Pages - Menu

Pages

28, జూన్ 2017, బుధవారం

రెండవ అమెరికా యాత్ర -75 (Bharatiya Temple Visit)

ఈరోజు ఇక్కడకు దగ్గరలోనే ఉన్న భారతీయ టెంపుల్ ను సందర్శించాము. ప్రతిరోజూ దానిమీదుగా పదిసార్లు తిరుగుతున్నప్పటికీ ఇంతవరకూ గుడి లోపలకు పోలేదు. ఎల్లుండే ఇండియాకు తిరుగు ప్రయాణం కనుక ఇక ఈరోజు టెంపుల్ కు వెళ్లి వచ్చాం. వీకెండ్ లో అయితే జనాల గోలతో విసుగ్గా ఉంటుందని ఈరోజు వెళ్లి వచ్చాం. ఉత్తర భారతీయ పోకడలతో దేవాలయం బాగుంది.

అంత పెద్ద గుడిలో ఇద్దరు పూజారులు మేమూ తప్ప ఒక్క పురుగు లేదు. లోపల ఇద్దరు పూజారులు కూచుని ఎవరి సెల్ ఫోన్లో వాళ్ళు యూట్యూబు వీడియోలు చూసుకుంటున్నారు. మేము లోపలకు పోయి దేవుళ్ళందరికీ దణ్ణాలు పెట్టుకుంటూ చివరకు వాళ్ళ ఎదురుగా నిలబడితే అప్పుడు తీరికగా తలలెత్తి విసుగ్గా చూసి మా మొఖాన కాస్త తీర్ధం పోసి మళ్ళీ యూట్యూబులో తలలు దూర్చారు. అమెరికా వీక్ డేస్ లో ఇదీ మన దేవాలయాల పరిస్థితి. మన పూజారుల పరిస్థితి.

ఆ ఫోటోలు ఇక్కడ.