మార్చ్ 7 తేదీ నుంచి కుజుడు ధనూరాశిలోకి ప్రవేశించి అప్పటికే అక్కడ ఉన్న శనీశ్వరుడిని కలుసుకున్నాడు. ఇక అప్పటినుంచీ జనాలకు బుద్ధి చెప్పే ఒక బృహత్తర కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. అదేంటంటే , యాక్సిడెంట్లు దెబ్బలు వగైరాలతో జనాల పాత కర్మను తగ్గించడం.
మార్చ్ 24 తేదీ నుంచి, వీరిద్దరూ డిగ్రీపరంగా మరీ దగ్గరగా వస్తున్నారు. అంటే నవాంశలో కూడా ఒకే రాశిలో ఉంటారన్న మాట. కనుక ఆ తేదీనుంచి మీరు గమనిస్తే, ఎక్కడచూచినా చిన్నా పెద్దా యాక్సిడెంట్లు మొదలవడం మీరు చూడవచ్చు. టీవీలలో పేపర్లలో ఎక్కడ చూచినా యాక్సిడెంట్ వార్తలు ఉంటాయి. మీ చుట్టు పక్కలవారిని గమనిస్తే చాలు ఎన్నో సంఘటనలు మీరు ఈ సమయంలో చూస్తారు. ఇంకో వారంపాటు ఈ అత్యంత చెడుకాలం ఉంటుంది. గమనించండి.
వీటిల్లో కొన్ని ఫన్నీ సంఘటనలు కూడా ఉంటాయి. కూచున్నచోట నుంచి ఊరకే లేచి పక్కకు తిరగబోయి క్రిందపడి మోకాలి చిప్పలు పగలగొట్టుకునేవారినీ, కాలవ దాటుదామని చిన్న జంప్ చెయ్యబోయి క్రిందపడి కాలు ఫ్రాక్చర్ అయ్యే వారినీ, కుక్కనో పిల్లినో ఇంకో మనిషినో తప్పించబోయి క్రిందపడి దెబ్బలు తగిలించుకునే వారినీ ఎందరినో మీరిప్పుడు చూడవచ్చు. ఇంకా ఎన్నో ఇలాంటివి సంఘటనలు మీ చుట్టూ జరుగుతాయి గమనించండి.
ముఖ్యంగా ఈ యోగం ఇంకో నెలా పదిరోజుల పాటు ఉంటుంది. ఈ లోపల ఎక్కడ చూచినా యాక్సిడెంట్లు జరుగుతాయి. గమనించండి.
ఈ సమయంలో దూరప్రయాణాలు, ముఖ్యంగా డ్రైవింగ్ చెయ్యడాలు, సాహసకార్యాలు మంచివి కావు. ఇంటి పట్టున ఉండి గుట్టుగా కాలక్షేపం చెయ్యడం ఉత్తమోత్తమం. ముందే చెప్పలేదని తర్వాత నన్ననవద్దు.
జ్యోతిశ్శాస్త్రం నిజమేనని రుజువులేంటి? ఉంటే చూపించండి ! అంటూ కొంతమంది అడుగుతూ ఉంటారు. నిజంగా జిజ్ఞాసతో ఆ ప్రశ్న అడిగితే లక్ష రుజువులు చూపగలను. కానీ జిజ్ఞాస లేకుండా, ఊరకే కాలక్షేపం కామెంట్స్ చేస్తూ వెకిలిగా మాట్లాడేవారికి జవాబు ఇవ్వకపోగా వారిని వెంటనే బ్లాక్ చేసి పారేస్తూ ఉంటాను. అది నా అలవాటు. ఎందుకంటే కాలక్షేప రాయుళ్ళతో వాదన పెట్టుకుని నా సమయాన్ని వృధా చేసుకోవడం నాకస్సలు ఇష్టం ఉండదు మరి !
జ్యోతిశ్శాస్త్రానికి రుజువులు కావాలంటే మన జీవితాలను పరిశీలించుకుంటే బోలెడన్ని కనిపిస్తాయి. అయితే చూచే దృష్టి మనకుండాలి. అప్పుడు విషయాలు అర్ధమౌతాయి. నేటి సంగతే గమనిద్దాం !
ఈరోజు ఈక్వినాక్టియల్ డే. అంటే పగలూ రాత్రీ సమంగా ఉండే రోజు. రేపటినుంచీ రాత్రుల నిడివి తగ్గి పగటి నిడివి పెరుగుతుంది. కనుక ప్రపంచమంతా ఈ రోజున ఎనర్జీ లెవల్స్ లో మార్పులు కలుగుతాయి. ఇవి ప్రతి ఏడాదీ కలుగుతాయి. గమనిస్తే అర్ధమౌతాయి. లేకపోతే అర్ధం కావు.
ఈ రోజున మీ జీవితాలను గమనించుకోండి. ఇన్నాళ్ళూ వాయిదా వేస్తున్న పనులను ఈరోజు అనుకోకుండా చేస్తారు. అవి ఏవో పెద్ద పెద్ద ప్రాజెక్టులే కానక్కరలేదు. చిన్న చిన్న పనులే కావచ్చు. కానీ ఈరోజున చేస్తారు. ఇది ప్రతివారి జీవితంలోనూ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా జరుగుతుంది. ఎందుకంటే సూర్యకాంతిలో ఈరోజు మార్పు ఉంటుంది.
మనిషి జీవితం సూర్యకాంతిమీదా, ప్రకృతిలో మన చుట్టూ ఉన్న విద్యదయస్కాంత రేడియేషన్ మీదా ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. ఇందులో ఏమీ అనుమానం లేదు. వీటిని నమ్మని వారి మీద కూడా ఇవి ప్రభావం చూపిస్తాయి. రేడియేషన్ కూ మన నమ్మకానికీ సంబంధం లేనేలేదు.
గమనించుకోండి ! ఈరోజున మీరు క్రొత్త నిర్ణయాలు తీసుకుని ఉంటారు. లేదా వాయిదా వేస్తున్న పనులను ఈరోజు మొదలుపెట్టి ఉంటారు. కొందరైతే వాటిని పూర్తి చేస్తారు. నేటి మీ షెడ్యూల్ నిన్నటివరకూ ఉన్నదాని కంటే ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. మీమీ జీవితాలు ఈరోజున ఒక క్రొత్త మలుపు తిరుగుతాయి. ఆ మార్పులు మళ్ళీ ఒక్కొక్కరికీ ఒక్కొక్క విధంగా ఉంటాయి. కొంతమందిలో దాగున్న దీర్ఘరోగాలు బయటపడతాయి. ఇంకొంతమంది జ్వరాలు జలుబు దగ్గులు మొదలైన వాటి బారిన పడతారు. ఇంకొంతమందిలో నూతనోత్సాహం పెల్లుబుకుతుంది. మరికొంతమంది ఈరోజు ఉన్న ఎనర్జీ ఊపులో ఇంపల్సివ్ నిర్ణయాలు తీసుకుని తర్వాత తీరికగా బాధపడతారు. ఇదంతా వారివారి జాతకాలను బట్టి జరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఈరోజును ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే చక్కటి ఫలితాలను ఈరోజే చూడవచ్చు !
జ్యోతిష్య శాస్త్రం నిజమే అనడానికి ఇది ఇంకొక ఉదాహరణ. కళ్ళున్నవారు చూడవచ్చు !!
అంటూ అనూప్ జలోటా తనదైన శైలిలో మధురంగా ఆలపించిన ఈ ఘజల్ Mainosh (1991) అనే ఆల్బం లోనిది. ఈ గీతాన్ని మహమ్మద్ వాయిజ్ వ్రాయగా అనూప్ జలోటా సంగీతాన్ని సమకూర్చాడు. చాలా మంచి ఘజల్.
నేను పాడే పాటల్లో చాలావాటిని మీరు విని ఉండరని నాకు తెలుసు. కనీసం ఇప్పుడైనా నా స్వరంలో ఈ పాటను విని తరించండి మరి. :)
Album :-- Mainosh (1991)
Lyrics :-- Mahammad Waayiz
Music:-- Anup Jalota
Singer:-- Anup Jalota
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------
Mehfil-e-Husn sajao to koyi baat bane
Daulat-e-Ishq lutao to koyi baat bane
Jaam O Saghar se gawara nahi peena mujhko
Apni aakhon se pilao to koyi baat bane
Aakhon se pee....
Aakhon se pee Rut mastani ho gayi - 2
Jaam se peena rasm purani ho gayi
Aakhon se pee Rut mastani ho gayi
Jaam se peena rasm purani ho gayi
Kuch unke bhi alhadpan ki hai khata-3
Thodi hamse bhi naadaani ho gayi-2
Jaam se peena rasm purani ho gayi-2
Waqt-e-Sheher ye kaun chaman me aa gaya-3
Sharm se shabnam pani pani ho gaya-2
Jaam se peena rasm purani ho gayi-2
Dil ke aangan khusbu se mehka diya-3
Yaad kisi ki raat ki rani ho gayi-2
Jaam se peena rasm purani ho gayi-2
Wayiz ne saaqi se karli dostee-3
Yetho badi dil chasp kahani ho gayi-2
Jaam se peena rasm purani ho gayi
Aakhon se pee Rut mastani ho gayi
Jaam se peena rasm purani ho gayi-2 Meaning Enjoy the beauty of a musical evening That is enough Steal the treasure of love That is enough Dont make me drink the wine from your goblet Just make me drink love from your eyes That is enough... Drink through the eyes.... Drink through the eyes - The season is lively Why should I drink from a wine goblet anymore? It is an old custom She was still immature and childish So could not understand my love There was foolishness on my part too I could have been a little gentle with her Anyway love has happened between us Why should I drink from a wine goblet anymore? It is an old custom Who has entered my flower garden at dawn?
With shyness, the dew drop has melted into water
Why should I drink from a wine goblet anymore? It is an old custom She has filled the interior of my heart with light
Her thoughts have become my companions during nights
Why should I drink from a wine goblet anymore? It is an old custom Wayiz has made friendship with Saaqi
And this has become a strange love story
Why should I drink from a wine goblet anymore? It is an old custom
Drink through the eyes - The season is lively Why should I drink from a wine goblet anymore? It is an old custom
ఉగాది సందర్భంగా నిన్న నాలుగు ప్రముఖ పార్టీలూ ఎవరికి వారు పంచాంగ శ్రవణాలు పెట్టాయి. ఎవరి పురోహితులు వారికి ఉంటారు కదా? యధావిధిగా అందరూ పట్టు పంచెలు కట్టుకుని బొట్లు పెట్టుకుని ఆసీనులై పంచాంగ శ్రవణం విన్నారు. ఉగాది పచ్చళ్ళు తిన్నారు. అంతా బాగానే ఉంది. అయితే ఇందులో ఒక విచిత్రం ఉంది.
అక్కడ చెప్పేవారికీ జ్యోతిశ్శాస్త్రం ఆమూలాగ్రం తెలీదు. వినేవారికి దానిమీద నమ్మకం లేదు. ఇంకెందుకీ ఫార్స్?
ఇది చాలదన్నట్లు, ఆ జ్యోతిష్కులలో కొందరు వీరంగాలు వేశారు. నేను చెప్పినది నిజం కాకపోతే అసలు జ్యోతిష్యం చెప్పడమే మానేస్తానని ఒకాయన, మీసం తీసేస్తానని ఒకాయన, గడ్డం పెంచుతానని ఒకాయన, ఇవన్నీ అక్కర్లేదు నేను చెప్పేది ఖచ్చితంగా జరుగుతుంది కనుక నేనేమీ ప్రతిజ్ఞలు చెయ్యను అని ఒకాయన - ఇలా రకరకాలుగా కామెడీ చేస్తూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారు. జ్యోతిష్కునికి వినయం ఉండాలని, అహంకారం ఉండకూడదని ప్రామాణిక గ్రంధాలు చెబుతున్నాయి. కానీ ఈ పంచాంగశ్రవణం చేసినవారిలో ఉండకూడని లక్షణాలే కనిపిస్తున్నాయి. వినయమే ఉంటే అలాంటి ప్రగల్భాలు ఎలా పలుకుతారు? అసలు జ్యోతిశ్శాస్త్రంలో వీరికి నిజమైన పట్టు ఉంటే, నలుగురూ నాలుగు రకాలుగా ఫలితాలు ఎందుకు చెబుతారు?
వీరిలో ప్రతివారూ, వారివారి పార్టీ లీడరే తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడని జ్యోస్యాలు చెప్పారు. ఇంతకంటే ఫార్స్ ఇంకెక్కడా ఉండదు. అంటే టీడీపీ,వైఎస్సార్ పార్టీ, జనసేనా, బీజేపీ నలుగురూ ముఖ్యమంత్రులు ఎలా అవుతారో? నాలుగు సీఎం కుర్చీలు వేసుకుని నలుగురూ పక్కపక్కనే కూచుంటారేమో మరి? మనకైతే తెలీదు. నలుగురిలో ఒకరే కరెక్ట్ అవుతారు. మిగతా ముగ్గురూ అబద్దాలు చెప్పినట్లేగా? లేకపోతే వారికి ఆ శాస్త్రం మీద సమగ్రమైన అవగాహన ఇంకా రాలేదనైనా అనుకోవాలి. అలాంటప్పుడు, ముందుగా దానిని సంపాదించి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. పోతే, ఆ వినేవారికి కూడా జ్యోతిష్యం అంటే నమ్మకం ఏమాత్రమూ ఉండదు. వింటే మంచి జరుగుతుందని ఒక నమ్మకమూ, వినకపోతే ఏ చెడు జరుగుతుందో ఏమో? కాసేపు కూచుని వినేస్తే పోలా? అన్న ధోరణి వల్లే వీళ్ళు అక్కడ కూచుని వింటారు గాని నిజంగా చెప్పాలంటే వీరిలో ఒక్కరికి కూడా జ్యోతిశ్శాస్త్రం మీదా మన ధర్మం మీదా విశ్వాసం ఉండదు. ధర్మం మీద విశ్వాసం ఉంటే అధర్మపు నడతలు ఎలా ఉంటాయి వాళ్ళలో? అధర్మం చెయ్యని రాజకీయ నాయకులను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అన్ని వేళ్ళూ పూర్తికావు కూడా. చాలా వేళ్ళు మిగిలిపోతాయి. ఇక జ్యోతిష్కులను చూద్దామా అంటే, లేనిపోని అహంకారాలకు తోడు, డబ్బు మీద ఆశతో, ఎవరు డబ్బిచ్చి పిలిస్తే, వాళ్ళ బాకా ఊదుతున్నారు. ఇది చాలా పొరపాటు. అక్కడ ఉన్నదానిని ఉన్నట్లు చెప్పాలి గాని ఎవరు పిలిచి కాసిని డబ్బులిస్తే వాళ్ళే తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పడం భలే విడ్డూరంగా ఉంది !! నిజమైన జ్యోతిష్కునికి డబ్బు మీద ఆశ ఉండకూడదని కూడా ప్రామాణిక గ్రంధాలు చెబుతున్నాయి. వీళ్ళసలు ఆయా గ్రంధాల మొదటి పేజీలన్నా సరిగ్గా చదివారో లేదో మరి !! నిజం చెప్పనా ? నేటి సమాజం పూర్తిగా కుళ్ళిపోయింది. ఎక్కడ చూచినా నేను, నా కులం, నా స్వార్ధం, నా డబ్బు - ఇది తప్ప విలువలు లేవు. ధర్మాచరణ లేదు. అంతా నాటకం, బూటకం. మనిషి జీవితం అంతా ఒక అసహ్యమైన డ్రామాగా తయారయ్యింది. అందుకే నేడు, నిజమైన మహనీయులు ఎవరూ ప్రజలకు సహాయం చెయ్యడానికి సిద్ధంగా లేరు. వారు సమాజాన్ని చీదరించుకుంటున్నారు. ఎందుకంటే - ప్రజలందరూ ఈ మహనీయుల దివ్యశక్తుల సహాయాన్ని మాత్రమే కోరుతున్నారు గాని, ఎలా ఉండమని వారు చెబుతున్నారో అలా ఉండటం లేదు. కనీసం ప్రయత్నం కూడా చెయ్యడం లేదు. కనుక నిజమైన దైవశక్తి సంపన్నులు నేటి సమాజానికి సాయం చెయ్యడానికి ఇష్టపడటం లేదు. నేటి సమాజానికీ మనుషులకూ సాధ్యమైనంత వరకూ దూరదూరంగా ఉండటానికే వారు మొగ్గు చూపుతున్నారు. ధర్మాచరణ లేకుండా ఉత్త గుళ్ళూ గోపురాలూ పూజలూ వేషాలూ ప్రవచనాలూ పంచాంగశ్రవణాలూ మాత్రం నేడు ఎక్కడ చూచినా కనిపిస్తున్నాయి. వీటివల్ల ఇసుమంతైనా ఉపయోగం లేదనేది వాస్తవం. ఇవన్నీ డ్రామాలు అంతే !! నిజమైన ధర్మం ఆచరణలో ఉంది, అంతేగాని కట్టుకునే పట్టుపంచెల్లో, పెట్టుకునే బొట్లలో, పండుగలకు వేసుకునే వేషాలలో, వండుకునే వంటల్లో లేదు. ఇది ముందు చక్కగా అర్ధం కావాలి. ఆ తర్వాత అది ఆచరణలోకి రావాలి. జ్యోతిష్కుల్లారా ! డబ్బుకు అమ్ముడు పోకండి. ఎవరికి తోచిన ఫలితాలు వారు ఇష్టం వచ్చినట్లు చెప్పకండి. దీనివల్ల మీరూ విలువ కోల్పోతారు. జ్యోతిష్యశాస్త్రం కూడా అవహేళనకు గురవుతుంది. మీకు తెలిస్తే, నిజాన్ని నిర్భయంగా చెప్పండి. లేకుంటే మౌనం వహించండి. అది మీకూ మన ధర్మానికీ రెంటికీ మంచిది. పంచెలు కట్టుకుని, ఉగాది పచ్చడి తిని - కుజుడు ఈ ఇంట్లో ఉన్నాడు, గురువు ఆ ఇంట్లో ఉన్నాడు, కేతువు మీ ఇంట్లో ఉన్నాడు, రాహువు మా ఇంట్లో ఉన్నాడు - అని మాయమాటలు చెప్పుకుంటూ కాసేపు ఫార్స్ చేసినంత మాత్రాన పంచాంగ శ్రవణం అవుతుందని అనుకుంటే అంతకంటే హాస్యం ఇంకోటి ఉండదు మరి !! శ్లో|| ఫలాని గ్రహచారేణ సూచయంతు మనీషిణ: కో వక్తా తారతమ్యస్య తమేకం వేధసం వినా ? అంటున్నాయి ప్రామాణిక గ్రంధాలు. ఈ శ్లోకం అర్ధం ఏమిటో తెలుసా? 'మనీషులైన వారు' (అంటే డబ్బుకు, ప్రలోభాలకు ఆశపడకుండా ధర్మంగా బ్రతికే ఉత్తమ మనుష్యులు) గ్రహచారాన్ని గమనించి ఫలితాలను ఊరకే సూచనామాత్రంగా చెప్పగలరు. ఖచ్చితంగా ఏం జరుగుతుందో చెప్పాలంటే ఈ సృష్టిని చేసిన ఒక్క బ్రహ్మదేవుని వల్లే అవుతుంది. మానవమాత్రుల వల్ల కాదు.' అని జ్యోతిష్య గ్రంధాలే చెబుతున్నాయి. జ్యోతిష్యశాస్త్రం పట్టుబడాలంటే ముందుగా మనీషులు (ఋషులు) గా మీరు రూపొందాలి. మనుషులే లేని నేటి సమాజంలో మనీషులు ఎక్కడనుంచి వస్తారో? ఎందుకు మీకీ ఉత్తరకుమార ప్రగల్భాలు???
Aye Dil Kisi Ki Yaad Mein అంటూ సలీం రాజా మధురంగా ఆలపించిన ఈ ఉర్దూ గీతం 1963 లో వచ్చిన 'Ik Tera Sahara' అనే పాకిస్తానీ మూవీలోనిది. ఈ పాటను కతీల్ షిఫాయ్ రచించగా ఇనాయత్ హుసేన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ గీతాన్ని సలీం రాజా చాలా మధురంగా ఆలపించాడు. ఇతనిది కూడా సాఫ్ట్ మేల్ వాయిసే.
అంటూ గతంలో ఒక మహాకవి ఒక కవితను వ్రాశాడు. ఆ మహాకవి ఎవరో నేను చెబితే బాగోదు. ఆయనెవరో ఊహించే అదృష్టాన్ని మీ ఊహకే వదిలేస్తూ విశ్వ విజ్ఞాన అజ్ఞాని స్టీఫెన్ హాకింగ్ జాతకం పరిశీలిద్దాం.
నేను పొరపాటుగా వ్రాయలేదు. మీరూ సరిగానే చదువుతున్నారు. లోకమంతా విజ్ఞాని అంటుంటే ఈయనేంటి అజ్ఞాని అంటున్నాడు? అని మీకు అనుమానం రాకూడదు, ముఖ్యంగా ఇన్నేళ్ళనుంచీ నా వ్రాతలు చదువుతూ అడిక్ట్ అయినవారికి !!
ఎందుకంటే, మన ఆధ్యాత్మిక చింతన ప్రకారం, ఎన్ని విషయాలలో పరిజ్ఞానం సంపాదించినా, ఆత్మజ్ఞానం లేనివాడు అజ్ఞానే. లోకం దృష్టిలో వాడు ఏమైనా కావచ్చు. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో వాడు అజ్ఞానే. ఎందుకంటే తానెవరో తెలియకముందే చనిపోయాడు కాబట్టి.
అసలు విజ్ఞాని అనే మాటే చాలా తప్పుమాట. దానిని లౌకిక కోణంలో అస్సలు వాడకూడదు. విజ్ఞాని అనేవాడు జ్ఞాని కంటే పైస్థాయికి చెందినవాడు. అసలు జ్ఞానే కానివాడు ఇక విజ్ఞాని ఎలా అవుతాడు? కనుక ఈ పదానికి ఇతనికి అర్హత లేదు. ఈ భూగోళం మీద విజ్ఞాని అనేవాడు ఏ టైంలోనైనా ఒక్కడు ఉంటాడేమో? లేకపోతే వాడూ ఉండడు. భూమ్మీద జ్ఞానులే అతి తక్కువగా ఉంటారు. ఇక విజ్ఞాని అస్సలు ఉండడు. కనుక ఆ పదం ఈయనకు వాడకూడదు. భౌతిక శాస్త్రవేత్త అనేది వాడచ్చు. సైంటిఫిక్ సర్కిల్స్ లో కూడా ఈయన్ను విమర్శించిన తెల్లవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయనది ఉత్త థియరీ మాత్రమేగాని ఈయన లెక్కలకు రుజువులు లేవని వారంటారు. సైన్స్ లో ఉత్త థియరీలు, లెక్కలు సరిపోవు. రుజువులు కావాలి. ఈయన చెప్పినవీ ఊహించినవీ పెద్దగా ఏవీ రుజువు కాలేదు. కనుక ఈయన ఒక తియరేటికల్ సైంటిస్ట్ మాత్రమే. బ్లాక్ హోల్స్ ఇలా ఉండచ్చు అలా ఉండచ్చు అంటూ ఎన్నైనా థియరీలు ప్రతిపాదించవచ్చు. కానీ వాటికి నిర్దిష్టమైన రుజువులు లేవు. పైగా ఈయన్ను మించి ఆయా రంగాలలో రీసెర్చి చేసిన ఘనులు చాలామంది ఉన్నప్పటికీ ఈయనకు ఇంత పేరు ప్రఖ్యాతులు రావడానికి గల ఏకైక కారణం ఈయనకున్న రోగం. 'అంత రోగం పెట్టుకుని కూడా అంత చేశాడు' - అన్న ఒక సింపతీ ఇమేజి ఈయనకు ఏర్పడిపోయింది. అంతేగాని ఈయనలో మీడియా ఊదరగొడుతున్నంత గొప్ప విజ్ఞానం ఏమీ లేదు. అదేదో సినిమాలో కోవై సరళ ఒక డైలాగ్ అంటుంది - 'నా బూతే నా భవిష్యత్తు' అంటూ. అలాగే ఈయన విషయంలో - 'నా రోగమే నా కీర్తి' అనుకోవచ్చు. ఈయనకు ఈ రోగం లేకుండా అందరిలా మామూలు మనిషే అయ్యుంటే ఎంతోమంది సైంటిస్ట్ లలో ఈయన కూడా ఇంకొక సైంటిస్ట్ అయ్యుండేవాడు. అంతేగాని ఇంత పేరు వచ్చేది కాదు. కనుక ఈయన పేరుకు ఈయన రోగమే కారణం గాని ఈయన చేసిన రీసెర్చి కాదు. ఇంతకీ ఈయన రోగానికీ, వచ్చిన పేరుకీ కారణాలు ఈయన జాతకంలో ఏమున్నాయో గమనిద్దాం. ఈయన 8-1-1942 న ఆక్స్ ఫర్డ్ లో పుట్టాడు. సమయం తెలియదు. పైపైన చూద్దాం. మేషంలో వక్రనీచశని, కుజునితో కలసి ఉండటం వల్ల ఈయనకు ఆసాధ్యమైన క్రానిక్ డిసీజ్ వచ్చింది. ఈ యోగం చంద్రుని నుంచి అష్టమంలో ఉన్నదనీ, ఆ అష్టమం దీర్ఘరోగాలకు సూచిక అనీ గుర్తుండాలి. చంద్రుడు ఈ జాతకంలో బలహీనుడుగా ఉన్నాడు. సూర్యుని నుంచి ఈ యోగం పంచమ కోణంలో ఉంటూ బలహీనమైన జీవశక్తిని సూచిస్తోంది. జీవకారకుడైన గురువు వక్రించి సూర్యుని నుంచి రోగస్థానంలో ఉండటం చూడవచ్చు. బలహీనవక్ర గురువు యురేనస్ తో కలసి సహజ ద్వితీయస్థానంలో ఉండటం వల్ల ఈయనకు గొంతు ఆపరేషన్ జరిగి మాట పూర్తిగా పోయింది. సూర్యుని నుంచి ద్వితీయ స్థానంలో ఉన్న బుధ శుక్రులమీద శని కుజుల ప్రతికూల కేంద్రదృష్టి వల్ల మొదట్లో మాట బాగా ఉన్నప్పటికీ ఆపరేషన్ జరిగి అది పూర్తిగా పోయింది. అయితే చంద్రుని నుంచి పంచమంలో ఉన్న అదే యోగం ఈయనకు మంచి సైంటిఫిక్ థింకింగ్ నూ, ఊహా శక్తినీ ఇచ్చింది. మేషంలోని శనికుజులకూ, మకరంలో ఉన్న బుధ శుక్రులకూ ఖచ్చితమైన కేంద్ర దృష్టులున్నాయి. బుధుడు నరాల రోగాలకు కారకుడన్న విషయం గుర్తుంటే, ఈయనకు ఈ క్రానిక్ డిసీజ్ ఎందుకొచ్చిందో అర్ధమౌతుంది. ఈ బుధుడు నవాంశలో extra saturnine planet అయిన యురేనస్ తో కలసి ఉండటంతో శరీరం ఆ స్థితిలో ఉన్నాకూడా భూమికి దూరంగా ఖగోళంలో ఉన్న వస్తువుల గురించి రీసెర్చి చేశాడు. బుద్ధికారకుడైన బుధుని మీద యురేనస్ ప్రభావం వల్లనే గ్రహాంతర వాసులున్నారని, ఇతర గ్రహాలలో జీవం ఉండవచ్చనీ నమ్మేవాడు. చెప్పేవాడు. యురేనస్ రాశి చక్రంలో జీవకారకుడైన వక్రగురువుతో కలసి ఉండటం ఈయనకు విచిత్ర వ్యాధిని తెచ్చిపెట్టింది. చంద్రుని నుంచి నవమంలో ఉన్న వక్ర గురువు అష్టమంలోకి రావడంతో శకటయోగం ఏర్పడి, దేవుడిని నమ్మని నాస్తికుడిగా మారాడు. అంతేకాదు ఈయన జ్యోతిష్యాన్ని కూడా నమ్మేవాడు కాదు. ఇది చాలామంది సైన్సు వాదులకున్న రోగమే. ఇందులో వింతేమీ లేదు. నవాంశలో శని రాహువులు బలహీన సూర్యునితో కలసి శపిత యోగాన్నిస్తూ జెనెటిక్ దోషాలను సూచించే వృశ్చికంలో ఉండటం వల్ల ఈ క్రానిక్ డిసీజ్ బలంగా ఈయనకు పట్టుకుంది. ప్రస్తుతం గోచార శని కుజులు ఈయన జనన సూర్యుని మీదకు సంచారం చెయ్యడం ఈయన మరణానికి కారణమైంది. నరాల బలానికి కారకుడైన బుధుడు ప్రస్తుతం గోచారంలో నీచస్థితిలో ఉండటం గమనార్హం. ఒకడిలో నిజంగా 'విషయం' ఉండటానికీ, లోకంలో పేరుప్రఖ్యాతులు రావడానికీ ఏమీ సంబంధం లేదని ఈయన జాతకం నిరూపిస్తుంది. కొందరికి అవకరం కూడా ఉన్నదానికంటే ఎక్కువ ఇమేజిని తెచ్చి పెడుతుంది. ఈ కేస్ అలాంటిదే. ఈ లోకంలో అంతా బూటకమే ! అంతా మాయే !! విచిత్ర లోకం !!
'ఉగాది ఫలితాలు వ్రాయడం లేదేంటి?' అడిగాడొక మిత్రుడు.
'బోరు కొట్టింది. అదీగాక అవి వ్రాయడానికి బోలెడుమంది సాంప్రదాయ జ్యోతిష్కులున్నారు. నేనెందుకు?' చెప్పాను.
'కాదు నీ శైలి విభిన్నంగా ఉంటుంది. వ్రాయి.' అన్నాడు వాడు.
'సరే వ్రాస్తాలే. ఏడుపాపు' చెప్పాను.
అందుకే ఈ పోస్ట్.
ఇక చదువుకోండి రాశులవారీగా ఫలితాలు.
-------------------------------------------
మేషరాశి
మేకలాగా అమాయకంగా ఉండకండి. ఎంతసేపూ మీరు మోసపోవడం కాదు. ఎదుటివారిని మోసం చెయ్యడం ప్రాక్టీస్ చెయ్యండి. ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. రెమెడీ :- ఆలస్యం చెయ్యడం, మారలేకపోవడం, పోనీలే పాపం అనుకోవడం మీ బలహీనతలు. వాటిని మార్చుకోండి.
వృషభరాశి
అచ్చోసిన ఆంబోతులాగా ఊరిమీద పడి తిరగడం ఆపి తల్లిదండ్రుల్ని పెళ్ళాం పిల్లల్ని కాస్త పట్టించుకోండి. మీకు మంచి జరుగుతుంది.
రెమెడీ :-పనులు మొదలుపెట్టడం పూర్థి చెయ్యలేకపోవడం, లోలోపల భయాలు, కంఫర్ట్ ను ఎక్కువగా కోరుకోవడం మీ లోపాలు. వీటిని వదుల్చుకోండి.
మిథునరాశి
ఎంతసేపూ ఎదుటివారి వ్యవహారాల్లో వేలు పెట్టడం తగ్గించండి. మీ పని మీరు చేసుకోండి. ఊరకే వసపిట్టలా వాగుడు ఆపి మౌనం పాటిస్తే మీకు మంచిది.
రెమెడీ :-గాలివాటుగా బ్రతికెయ్యడం, అతిగా సోషలైజ్ అవడం, పదిపనులు ఒక్కసారే పెట్టుకోవడం మీ బలహీనతలు. వీటినే మీ బలాలుగా మార్చుకోండి.
కర్కాటక రాశి
బీచిలో పీతలాగా పక్కదాటు వైఖరి ఆపి, సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోండి. స్వార్ధం తగ్గించుకుని ఇతరులకు కాస్త సాయం చెయ్యండి. పైకొస్తారు.
రెమెడీ :-నిలకడ లేకపోవడం, స్వార్ధం, ఆకర్షణలకు తేలికగా లోబడటం మీ బలహీనతలు. వీటిని జయించండి.
సింహరాశి
దురహంకారం తగ్గించుకుని మానవత్వం పెంచుకోండి. భజన బృందాలకు దూరంగా ఉండండి. బాగుపడతారు.
రెమెడీ :-పొగడ్తలకు ఉబ్బిపోవడం, మీ గురించి గొప్పగా ఊహించుకోవడం, నలుగురికోసం బ్రతకడం మీ బలహీనతలు. వీటిని మార్చుకోండి. కన్యారాశి
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూచి మోసపోకండి. మీ కాళ్ళమీద మీరు నిలబడే ప్రయత్నం చెయ్యండి. ఇదే మీకు రాజబాట.
రెమెడీ :-ఇతరులమీద ఎక్కువగా ఆధారపడటం, అందరినీ త్వరగా నమ్మడం మీ బలహీనతలు. వీటిని మార్చుకోండి. తులారాశి
ఎంతసేపూ ఎదుటివారిని అంచనా వేసి, తీర్పులు తీర్చే పని ఆపి, ఆత్మవిమర్శ చేసుకుంటూ మీ సంగతేంటో మీరు చూసుకోండి. బాగుంటుంది.
రెమెడీ :-విలాసాల మోజులో పడటం, ఎల్లకాలం ఈ రోజులాగే ఉంటుందని భ్రమించడం, లోకాభిప్రాయానికి మితిమీరిన విలువ ఇవ్వడం మీ బలహీనతలు. వీటిని మార్చుకోండి. వృశ్చికరాశి
మీ దగ్గర తేలుకొండి ఉంటె ఎదుటివారి దగ్గర చెప్పు ఉందని మర్చిపోకండి. కుళ్ళు, కుట్రలు తగ్గించుకుని స్వచ్చంగా ఉండే ప్రయత్నం చెయ్యండి. మంచి మార్పు వస్తుంది.
రెమెడీ :-రహస్య అజెండాలు లోలోపల ఉంచుకోవడం, బయటకు వేరేగా కన్పించడం, అతిస్వార్ధం, మాటకు కట్టుబడకపోవడం, నమ్మినవారిని మోసం చెయ్యడం మీ బలహీనతలు. వీటిని మార్చుకోండి. ధనూరాశి
ఎంతసేపూ ఎదుటివారిలో తప్పులు వెదకడం, ఎదుటివారిని నిందించడం మానేసి, మీ తప్పులు మీరు వెదుక్కొని వాటిని సరిదిద్దుకోండి. బాగుపడతారు. రెమెడీ :-మీగురించి ఎక్కువగా ఊహించుకోవడం, ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం, అందరూ మీ ట్యూన్ కే డాన్స్ చెయ్యాలని కోరుకోవడం మీ బలహీనతలు. వీటిని మార్చుకోండి.
మకరరాశి
మూర్ఖపు పట్టుదలలు, ఉడుంపట్లు మానేసి, కాస్త రెండుపక్కలా ఆలోచించే మంచి అలవాటు చేసుకోండి. ఎదుటివారు కూడా మనుషులే అని గుర్తుంచుకోండి. శాంతి కలుగుతుంది.
రెమెడీ :-ఊగిసలాట మనస్తత్వం, డిప్రెషన్ కు తేలికగా గురికావడం, అసవసరమైన చోట్ల పనికిరాని పట్టుదలలు మీ బలహీనతలు. వీటిని మార్చుకోండి.
కుంభరాశి
ఓవర్ సెంటిమెంట్ తగ్గించుకోండి. లోకం కోసం బ్రతకడం మానేసి మీకోసం బ్రతకడం మొదలు పెట్టండి. మీ శక్తికి మించి ఇతరులకు సాయం చెయ్యకండి. మీకు మంచి జరుగుతుంది.
రెమెడీ :-మిమ్మల్ని మీరు మర్చిపోవడం, అనవసరంగా గిల్టీగా ఫీలవడం, ఎదుటివారికి సాయం చెయ్యడానికి ఎంత దూరమైనా పోవడం మీ బలహీనతలు. వీటిని వదుల్చుకోండి.
మీనరాశి
అనవసరమైన ఆదర్శాలకు పోయి ఉన్నది పోగొట్టుకోకండి. తేలికగా మోసపోయే లక్షణాన్ని మార్చుకోండి. అతిమంచితనం పనికిరాదని గుర్తుంచుకోండి. బాగుపడతారు.
రెమెడీ :- నేలను వదిలి ఊహల్లో బ్రతకడం, లోకాన్ని మార్చాలని చూడటం, సిద్ధాంతాల ఊహల్లో ఎప్పుడూ విహరిస్తూ ఉండటం మీ బలహీనతలు. వీటిని మార్చుకోండి. ఈ ఉగాదికే కాదు ఏ ఉగాదికైనా ఇవే ఫలితాలుంటాయి. చెప్పినవిధంగా మారే ప్రయత్నం చేయండి. దీనికి మీకొక జీవిత కాలం పట్టచ్చు. ఎందుకంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడం అంత సులభం కాదు మరి ! ఇకమీద ఉగాది ఫలితాలని నన్నడక్కండి. సరేనా !
కళ్ళెదురుగా నిన్ను కాంచలేనివాడే గుడికెళ్ళి గుండు చేయించుకుంటాడు ఘోరంగా నీతో బేరాలాడేవాడే హుండీలో దండిగా డబ్బులేస్తాడు ఆ గ్రుడ్డితనమూ నాకొద్దు ఈ బేరసారాలూ నాకొద్దు నువ్వే నాక్కావాలి భయంతో వణికేవాడే బాగా సంపాదించాలనుకుంటాడు గర్వంతో పొంగేవాడే ఘనంగా బ్రతకాలనుకుంటాడు ఆ భయమూ నాకొద్దు ఈ గర్వమూ నాకొద్దు నిజమైన బ్రతుకు నాక్కావాలి జీవితంలో నీ ఆటను చూడలేనివాడే పూజల్లో నిన్ను వెదుకుతాడు దేవుడి పేరుతో మోసం చేసేవాడే సోమరిగా బ్రతుకుతాడు ఆ అజ్ఞానమూ నాకొద్దు ఈ సోమరితనమూ నాకొద్దు నిజమైన వెలుగు నాక్కావాలి ఒకప్పుడు దోచుకున్నవాడే ఇప్పుడు సేవ చేస్తానంటాడు లోకంకోసం అని చెబుతూ తనకోసమే తను చేసుకుంటాడు ఆ దోపిడీ నాకొద్దు ఈ సేవా నాకొద్దు నిజమైన తృప్తి నాక్కావాలి నువ్వంటే తెలియనివాడే నీమీద ఉపన్యాసాలిస్తాడు దారేంటో తెలియనివాడే ఇతరులకు దాన్ని బోధిస్తాడు ఆ వాగుడూ నాకొద్దు ఈ బోధలూ నాకొద్దు నువ్వే నాక్కావాలి ఎందుకు పుట్టానో తెలియనివాడు ఇతరులకు మార్గదర్శనం చేస్తుంటాడు ఎటు పోవాలో తెలియని వాడు ఎలా పోవాలో చెబుతుంటాడు ఆ చీకటీ నాకొద్దు ఈ బాధ్యతా నాకొద్దు నువ్వే నాక్కావాలి పేరుప్రతిష్టలు కోరేవాడే గుళ్ళు కట్టి నిన్ను రాయిని చేస్తాడు గుండె బండగా మారినవాడే బండరాళ్ళను పూజిస్తాడు ఆ గుళ్ళూ నాకొద్దు ఈ పూజలూ నాకొద్దు నువ్వే నాక్కావాలి నిన్ను పట్టుకోలేనివాడు తానే నువ్వంటూ వేషం వేస్తుంటాడు నీ నగ్నత్వం తెలియనివాడు నీకు వేషాలేసి మోసం చేస్తుంటాడు ఆ వేషాలూ నాకొద్దు ఈ మోసాలూ నాకొద్దు నువ్వే నాక్కావాలి...