ఈరోజు మళ్ళీ గురువుగారు మకరంలోకి నీచస్థితిలోకి వస్తున్నాడు. దాని ఫలితాలు మళ్ళీ మళ్ళీ వ్రాసి ఊదరపెట్టడం నా ఉద్దేశ్యం కాదు. కాకపోతే గతవారం నుంచీ జరుగుతున్న విషయాలు గమనిస్తే ఈ గోచారం ఎలా ఉండబోతోందో అర్ధమౌతుంది.
జాతీయ అంతర్జాతీయ గొడవల జోలికి పోకుండా రెండు చిన్న విషయాలు మాట్లాడుకుందాం.
గురువు నీచస్థితిలో ఉన్నపుడు దొంగగురువులు, దొంగజ్యోతిష్కులు, మతాధికారులు బయటపడతారని ఎన్నోసార్లు గతంలో చెప్పాను. ఇది ఎన్నోసార్లు రుజువైంది కూడా. గతవారంగా జరుగుతున్న ఒక జ్యోతిష్కుని ఉదంతం దీనికి తాజా ఉదాహరణ.
అతని ఇద్దరు భార్యలూ పోలీసు కంప్లెయింట్ ఇచ్చి టీవీలకెక్కారు. ఇంకా చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ క్యూలో ఉన్నారట. వాళ్ళు ముగ్గురూ మాట్లాడేది వింటుంటే అమాయకత్వమా, అతితెలివా అర్ధం కాలేదు. అతని ఆధ్యాత్మికతను చూచి పెళ్లి చేసుకున్నానని ఆ డాక్టర్ భార్య అంటోంది. చాలామంది ఇదే భ్రమల్లో ఉంటారు. ఆధ్యాత్మికమంట్టే పూజలు, పునస్కారాలు, హోమాలు, తంతులు, గుళ్ళూగోపురాల వెంట తిరగడం అనుకుంటారు. ఒకడు నాలుగుమాటలు బట్టీపట్టి చెప్పగానే పడిపోతారు. అసలైన ఆధ్యాత్మికత అది కాదని నేను పదేళ్ళ నించీ చెబుతున్నాను.
సరే! మోసపోయేవాళ్ళు అమాయకులు. మరి మోసం చేసేవాళ్ళు? వారికి భయంకరమైన కర్మ చుట్టుకుంటుంది. అది పక్వానికి వచ్చినపుడు వాళ్ళు పడే బాధలు దేవుడు కూడా పట్టించుకోడు. ఇది ఎన్నోసార్లు జరిగింది. రుజువైంది. అయినా కొత్తకొత్త స్వార్ధపరులు పుడుతూనే ఉంటారు. కొంతమంది రాజకీయనాయకులు, కొన్ని టీవీ చానల్స్ అదేపనిగా వారిని పెంచుతూ ఉంటాయి. ఇదంతా పెద్ద విషవలయం. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ఎవరి సమయం వచ్చినపుడు వారికి వడ్డన జరుగుతుంది.
ఇక కెనడా అబ్బాయి ఉదంతం !
ఇలాంటి గోచారఘడియలలో సెంటిమెంటల్ ఫూల్స్ పిచ్చిపనులు చేస్తారని కూడా ఎన్నోసార్లు చెప్పాను. కెనడాలో ఒక తెలుగబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడట. కారణం? తను ప్రేమించిన అమ్మాయికి H1B వచ్చేసి అతన్ని వదిలేసి అమెరికా వెళ్ళిపోయిందట. అందుకని ఇతను ఈ పని చేశాడు. ఇంతా చేస్తే ఆ అమ్మాయికి ఇంకా చాలామందితో సంబందాలున్నాయట. చెడు అలవాట్లున్నాయట. ఈ గోలంతా చూస్తుంటేనే చీదరపుట్టింది. ఎంత చండాలంగా తయారౌతున్నారో మనుషులు !
ఈ రెండూ గతవారంగా టీవీలలో యూ ట్యూబు చానల్స్ లో గోలగోల అయ్యాయట. ఎవరో నాకు పంపిస్తే చూశా. సామాన్యంగా ఇలాంటి చెత్త నేను చూడను. పట్టించుకోను. ఎవరో నాకు పంపించారు. ఇవేవీ జాతీయ అంతర్జాతీయ ఇష్యూస్ కాదు. ఒకటేమో మతపరమైన మోసం. ఇంకొకటేమో ఎమోషనల్ బాలెన్స్ లేకపోవడం.
జ్యోతిష్యరంగంలో చాలా మోసాలు జరుగుతున్నాయి. దీనివల్ల అసలైన శాస్త్రానికి ఏమీ ప్రమాదం లేదుగాని, అమాయకులు తమ నమ్మకాన్ని పోగొట్టుకుని పిచ్చిపిచ్చిగా మాట్లాడే ప్రమాదం ఉన్నది. కొంతమంది కుహనా జ్యోతిష్కులు నాలుగు మాటలు నేర్చుకుని, కొన్ని టీవీ చానల్స్ ని ఆశ్రయించి, ఈ శాస్త్రాన్ని చాలా ఖరీదైన వ్యవహారంగా మార్చి బిజినెస్ చేసుకుంటున్నారు. అమాయక గొర్రెలు నమ్ముతున్నారు. నిజానికి జ్యోతిష్యం అంత ఖరీదైన విషయం కాదు. చాలా సింపుల్ రెమెడీస్ దీనిలో ఎన్నో ఉన్నాయి. కానీ జనానికి మోసపోవడమే కావాలి. జనమూ సరైనవాళ్ళు కారు. ఈ మోసగాళ్ళూ సరేసరి. ఒకరికొకరు సరిపోయారు.
దురాశ, స్వార్ధం, అడ్డదారుల్లో ఏదో సంపాదించేసేయ్యాలన్న దుర్బుద్ధి జనంలో ఉన్నంతవరకూ, దొంగజ్యోతిష్కులు, దొంగస్వామీజీలు పుడుతూనే ఉంటారు. ఈ అనైతికవ్యాపారంలో ఒకపక్క జనమూ, ఇంకోపక్కన మోసపూరిత జ్యోతిష్కులూ లేదా స్వామీజీలూ ఇద్దరూ పాత్రధారులే. ఇద్దరిదీ తప్పుంది. అసలైన శాస్త్రం మాత్రం, ఈ గోలతో సంబంధం లేకుండా, ఏ మచ్చా లేకుండా వెలుగుతూనే ఉంటుంది. అర్హత ఉన్నవాళ్లకే అది దక్కుతుంది గాని ఇలాంటి చెత్త జనానికి, చెత్త గురువులకి దక్కదు.
ఆత్మహత్య చేసుకున్న కెనడా అబ్బాయికి బ్రతుకు విలువ తెలీదు. తల్లిదండ్రులు గుర్తు రాలేదు. ఆఫ్టరాల్ ఒక అమ్మాయికోసం చనిపోయాడు. వద్దని వెళ్ళిపోయిన అమ్మాయి కోసం అంత గోలెందుకు? అసలా అమ్మాయి ఎందుకు పారిపోయిందో? ఇతని ఎమోషనల్ గోల భరించలేకే అలా చేసిందేమో? ఎవరికి తెలుసు? ఇంత ఓవర్ పొసెసివ్ నెస్ ను ఎవరూ భరించలేరు.
అతను మానసికంగా బాలెన్స్ తప్పాడని క్లియర్ గా తెలుస్తోంది. ప్రపంచంలో అమ్మాయిలే లేరేమో ఇక? అతనొక మానసిక అస్థిరరోగిలా ఉన్నాడు. మొన్నీ మధ్యన నా శిష్యురాలు కూడా ఒకమ్మాయి సూయిసైడ్ చేసుకుంది. ఇలా చనిపోయేవాళ్ళు ఎమోషనల్ గా చాలా గందరగోళంలో పడతారు. వాళ్లకు బ్రతుకు విలువ అర్ధం కాదు. జీవితం అనేది దేవుడిచ్చిన వరమన్నది వాళ్లకా క్షణంలో గుర్తుండదు. ఎవరు చెప్పినా వినరు. అలాంటివాళ్లకి బ్రతికే అర్హత లేదు. వాళ్ళని గురించి బాధపడటం అనవసరం.
కొన్ని కులాలలో చాలామందికి లోకాన్ని వోల్ సెల్ గా మోసం చేసే తెలివి ఉంటుంది. దీనిని తెలివి అనడం సమంజసం కాదు. కానీ ప్రస్తుతం ఇదే పదం చెలామణీలో ఉన్నది కనుక అనవలసి వస్తోంది. మరికొన్ని కులాలలో చాలామంది ఎమోషనల్ ఫూల్స్ గా ఉంటారు. కొన్ని కులాలు ఎన్ని మోసాలు చేసినా కులసపోర్ట్ తో నెగ్గుకొస్తారు. మరికొన్ని కులాలు తేలికగా బయటపడి బద్నాం అవుతుంటారు. కొన్ని కులాలు చాలా ప్రాక్టికల్ గా ఉంటాయి. కొన్ని సెంటిమెంటల్ గా ఉంటాయి. ఈ రెండూ కలవకూడదు. కలిస్తే ఇలాగే అవుతుంది.
నిప్పు నీరు దూరంగా ఉండాలి. నిప్పు ఎక్కువైతే నీరు వేడెక్కుతుంది. నీరు ఎక్కువైతే నిప్పు ఆరిపోతుంది. నీరు పారిపోతుంది. అదే ఈ కేసుల్లో జరిగింది. అతియాజమాన్య మనస్తత్వం ఒక రోగం. దీనిని ఎవరూ ఎక్కువకాలం భరించలేరు. ఎవరి స్వేచ్చ వారికుండాలి. అది లేకపోతే పారిపోతారు. సహజమే !
నేటి రోజుల్లో కేరెక్టర్ అనేది ఒక బూతుమాటైపోయింది. 'తిరిగితే తిరిగావు నాతో ఈ గదిలో ఉన్నంతవరకూ సక్రమంగ్గా ఉండు చాలు. ఆ తర్వాత నీ ఇష్టం' అని ఆడామగా ఇద్దరూ అంటున్న రోజులివి. పిల్లలకు చదువులు నేర్పిస్తున్నారు గాని, నిబ్బరంగా ఎలా బ్రతకాలో నేర్పించడం లేదు. అమెరికా పంపించినంత మాత్రాన సరిపోదు, కోట్లు సంపాదించినంత మాత్రాన సరిపోదు. సక్రమంగా, ప్రణాలికాబద్ధంగా ఎలా జీవించాలో నేర్పించనంతవరకూ అవన్నీ వృధానే.
అతి పేదరికంలో ఏళ్ళపాటు భయంకరమైన బాధలు పడుతూ కూడా మొండిగా నిలబడి ఎదురీది జీవితంలో గెలిచిన మనుషులను నేను చూచాను. అన్నీ ఉండి, చిన్నచిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకునే అల్పులను కూడా చూస్తున్నాను. జీవితం ఎంత విచిత్రమైందో !
గురుగోచారం ఇలాంటి సంఘటనలను చాలావాటిని రేపుతుంది. ఇంకా చూద్దాం ఏమేం జరుగుతాయో !