స్వామీజీతో మాట్లాడాక అక్కడకు ఒక ఇరవై నిముషాల దూరంలో ఉన్న 'హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో' కు చేరుకున్నాం. అది ఒరిజినల్ గా రామాలయం. వీరి వెబ్ సైట్ ను ఇక్కడ చూడవచ్చు.
ఈ ఆలయ ప్రాంగణంలో వివేకానంద స్వామి విగ్రహం ఒకటి ఉన్నది. దాని పక్కనే ఒక పెద్ద ఆడిటోరియం ఉన్నది. ఇందులో స్వామి ఈశాత్మానంద గారు తరచుగా ప్రసంగాలు ఇస్తారని తెలిసింది.
అక్కడ శ్రీరామ దర్శనం చేసుకుని ఆలయ కేంటీన్లో భోజనాలు కానిచ్చి మళ్ళీ కార్లెక్కి డెట్రాయిట్ కు బయలుదేరాం. కేంటీన్లో మన టిఫిన్లు అన్నీ దొరుకుతాయి. ఇవన్నీ బయట తినాలంటే ఎక్కడో ఉన్న ఇండియన్ హోటల్ కు వెతుక్కుంటూ పోవాలి. ఇక్కడైతే పుణ్యం పురుషార్ధం రెండూ ఒకేచోట లభిస్తాయి. అమెరికాలో ఉన్న మన దేవాలయాలన్నీ ఇప్పుడు చక్కటి కేంటీన్లను నడుపుతున్నాయనీ, చాలామంది దేవుడిని చూడటం కంటే ఇక్కడ ఫుడ్ తినడానికే వస్తుంటారనీ, ఊరకే తిని వెళ్ళిపోతే బాగుండదు గనుక దైవదర్శనం చేసుకుని వెళుతూ ఉంటారనీ నాకు తెలిసింది.
ఆ ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.