ఎడ్వాన్స్డ్ కరాటే కటాలలో శాంచిన్ తర్వాత చెప్పవలసినది 'టెన్షో' కటా. టెన్షో అంటే అర్ధం Revolving Hands అని. ఇది "గోజుర్యూ" స్టైల్ కు చెందిన కటా. గోజుర్యు స్టైల్ లో హార్డ్ కరాటే, సాఫ్ట్ కరాటే రెండూ కలగలసి ఉంటాయి. హార్డ్ స్టైల్ టెక్నిక్స్ లో శరీరబలానికి, మజిల్ పవర్ కు ప్రాధాన్యత ఉంటే, సాఫ్ట్ స్టైల్ టెక్నిక్స్ లో బ్రీతింగ్ కు, ఇంటర్నల్ పవర్ జెనరేషన్ కు ప్రాధాన్యత ఉంటుంది. ఈ కటాలో రెండూ కలసి ఉంటాయి గనుక ఇది మాస్టర్స్ కు ఫేవరేట్ కటాలలో ఒకటి అయింది.
గోజుర్యు కరాటే గ్రాండ్ మాస్టర్ అయిన "చోజన్ మియాగి" 1921 లో దీనిని సృష్టించాడు. ఆ తర్వాత ఇది అనేక కరాటే స్టైల్స్ లోకి స్వీకరించబడింది. క్యోకుషిన్ కాయ్ కరాటే గ్రాండ్ మాస్టర్ అయిన "మాస్ ఒయామా" ఫేవరేట్ కటాలలో ఇదీ ఒకటి.
అమెరికాలో ఇంటి డెక్ మీద చేసిన ఈ కటాను యూట్యూబ్ లో ఇక్కడ వీక్షించండి మరి.