Once you stop learning, you start dying

7, జులై 2017, శుక్రవారం

వాన

జెట్ లాగ్ తో నిద్ర పట్టక రాత్రి రెండింటికి లేచా. బయటకు వచ్చి చూస్తే వాన పడుతోంది. అంతా చీకటిగా ఉంది. నాలోకి తొంగి చూచా. వెన్నెల వెలుగు కనిపించింది.

మదిలో కవిత మెరిసింది.

చదవండి
---------------------------
బయట వాన పడుతోంది
నాలో ప్రేమ పుడుతోంది
బయటంతా చీకటిగా ఉంది
నాలో వెలుగు వెల్లువలౌతోంది

వేసవి జల్లు కురుస్తోంది
లోపల వెన్నెల విరుస్తోంది
లోకమంతా మత్తుగా పడి ఉంది
నాలో ఎరుక ఎగసి పడుతోంది

ప్రళయం వచ్చి లోకం మాయమైంది
నేను మాత్రం బ్రతికే ఉన్నా
విలయం వచ్చి మనసే ఆవిరైంది
దాన్ని చూస్తూ నిలిచే ఉన్నా 

చుట్టూ చీకటి సముద్రం
మధ్యలో బడబానలంలా నేను
చుట్టూ జలపాతంలా వర్షం
మధ్యలో శిలావిగ్రహంలా నేను