుండా మనం ఏ పనినీ మనస్ఫూర్తిగా చెయ్యలేము. అప్పుడే పుట్టిన ఒక బేబీని చూచినప్పుడు మనం ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తాం. ఎమోషన్ లేకపోతే మనం డెడ్ అయినట్లే. మనలో జీవం ఉండదు. కనుక ఎమోషనల్ అవడం ఏమీ తప్పు కాదు. ఆ పరిస్థితికి తగినట్లుగా మనం ఎమోషనల్ అయినప్పుడే మనం మనుషులం అవుతాం. లేకపోతే మనం నడుస్తున్న శవాలమే.
నేను ఎమోషనలే కాని గాసిప్ అంటే నాకేమీ ఇష్టం ఉండదు. నేనెప్పుడూ గాసిప్ చెయ్యను. ఈ లక్షణం నాకు మా నాన్నగారినుంచి వచ్చింది. ఆయనకు ఈ గుణం ఎక్కడనుంచి వచ్చిందో తెలుసా? అదాయనకు శ్రీశ్రీ మా (శారదామాత) నుంచి వచ్చింది."
అంటూ మాషీమా కొనసాగించింది.