ఈ వార్త పాతదే. గత నెల 25 న అమెరికాలో జరిగింది. కానీ దీని ప్రాముఖ్యత కొత్తది. నిజంగా కొత్తదా? అంటే అదీ ఇదమిద్ధంగా చెప్పలేం. మానవసమాజం అంత పాతది. ఎందుకంటే, మనిషి భూమ్మీద పుట్టిననాటినుండీ అసూయ ఉంది, ద్వేషం ఉంది, కోపం ఉంది, అధికారం చేతిలో ఉంటే దాని దుర్వినియోగం ఉంది, బలహీనులపైన జులుం చెలాయించడం ఉంది, దానిని సమర్ధించుకోవడం ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని కాలాలలో ఉన్నాయి, అన్ని దేశాలలో ఉన్నాయి. అయితే, చాలా అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకునే అమెరికాలో ఇలాంటి సంఘటనలు ఈనాడు జరగడం ఆ సమాజపు డొల్లతనాన్ని స్పష్టంగా చూపిస్తున్నది.
సమాజం నిజంగా చాలా ఉన్నతమైన భావాలు కలిగినదై ఉండటం వేరు. ఏం జరిగినా, 'అబ్బే ఏం లేదు' అంటూ దానిని చాపక్రింద దాచిపెట్టి 'మేం చాలా అభివృద్ధి చెందాం' అని గప్పాలు కొట్టుకోవడం వేరు. ఇలా దాచిపెట్టడం, వాళ్లకు కావలసినదే బయటకు చూపించుకోవడం చైనాలో సర్వసాధారణం. ఇప్పుడు అదే చైనా పుణ్యమాని భూగోళమంతా వణికి చస్తున్నది. అమెరికాలో కూడా ఇది సహజమే. ముఖ్యంగా ఒక నేరాన్ని తెల్లవాడు చేస్తే ఒక శిక్ష, నల్లవాడు చేస్తే ఇంకో శిక్ష అక్కడ ఉంటుంది. పైకి ఉన్నట్లుగా కనిపించకపోయినా, లోలోపల తేడాలుంటాయి. పైకి అంతా సమానమే అని చెప్పినా, ఎక్కడికక్కడ రేసిజం ఛాయలు కనిపిస్తూనే ఉంటాయి.
ఇండియాలో కులవ్యవస్థ ఉందని అన్ని దేశాలూ విమర్శిస్తాయి. మరి 'రేసిజం' అన్న పదానికి అర్ధం చెప్పమని వాటిని అడిగితే కనపడకుండా పారిపోతాయి. లేదా కల్లబొల్లి కబుర్లు చెప్పడం మొదలుపెడతాయి. రేసిజమూ కులవ్యవస్థా రెండూ వాటి బాహ్యవికాసరూపంలో వేర్వేరు కావచ్చు. కానీ మూలాల్లో రెండూ ఒకటే. 'ఒక మనిషి మనలాగా లేకపోతే వాడిని దూరం పెట్టు' అన్నదే వాటి మూలసూత్రం. ఇది జంతున్యాయం గాని మానవన్యాయం కాదు. కానీ మనుషులూ జంతువులేగా? 'మనిషి ఒక సామాజిక నాగరిక జంతువు' - అంతే. బయటకు ఎంతో తెల్లగా, మంచిగా, నాగరికంగా కనిపించవచ్చు. కానీ లోలోపల జంతువే. ఈ సత్యాన్ని మానసికశాస్త్రం ఎప్పుడో ఒప్పుకుంది.
గత నెల 25 న జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లవాడిని మినియాపోలిస్ పోలీసులు హత్య చేశారు. అతనితో వాళ్ళు ప్రవర్తించిన తీరు చాలా పాశవికంగా ఉంది. చాలా దారుణంగా ఉంది. అమెరికా మొత్తం నిరసనలు వెల్లువెత్తేలా చేసింది.
'కప్ ఫుడ్స్' షాపులో సిగరెట్లు కొనడానికి అతనిచ్చిన 20 డాలర్ల నోటు దొంగదే కావచ్చు. కానీ ఆ దొంగనోటును ప్రింట్ చేసింది అతను కాదు. ఆ వ్యవస్థను పట్టుకోవాలి. అతన్ని చంపితే ఏం వస్తుంది? మన దేశంలో, నోట్ల రద్దుకు ముందు చూస్తే, 500 రూపాయల నోట్లన్నీ దొంగవే. ప్రతివాడి జేబులోనూ దొంగనోట్లే అప్పుడు ఉండేవి. ఇక ఆరకంగా అందరినీ చంపుతూ పోతే ఇప్పటికి మన దేశ జనాభా ఏ 10 కోట్లకో పడిపోయి ఉండేది.
జార్జ్ ఫ్లాయిడ్ కు పాత నేరచరిత్ర ఉండి ఉండవచ్చు. అంతమాత్రాన ఆ విధంగా అతన్ని ఒక జంతువులాగా చంపడం అవసరమా? ఈ సంఘటనలో అతనేమీ పోలీసులతో ఫైట్ చెయ్యలేదు. పోలీసులకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. చంపడానికి వారికి హక్కు లేదు. మనిషిని జంతువులాగా ట్రీట్ చెయ్యడానికి వారికి హక్కు లేదు. మనిషి ఆరడుగులున్నా, ఎంత బలంగా ఉన్నా, అతనికీ నాడీకేంద్రాలుంటాయి, సున్నితమైన భాగాలుంటాయి. మెడ అనేది ఒక సున్నితమైన జాయింట్. అది ఎక్కువ బరువును ఎక్కువసేపు భరించలేదు. అందులోనూ ఒక కోణంలో అయితే అస్సలు భరించలేదు. వీరవిద్యలలో అనుభవం ఉన్నవారికి ఈ విషయం బాగా తెలుసు. మరి అతనితో ఆ పోలీసులు అంత క్రూరంగా ప్రవర్తించడం ఎంత దారుణం? దానిని పోలీసు యూనియన్లు సమర్ధించడమూ, ఏదో కంటితుడుపు చర్య తీసుకున్నామని చూపడమూ అన్నీ డ్రామాలే. నలుగురు పోలీసులు కలసి నడిరోడ్డుమీద ఒక మనిషిని చంపడమే అది !

సోషల్ మీడియా అనేది ఒకటి ఉండటమూ, ఎంతోమంది అక్కడున్న పౌరులు ఈ సంఘటనను వీడియో తీసి యూ ట్యూబ్ లోనూ ఇంకా ఇతర సోషల్ మీడియాలలోనూ పెట్టడమూ, పోలీసులను ఇరకాటంలో పెట్టాయి. సోషల్ మీడియా లేకుంటే, దీనిని ఒక సాధారణ సంఘటనగా చిత్రీకరించి ఎప్పుడో కేసును మూసేసి ఉండేవారు. సోషల్ మీడియా పుణ్యమాని చచ్చినట్లు చర్య తీసుకోవలసిన పరిస్థితి వచ్చింది. పోలీసు వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ విధంగా సోషల్ మీడియా మళ్ళీ గెలిచింది. నేటి ప్రపంచంలో సోషల్ మీడియా ఎంత శక్తివంతమైన ఆయుధమో ఈ సంఘటన నిరూపిస్తున్నది. మన చేతిలోని మొబైల్ ఫోనూ, దాని కెమెరా ఈ రెండూ ఎంత శక్తివంతములైన ఆయుధాలో ఈ సంఘటన మళ్ళీ నిరూపిస్తున్నది.
'తెల్లవారి ఆధిపత్యం' అనే భావన ఎంత ప్రమాదకరమో, 'పోలీసు జులుం' అనేది కూడా అంతే ప్రమాదకరం. దురదృష్టవశాత్తూ అమెరికాలో ఇవి రెండూ బాగా ఎక్కువే. అన్ని రాష్ట్రాలలో కాకపోవచ్చు. కొన్నింటిలో బాగా ఎక్కువ. అందరిలోనూ రేసిజం ఉండకపోవచ్చు. కానీ తెల్లవాళ్ళలో చాలామందిలో ఇది ఉంది. రెండుసార్లు అమెరికా వెళ్ళినప్పుడు నేను కూడా ఈ పోకడలు అక్కడి సమాజంలో గమనించాను. తెల్లతోలు కాకపోతే చాలు, వాళ్ళ ట్రీట్మెంట్ చాలా తేడాగా ఉంటుంది. 'అసలు వీడెందుకు ఇక్కడికొచ్చాడు?' అన్నట్లు చూస్తారు. అందరు తెల్లవాళ్లూ దుర్మార్గులని, అందరు నల్లవాళ్ళూ మంచివారనీ నేననడం లేదు. జార్జ్ ఫ్లాయిడ్ అంతిమయాత్రలో పాల్గొన్న అనేకమంది తెల్లవాళ్లే దీనికి ఉదాహరణ. కులం, మతం, రంగు, దేశాలతో సంబంధం లేకుండా మంచీచెడూ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. కానీ అంత చిన్ననేరానికి అతన్ని అలా చంపడం దారుణాతి దారుణం. అమెరికాలో నల్లవారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందొ చెప్పడానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ !
మినియాపోలిస్ మేయర్ 'జాకబ్ ఫ్రే' మాటల్లో చెప్పాలంటే - 'నల్లవాడిగా అమెరికాలో ఉండటం అంటే మరణశిక్ష కాకూడదు. అయిదునిముషాలపాటు ఒక తెల్లపోలీస్ ఆఫీసర్ ఒక నల్లవాడి గొంతుమీద మోకాలు పెట్టి అదిమిపట్టిన వీడియో మనం చూచాం. ఎవరైనా సహాయం కోసం అరుస్తుంటే, మనం సాయం చెయ్యాలి. మానవత్వం అనే తన అత్యంత ప్రాధమికబాధ్యతను ఈ పోలీస్ ఆఫీసర్ మరచిపోయాడు'.
రెండ్రోజుల తర్వాత ఆయన ఇంకా ఇలా అన్నాడు ' కలర్డ్ పీపుల్, ముఖ్యంగా నల్లవాళ్ళు, ఇదే పోలీస్ ఆఫీసర్ చేసిన పని చేసుంటే, ఈపాటికి జైల్లో ఉండేవారు'.
ఫ్లాయిడ్ మరణం ఒక హత్యేనని ఆయనన్నాడు. 'నాకు ఊపిరి అందడం లేదు. నన్ను చంపకండి, ప్లీజ్ కాపాడండి' అంటూ ఫ్లాయిడ్ దాదాపు అయిదు నిముషాలు అడుగుతూనే ఉన్నాడు. చివరలో వాళ్ళమ్మను తలచుకుంటూ 'అమ్మా అమ్మా' అని పిలిచిన తీరు చూస్తె ఎవరికైనా కళ్ళలో నీళ్ళు తిరగడం ఖాయం. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ కు ఏ మాత్రమూ జాలి కలగలేదు. అతనికే కాదు. అతనితో ఉన్న మిగతా ముగ్గురు పోలీసులకు కూడా కలగలేదు. చుట్టూ మూగిన పౌరులు ' అతను చనిపోతున్నాడు. ఆపండి' అంటూ బ్రతిమిలాడినా వాళ్ళు వినలేదు. రాక్షసత్వానికి పరాకాష్ట !

ఈ సంఘటన మీద స్పందిస్తూ నిన్నామొన్నటి అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ తన ప్రెస్ రిలీజ్ లో ఇలా అన్నాడు ' అమెరికాలోని చాలా పొడుగైన అన్యాయాల, విషాదాల చరిత్రచిట్టాలో ఇది కొంగ్రొత్త సంఘటన. అమెరికాలోని దాదాపు అన్ని రంగాలలోనూ 'ఒకడు ఎలా ట్రీట్ చెయ్యబడతాడు' అనడానికి, అతడి 'రంగు' అనేది కారణం కావడం చాలా బాధాకరం'.
ఈ మాటన్నది నిన్నా మొన్నటి అమెరికా ప్రెసిడెంట్ అన్న విషయం గుర్తుంటే, అమెరికాలో రేసిజం ఎంత స్థాయిలో ఉందో అర్ధమౌతుంది.
ఆ రోజున గ్రహస్థితులను ఒక్కసారి చూద్దాం.
మకరంలో గురుశనుల వక్రస్థితి, వాళ్ళిద్దరూ బాగా దగ్గరగా ఉండటం ఒక విషయం. ఇది మేక్రోస్థాయిలో ప్రపంచవ్యాప్తంగా జరిగే ఘోరాలకు సూచిక. మిధునంలో రాహువు, బుధుడు, చంద్రుడు ఆ రోజున దగ్గరగా కలవడం మైక్రోస్థాయి సంఘటనలను సూచిస్తుంది. వీరిలో రాహువు బుధుడు బాగా దగ్గరగా ఉంటూ బుద్ధిలేనితనాన్ని సూచిస్తున్నారు. చంద్రుడు సున్నా డిగ్రీలలో ఉంటూ మైండ్ లేని చర్యలను సూచిస్తున్నాడు. మిధునం అమెరికాకు సూచిక అని జ్యోతిష్య విద్యార్ధులకందరికీ తెలిసిన విషయమే. ఇంకేం కావాలి? మొత్తం బొమ్మ అంతా చాలా స్పష్టంగా ఉన్నది.
ఈ సంఘటన జరిగాక, సోషల్ మీడియాలో ఇండియన్ ఒకాయన ఇలా వ్రాశాడు.
'నేను మూన్నెల్ల క్రితం అమెరికాలో ఉన్నాను. అక్కడ ఏదో కొని 50 డాలర్ల నోటు ఇచ్చాను. చిల్లరగా నాకు ఒక 10 డాలర్ నోటు, ఒక 20 డాలర్ నోటు వచ్చాయి. వాటితో ఇండియాకు వచ్చిన నేను, ఇక్కడ వాటిని మన కరెన్సీలోకి మార్చుకుందామని ప్రయత్నిస్తే, ఆ 20 నోటు నకిలీదని కౌంటర్లో అన్నారు. దానిని గనుక అమెరికాలో మార్చినట్లయితే నా గతి ఏమై ఉండేదో తలచుకుంటే నాకు ఒణుకు పుడుతోంది'.
నిజమే ! అతని అదృష్టం బాగుంది గనుక ఇండియా కొచ్చాక దానిని రూపాయలలోకి మారుద్దామని ప్రయత్నించాడు. లేకుంటే జార్జ్ ఫ్లాయిడ్ కంటే ముందే ఇతను శవమై ఉండేవాడు. ఆఫ్ కోర్స్ ! అందరికీ అలా జరగదనుకోండి. కానీ చెప్పలేం. ఖర్మ బాలేనప్పుడు ఏదైనా జరుగవచ్చు.

మొత్తం మీద నల్లవాడిగా పుట్టడమూ, అమెరికాలో ఉండటమూ, ధనికుడు కాకపోవడమూ, జార్జ్ ఫ్లాయిడ్ కొంప ముంచాయి. బానిసత్వాన్ని అబ్రహాం లింకన్ ఎప్పుడో రద్దు చేశాడు. కానీ తెల్లవాళ్ళ మనసులలో అదింకా కొనసాగుతున్నట్లే ఉంది చూస్తుంటే !