వాళ్ళమ్మాయికి పెళ్లిసంబంధం కోసం ఒకామె ఈ మధ్యనే నన్ను సంప్రదించింది.
వాళ్ళమ్మాయి ఇండియాలో బీ టెక్ చేసి అమెరికాలో ఎమ్మెస్ చేసి అక్కడే గత నాలుగేళ్ళుగా ఉద్యోగం చేస్తోంది. సంబంధాలు చూస్తున్నారు. కానీ ఏవీ కుదరడం లేదుట. ఏం చెయ్యాలి అనడుగుతూ అమ్మాయి జాతకం కాస్త చూడమని నన్ను కోరింది వాళ్ళమ్మగారు. ఎందుకు కుదరడం లేదని ఆమెను ప్రశ్నించిన మీదట నాకు కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. లోపం జాతకంలో లేదు, అమ్మా కూతుళ్ళలో ఉంది.
వాళ్లకు మంచి మంచి అమెరికా సంబంధాలే వచ్చాయి. కానీ వాళ్లమ్మాయికి అవి నచ్చడం లేదు.
'అసలు మీ అమ్మాయికి ఏం కావాలి? ఎలాంటి వరుడు కావాలి?' అని నేనడిగాను.
'మాకేం పెద్దగా కోరికలు లేవండీ. చాలా సింపుల్. చిన్నచిన్న కోరికలే.' అంటూ ఆమె ఒక లిస్టు చదివింది.
1. అబ్బాయి మైక్రో సాఫ్ట్ లో గాని, గూగుల్లో గాని, ఇంటెల్లో గాని టాప్ ఎండ్ లొ పని చేస్తూ ఉండాలి. వాళ్ళ అమ్మా నాన్నా ఇద్దరూ ఇండియాలో మంచి పొజిషన్లో ఉండాలి. వాళ్లకు హైదరాబాద్, విజయవాడ, గుంటూరులలో కనీసం నాలుగు ఇళ్లుండాలి.
2. జీతం 150 K - 200 K మధ్యలో ఉండాలి.
3. మా అమ్మాయి బిట్స్ పిలానీలో చదివింది. అబ్బాయి కనీసం IIT చెన్నై లోగాని, IIT బాంబేలో గాని చదివి ఉండాలి. వేరే IIT లలో అయితే మాకు కుదరదు. ఇక మామూలు లోకల్ కాలేజీలలో చదివితే వాళ్ళ ముఖం కూడా మేం చూడం.
3. మా అమ్మాయి బిట్స్ పిలానీలో చదివింది. అబ్బాయి కనీసం IIT చెన్నై లోగాని, IIT బాంబేలో గాని చదివి ఉండాలి. వేరే IIT లలో అయితే మాకు కుదరదు. ఇక మామూలు లోకల్ కాలేజీలలో చదివితే వాళ్ళ ముఖం కూడా మేం చూడం.
4. అబ్బాయి హెయిర్ స్టైల్ వయసులో ఉన్నప్పటి సత్యసాయిబాబా టైపులో ఉండాలి. అమెరికాలో ఉంటున్న మన అబ్బాయిలకు అక్కడి హార్డ్ వాటర్ పడక హెయిర్ లైన్ వెనక్కు పోతోంది. మా అల్లుడికి అలా ఉండకూడదు. ఎందుకంటే మావారికి బట్టతలే. మా అల్లుడికి కూడా అలా ఉంటే అందరూ ఎగతాళి చేస్తారు. మాకిష్టం ఉండదు.
5. అబ్బాయికి అక్కా చెల్లెళ్ళు ఉండకూడదు. మా అమ్మాయికి వాళ్ళంటే పడదు. ఎందుకంటే వాళ్ళతో వేగడం కష్టం.
6. అబ్బాయి అమ్మా నాన్నా ఇండియాలోనే ఉండాలి. ఏడాదికొకసారి అమెరికాకు వచ్చి తిష్ట వేసుకుని కూచోకూడదు. రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇండియాలోనే ఉండాలి. అమెరికాకు వస్తామని అనకూడదు.
7. అబ్బాయి నుంచి డబ్బులేవీ వాళ్ళ అమ్మా నాన్నా ఆశించకూడదు. మా డబ్బులతో అమెరికాలో మేమేం చేస్తున్నామో వాళ్ళు ఆరాలు అడగకూడదు.
8. అన్నిటినీ మించి, అబ్బాయికి సిగరెట్ అలవాటు ఉండకూడదు. మా అమ్మాయికి ఆ వాసన పడదు. త్రాగుడు అస్సలే పనికిరాదు. సోషల్ డ్రింకింగ్ కూడా మాకు నచ్చదు. పూర్తిగా టీ టోటలర్ అయి ఉండాలి.
9. అబ్బాయి వెజిటేరియన్ అయి ఉండాలి. కానీ మా అమ్మాయి చిన్నప్పటి నుంచీ ఎగ్ తింటుంది. హాస్టల్లో ఉన్నప్పుడు దానికి అలవాటైంది. కనుక అంతవరకూ ఒప్పుకుంటాం. అంతేగాని నాన్ వెజ్ తింటే మాకు పడదు.
10. అబ్బాయికి పెద్దగా స్నేహాలు ఉండకూడదు. వీకెండ్ పార్టీలకు వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళినా మా అమ్మాయిని వెంట తీసికెళ్లాలి.
11. వాళ్ళు కొలీగ్స్ అయినా సరే, గర్ల్ ఫ్రెండ్స్ తో ఫోన్లో మాట్లాడకూడదు. ఇలాంటివి మా అమ్మాయికి నచ్చవు.
12. అన్నిటినీ మించి, మా అమ్మాయి ఎత్తు 4-8 మాత్రమే. కానీ అబ్బాయి 6 ఫీట్ ఉండాలి. ఇంకా ఎత్తుంటే మరీ మంచిది. షారుక్ ఖాన్ చలాకీ దనమూ, సల్మాన్ ఖాన్ కండలూ, రణబీర్ కపూర్ అందమూ కలగలసి ప్యూర్ వైట్ కలర్లో ఉండాలి. మా క్యాస్ట్ అబ్బాయే అయ్యుండాలి. మా శాఖే అయ్యుండాలి. మా కులం అయినా సరే, వేరే శాఖ అయితే మేం ఒప్పుకోము.
13. వీటిల్లో ఏ ఒక్కటి తప్పినా ఆ సంబంధం మేము చేసుకోము, ఎందుకంటే అలా లైఫ్ లో కాంప్రమైజ్ అవ్వడం మాకస్సలు ఇష్టం ఉండదు.
13. వీటిల్లో ఏ ఒక్కటి తప్పినా ఆ సంబంధం మేము చేసుకోము, ఎందుకంటే అలా లైఫ్ లో కాంప్రమైజ్ అవ్వడం మాకస్సలు ఇష్టం ఉండదు.
'ఇవి చాలామ్మా? ఇంకేవైనా మర్చిపోతే నిదానంగా గుర్తుచేసుకుని చెప్తారా? వినడానికి ఎన్ని జన్మలైనా నేను వెయిట్ చేస్తాను పర్లేదు.' అన్నా నేను ఎగతాళిగా.
నా ఎగతాళి ఆమెకు అర్ధమైంది.
'మేము కోరుతున్నది చాలా తక్కువండి. వేరేవాళ్ళైతే ఇంకా చాలా కోరికలుంటున్నాయి. అవన్నీ మేం అడగడం లేదు.' అందామె కోపంగా.
సరే వాళ్ళ కోరికలను కాదనడానికి మనమెవరం అనుకుని, ఆ జాతకం చూచి ఆమెకు కావలసిన విషయాలు చెప్పేశాను. కానీ ఆమెకు సంతృప్తి కలగలేదు. రెమెడీలుగా ఏవైనా మంత్రతంత్రాలు చెబుతానేమోనని ఆమె ఆశ ! అలాంటివి నాకు తెలీదని ఆమెతో చెప్పాను.
'జ్యోతిష్కుడన్న తర్వాత అలాంటివి తెలీకపోతే ఎలాగండి? మా ఫేమిలీ జ్యోతిష్కుడు ఈ మంత్రం చదవమని చెప్పాడు. ఇది మంచిదేనా? చదవమంటారా?' అంటూ ఒక మంత్రాన్ని నాకు వాట్స్ అప్ లో పంపిందామె.
'విశ్వాసో గంధర్వరాజకన్యాం సాలంకృతాం మమాభీప్సితాం ప్రయచ్చ ప్రయచ్చ నమ:'
దీనిని చదవమని మా జ్యోతిష్కుడు చెప్పాడు. ప్రస్తుతం ప్రతిరోజూ 108 సార్లు చదువుతున్నాను. మంచిదేనా?' అడిగిందామె.
నాకు విపరీతమైన నవ్వు వచ్చింది.
'మీరు చదువుతున్నారా? అదేంటి? పెళ్లిసంబంధం కావలసింది మీ అమ్మాయికి కదా?' అడిగాను అయోమయంగా.
'అవునండి. కానీ మా అమ్మాయి అమెరికాలో బిజీగా ఉంటుంది. దానికి కుదరదు. అందుకని దానిబదులు నేనే చదువుతున్నాను.' చెప్పిందామె.
'ఆ శ్లోకం అర్ధం తెలుసా మీకు?' అడిగాను.
'తెలీదు' అందామె.
'దాన్ని మీరు చదవకూడదు. మీ అమ్మాయి కూడా చదవకూడదు.' అన్నాను.
'ఎందుకని?' అందామె.
'అది అబ్బాయిలు చదవవలసిన శ్లోకం. అమ్మాయిలది కాదు. పైగా మీ అమ్మాయి చదవలసిన శ్లోకం మీరు చదివితే ఎలా? ఒకవేళ ఈ శ్లోకం ఫలిస్తే సంబంధాలు మీకొస్తాయి. మీ అమ్మాయికి కాదు' అన్నాను సీరియస్ గా.
'ఏంటండి మీ మాటలు? ఈ వయసులో నాకు సంబంధాలు రావడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నారో మీకు తెలిసే మాట్లాడుతున్నారా?' అడిగిందామె కొంచం కటువుగా.
'మీరు ఏ శ్లోకాన్ని చదువుతున్నారో దానర్ధం ఏంటో మీకు తెలుసా? ముందు అది తెలుసుకొని ఆ తర్వాత నాతో మాట్లాడండి. అదీగాక మీ అమ్మాయి చెయ్యవలసిన రెమెడీ మీరు చేస్తే సంబంధాలు మీగ్గాక మీ అమ్మాయికెలా వస్తాయి?' అన్నాను నేను.
సడన్ గా ఫోన్ కట్ చేసేసిందామె. నేనూ ఆ విషయాన్ని అంతటితో మర్చిపోయాను.
తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఆమెనుండి ఫోనొచ్చింది.
'సారీ అండి ! ఆ రోజున వేరే పని తగిలి ఫోన్ కట్ చేశాను. మీరు చెప్పినది నిజమే. ఈ శ్లోకం అమ్మాయిలు చదివేది కాదని మా పురోహితుడు చెప్పాడు. సారీ !' అంది.
ఇలాంటి నాటకాలు చాలా చూసి ఉండటంతో నాకేమీ వింత అనిపించలేదు. అవసరం ఉన్నప్పుడు ఇలా మాట్లాడటం, అది తీరాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కొన్ని వందల కేసుల్లో చూచాను గనుక నాకు కోపం కూడా రాలేదు. జాలి కలిగింది. బ్రతకడం కోసం ఇన్ని నాటకాలు అవసరమా? అనిపించింది.
'సరే ! ఇప్పుడెందుకు నాకు ఫోన్ చేశారో త్వరగా చెప్పండి. మళ్ళీ మీకేదైనా పని తగిల్తే మధ్యలోనే కట్ చేసి అటు వెళ్తారు కదా!' అన్నా నేను కూడా.
ఆమె కొంచం ఇబ్బంది పడుతున్నట్లు ఆమె స్వరం వింటే అర్ధమైంది.
'అదేనండి. ఆ రెమెడీ ఇప్పుడు చెయ్యడం లేదు. ప్రస్తుతం రుక్మిణీ కల్యాణం చదువుతున్నాను. మంగళవారం, శుక్రవారాలలో దీన్ని చదవమని చెప్పాడు మా పురోహితుడు.' అందామె.
'అవి కూడా మీరు చెయ్యకూడదమ్మా. మీ అమ్మాయి చెయ్యాలి.' అన్నాను నేను.
'అది చెయ్యదండి. దానికి మొదట్నించీ ఇలాంటివి నమ్మకాలు లేవు. ఇప్పుడు అమెరికాకు వెళ్ళాక మా మాట అసలే వినడం లేదు. ఇదంతా నాన్సెన్స్ అంటోంది. అందుకే నేను చేస్తున్నాను.' అందామె.
ఎంత చెప్పినా ఈమె వినే రకం కాదని నాకర్ధమై పోయింది.
'సరేనమ్మా ! ప్రస్తుతం నానుంచి మీకేం కావాలి?' అనడిగాను.
'అదేనండి. ఈ రుక్మిణీ కల్యాణం నిజంగా పనిచేస్తుందా? ఇది మంత్రంలాగా లేదు. ఒక కధలాగా ఉంది. ఇదిగాక ఇంకేమైనా మంత్రం లాంటిదో పూజ లాంటిదో చెయ్యాలా?' అడిగింది ఆమె.
మళ్ళీ జాలేసింది.
ప్రాధమికంగా మనుషులకు నమ్మకం అనేది తక్కువ. ఒకర్ని అడిగి తెలుసుకున్నది ఇంకొకరికి చూపించి కరెక్టా కాదా వెరిఫై చేసుకుంటూ ఉంటారు. అంటే సెకండ్ ఒపీనియన్ అన్నమాట ! కానీ చివరకు పప్పులో కాలేస్తూనే ఉంటారు. మనిషంటే మనిషికి నమ్మకం లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇది వీళ్ళ తప్పు కూడా కాదు. వీళ్ళకు తగిలేవాళ్ళందరూ అలాంటి వాళ్ళే తగులుతూ ఉన్నప్పుడు వీళ్ళు మాత్రం ఏం చెయ్యగలరు? ఎవరి అనుభవాన్ని బట్టే కదా వారికి నమ్మకాలు ఏర్పడేది??
'చూడమ్మా ! రుక్మిణీ కల్యాణం ఎలా జరిగిందో నీకు తెలుసా?' అడిగాను.
'తెలుసండి' అందామె.
'రుక్మిణీదేవి మెసేజి పంపిస్తే కృష్ణుడొచ్చి ఆమెను ఎత్తుకుపోయాడు. అడ్డొచ్చిన వాళ్ళన్నయ్యతో యుద్ధం చేసి అతన్ని చావగొట్టి అతనికి గుండు గీసి మరీ రుక్మిణిని ఎత్తుకుపోయాడు. అంటే, ఆమె వివాహం సుఖంగా, అనుకూల పరిస్థితుల మధ్యలో ఏమీ జరగలేదు. అదొక కిడ్నాప్ వివాహం. ఆ స్తోత్రం చదివితే మీ అమ్మాయిక్కూడా అలాగే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని ఏ జ్యోతిష్కుడూ చెప్పలేదా మీతో?' అడిగాను.
'ఆమెకలా జరిగిందని మనక్కూడా అలాగే ఎందుకు జరుగుతుంది?' అందామె వితండవాదంగా.
'ఆ స్తోత్రం చదువుతున్నపుడు అలా జరగక ఇంకెలా జరుగుతుంది?' అన్నాను.
అటువైపు నుంచి కాసేపు మౌనం ధ్వనించింది. ఆ తర్వాత వెక్కిళ్ళ శబ్దం వినిపించింది.
నాకు కంగారు పుట్టింది. ఆడవాళ్ళు ఏడిస్తే కరిగిపోయేవాళ్ళ లిస్టులో నేను మొదటి వరుసలో మొదటి స్థానంలో ఉంటాను. ఇంకాసేపు ఆమె వెక్కులు వింటే అంతకంటే పెద్ద వెక్కిళ్ళు నానుంచి ఆమె వినవలసి వస్తుంది. ఆ గోలంతా ఎందుకులే అని ఇలా అడిగాను.
'చూడమ్మా ! మీకు నేనెలా సహాయపడగలనో చెప్పండి?'
'ఏదైనా రెమెడీ చెప్పండి. మా అమ్మాయికి త్వరగా పెళ్లి కావాలి.'
ఆమెకు నచ్చినా నచ్చకపోయినా వాస్తవాన్ని ఆమెకు చెప్పక తప్పదన్నది నాకు బాగా అర్ధమైంది.
ఆమెకు నచ్చినా నచ్చకపోయినా వాస్తవాన్ని ఆమెకు చెప్పక తప్పదన్నది నాకు బాగా అర్ధమైంది.
'చూడమ్మా! నేను చెప్పేది మీకు నచ్చకపోవచ్చు. మీరు పాటిస్తారో లేదో కూడా నాకు డౌటే ! కానీ అడిగారు కాబట్టి చెబుతున్నాను వినండి. మీరు చెయ్యవలసింది మంత్రాలు పఠించడం, స్తోత్రాలు చదవడం కాదు. ముందు మీరూ మీ అమ్మాయీ మీమీ మొండి మనస్తత్వాలు మార్చుకోవాలి. గొంతెమ్మ కోరికలు తగ్గించుకుని వాస్తవిక దృక్పధంలో ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. తప్పకుండా మీకు మంచి సంబంధాలు వచ్చే ఉంటాయి. కానీ మీ చూపు ఇంకా పైన ఎక్కడో ఉంది. ఎవడో ఆకాశంలోనుంచి రెక్కలగుర్రం మీద రాజకుమారుడు వస్తాడని ప్రతి అమ్మాయీ సినిమాలు చూసి కలలు కంటుంది. అది ఎన్నటికీ జరగదు. వాస్తవం వేరు. ఊహలు వేరు. ఊహల్లో బ్రతకడం మానేసి వాస్తవాలను అర్ధం చేసుకోవడం ముందు మీరూ మీ అమ్మాయీ అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీ అమ్మాయి పెళ్లి అవుతుంది. లేకపోతే 36, 38, 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాకుండానే మీ అమ్మాయి మిగిలిపోతుంది. ఇది ఖాయం.' అన్నాను.
'అదేనండి మా భయం కూడా. ప్రస్తుతం దానికి ముప్పై వచ్చేశాయి.' అందామె వెక్కుతూ.
'అదేనండి మా భయం అంటూ మీ మొండితనాలు మానుకోకపోతే ఏమీ జరగదమ్మా ! వచ్చిన సంబందాలన్నింటినీ మీ అమ్మాయి ఏదో వంక చెప్పి తిరస్కరిస్తోందని మీరే చెబుతున్నారు. మీ అమ్మాయికి నచ్చడం లేదో మీకే నచ్చడం లేదో నాకు తెలీదు. మళ్ళీ మంత్రాలతో స్తోత్రాలతో పని కావాలని ఆశిస్తున్నారు. ఇది జరిగేపని కాదు. ముందు మన మైండ్ సెట్ సరిగ్గా ఉండాలి. ఆ తర్వాత మంత్రాలు స్తోత్రాలు పనిచేస్తాయి. అంతేగాని, మనం గొంతెమ్మ కోరికలు కోరుతూ, అవి ఖచ్చితంగా జరగాలంటే మంత్రాలు పనిచెయ్యవు. ఒకవేళ పనిచేసినా, దానితోబాటు మీరు ఊహించని ఇంకో చెడు కోణం అందులో ఉంటుంది. అదిప్పుడు తెలీదు. తర్వాత తెలుస్తుంది. అప్పుడు ఇంకో జ్యోతిష్కుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యడం తప్ప మీరు చేసేదేమీ ఉండదు. మీ జీవితమంతా ఇలా జ్యోతిష్కుల చుట్టూ తిరగడం, వాళ్ళు చెప్పిన ఫేక్ రెమేడీలు చేసుకుంటూ ఉండటమే సరిపోతుంది. అసలైన పధ్ధతి ఇది కాదు.
అసలు మీరొక విషయం ఆలోచించడం లేదు. మీ కోరికలు మీరు చెబుతున్నారు. మరి అబ్బాయికి కూడా ఉంటాయిగా కోరికలు ! ఆ కోరికలకు తగినట్టు మీ అమ్మాయి ఉందో లేదో కూడా మీరు ఆలోచించాలి కదా! ఈ కోణాన్ని మీరు మర్చిపోతున్నారు.
అబ్బాయి ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో, ఆ లక్షణాలు మీ అమ్మాయిలో ఉన్నాయా లేవా ముందుగా బేరీజు వేసుకోండి. మీ గొంతెమ్మ కోరికలు తగ్గించుకోండి. మీ దురాశ వదల్చుకోండి. మీ మైండ్ సెట్లు మార్చుకోండి. స్తోత్రాలు, మంత్రాలు, పూజలు కాదు. వాస్తవికంగా ఆలోచించడం నేర్చుకోండి.
ఇదే నేను చెప్పే రెమెడీ.
అసలు మీ అమ్మాయికి కావలసింది మొగుడు కాదు. తను చెప్పినట్టల్లా ఆడే బానిస. అలాంటి మొగుడూ దొరకడు. అలాంటి బానిసా దొరకడు. మర్చిపోండి. మీ అమ్మాయి పెళ్ళికి మీరూ మీ అమ్మాయే అసలైన అడ్డుగోడలు. అంతేగాని జాతకం కాదు.' అన్నాను.
ఇదే నేను చెప్పే రెమెడీ.
అసలు మీ అమ్మాయికి కావలసింది మొగుడు కాదు. తను చెప్పినట్టల్లా ఆడే బానిస. అలాంటి మొగుడూ దొరకడు. అలాంటి బానిసా దొరకడు. మర్చిపోండి. మీ అమ్మాయి పెళ్ళికి మీరూ మీ అమ్మాయే అసలైన అడ్డుగోడలు. అంతేగాని జాతకం కాదు.' అన్నాను.
మళ్ళీ ఫోన్ కట్ అయిపోయింది. నేను చెప్పినది ఆమెకు నచ్చలేదన్న విషయం స్పష్టంగా అర్ధమౌతోంది. ప్రస్తుతకాలంలో మంచి చెబితే ఎవరు వింటున్నారు గనుక?
ఈసారి నేనూ ఊరుకోలేదు. వెంటనే ఆ నంబర్ని బ్లాక్ చేసి పడేశాను. ఎందుకంటే, మాటమాటకీ ఈ సోది వినే ఓపిక నాకూ లేదు కాబట్టి !
ఇలా ఉన్నారు మనుషులు ! వాళ్ళ తప్పు కూడా లేదు. అమ్మాయి జాతకంలో వృద్ధకన్యా యోగం ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం ఏం చెయ్యగలరు?
ఇలా ఉన్నారు మనుషులు ! వాళ్ళ తప్పు కూడా లేదు. అమ్మాయి జాతకంలో వృద్ధకన్యా యోగం ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం ఏం చెయ్యగలరు?