Pages - Menu

Pages

5, జులై 2017, బుధవారం

అమెరికా జనజీవనం - నా అభిప్రాయాలు - 3

డబ్బు, సెక్స్, పవర్.

అమెరికాలో మూల సూత్రాలు మూడే మూడు. డబ్బు, సెక్స్, పవర్. ఇండియాలో కూడా ప్రస్తుతం ఇవేననుకోండి. కాకుంటే మనకు తరతరాలుగా వారసత్వంగా వచ్చిన సంస్కృతి ఒకటి ఏడిసింది. వాళ్లకది లేదు. మనది వేలాది సంవత్సరాల సంస్కృతి. వాళ్ళది 600 ఏళ్ళ చరిత్ర.

అక్కడ పిల్లలు చిన్నప్పటి నుంచే పోర్నోగ్రఫీకి అలవాటు పడతారు. హైస్కూల్లోనే సెక్స్ లైఫ్ మొదలు పెడతారు. టీనేజిలోనే ఒకరిని మించి పార్ట్ నర్స్ ను మార్చేస్తారు. అక్కడ స్కూళ్లలోనే సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పిస్తారు. దాని మూలసూత్రం ఒక్కటే - "కోరికలను ఆపుకోకు. ఎంజాయ్ చెయ్యి. ఎంజాయ్ చెయ్యడం నీ హక్కు. కాకపోతే రోగాలు రాకుండా, కడుపు రాకుండా చూసుకో. దానికి కావలసిన జాగ్రత్తలు ఎలాగో మేం నేర్పిస్తాం." అందుకే పాతికేళ్ళు వచ్చేసరికి అక్కడ పిల్లలు సెక్సువల్ పెర్వర్ట్ లు గా తయారౌతున్నారు. చాలామంది అమ్మాయిలకు ఆ వయసుకే రెండు మూడు అబార్షన్లు అవుతున్నాయి. పొరపాటున టీనేజి ప్రెగ్నెన్సీ వచ్చి కడుపు తీయించుకునే అవకాశం లేకపోతే,  ఏడుస్తూ ఆ పిల్లలని పెంచుతారు. లేదా ఆ పిల్లల్ని చంపేస్తున్నారు.

నేను అక్కడ ఉన్నపుడు ఒక న్యూస్ చాలా చర్చనీయాంశం అయింది.

ఒక టీనేజి అమ్మాయికి ఇద్దరు పిల్లలు. తండ్రి / తండ్రులు ఎవరో ఆ అమ్మాయికి కూడా తెలుసో తెలీదో మనకు తెలియదు. ఒకరోజున ఆ ఇద్దరు పిల్లల్నీ తన కార్ లో పెట్టి లాక్ చేసి ఆ అమ్మాయి 50 మైళ్ళ దూరంలో ఉన్న బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి రాత్రంతా వాడితో గడిపి తెల్లారి తిరిగి వచ్చింది. ఈలోపల ఆ పిల్లలిద్దరూ కారులో ఊపిరాడకో లేదా చలికో చనిపోయి ఉన్నారు. ఈ సంఘటన జరిగి ఇంకా ఒక నెల కూడా కాలేదు. ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఆ పిల్లల్ని చంపేద్దామనే ఉద్దేశ్యం తోనే ఆ పిల్ల అలా చేసిందని పోలీసులు అంటున్నారు. కేసు నడుస్తోంది.

లెస్బియనిజం, హోమో సెక్సువాలిటీలు అక్కడ సర్వసాధారణమేగాక లీగల్ కూడా. పోప్ కూడా వీటిని ఒప్పుకుంటూ ఆశీర్వదించాడు. ఇంకేం కావాలి? ఆ పోపు పరిస్థితి కూడా ఏమీ బాగాలేదు. దాదాపు ఏభై మంది చిన్నపిల్లల్ని రేప్ చేసిన ఒక HIV వాటికన్ ప్రీస్ట్ గారిని ఉదారంగా క్షమించి ఆయన్ను ఏ కోర్టులూ శిక్షించకుండా అడ్డు పడుతూ పోపుగారు ఈ మధ్యనే ఆ రాక్షసప్రీస్టు గారికి క్షమాభిక్ష పెట్టేశారు. వారి లీలలు అలా ఉంటాయి మరి !!  

అమెరికా సమాజంలో ఉన్నన్ని వెర్రి తలలు ఇంకెక్కడా ఉండవు. అదేమంటే హ్యూమన్ రైట్స్ అంటారు. మా ఇష్టం అంటారు. ఇలాంటి పెర్వర్శన్స్ ను సమర్ధించుకుంటూ ఉద్యమాలు నడుపుతారు. కోర్టులకెళతారు.

అక్కడ పుట్టి పెరుగుతున్న మనవాళ్ళ పిల్లల్లో కూడా ఈ వెర్రి పోకడలు బాగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం అమెరికన్లతో స్నేహాలు. నాకు తెలిసిన ఒక తండ్రి ఉన్నాడు. ఆయన మన ఇండియనే. అక్కడి మన ఇండియన్ సర్కిల్స్ లో చాలా పద్ధతైన మనిషిగా చలామణీ అవుతూ ఉంటాడు. మన ఇండియన్ కల్చర్ గురించి, గుళ్ళు గోపురాల గురించి లెక్చర్లు ఇస్తూ, పిల్లల్ని అలా పెంచాలి ఇలా పెంచాలి అని అందరికీ చెబుతూ ఉంటాడు.

ఇదిలా ఉంటే, ఇరవై ఏళ్ళున్న ఆయన కూతురు ఈ మధ్యనే తన ఫేస్ బుక్ లో దర్జాగా ' నేను బై సెక్సువల్ ను' అంటూ  ఒక స్టేట్ మెంట్ పారేసింది. ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.

ఇండియన్ అమెరికన్స్ ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రశ్న - "వాళ్ళ పిల్లల్ని అమెరికా విషసంస్కృతి చేతిలో పడకుండా కాపాడటం ఎలా?" అనేదే. అది ఎవరి వల్లా కావడం లేదు. దీనికి పరిష్కారం కూడా లేదు. డబ్బుకోసం అక్కడకు వెళ్ళినందుకు బహుశా మనవాళ్ళు పే చేస్తున్న పెనాల్టీ ఇదేనేమో?

పిల్లల్లో పెడ ధోరణులు

అక్కడ హ్యూమన్ రైట్స్ చాలా ఎక్కువ. పిల్లల్ని కూడా అరవకూడదు. కొట్టకూడదు. బెదిరించకూడదు. కనీసం గట్టిగా చెప్పకూడదు. స్కూళ్ళల్లో వారికి ఇదే నేర్పిస్తారు. 'మీ అమ్మ నాన్నా నిన్ను తిడుతున్నారా? కొడుతున్నారా? అయితే ఈ నెంబర్ కు కంప్లెయింట్ చెయ్యి' అని స్కూల్లో టీచర్లే నూరిపోస్తారు.

ఆ నెంబర్ కు నిజంగానే ఆ పిల్లో పిల్లాడో ఫోన్ చేసి తన బాధలు చెబితే వెంటనే పోలీసులొచ్చి అమ్మానాన్నలని అరెస్ట్ చేస్తారు. మరీ చిన్న పిల్లలైతే ఆ పిల్లల్ని తీసుకుపోయి హోమ్స్ లో ఉంచేస్తారు. ఆ పేరెంట్స్ ను వారితో కలవనివ్వరు.

అందుకని పిల్లల్ని పెంచాలంటే తల్లిదండ్రులే భయం భయంగా వారిని పెంచవలసి వస్తుంది. ఈ విధంగా పెరిగిన పిల్లలు పెడగా తయారౌతున్నారు. "మీకేం తెలుసు మీ మొఖాలు? డర్టీ  ఇండియన్  విలేజ్ బ్రూట్స్. కల్చర్ లెస్ మొరాన్స్" అని తల్లిదండ్రులను తిడుతున్నారు. లేదా లోలోపల అనుకుంటున్నారు. అలా ఉన్న పిల్లలను చూసి ఈ పేరెంట్స్ మురిసిపోతూ " అబ్బ ! మా పిల్లలు ఎంత ఎదిగారు? ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు?" అని చంకలు చరుచుకుంటున్నారు. ఇదీ అమెరికాలో మన ఇండియన్ తల్లిదండ్రుల ఖర్మ !!

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడటం అంటే ఇదేనా మరి??