నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

23, సెప్టెంబర్ 2017, శనివారం

ప్యూర్టో రికోలో హరికేన్ మరియా భీభత్సం - ఇదీ అమావాస్య పరిధిలోనే

అమావాస్య ప్రభావంలోనే ఇంకొక ఉపద్రవం ఇప్పుడు అట్లాంటిక్ ఫసిఫిక్ సముద్రాల మధ్యన ఉన్న దీవులను హడలెత్తిస్తోంది.  దానిపేరే హరికేన్ 'మరియా'. గత రెండు రోజులనుంచీ ఇది కరీబియన్ దీవులను, తుర్క్స్, కైకోస్ దీవులను, డొమినికన్ రిపబ్లిక్ ను వణికించింది. ఇప్పుడు ప్యూర్టో రికో పై తన విధ్వంసాన్ని చూపిస్తోంది. నిన్న ఆ ప్రాంతంలో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దాదాపు...
read more " ప్యూర్టో రికోలో హరికేన్ మరియా భీభత్సం - ఇదీ అమావాస్య పరిధిలోనే "

21, సెప్టెంబర్ 2017, గురువారం

మా పుస్తకాలు - Secret of Sri Vidya E Book

పంచవటి మబ్లికేషన్స్ నుంచి ఐదో పుస్తకంగా (మూడో ఈ బుక్) Secret of Sri Vidya E Book విడుదలైంది. ఈ పుస్తకం అమెరికా నుంచి 1-6-2017 న వెలువడింది. ఇది 'శ్రీవిద్యా రహస్యం' తెలుగు పుస్తకానికి ఇంగ్లీషు అనువాదం. అయితే తెలుగు భాషలోని ఛందోబద్ధమైన పద్యాలను ఇంగ్లీషులోకి తేవడం కష్టం గనుక, భావం ఏ మాత్రం చెడకుండా వచనంలోనే ఇంగ్లీషులోకి మార్చాము. ఇది కూడా Google play books నుంచి, మరియు amazon.com నుంచి అందుబాటులో ఉంది...
read more " మా పుస్తకాలు - Secret of Sri Vidya E Book "

మా పుస్తకాలు - తారా స్తోత్రం E Book

పంచవటీ పబ్లికేషన్స్ నుంచి వచ్చిన నాలుగో పుస్తకంగా (రెండవ ఈ బుక్ ) -  11-5-2017 న తారా స్తోత్రం E Book రిలీజైంది. దీనిని అమెరికా నుంచి విడుదల చెయ్యడం జరిగింది. Google play books నుంచి ఈ పుస్తకం అందుబాటులో ఉన్నది...
read more " మా పుస్తకాలు - తారా స్తోత్రం E Book "

మా పుస్తకాలు - శ్రీవిద్యా రహస్యం E Book

పాపులర్ డిమాండ్ ను బట్టి, 26-7-2016 న "శ్రీవిద్యా రహస్యం E Book" విడుదల చెయ్యబడింది. ఇందులో 61 పద్యాలతో కూడిన ఇంకొక అధ్యాయం అదనంగా చేర్చబడింది. Google play books నుంచి ఇది అందుబాటులో ఉన్నది...
read more " మా పుస్తకాలు - శ్రీవిద్యా రహస్యం E Book "

మా పుస్తకాలు - తారా స్తోత్రం

పంచవటి పబ్లికేషన్స్ నుంచి వెలువడిన రెండవ పుస్తకం - తారా స్తోత్రం. ఈ పుస్తకం 4-6-2015 న విజయవాడలో ఆవిష్కరింపబడింది. ఇందులో - మొత్తం 108 పాదాలతో కూడిన 27 సంస్కృత శ్లోకములు, వాటికి దాదాపు 400 తెలుగు పద్యములతో కూడిన సరళమైన తెలుగు వివరణ ఇవ్వబడింది. ఈ పుస్తకం పేరుకు దశమహావిద్యలలో ఒకరైన తారాదేవి యొక్క స్తోత్రం అయినప్పటికీ, ఇందులో సందర్భోచితంగా అనేకములైన తంత్ర సాధనా రహస్యాలు వివరించబడినాయి. నిజమైన...
read more " మా పుస్తకాలు - తారా స్తోత్రం "

మా పుస్తకాలు - శ్రీవిద్యా రహస్యం

మా పంచవటి పబ్లికేషన్స్ నుంచి మొదటి పుస్తకంగా వచ్చినది -  'శ్రీవిద్యా రహస్యం'. ఈ పుస్తకం 28-12-2014 న రిలీజైంది. ఇండియాలోనూ విదేశాలలోనూ ఈ పుస్తకం ఎంతోమంది జిజ్ఞాసువులను కదిలించింది. ఆలోచింపజేసింది. మన సనాతన ధర్మాన్ని సరియైన విధానంలో గ్రహించడానికి ఈ పుస్తకం వేలాదిమందికి ఉపయోగపడింది. ఇందులో దాదాపు 1400 తెలుగు పద్యాలు, వాటికి సులభమైన తెలుగుభాషలో వివరణా ఉంటాయి. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటి?...
read more " మా పుస్తకాలు - శ్రీవిద్యా రహస్యం "

20, సెప్టెంబర్ 2017, బుధవారం

కాలగ్రస్త యోగం - 21-8-2017 నుంచి 6-2-2018 వరకూ

కాలసర్పయోగం అనే పదం మీరు విని ఉంటారు. కానీ కాలగ్రస్తయోగం అనే పదం విని ఉండరు. ఎందుకంటే ఇది నేను కాయిన్ చేసిన పదం కాబట్టి. అన్ని గ్రహాలూ రాహుకేతువుల మధ్యలో ఉంటే దానిని కాలసర్పయోగం అంటామని మనకు తెలుసు. కానీ అవే గ్రహాలు కేతురాహువుల మధ్యన ఉంటే దానిని సాధారణంగా అపసవ్య కాలసర్పయోగం అంటున్నారు. కొన్నేళ్ళ క్రితం నేను కూడా దీనిపైన కొన్ని పోస్టులు వ్రాశాను. కానీ ఈ పదం నాకు సమ్మతం కాదు. అందుకని నేను దీనిని...
read more " కాలగ్రస్త యోగం - 21-8-2017 నుంచి 6-2-2018 వరకూ "

Mexico Earth Quake - మళ్ళీ రుజువైన అమావాస్య ప్రభావం

ఈరోజు అమావాస్య. నిన్న సెంట్రల్ మెక్సికోలో 7.1 స్థాయిలో భూకంపం వచ్చింది. దాదాపు 250 మంది చనిపోయారని, వందలాది ఇళ్ళు పేకమేడల్లా నేలకూలిపోయాయని అంటున్నారు. ఇంకా చాలామంది శిధిలాల క్రింద చిక్కుకుని ఉండవచ్చని అంచనా. సహాయకార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ విధంగా అమావాస్య ప్రభావం మళ్ళీ నిజమైంది.  ఈ ప్రదేశం 21-8-2017 న వచ్చిన సూర్యగ్రహణ సమయంలో  వేసిన 'ఆస్ట్రో కార్టో గ్రాఫ్' ...
read more " Mexico Earth Quake - మళ్ళీ రుజువైన అమావాస్య ప్రభావం "

12, సెప్టెంబర్ 2017, మంగళవారం

గురువుగారి తులా రాశి ప్రవేశం - ఫలితాలు

ఏడాది నుంచీ తానుంటున్న కన్యారాశి నుంచి నిన్న రాత్రి గురువుగారు తులా రాశిలోకి ప్రవేశించారు. ఈ రాశిలో కూడా ఏడాది పాటు ఉంటారు. కనుక ఒక వారం నుంచే అందరి జీవితాలలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. గమనించుకోండి. ముఖ్యంగా నిన్నా మొన్నలలో ఖచ్చితమైన మార్పులు కొన్ని మీమీ జీవితాలలో జరిగి ఉంటాయి చూచుకోండి. ఈ గురుగోచారం వల్ల సామూహికంగా అందరి జీవితాలలో కనిపించే (General ) మార్పులు ఇలా ఉంటాయి. మానవ సంబంధాలు విస్తృతం అవుతాయి. బాధ్యతలు పెరుగుతాయి....
read more " గురువుగారి తులా రాశి ప్రవేశం - ఫలితాలు "

10, సెప్టెంబర్ 2017, ఆదివారం

Kabhi Tanhayiyon Me Yu - Mubarak Begum

Kabhi Tanhayiyon Me yun Hamari Yaad Aayegi అంటూ ముబారక్ బేగం తనదైన మధుర స్వరంలో ఆలపించిన ఈ గీతం 1961 లో వచ్చిన Hamari Yaad Aayegi అనే చిత్రం లోనిది. ఎవరూ లేని ఏకాంతం ఎంతో గొప్పది. అందులోనే మన మనసులోకి మనం తొంగి చూచుకునే అవకాశం కలుగుతుంది. మనతో మనం మాట్లాడుకునే అదృష్టం లభిస్తుంది. ఆ ఏకాంతం లోనే మనకు మన గతం గుర్తొస్తుంది. మనం ప్రేమించినవాళ్ళూ, మనల్ని ప్రేమించిన వాళ్ళూ గుర్తొస్తారు. అప్పుడు...
read more " Kabhi Tanhayiyon Me Yu - Mubarak Begum "

6, సెప్టెంబర్ 2017, బుధవారం

మనసు - మాయ

వాస్తవం కంటే మనసే నిన్నెక్కువగా బాధిస్తుంది ఎందుకో తెలుసా? వాస్తవం చిన్నది మనసు భూతద్దం జీవితం కంటే ఆశే నిన్నెపుడూ అల్లాడిస్తుంది ఎలాగో చెప్పనా? జీవితం స్వల్పం ఆశ అనంతం భూతం కంటే మనసే నిన్నెక్కువగా భయపెడుతుంది ఎలాగంటావా? భూతం అబద్దం ఊహ నిజం వాస్తవం కంటే ఊహే నిన్నెపుడూ నడిపిస్తుంది ఎందుకంటావా? వాస్తవం చేదు ఊహ మహాతీపి జరిగిన దానికంటే నువ్వూహిస్తున్నదే నిన్నెపుడూ ఏడిపిస్తుంది జరిగింది నీ చేతిలో లేదు నీ ఊహ నీలో ఉంది లోకం...
read more " మనసు - మాయ "

4, సెప్టెంబర్ 2017, సోమవారం

బాబా రాం రహీం సింగ్ ఉదంతం- కొన్ని కొత్త కోణాలు

రాజకీయం వేరు. గురుత్వం వేరు. ఈ రెండూ ఎప్పుడూ కలవకూడదు. ముఖ్యంగా ఈ కలియుగంలో. సత్యయుగంలో అయితే మనువు వంటి మహారాజులు అందరూ ధర్మాత్ములుగా ఉండేవారు. అప్పుడు రాజరికమూ గురుత్వమూ ఒక్కరిలోనే ఉండటానికి అభ్యంతరం ఏమీ ఉండేది కాదు. త్రేతాయుగంలో కూడా జనకమహారాజు వంటి కొందరు ఈ రెంటినీ తమలో కలిగి ఉండేవారు. కానీ ద్వాపరం వచ్చేసరికి ఈ స్థితి క్షీణించింది. కలియుగంలో అయితే ఇక చెప్పనక్కర లేదు. కలియుగంలో ఈ రెంటినీ...
read more " బాబా రాం రహీం సింగ్ ఉదంతం- కొన్ని కొత్త కోణాలు "

నిజం

తను లేకుంటే వెలుగే లేదని రాత్రిపూట ఎగురుతూ అనుకుంటుంది మిణుగురు పురుగు కానీ...అది ఎగరకపోయినా సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు తను అరవకపోతే వర్షం కురవదని గుంటలో కూచుని అనుకుంటుంది సణుగుడు కప్ప కానీ...అది అరవకపోయినా కుంభవృష్టి కురుస్తూనే ఉంది తను కుయ్యకపోతే తెల్లవారదని బుట్టలో కూచుని అనుకుంటుంది తెలివిలేని కోడి కానీ...అది కుయ్యకపోయినా తెల్లవారి వెలుగొస్తూనే ఉంది తను లేకపోతే ప్రపంచం నడవదని అహంతో అనుకుంటాడు మిడిసిపాటు మనిషి కానీ...అతను...
read more " నిజం "

1, సెప్టెంబర్ 2017, శుక్రవారం

ఛిన్నమస్తా సాధన - 7 (యజ్ఞస్వరూపం)

ఇప్పటిదాకా బౌద్ధ తంత్రాలలో ఈ దేవత గురించి ఏముందో తెలుసుకున్నాం. హిందూతంత్రాలు ఈ దేవతను గురించి ఏమంటున్నాయో ఇప్పుడు చూద్దాం. యజ్ఞరూపాం యజ్ఞదాత్రీం యజ్ఞగ్రహణకారిణీం మోక్షదాం సర్వసత్త్వేభ్యశ్చిన్నమస్తాం నమామ్యహం (నీవు యజ్ఞరూపిణివి. యజ్ఞాన్ని ఇచ్చేదానివి. యజ్ఞాన్ని స్వీకరించేదానివి. అందరు జీవులకూ మోక్షాన్ని ఇచ్చేది నీవే. అటువంటి ఛిన్నమస్తా మహాదేవికి నమస్కరిస్తున్నాను) కొన్ని హిందూతంత్రాలు...
read more " ఛిన్నమస్తా సాధన - 7 (యజ్ఞస్వరూపం) "