Pages - Menu

Pages

2, జులై 2017, ఆదివారం

Jagjit Singh తో ఇంటర్వ్యూ

టెక్సాస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మాటల్లో ఆనంద్ నాతో ఇలా అన్నారు.

' గురూజీ ! మీరు జగ్జీత్ సింగ్ పాటల్ని బాగా ఇష్టపడతారు కదా? ఆయన డెట్రాయిట్ వచ్చినపుడు miindia నుంచి నేను ఇంటర్వ్యూ చేశాను. ఆ తర్వాత ఒకటి రెండేళ్లకు ఆయన పోయాడు.'

నేనాశ్చర్యంగా ' ఓ అవునా?' అన్నాను.

'అవును. ఆయన చాలా మంచి మనిషి. చాలా మర్యాదస్తుడు. ఆయన పాడే పాటలలాగా ఆయనకూడా చాలా సున్నితమైన మనస్తత్వం కలవాడని నాకనిపించింది.' అన్నాడు ఆనంద్.

'అది నిజమే. ఘజల్స్ పాడాలంటే ఫీలై పాడాలి. అవన్నీ భావగీతాలు. కనుక వాటిని ఫీలౌతూ పాడీ పాడీ వాళ్ళూ భావుకులై పోతారు. అసలు భావుకత లేనిదే ఘజల్స్ వ్రాయలేరు, పాడలేరు, ఎంజాయ్ చెయ్యలేరు. అదీ గాక ఆయన పర్సనల్ లైఫ్ చాలా బాధలతో కూడుకుని ఉంది. అదే ఆయన స్వరంలో పలుకుతుంది.' అని నేనన్నాను.

'ఆయనతో మాట్లాడిన కాసేపటికే ఆయన చాలా మంచి మనిషని నాకనిపించింది. ఆయన లోపల చాలా బాధ ఉందని నాకనిపించింది. నేను ఏ ఆర్ రహమాన్ని కూడా ఇంటర్వ్యూ చేశాను. కానీ అతని ధోరణి చాలా తేడాగా ఉంది. ఎందుకో అతని తీరు మాకెవరికీ నచ్చలేదు.' అన్నాడు ఆనంద్.

ఇది నేను అనుకున్నదే గనుక నవ్వేసి ఊరుకున్నాను.

'ఏ.ఆర్.రెహమాన్ కు ఘజల్స్ గురించి ఏమీ తెలీదనీ, అతను తెలుసుకోవాలనీ, తెలుసుకుని వాటిని బ్రతికించాలనీ సింగ్ అన్నారు.' అన్నాడు ఆనంద్.

రెహమాన్ పని అయిపోయిందనీ అతనికి మంచి దశలు అయిపోయాయనీ అందుకే అతని పాటలన్నీ ఇప్పుడు హిట్ అవడం లేదనీ నేనన్నాను. అంతా అల్లా దయ అని అతను అనుకుంటున్నాడు. కానీ అది నిజం కాదు. అతని జాతకంలో మంచి దశలు జరిగినప్పుడు అతను సక్సెస్ చూశాడు. ఆ దశలు అయిపోతే అది పోతుంది. ఎవరికైనా ఇంతే. అతి కొద్ది మందికి మాత్రమె జీవితాంతం మంచి దశలు నడుస్తాయి. అందరికీ అలా ఉండవు - అని కూడా చెప్పాను.

వీరిద్దరి గురించీ ఆనంద్ ఇంకా చాలా విషయాలు చెప్పాడు. మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. కానీ అవన్నీ కాన్ఫిడెంషియల్ గనుక ఇక్కడ వ్రాయడం లేదు.

ఆ ఇంటర్వ్యూ  ఇక్కడ చూడండి.