ముందే ప్లాన్ చేసినట్లుగా వరంగల్ స్పిరిట్యువల్ రిట్రీట్ 16-12-2018 న గ్రాండ్ కాకతీయ హోటల్ లో జయప్రదంగా జరిగింది. పంచవటి ఇండియా సభ్యులు, కొంతమంది ఇదే సమయానికి ఇండియాలో ఉన్న పంచవటి అమెరికా సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే రిట్రీట్లో మా లేటెస్ట్ 'ఈ - బుక్' 'మహా సౌరమ్' ను విడుదల చేశాం.
నా మార్గంలో మొదటి, రెండు లెవల్స్ సాధన, ప్రశ్నోత్తరాల కార్యక్రమం, సభ్యుల ఆధ్యాత్మిక జీవన సందేహాలకు సమాధానాలు, వారి వారి అనుభవాల కలబోత, చిన్నారుల పాటలు, కలసి భోజనాలు, ఆనందపు సంబరాలు, ఆత్మీయాతానురాగాల మధ్యన ఈ రిట్రీట్ జరిగింది. విడిపోయే సమయంలో వెళ్ళలేక వెళ్ళలేక కన్నీళ్లు పెట్టుకున్న సభ్యుల ప్రేమానురాగాలు అమూల్యాలు. ఇవి భగవంతుడు మాకిచ్చిన అద్భుతమైన వరాలు.
ఈ రిట్రీట్ ను చక్కగా నిర్వహించి దీనిని జయప్రదం చేసిన నా శిష్యుడు తాటికొండ రామారావ్ కు, అతని శ్రీమతికి, నా కృతజ్ఞతలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ రిట్రీట్ ను సక్సెస్ చెయ్యడంలో తోడ్పడిన రాజు సైకం, శ్రీరామ్మూర్తిలకు, నా మిగతా శిష్యులందరికీ ఆశీస్సులు.
రిట్రీట్ తర్వాత గ్రామాధిదేవత అయిన భద్రకాళి అమ్మవారి దర్శనంతో కార్యక్రమం ముగిసింది.
రిట్రీట్ ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.