అమెరికా గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఎన్నైనా వ్రాసుకోవచ్చు. అదంతా ఎందుకు? ఒక కవితలో సారం మొత్తం చెప్తా.
ఐశ్వర్యం ఉంది ఆనందం లేదు
పచ్చదనం ఉంది పవిత్రత లేదు
సుఖం ఉంది సంతోషం లేదు
పరిశుభ్రత ఉంది పాతివ్రత్యం లేదు
విలాసాల మాటున
విషాదం ఉంది
కులాసాల మాటున
కుయుక్తులున్నాయి
రహదారులున్నాయి
జీవితపు దారులు లేవు
సంసారాలున్నాయి
కమ్మని కాపురాలు లేవు
పరుగుల వేగం ఉంది
గమ్యాలు లేవు
తరగని భాగ్యం ఉంది
తపనలు పోవు
తెల్లని తోలు వెనుక
మసి బారిన మనస్సులున్నాయి
చల్లని గాలి వెనుక
కసి నిండిన తమస్సున్నాయి
అన్నీ ఉన్నా
అలవిగాని భయాలున్నాయి
ఎన్నో చెప్పినా
తొలగిపోని అహాలున్నాయి
అమెరికా జీవితం
గమ్యం లేని ప్రయాణం
అమెరికా జీవితం
అతి మోహాల ఆరాటం
డబ్బుల్లోంచి నడిచే నడకల్లో
అవుతోంది సంస్కృతి నాశనం
మబ్బుల్లోకి చేసే పయనంలో
పోతోంది పుడమితల్లి దూరం
అక్కడ పుట్టినందుకు
ఆవిరౌతుంది బాల్యం
అక్రమ స్నేహాల మాటున
చెల్లిస్తుంది భారీ మూల్యం
చెల్లిస్తుంది భారీ మూల్యం
భావితరం ఏమౌతుందో అంటూ
బాధపడే బాంధవ్యం
పాత చింత పచ్చడంటూ
పక్కుమనే యువతరం
అన్నీ చుట్టూ ఉన్నా
ఏమీ మిగలని నైరాశ్యం
ఎందుకొచ్చామిటంటూ
ఏదో తెలియని వైరాగ్యం
మూలాలు మరిస్తే
మూలగక తప్పదు
కాలాలు మారితే
కనుమరుగూ ఆగదు
వేర్లు లేని ప్లాస్టిక్ మొక్క
అమెరికా జీవితం
కాళ్లులేని కండల దేహం
అమెరికా జీవితం
రంగుల్లో మెరుస్తూ
జీవంలేని కాగితం పువ్వు
అమెరికా జీవితం
దిగులుతో రగుల్తూ
బయటకు నవ్వే నవ్వు
అమెరికా జీవితం
అమెరికా జీవితం
దిగులుతో రగుల్తూ
బయటకు నవ్వే నవ్వు
అమెరికా జీవితం