'గుండెనిండా గుడిగంటలు' అంటూ బాలసుబ్రమణ్యం తనదైన శైలిలో మధురంగా ఆలపించిన ఈ గీతం 1998 లో వచ్చిన 'శుభాకాంక్షలు' అనే చిత్రంలోది. ఈ పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి వ్రాయగా, కోటి సంగీతాన్ని అందించారు.
నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.
------------------------------------------------
గుండె నిండా గుడిగంటలు – గువ్వల గొంతులు – ఎన్నో
మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు – సంధ్యా కాంతులు –
శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా
గుండె నిండా గుడిగంటలు – గువ్వల గొంతులు – ఎన్నో
మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు – సంధ్యా కాంతులు –
శుభాకాంక్షలంటే
చూస్తూనే మనసు వెళ్లి నీ ఒళ్లో వాలగా
నిలువెల్లా మారిపోయా నేనేనీ నీడగా
నిలువెల్లా మారిపోయా నేనేనీ నీడగా
నిలువదు నిముషం – నువు ఎదురుంటే
కదలదు సమయం – కనబడకుంటే
కదలదు సమయం – కనబడకుంటే
నువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా- కవ్విస్తూనే
చంద్రజాలం వేశావమ్మా
పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగ ఓ ప్రేమా
గుండె నిండా గుడిగంటలు – గువ్వల గొంతులు – ఎన్నో
మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు – సంధ్యా కాంతులు –
శుభాకాంక్షలంటే
నీ పేరే పలవరించే నాలోని ఆశలు
మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు
మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు
తెరిచిన కనులే - కలలకు నెలవై
కదలని పెదవే - కవితలు చదివే
కదలని పెదవే - కవితలు చదివే
ఎన్నెన్నెన్నో గాధలున్న నీ భాషని – ఉన్నట్టుండి
నేర్పినావె ఈ రోజుని
నీ జతలో క్షణమైనా బ్రతుకును చరితగ
మార్చేస్తుందమ్మా
గుండె నిండా గుడిగంటలు – గువ్వల గొంతులు – ఎన్నో
మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు – సంధ్యా కాంతులు –
శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా