Once you stop learning, you start dying

1, నవంబర్ 2018, గురువారం

నాందేడ్ యాత్ర - 3 (Maltekdi Gurudwara)







Maltekdi స్టేషన్లో నైట్ డ్యూటీ. తెల్లవార్లూ మేలుకుని కూర్చుని ఉన్నాను. మాటల మధ్యలో ఇక్కడకు చాలా దగ్గరలోనే ఒక గురుద్వారా ఉన్నదని చెప్పారు. ఇది కూడా చాలా ప్రసిద్ధి చెందినదే.

ఈ గురుద్వారా గురించి ఈ లింక్ లో చూడవచ్చు.


బీదర్ కు వెళ్ళేదారిలో గురునానక్ ఇక్కడకు వచ్చాడు. అది క్రీ.శ. 1512 వ సంవత్సరం. అప్పటికే ఇక్కడ లకడ్ ఫకీర్ అని ఒక ముస్లిం సాధువు ఉంటూ ఉండేవాడు. ఆ సాధువుతో గురునానక్ ఇలా అన్నాడు.

'ఇక్కడ ఒక పెద్ద నిధి ఉన్నది. దానిని నీవు  సంరక్షిస్తూ ఉండు. అందుకోసం నువ్వు రోజుకు రెండు అష్రఫీలు (బంగారు నాణాలు) తీసుకో.  కొన్నేళ్ళ తర్వాత నా పరంపరలో ఒక గురువు ఇక్కడకు వస్తాడు. ఆయనకు ఈ నిధిని అప్పగించు. అంతవరకూ నువ్వు నీ వంశస్తులు దీనికి కాపలాగా ఉండాలి.'

లకడ్ ఫకీర్ అలాగే చేశాడు. ఆయన చాలాకాలం  బ్రతికి క్రీ.శ. 1610 లో చనిపోయాడు. అప్పటికి గురు గోవింద్ సింగ్ అక్కడకు తన సిఖ్ సైన్యంతో వచ్చాడు. ఆయనకు ఆ నిధిని అప్పగించి లకడ్ ఫకీర్ చనిపోయాడు. ఆ నిధిని తన సైనికులకు పంచిపెట్టాడు గురు గోవింద్ సింగ్. మిగతా  కధ అంతా పై లింక్ లోనూ,  ఇంకా  మిగిలిన లింక్స్ లోనూ చూడవచ్చు. గురు గోవింద్ సింగ్ కు ఇక్కడ మాల్ (అమితమైన ధనం) దొరికింది గనుక ఇది Mal Tekri లేదా Mal Tekdi అని పిలువబడుతోంది.

Maltekdi స్టేషన్ లోనే నేను మూడు రాత్రులు డ్యూటీ చేశాను. ఇది చాలా శక్తివంతమైన వైబ్రేషన్స్ ను కలిగి ఉన్న ప్రదేశం అని ఆ మూడు రాత్రులలో నాకర్ధమైంది. ఇద్దరు ముగ్గురు స్టాఫ్ తప్ప ఆ స్టేషన్ లో నరసంచారం లేదు. తెల్లవార్లూ పూర్తి ఏకాంతం. ఆంధ్రాలో జిల్లెళ్ళమూడి నుంచి మహారాష్ట్రలో మాల్ టెక్ డి కి ఒక్క రాత్రిలో ఎందుకు అమ్మ నన్ను తెచ్చిందా అని ఆ మూడు రాత్రులూ ధ్యానం చేశాను. విషయాలు అర్ధమయ్యాయి.

(ఇంకా ఉంది)