'గుండెనిండా గుడిగంటలు' అంటూ బాలసుబ్రమణ్యం తనదైన శైలిలో మధురంగా ఆలపించిన ఈ గీతం 1998 లో వచ్చిన 'శుభాకాంక్షలు' అనే చిత్రంలోది. ఈ పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి వ్రాయగా, కోటి సంగీతాన్ని అందించారు.
నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.
------------------------------------------------
గుండె నిండా గుడిగంటలు – గువ్వల గొంతులు – ఎన్నో
మోగుతుంటే
'చాంద్ ఫిర్ నిక్ లా' అంటూ లతా మంగేష్కర్ మధురంగా ఆలపించిన ఈ పాథోస్ గీతం 'పేయింగ్ గెస్ట్' అనే సినిమాలోది. ఈ సినిమా 1957 లో వచ్చింది. 60 ఏళ్ళ తర్వాత కూడా ఇది మరపురాని మధురగీతమే. నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి. Movie:-- Paying Guest (1957)
Lyrics:--Majrooh Sultanpuri
Music:-- S.D.Burman
Singer:--Lata Mangeshkar
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------------
Chand phir nikla - Magar tum na aaye
Jala phir mera dil - Karu kya me haaye
Chand phir niklaa
Ye raat kehtee hai - Vo din gaye tere
Ye jaantaa hai dil - Ke tum nahi mere
Khadee hu me phir bhee - Nigahe bichaye
Me kya karu haaye - Ki tum yaad aaye
Chaand phir niklaa
Sulagthe seene se - Dhuvasa utthaa hai
Lo ab chale aavo - Ke dum ghutthaa hai
Jala gaye tan ko - Baharo ke saaye
Me kya karu haaye - Ke tum yaad aaye
Chand phir nikla - Magar tum na aaye
Jala phir mera dil - Karu kya me haaye
Chand phir niklaa Meaning The Moon rose again but you haven't come yet My heart is burning again Alas ! What can I do? The night says - 'your good days are gone' My heart knows that you are no longer mine Yet, I am standing here waiting for you with wide open eyes with a hope that you will come back What can I do? I am haunted by your thoughts Something like a smoke is coming out of my burning heart Come back to me because my life energy is ebbing out The shadow of spring season has scorched my whole body What can I do? I am haunted by your thoughts
The Moon rose again but you haven't come yet My heart is burning again Alas ! What can I do?
తెలుగు స్వేచ్చానువాదం
చంద్రుడు మళ్ళీ ఉదయించాడు
కానీ నువ్వు ఈరోజు కూడా రాలేదు
నా హృదయం కాలుతోంది
ఏం చెయ్యను?
'నీ మంచి రోజులు గతించాయి' అంటూ ఈ రాత్రి అంటోంది
నువ్వు నావాడివి కాదని నా హృదయం చెబుతోంది
కానీ కళ్ళు విప్పార్చుకుని నేనిక్కడే నిల్చుని ఉన్నాను
నేటి నుంచీ కొత్త సీరీస్ ఒకటి మొదలు పెడుతున్నాను. జీవితాలపైన గ్రహప్రభావం ఎలా ఉంటుందో ప్రాక్టికల్ గా చెప్పడమే ఈ సీరీస్ ఉద్దేశ్యం. ప్రతిరోజూ మన జీవితాలలో మన చుట్టూ జరిగే సంఘటనలు ఏ విధంగా గ్రహసంచారాన్ని బట్టి ఉంటుంటాయో ఈ సీరీస్ రుజువు చేస్తాయి. మీమీ జీవితాలలో ఇక్కడ నేను చెప్పినవి జరుగుతున్నాయో లేదో మీరే పరిశీలించుకోండి మరి.
నాతో కలసి ఈ రహస్య ప్రపంచంలో విహరించడానికి మీకిదే నా ఆహ్వానం !!
ఈరోజూ రేపూ
----------------
అనవసరంగా అనుకోకుండా జరిగిన చిన్న చిన్న సంఘటనలు మనసును బాధిస్తాయి. డిప్రెషన్ తేలికగా కలుగుతుంది. విలాస వస్తువుల కోసం కాలం వెచ్చిస్తారు. ఈగో ప్రాబ్లంస్ తలెత్తుతాయి. మనుషుల మధ్యన కమ్యూనికేషన్ కుంటుపడుతుంది. కమ్యూనికేషన్ డివైజెస్ రిపేర్లోస్తాయి. కానీ త్వరలోనే బాగౌతాయి.
Suhana safar aur ye mausam haseee అంటూ ముకేష్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1958 లో వచ్చిన మధుమతి అనే సినిమాలోది. ఈ గీతానికి సాహిత్యాన్ని శైలేంద్ర అందించగా సంగీతాన్ని సలీల్ చౌదురీ సమకూర్చారు. 6 రోజుల క్రితం రిలీజైన సినిమాలో పాటలు మనకు గుర్తుండటం లేదు. కానీ 60 ఏళ్ళ క్రితం పాటలు ఇంకా గుర్తున్నాయి. అదీ ఆనాటి సంగీత సాహిత్యాల మహత్యం అంటే !! అప్పట్లో హీరో ఇలా ప్రకృతిలో విహరిస్తూ పరవశించి పాడే పాటలు సినిమాలలో ఒక ఒరవడిగా ఉండేవి. ఈ పాటా అలాంటిదే. ఇందులో దిలీప్ కుమార్ నటించాడు. ఈ పాట మొదట్లో గొర్రెల కాపరి గొర్రెలను అదిలిస్తూ అరిచే అరుపులు ఉంటాయి. అసలు పాటలో వాటిని ఎవరన్నారో నాకు తెలీదు గాని ఈ పాటలో నేనే ఆ బిట్ కూడా అన్నాను. ఇలాంటి మిమిక్రీలు చెయ్యడం మనకు చాలా సరదా కదా మరి !! నా స్వరంలో కూడా ఆ మధురగీతాన్ని వినండి. Movie:-- Madhumathi (1958) Lyrics:--Shailendra Music:-- Salil Choudhury Singer:-- Mukesh Karaoke Singer:-- Satya Narayana Sarma Enjoy -------------------------------------- Suhana safar aur ye mausam haseee Suhana safar aur ye mausam haseee
Hame dar hai ham kho na jaaye kahee
Suhana safar aur ye mausam haseee Suhana safar aur ye mausam haseee
Hame dar hai ham kho na jaaye kahee
Suhana safar aur ye mausam haseee [Ye kaun hasta hai phoolon me chup kar
Bahar bechain hai kiski dhun par] - 2
kahi gungun kahi runjhun ke jaise naache jamee
[Ye gori nadiyon ka chalna ujhal kar
Ke jaise alhad chale Pee se milkar] - 2
Pyare pyare ye nazare Nikhar hai har kahee
[Vo aasma jhuk rahaa hai jamee par
Ye milan hamne dekha yahee par] - 2
Meri duniya mere sapne Milenge shaayad yahee
Suhana safar aur ye mausam haseee
Hame dar hai ham kho na jaaye kahee
Suhana safar aur ye mausam haseee Meaning The journey is good and the weather is pleasant I am afraid that I may lose my way somewhere Hiding in the flowers Who is smiling? The weather is intoxicated with somebody's tune The Earth is dancing with a hum here and a beat there These pure waters of rivers are running with jest as if a sweet girl is running to meet her lover Such lovely sights are everywhere The sky at the horizon is bending to kiss the Earth This wondrous meeting I see only here Perhaps my dreams may come true here తెలుగు స్వేచ్చానువాదం ప్రయాణం చాలా బాగుంది ప్రకృతి మనోహరంగా ఉంది ఎక్కడ నేను మైమరచి పోతానో తెలియడం లేదు ఈ పూలలో దాక్కుని ఎవరు నవ్వుతున్నారో? ప్రకృతి ఎవరి పాటలతో పరవశిస్తోందో? ఈ నేల కూడా సంతోషంతో నాట్యం చేస్తోంది ఈ నదుల స్వచ్చమైన జలాలు తన ప్రియుని చేరడానికి పరుగెత్తే అమ్మాయిలా గలగలా ప్రవహిస్తున్నాయి ఎక్కడ చూచినా ప్రేమ ఉప్పొంగుతోంది ఆకాశం వంగి భూమిని ముద్దాడటం ఇక్కడే చూస్తున్నాను నా కలలు ఇక్కడే నిజం కావచ్చు ప్రయాణం చాలా బాగుంది ప్రకృతి మనోహరంగా ఉంది ఎక్కడ నేను మైమరచి పోతానో తెలియడం లేదు
అంటూ పి.సుశీల మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1963 లో వచ్చిన నర్తనశాల అనే సినిమాలోది. గాయనీమణులు ఆలపించిన గీతాలలో నాకు నచ్చే పాటలు కొన్నున్నాయి. అలాంటి ఎవర్ గ్రీన్ మధురగీతాలలో ఇదీ ఒకటి. ఈ పాటను రచించినది సముద్రాల రాఘవాచార్య అయితే సంగీతాన్ని సమకూర్చినది సుసర్ల దక్షిణామూర్తి.
మాధుర్యానికి లింగభేదం లేదని నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను కదా ! అందుకే నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.
తిధుల ప్రకారం ఈరోజు నేను పుట్టినరోజు. పొద్దుటినుంచీ యధావిధిగా శిష్యులూ అభిమానులూ విషెస్ పంపిస్తున్నారు. కొందరు బాగా దగ్గరైన వాళ్ళు అనేక ప్రశ్నలు చనువుగా అడుగుతున్నారు. ఈరోజు నా షెడ్యూల్ ఎలా ఉంటుందా అని చాలామందికి సందేహాలున్నాయి. వారికందరికీ ఈ కవితే జవాబు.
జీవితం దేనినో ఆశించి ఉన్నదాన్ని చేజార్చుకోవడం దేనినో ఊహించి కానిదానికి ఓదార్చుకోవడం దూరపు కొండలను చూస్తూ ఎదురుగా ఉన్నదాన్ని విస్మరించడం భారపు బండలను మోస్తూ కుదురుగా ఉండలేక వెర్రులెత్తడం దేవుడెంత ఇచ్చినా ఇంకేదో ఇవ్వలేదని ఏడవడం దేబిరింత లాపలేక దేవుళ్ళాడుతూ లోకాన్ని వదలడం ప్రేమించేవారిని దూరం చేసుకోవడం ఆత్మీయులతో వైరం పెంచుకోవడం అనవసరపు బరువులకు చాన్సులివ్వడం అపసవ్యపు దరువులకు డాన్సులెయ్యడం అన్నీ తెలుసనుకుంటూ అడుసులో కాలెయ్యడం అన్నీ కాలిపోయాక ఆకులు పట్టుకోవడం వయసు ఛాయల్లో కాలిపోవడం మనసు మాయల్లో కూలిపోవడం మంచి చెప్పినా వినకపోవడం వంచనలకేమో లొంగిపోవడం డబ్బు సంపాదన కోసం ఆరోగ్యాన్ని పణం పెట్టడం అదే ఆరోగ్యాన్ని మళ్ళీ డబ్బుతో కొనుక్కోవడం అహంతో అందరినీ దూరం చేసుకోవడం ఆఖరికి వాళ్ళే కావాలని అలమటించడం ఎందుకు బ్రతుకుతున్నామో తెలియకుండా బ్రతకడం ఎక్కడికి పోతున్నామో తెలియకుండా పోవడం ఏ నేలపై నడుస్తున్నామో అదే మట్టిలో మట్టిగా రాలడం ఏ గాలిని పీలుస్తున్నామో అదే గాలిలో గాలిగా తేలడం ఇదే జీవితం...
సోమవారం రాత్రి 8.30 ప్రాంతంలో ఒక అమర్నాథ్ యాత్ర బస్సును కాశ్మీర్ ముస్లిం టెర్రరిస్ట్ లు ఎటాక్ చేసినప్పుడు ఏడుగురు చనిపోయారు. పదిహేడు మంది గాయపడ్డారు. వందనుంచి నూటయాభై మంది యాత్రికులను చంపడం టెర్రరిస్టుల లక్ష్యం అని చెబుతున్నారు. ఈ సంఘటన కూడా పౌర్ణమి పరిధిలోనే (ఆషాఢ బహుళ ద్వితీయ) రోజునే జరగడం గమనార్హం. జూలై 10 నుంచీ 16 వరకూ ఉన్న కొన్ని గ్రహయోగాల వల్ల ఈ వారంలో ఇలాంటి సంఘటనలు, ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా చాలా జరుగుతాయి.
గతంలో పదిహేనేళ్ళక్రితం నా స్నేహితుడు సందీప్ కుమార్ భట్టాచార్జీ అతని భార్యా ఇద్దరూ ఇలాగే అమర్నాథ్ యాత్రలో జరిగిన బాంబు దాడిలో జమ్మూలో చనిపోయారు. పిల్లలిద్దరూ అనాధలయ్యారు. ప్రభుత్వం ఏదో డబ్బులిస్తుంది కానీ ప్రాణాలు వెనక్కు రావు కదా?
మన దేశంలో మనం యాత్ర కెళ్ళాలంటే కూడా భయపడే ఖర్మ ఇంకెన్నాళ్ళో??
గురుపూర్ణిమ సందర్భంగా లోకానికి అసలైన సుప్రభాతం ----------------------------------------------------------- గురుచరిత్ర వినోదపు పారాయణాలూ మనుచరిత్ర వరూధిని వేషాలూ ఇవన్నీ పరమచెత్త పనులు గురుతత్వం నిజంగా నీకు తెలిస్తే ఈ పనులు నువ్వసలు చెయ్యనుగాక చెయ్యవు సామూహిక భోజనాలన్నీ త్రైమాసిక తర్పణాలే రెంటికీ పెద్ద తేడా లేదు మొదటి దాంట్లో ఆత్మల్లేని దేహాలుంటాయి రెండోదాంట్లో దేహాల్లేని ఆత్మలుంటాయి అంతే తేడా గుళ్ళల్లో నీక్కనిపించే భక్తులందరూ అహంకారంతో కుళ్ళిపోయిన శవాలే శవాలలో జీవం కోసం వెదుకుతున్నావా పిచ్చివాడా? గురుపూర్ణిమ సెలబ్రేషన్స్ అన్నీ మాయదారి అవినీతి వ్యాపారాలే గురువంటే ఒక్క పూర్ణిమకే పరిమితమా వెర్రివాడా? గురువంటే నీ కోరికలు తీర్చే వెలయాలు కాదు గురువంటే నీ అవసరానికి గుర్తొచ్చే ప్రియురాలు కాదు గురువంటే నువ్వేం చేసినా సమర్ధించే ధృతరాష్ట్రపు తండ్రి కాదు గురువంటే నిన్ను తప్పుదారి పట్టించే మతమోహపు ఊబి కాదు నీ దొంగపూజలు గురువుకు అక్కర్లేదు నీ నంగివేషాలు అతని దగ్గర కాదు నీ అక్రమ వ్యాపారంలో వాటా అతనికి ఏమాత్రం అవసరం లేదు నువ్వు కొట్టే కొబ్బరి కాయకు ఆశపడటానికి అతను కోతి కాదు హుండీలో నువ్వేసే రూపాయికి మోసపోవడానికి అతను బిచ్చగాడు కాదు నువ్విచ్చే బట్టలకోసం వేచిచూస్తూ అతను దిసమొలతో లేడు నువ్విచ్చే నగలకోసం ఆశపడి అతను దరిద్రంలో లేడు నాకు బట్టలు పెట్టడం కాదు ముందు నువ్వు బట్టలు కట్టుకో నాకు నగలివ్వడం కాదు ముందు నీ దరిద్రాన్ని తొలగించుకో నాకు నైవేద్యం పెట్టడం కాదు ముందు నువ్వసలైన తిండి తిను నాకు డబ్బులివ్వడం కాదు ముందు నువ్వసలైన ధనాన్ని సంపాదించు నీ హారతిని ఆశిస్తూ నేను చీకట్లో లేను నువ్వు నిమ్నత్వపు చీకట్లో ఉన్నావు నీ హారతి నీకే పట్టుకో నీ నైవేద్యం ఆశిస్తూ నేను ఆకలితో లేను నువ్వు అజ్ఞానపు ఆకలితో ఉన్నావు నీ ఆకలి సరిగ్గా తీర్చుకో గురుచరిత్ర పారాయణం చెయ్యడం కాదు నీ చరిత్ర సక్రమంగా ఉండాలి గురువారం గుడికెళ్ళడం కాదు నీ గుండే గుడిగా మారాలి అప్పుడప్పుడూ సరదాకి మడి కట్టుకోవడం కాదు నువ్వే దైవానికి దడిగా మారాలి గురువంటే విశ్వచైతన్యం నువ్వు కదలలేని రోగివైతే ఆ చైతన్యం నీకెలా అబ్బుతుంది? గురువంటే ఎల్లలు లేని ఆకాశం నువ్వు బురదలో పందివైతే ఆ ఆకాశం నీకెలా అందుతుంది? అసలైన గురుతత్త్వం అందరికీ అందేది కాదు ఎందుకంటే దాని వెల చాలా ఎక్కువ అసలైన గురుతత్త్వం మందలలో దొరికేది కాదు ఎందుకంటే దానికి క్వాలిటీ అంటే చాలా మక్కువ గురుతత్త్వం ఒక ధృవనక్షత్రం దానికోసం ఆకాశంలోకి నువ్వు సుదూర ప్రయాణం చెయ్యాలి గురుతత్త్వం ఒక ఎవరెస్ట్ శిఖరం దానికోసం నీ ప్రాణాలనే పణంగా పెట్టగలగాలి నువ్వు చేస్తున్న పూజలన్నీ వృధానే అవి నీ వ్యధలను ఏమాత్రం తీర్చలేవు నువ్వు వేస్తున్న మతవేషాలన్నీ వృధానే అవి నీకు గురు అనుగ్రహాన్ని ఏమాత్రం అందించలేవు నిజమైన గురు అనుగ్రహం నీకు కావాలంటే ముందు నువ్వు మారాలి నీ లోపలను నువ్వు కడుక్కోవాలి నీ లోగిలిని నువ్వు శుభ్రపరచుకోవాలి నీ పాత 'నేను' లేకుండా పోవాలి నువ్వు కొత్త జన్మ ఎత్తాలి అప్పుడే తెలుస్తుంది గురువంటే ఏమిటో అప్పుడే తెలుస్తుంది గురుతత్త్వం ఏమిటో చెయ్యలేవా ఈ పనిని? అయితే అఘోరించు ఈ బురదలోనే జీవించు ఈ నరకంలోనే ఇదే నీకు సుఖంగా ఉంటే నిన్నెవరూ రక్షించలేరు నరకమే నీకు స్వర్గంలా తోస్తే నిన్నెవరూ కాపాడలేరు గురుతత్త్వం నీకు నిజంగా తెలిస్తే గురుపూర్ణిమ నువ్వు సెలబ్రేట్ చెయ్యవు నిన్ను నువ్వు కాలిబ్రేట్ చేసుకుంటావు గురుతత్వం నీకు నిజంగా తెలిస్తే
ఎల్లకాలం బయట బయట తిరగవు
నీలోపలకు నువ్వు నడుస్తావు
ఇన్నాళ్ళూ తెలీలేదా? పోనీ ఇప్పుడైనా తెలిసిందిగా? మరి మొదలుపెట్టు నీ పనిని వేచి చూస్తోంది నీకోసం దివ్యత్వపు అవని
అంటూ ముకేష్ మధురంగా ఆలపించిన ఈ క్లాసిక్ గీతం 1959 లో వచ్చిన Choti Bahen అనే సినిమాలోది. ఈ గీతానికి సాహిత్యాన్ని హస్రత్ జైపురి, సంగీతాన్ని శంకర్ జైకిషన్ అందించారు.
ముకేష్ స్వరంలో చాలా లోతుంటుంది. ఆయన పాటలు వినటానికి చాలా సింపుల్ గా ఉంటాయి గాని ఆ రాగాలలో చిన్న చిన్న విరుపులు ఉంటాయి. అలవాటు లేకపోతే వాటిని పాడటం కష్టమే.