యధావిధిగా ప్రతి ఏడాదీ వచ్చేటట్లే వినాయక చవితి వచ్చింది. యధావిధిగా ప్రతి ఏడాదీ అడిగేటట్లే కుర్రాళ్ళు వచ్చి చందాలు అడిగారు.
యధావిధిగా నేనివ్వను పొమ్మన్నాను.
యధావిధిగా నేనివ్వను పొమ్మన్నాను.
వాళ్ళు నన్నొక హిందూమత ద్రోహిని చూచినట్లు చూస్తూ వెళ్ళిపోయారు.
పందిళ్ళు లేచాయి. పెద్ద వినాయక విగ్రహం వచ్చి అందులో కూచుంది. కాసేపు అందరూ గోల చేశారు. ఆ తర్వాత అక్కడ ఎవ్వరూ లేరు.
మూడురోజుల పాటు అందులోని మైకులో లేటెస్ట్ ఐటం సాంగ్స్ హోరెత్తాయి. ఎప్పుడు చూచినా పందిర్లో వినాయకుడూ, మైకూ తప్ప ఎవరూ ఉండటం లేదు. సాయంత్రం పూట మాత్రం నిక్కర్లేసుకున్న చిన్నపిల్లలు కొంతమంది వచ్చి ఆ ఐటం సాంగ్స్ కి డాన్సులు చేసి పోతున్నారు. ఆర్గనైజర్స్ ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు.
నాకు వినాయకుడి మీద భలే జాలేసింది. ఆ చెత్తపాటలన్నీ ఆయన ఎలా వింటున్నాడో, ఆ డాన్సులు ఎలా చూస్తున్నాడో అని !
నాకు వినాయకుడి మీద భలే జాలేసింది. ఆ చెత్తపాటలన్నీ ఆయన ఎలా వింటున్నాడో, ఆ డాన్సులు ఎలా చూస్తున్నాడో అని !
ఇవాళ పందిరి పీకేస్తున్నారు. మూడ్రోజుల్నించీ పాటలు పాడిన మైకుకు విశ్రాంతి దొరికింది. ఒక బండిమీద కూచుని మైక్ సెట్టు తన షాపుకు పోతోంది.
మైకుకు మోక్షం వచ్చింది.
మనుషులకి మాత్రం ఎన్నేళ్ళకీ రావడం లేదు !