మూడు నెలల మెడికల్ రెస్ట్ తర్వాత మళ్ళీ ఉద్యోగంలో చేరాను. యధావిధిగా అందరూ వచ్చి పలకరించడం గట్రాలు అన్నీ అయ్యాయి. కానీ ఈ పరిస్థితిని కూడా క్యాష్ చేసుకుందామని చూచేవాళ్ళు కొందరు ఉండటం, నాకు మనుషుల మనస్తత్వాలంటే ఇప్పటికే ఉన్న అసహ్యాన్ని మరింతగా పెంచింది.
మా కొలీగ్ ఒకాయన నన్ను పలకరిద్దామని వచ్చాడు.
ఆ మాటా ఈ మాటా అయ్యాక, ' జీసస్ దయవల్ల మీరు మళ్ళీ బ్రతికారు' అన్నాడు.
అంటే, ఈ పరిస్థితిని సాకుగా తీసుకుని ఏదో ఒక రకంగా నన్ను కన్వర్ట్ చేద్దామని ఈయన ప్రయత్నం. కాసేపుంటే అక్కడే మోకాటి తండా వేసి ప్రేయర్ మొదలుపెట్టేలా ఉన్నాడు.
మనం ఊరుకోం కదా !
'అదేంటి? మధ్యలో ఆయనెందుకు?' అన్నాను.
'మీ పాపాల కోసం ఆయన చనిపోయాడు. అందుకే మీరు యాక్సిడెంట్ లోంచి బ్రతికి బయట పడ్డారు' అన్నాడు.
'అవునా? నేనలా అనుకోవడం లేదు. నువ్వు చేసిన పాపాలకే నాకు యాక్సిడెంట్ అయ్యింది.' అన్నాను.
అతను అవాక్కయ్యాడు.
'అదేంటండి? నా పాపాలకు మీకెందుకు యాక్సిడెంట్ అవుతుంది? ' అన్నాడు.
'మరి, నేనిప్పుడు చేసిన పాపాలకు జీసస్ ఎప్పుడో రెండువేల ఏళ్ళ క్రితం చనిపోవడం ఏంటి?' అన్నాను.
'అలా అని బైబిల్లో వ్రాసుంది' అన్నాడు.
'ఆ వ్రాసినవాడిని నా దగ్గరకు తీసుకురా. అలాంటి అబద్దాలు వ్రాసినందుకు వాడిని మళ్ళీ శిలువ వేస్తాను' అన్నాను.
'తప్పు సార్. అలా అనకండి.' అన్నాడు ఏదో పాపం చేసినవాడిలాగా తను కుమిలిపోతూ.
'నువ్వెందుకు బాబూ అంత బాధపడుతున్నావు? మీ జీసస్ ది చాలా పెద్దకంపెనీ గనుక లోకంలో అందరి పాపాలను గ్లోబల్ గా తీసుకుంటున్నాడు. నాది చిన్న కంపెనీ గనుక మీ అందరి పాపాలకు లోకల్ గా నేను శిక్ష అనుభవిస్తున్నాను. నీ పాపాలకు ఈ యాక్సిడెంట్ రూపంలో నాకు శిక్ష పడింది.' అన్నాను.
'ఊరుకోండి సార్ ! భలే జోకులేస్తారు మీరు !' అన్నాడు.
'నువ్వు కూడా బాగా జోకులేస్తావు. ఇలాంటి జోకులు నా దగ్గర చెప్పకు.' అన్నాను.
అతను లేచి వెళ్ళిపోయాడు.
ఇంకొక కొలీగ్ కూడా ఇలాగే కుశలప్రశ్నలు అయ్యాక ఇలా అన్నాడు.
'మొన్ననే దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయం మనకు దగ్గరలోనే కట్టారు. వెళదాం వస్తారా?'
'ఎందుకు?' అన్నాను.
'ఏం లేదు. మళ్ళీ జాయినయ్యారు కదా. ఏదైనా చీడా పీడా ఉంటే పోతుందని. ఈ వెంకటేశ్వరస్వామి చాలా పవర్ ఫుల్. ఈయనలో పది అవతారాలున్నాయి.' అన్నాడు.
'ఏంటీ? పవర్ ఫుల్లా? అంటే, అందరు వెంకటేశ్వర స్వాములకూ బాక్సింగ్ మ్యాచ్ పెడితే అందులో ఈయన గెలిచాడా? ఇప్పటిదాకా అన్ని వెంకటేశ్వరస్వాములలోకీ పిట్స్ బర్గాయనే పవర్ ఫుల్ అని ఒకాయన చెబుతూ ఉంటాడు. అలాంటి క్షుద్ర స్వామీజీ ఎవరైనా ఇలా చెప్పాడేంటి నీకు?' అడిగాను సీరియస్ గా.
'తప్పు సార్ ! అలా అనకండి. చెంపలేసుకోండి' అన్నాడు.
'కావాలంటే నీ చెంపలు వాయిస్తా దగ్గరికి రా.' అన్నాను.
అన్నట్టు, చీడా పీడా అంటే ఒక విషయం గుర్తొచ్చింది.
నాకు యాక్సిడెంట్ అయిన కొత్తల్లో నా శిష్యురాలు ఒకమ్మాయి నన్ను చూట్టానికి వస్తూ ఒక దిష్టిబొమ్మను తెచ్చింది.
'ఏంటిది?' అడిగాను.
'మీకు చాలా నరదృష్టి ఉంది. మీ మీద ఎందరి చూపో ఉంది. కనుకనే మీకు ఇలా యాక్సిడెంట్ అయింది. ఈ దిష్టిబొమ్మను మన ఇంటి గుమ్మంలో కడతాను. దాంతో మీకున్న చీడా పీడా పోతుంది.' అంది.
'ఒక పని చెబుతా చేస్తావా?' అడిగాను.
'చెప్పండి' అంది.
'ఈ దిష్టిబొమ్మను నీ మెడలో కట్టుకోని తిరుగుతూ ఉండు. ఎట్టి పరిస్థితిలోనూ దీన్ని తియ్యకు. ముందు నీకున్న మెంటల్ తగ్గుతుంది. ఆ తర్వాత, జన్మజన్మల నుంచీ నీకున్న చీడాపీడా అంతా పోతుంది.' అన్నాను.
అంతటితో ఆ అమ్మాయి ఇంకేమీ రెట్టించలేదు. ఆ సంగతి ఇప్పుడు గుర్తొచ్చింది.
ఆలోచనలో ఉన్న నన్ను ఇవతలకు తెస్తూ - 'ఏమంటారు సార్ ! పోదామా?' అన్నాడు దశావతార భక్తుడు.
'అమ్మో మీ స్వామిలో అంత పవరుందా? ఆయన దగ్గరకు వచ్చేంత పవర్ నా దగ్గర లేదులే. నేను రాలేను.' అన్నాను.
'అలా అనకండి. మన సీ.ఎం. గారొచ్చారు. రాజకీయ నాయకులు ఎందఱో వచ్చారు. ఫలానా స్వామీజీ స్వయానా సంప్రోక్షణ చేశారు. ఒక్కసారి వెళదాం రండి' అన్నాడు.
'అలాగైతే అస్సలు రాను. రాజకీయ నాయకులూ, వారితో సంబంధం ఉన్న స్వామీజీలూ అక్కడకు వచ్చారంటేనే అర్ధమౌతోంది. అలాంటి 'పవిత్రమైన చోట్ల' నా అపవిత్రపాదం పెట్టి వాటిని పాడుచెయ్యలేను.' అన్నాను.
'పది అవతారాలూ ఒకేచోట ఉన్నాయి' అన్నాడు.
'మిగతా అవతారాలు వదిలేశారేం?' అడిగాను.
'మనకున్నవి పది అవతారాలేగా?' అన్నాడు.
'దైవానికి అనంతమైన అవతారాలున్నాయని శ్రీమద్భాగవతం చెబుతోంది. మరి వాటి సంగతేంటి?' అడిగాను.
'ఏమో నాకా సంగతి తెలీదు. భాగవతం అలా చెప్పిందా?' అడిగాడు.
'చదవండి. తెలుస్తుంది. మన గ్రంధాలలో ఏముందో మనకే తెలీదు. అందుకే మన హిందూమతం ఇలా తయారైంది. అనంతమైన విభూతులను ఒక విగ్రహంలోకి ఎలా తెస్తారసలు? అది సాధ్యం కాదు. ఒకటిలో అనంతాన్ని చూస్తారా? లేక అనంతాన్ని ఒకదాంట్లోకి మలుస్తారా? ఏది కరెక్ట్? అసలలా మలచగలరా ఎవరైనా? మీకు తోచిన విధంగా మీరా విగ్రహాన్ని తయారుచేశారు. చూసుకోండి. నేను రాను. ప్రస్తుతం ఏ గుడికీ పోవాలని నాకనిపించడం లేదు. ఈ గుడికి అసలే రాను.' అన్నాను.
'ఎందుకలా?' అడిగాడు కుతూహలంగా.
'నిగ్రహం కోసమే విగ్రహం' అని జిల్లెళ్ళమూడి అమ్మగారన్నారు. నాకు నిగ్రహం బాగానే ఉంది. కనుక ప్రస్తుతం ఏ విగ్రహమూ నాకవసరం లేదు. అందులోనూ అన్ని అవతారాలతో తయారు చేసిన విగ్రహం అసలు అవసరం లేదు. నేను రాను. నన్ను రమ్మని బలవంతం చెయ్యద్దు. నీక్కావాలంటే నువ్వు వెళ్లి చూడు. అక్కడనుంచి వెనక్కు రావాలని అనిపించకపోతే ఎల్లకాలం అక్కడే ఉండు. నాకేమీ అభ్యంతరం లేదు. నన్ను మాత్రం ప్రేరేపించకు.' అని ముగించాను.
మనుషుల అజ్ఞానానికి అంతం లేదనే నా సూక్తి నిజమా కాదా?