నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

27, జూన్ 2021, ఆదివారం

కెనడాలో బయటపడిన 751 పిల్లల సామూహిక సమాధులు - ప్రభువా నీ యిచ్ఛయే నెరవేరుగాక !

గతనెల 25 వ తేదీన కాంలూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్లో బయటపడిన పిల్లల సమాధుల ఉదంతాన్ని ప్రపంచం మరచిపోకముందే మరొక ఘోరం బయటపడింది. ఈ సారికూడా కెనడాలోనే, మరైవల్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణంలో 751 మంది పిల్లల సామూహికసమాధులు బయటపడ్డాయి. ఇది సస్కచ్చవాన్ రాజధానియైన రెజీనా కు 87 మైళ్ళదూరంలో ఉంటుంది. ఈ స్కూలు 1899 నుండి 1997 వరకూ నడిచింది.

ఈ ఘోరం రెండురోజులక్రితం పౌర్ణమి ఘడియలలో బయటపడింది. కెనడాలో దాదాపుగా పదివేల మంది నేటివ్ పిల్లలు ఈ విధంగా గల్లంతైనవాళ్లున్నారు. వీళ్ళందరూ ఈ క్రిస్టియన్ స్కూళ్లలోనే గల్లంతయ్యారు.

అప్పట్లో ఈ పిల్లల్ని బలవంతంగా ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్చుకున్నారు. అక్కడ వాళ్ళ భాష మాట్లాడనిచ్చేవారు కారు. పిల్లలను శారీరకంగా మానసికంగా హింసించేవారు. సెక్స్ నేరాలు కూడా జరిగేవి. బాలికా విద్యార్థులకు క్రైస్తవ సన్యాసుల ద్వారా ఫాదర్ల ద్వారా పుట్టిన పిల్లల శవాలు కూడా ఈ సమాధులలో లభించాయని అంటున్నారు. వినడానికి చాలా బాగుంది కదా !
 
ఇంతకంటే అమానుషం, ఘోరం ఇంకెక్కడా ఉండదు. అయ్యా పోపుగారు ! వినబడుతోందా కనబడుతోందా ? కొంచం మాట్లాడండి ! మానవజాతికి మీ వాళ్ళు చేసిన నేరాలకు, అపరాధాలకు క్షమార్పణ చెప్పి కనీసం మీ పాపాలను ఇప్పుడైనా కొంచం కడుకునే ప్రయత్నం చెయ్యండి.

ఓ ప్రభువా ! స్వర్గంలోలాగా భూమిపైన కూడా నీ యిచ్ఛయే నెరవేరుగాక -  చిన్నపిల్లలపైన కూడా. ఆమెన్ !

ఇప్పుడు జ్యోతిష్యం వైపు కొంచం తొంగి చూద్దాం. గతనెలలో నేను వ్రాసిన పోస్టులో కర్కాటక రాశి కెనడాకు సూచిస్తుందన్నాను. అది నిజమైంది చూడండి మరి !

రెండు రోజుల క్రితం శుక్రుడు అప్పుడే కర్కాటక రాశిలో ప్రవేశించి చావులకు సమాధులకు కారకుడైన ప్లుటోతో ఖచ్చితమైన సమసప్తక దృష్టిలోకి వచ్చాడు. శుక్రుడూ చంద్రుడూ ఇద్దరూ చిన్నపిల్లలను అందులోను ఆడపిల్లలను సూచిస్తారని మనకు తెలుసు. చూడండి మరి శుక్రుడు ప్లుటోతో దృష్టిలోకి రావడంతోనే ఈ సమాధులు బయటపడ్డాయి ! పౌర్ణమి  ఛాయలోనే ఇది జరిగింది. పౌర్ణమి రోజున చంద్రునిపైన సూర్యునివెలుగు పూర్తిగా పడుతుంది. చంద్రుడు వెలుగులోకి వస్తాడు. అలాగే, అదే రోజున, చంద్రుడు సూచించే చిన్నపిల్లల సమాధులు వెలుగులోకి వచ్చాయి. ఇలా ఉంటాయి గ్రహప్రభావాలు !

50 రోజుల ప్రభావం కొనసాగుతోంది !
read more " కెనడాలో బయటపడిన 751 పిల్లల సామూహిక సమాధులు - ప్రభువా నీ యిచ్ఛయే నెరవేరుగాక ! "

25, జూన్ 2021, శుక్రవారం

మయామిలో పన్నెండంతస్తుల భవనం కూలుడు - పౌర్ణమి ప్రభావం

నిన్న పౌర్ణమి. ఉదయం 1.30 కి ఫ్లోరిడాలో మయామి సబర్బ్ అయిన సర్ఫ్ సైడ్ అనేచోట ఒక పన్నెండంతస్తుల భవనం పాక్షికంగా కూలిపోయింది. ఒకరు చనిపోయారు, తొమ్మిదిమంది గాయపడ్డారు, దాదాపు వందమంది గల్లంతయ్యారు. వీరిలో ఎక్కువమంది లాటిన్ అమెరికావాసులు. వాళ్ళు ప్రాణాలతో ఉంటారన్న నమ్మకం లేదు. శిధిలాలను తొలగించి చూస్తేగాని వాళ్ళ శరీరాలు దొరకవు. శిధిలాలను తొలగించే ప్రయత్నాలు సాగుతున్నాయి.


ఆ సమయంలో మీనలగ్నం 12 వ డిగ్రీ ఉదయిస్తోంది. దీనికి మిగతా అన్ని గ్రహాలూ అర్గలదోషం పట్టించాయి. లగ్నం మీనమైనప్పటికీ, అమెరికా లగ్నమైన మిధునం నుంచి చూస్తే, సూర్యుడు లగ్నంలో ఉంటూ సప్తమంలోని చంద్రునివల్ల పౌర్ణమి ఏర్పడుతోంది. ఈ పౌర్ణమి అమెరికా నుంచి మిడిల్ ఈస్ట్ ను చూస్తున్నది. మిగతా అన్ని గ్రహాలూ సూర్యుడిని, మిధునరాశిని అర్గళం చేస్తున్నాయి. జలకారకుడైన శుక్రుడు కర్కాటకం 2వ డిగ్రీలో ఉంటూ ప్లుటోను ఖచ్చితమైన దృష్టితో చూస్తున్నాడు. శుక్రుడు జలగ్రహం, కర్కాటకం జలతత్వరాశి, లగ్నం మీనం మరొక జలతత్వరాశి. సర్ఫ్ సైడ్ అనే ప్రదేశం బీచ్ దగ్గరగా ఉంటుంది, అందుకని, ఈ మూడు కారకత్వాలవల్ల ప్రభావితమైంది.

50 రోజుల ప్రభావం కొనసాగుతున్నది !
read more " మయామిలో పన్నెండంతస్తుల భవనం కూలుడు - పౌర్ణమి ప్రభావం "

21, జూన్ 2021, సోమవారం

అలబామా తుఫాను - భయంకర కారు ప్రమాదం

గత మూడురోజులనుంచీ క్లాడెట్ అనే తుఫాను బలాన్ని పుంజుకుంటూ అలబామా రాష్ట్రాన్ని వర్షాలతో ముంచెత్తుతోంది. శనివారం మధ్యాహ్నం ఇంటర్ స్టేట్ 65 రోడ్డు మీద బట్లర్ కౌంటీలో జరిగిన వరుస కారుప్రమాదంలో తొమ్మిదిమంది హరీమన్నారు. అందులో ఎనిమిదిమంది చిన్నచిన్నపిల్లలు. గతంలో ఇలాంటి భయంకరమైన యాక్సిడెంట్ ను ఎప్పుడూ చూడలేదని అక్కడివాళ్లు అంటున్నారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో కుండపోత వర్షమేమీ పడటం లేదుగాని, రోడ్లన్నీ జలమయంగా ఉన్నాయి.

అమెరికా లగ్నమైన మిధునం నుంచి చూద్దాం. మిధునరాశి వాయుతత్వరాశని మనకు తెలుసు. జలగ్రహమైన శుక్రుడు ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. మిధునరాశికి ప్రస్తుతం భయంకరమైన అర్గలదోషం పట్టి ఉన్నది. శుక్రుడు 26 వ డిగ్రీమీదున్నాడు. బహుశా ఇదే డిగ్రీ అలబామా రాష్ట్రాన్ని సూచించవచ్చు. ఈ డిగ్రీ ఉన్న భాగం ఆగ్నేయదిక్కును సూచిస్తుంది. ఈ అన్నింటినీ కలుపుకుని చూడండి - అమెరికాదేశం, సుడిగాలులు, తీవ్రవర్షాలు, ఆగ్నేయదిక్కు. సరిపోయిందా లెక్క?

మరి వరుస కారు ప్రమాదాలెందుకు జరిగాయి?

తృతీయాధిపతిగా దగ్గర ప్రయాణాలకు కారకుడైన సూర్యుడు లగ్నంలో ఉన్నాడు. మరణాలకు కారకుడైన ప్లుటోతో అతి దగ్గరి షష్టాష్టకదృష్టిలో ఉన్నాడు. యాక్సిడెంట్లకు, చావులకు మరో కారకుడైన శని ధనుస్సునుంచి సూర్యుని సూటిగా చూస్తున్నాడు.

ఇలాంటి భయంకరమైన యాక్సిడెంట్ జరగడానికి ఇంతకంటే ఇంకేం కావాలి?

read more " అలబామా తుఫాను - భయంకర కారు ప్రమాదం "

14, జూన్ 2021, సోమవారం

శని కుజుల ప్రభావం - 5 - వీకెండ్ లో అమెరికా ఎలా ప్రభావితమైంది?

10-6-2021 గురువారం అమావాస్య సూర్యగ్రహణమైంది. శుక్రవారం నుండి ఆదివారం వరకు మూడురోజులలో అమెరికాలోని మూడురాష్ట్రాలలో చెదురుమదురు కాల్పుల సంఘటనలు జరిగాయి. అనేకమంది చనిపోయారు, అనేకమంది గాయపడ్డారు. అమెరికాలో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అనకండి ! ఎప్పుడూ జరగవు. ఎప్పుడో మాత్రమే జరుగుతాయి. ఆ ఎప్పుడో జరగడం వెనుక ఏమున్నదనేదే నేను చెబుతున్నాను. వినండి.

10-6-2021 గురువారం

డెట్రాయిట్ మిషిగన్ లో జరిగిన కాల్పులలో ఒకరు చనిపోయారు. ముగ్గురు గాయాలపాలయ్యారు.

  • అమావాస్య, సూర్యగ్రహణం
  • బుధుని తీవ్ర అస్తంగత్వం
  • మిధునరాశికి పాపార్గళం
  • మిధునమంటే అమెరికా అని గతంలో ఎన్నో సార్లు నిరూపితమైంది. మళ్ళీ ఇప్పుడు రుజువైంది.



11-6-2021 శుక్రవారం

చికాగోలో సాయంత్రం ఏడు నుంచి రాత్రి పన్నెండు మధ్యలో నాలుగు కాల్పుల సంఘటనలు జరిగాయి. ఆరుగురు గన్ షాట్ గాయాలకు గురయ్యారు.

సవన్నా జార్జియాలో జరిగిన కాల్పుల సంఘటనలో ఒకరు చనిపోయారు. ఏడుగురు గాయపడ్డారు.

  • మిధునరాశికి పాపార్గళం
  • చంద్రశుక్రుల డిగ్రీ సంయోగం


12-6-2021 శనివారం

చికాగోలో అర్ధరాత్రి పన్నెండు నుంచీ సాయంత్రం లోపు ఏడు కాల్పుల సంఘటనలు జరిగాయి. వీటిల్లో ఏడుగురు గాయపడ్డారు.

ఆస్టిన్ టెక్సాస్ లో ఉదయం జరిగిన కాల్పులలో ఒకరు చనిపోయారు. 14 మంది గాయపడ్డారు.

న్యూబర్గ్, లూయిస్ విల్, కెంటకీ లో జరిగిన కాల్పులలో ఒకరు చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు.

  • మిధునరాశికి పాపార్గళం
  • మేష యురేనస్ కూ, మిధునశుక్రునికి ఖచ్చితమైన డిగ్రీ దృష్టి.

గత రెండురోజులకంటే శనివారం నాడు గ్రహయోగాలు బలంగా ఉన్నాయి. యురేనస్ దృష్టి విపరీతమైన దూకుడునూ, ఆలోచనలేని చర్యలనూ ప్రేరేపిస్తుంది. కనుక ఆ రోజున ఎక్కువ కాల్పుల సంఘటనలు జరిగాయి.


13-6-2021 ఆదివారం

ఆస్టిన్ టెక్సాస్ లో జరిగిన మూడు కాల్పుల సంఘటనలలో నలుగురు గాయపడ్డారు.

  • మిధునరాశికి పాపార్గళం
  • చంద్రకుజుల డిగ్రీసంయోగం. గురువుతో వీరికి ఖచ్చితమైన 6/8 దృష్టి.

మొత్తం అన్ని సంఘటనలనూ వ్రాయడం అనవసరం గాని, ఈ వీకెండ్ లో జరిగిన కాల్పుల సంఘటనలలో మొత్తం 6 గురు చనిపోగా 40 మంది గాయాలపాలయ్యారు. వీరిలో కొందరికి తీవ్రమైన గాయాలైతే, మరికొందరికి ఒకమోస్తరు గాయాలయ్యాయి. అన్నీ గన్ షాట్ గాయాలే.

ఇవన్నీ ఉన్నట్టుండి ఈ వీకెండ్ లోనే, అదీ అమెరికాలోనే, ఎందుకు జరిగాయో అర్థమైందా మరి? మిధునరాశి ఇంతగా దెబ్బతిన్నప్పుడు అమెరికాలో ఇలా జరగక ఇంకెలా జరుగుతుంది?

అయినా నా పిచ్చిగాని, పడ్డాక లబోదిబో అనడమేగాని ముందుగా చెబితే ఈ లోకంలో ఎవడు వింటాడు గనుక?

read more " శని కుజుల ప్రభావం - 5 - వీకెండ్ లో అమెరికా ఎలా ప్రభావితమైంది? "

13, జూన్ 2021, ఆదివారం

శనికుజుల ప్రభావం - 4 - చైనా గ్యాస్ పైప్ లైన్ పేలుడు

ఇవాళ శుక్లతృతీయ. అంటే, అమావాస్య వెళ్లిన మూడవరోజు. అంటే, దాదాపుగా అమావాస్య ఛాయలోనే ఉన్నాం మనం.

ఈరోజు ఉదయం 6.30 కి చైనాలోని హుబే ప్రావిన్స్ లోని షియాన్ అనే ఊళ్ళో గ్యాస్ పైప్ లైన్ పేలిపోయి ఒక హోటల్ కూలిపోయింది. 12 మంది చనిపోయారు. 150 మంది గాయపడ్డారు.

చైనా దేశం వృశ్చికరాశిలో ఉంటుంది. దానిని లగ్నంగా తీసుకుని చూస్తే --

రాహుకేతువుల ఇరుసు వృశ్చిక లగ్నాన్ని సూటిగా కొడుతోంది. శని దృష్టి కుజునిపైన ఉన్నది.  కుజుని పంచమదృష్టి వృశ్చికంలో కేతువుపైన ఉన్నది. ఇది  ఆ రాశికి సూచకంగా ఉన్న చైనాలో పేలుడును సృష్టించింది.

గ్రహాలమధ్యన ప్రతిరోజూ రకరకాలైన ఈక్వేషన్స్ ఏర్పడుతూ, మారిపోతూ ఉంటాయి. వాటిని బట్టి రకరకాల సంఘటనలు ఆయా దేశాలలో జరుగుతూ ఉంటాయి. ప్రస్తుత సంఘటన అలాంటిదే.
read more " శనికుజుల ప్రభావం - 4 - చైనా గ్యాస్ పైప్ లైన్ పేలుడు "

11, జూన్ 2021, శుక్రవారం

శనికుజుల ప్రభావం - 3 - అమావాస్య సూర్యగ్రహణం ఏమేం చేశాయి?

శని - కుజ - ప్లుటోల చెడుప్రభావాలు కొనసాగుతున్నాయి.

  • నిన్న గురువారం, అమావాస్య సూర్యగ్రహణం. మొన్న బుధవారం రాత్రి 10. 15 గంటలకు ముంబాయ్ లోని మలాడ్ ఏరియాలో ఒక ఇల్లు కూలిపోయి 11 మంది చనిపోయారు. పక్కనున్న ఇళ్లుకూడా దెబ్బతిన్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షాలవల్ల ఇది జరిగిందని అంటున్నారు.
  • దక్షిణ కొరియాలో ఒక ఐదంతస్తుల బిల్డింగ్ కూలిపోయి క్రిందనున్న బస్సుమీద పడింది. ఆ బస్సులోని 9 మంది హరీమన్నారు. మరో 8 మంది తీవ్రగాయాల పాలయ్యారు. 
  • ఇదే సమయంలో మెక్సికో టూర్ కెళ్లిన మెలిస్సా, జార్జియా లారీ అనే బ్రిటిష్ అక్కాచెల్లెళ్లు ఒక మడుగులో ఈతకొడుతుండగా వారిలో ఒకమ్మాయిని మొసలి పట్టుకుంది. జార్జియా ఆ మొసలితో పోరాడింది. ఇద్దరూ బయటపడ్డారు. ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. అది కాదు అసలు విషయం. మెక్సికో కూడా ఇండియాలాగా మకరరాశి అని ఇంతకుముందు వ్రాశాను. మకరమంటే మొసలి. ఈ అక్కాచెల్లెళ్ళిద్దరూ కవలలు, అంటే మిధునరాశిచేత సూచింపబడతారు. కర్కాటకమంటే నీటిమడుగు. కర్కాటకరాశిలో ఉన్న నీచకుజుడు మొసలిని సూచిస్తున్నాడు.  అక్కడున్న నీచ కుజునికీ మిధునానికీ (ట్విన్ సిస్టర్స్ కీ) ఆచ్చాదనాదోషం ఉన్నది. మకరం నుంచి శని ప్లూటో ల దృష్టి కర్కాటకం మీద ఉన్నది. ఈ లోపల అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య సమయంలోనే ఈ సంఘటన జరిగింది. ఎంత కరెక్ట్ గా జరిగిందో చూడండి ! ఎక్కడో ఇంగ్లాండ్ లో ఉన్న ట్విన్స్ ఇదే సమయానికి మెక్సికోకెళ్లి అక్కడ ఎవడో లైసెన్స్ లేని టూర్ గైడ్ చూపించిన ఒక నీటిమడుగులో దిగి ఈతకొడుతూ మొసలిబారిన పడ్డారు. గ్రహప్రభావాలు లేవని అనగలమా చెప్పండి ! అమావాస్య, పౌర్ణమి సమయాలలో ఇలాంటి సాహసాలు చెయ్యకూడదని మనవాళ్ళు ఊరకే అనలేదు మరి !
  • ఇది అంతర్జాతీయ వార్త కాదు. కానీ గ్రహప్రభావాలు మనిషి జీవితం మీద ఎంత సూక్ష్మంగా పనిచేస్తాయో చెప్పడానికి ఈ సంఘటనను వ్రాస్తున్నాను.
  • ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జరిగాయి. ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే.

read more " శనికుజుల ప్రభావం - 3 - అమావాస్య సూర్యగ్రహణం ఏమేం చేశాయి? "

7, జూన్ 2021, సోమవారం

శనికుజుల ప్రభావం -2 - పాకిస్తాన్ రైలు ప్రమాదం - శ్రీలంకలో విపరీత వర్షాలు

కుజ శని ప్లూటో ల విధ్వంసం కొనసాగుతున్నది !

ఈరోజు ఉదయం దక్షిణ పాకిస్తాన్లో రెండు రైళ్లు గుద్దుకుని 40 మంది చనిపోయారు, 120 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో మొదటి రైలు పట్టాలు తప్పగా దాని పెట్టెలు పక్క ట్రాక్ మీద పడ్డాయి. ఎదురుగా వస్తున్న మరో రైలు వాటిని గుద్దుకుని అదీ పట్టాలు తప్పింది. రైల్వే సేఫ్టీ పరంగా ఇది మేజర్ యాక్సిడెంటే.

విధ్వంసానికి కారకుడైన కుజుడు ప్రస్తుతం కర్కాటకం 3 వ డిగ్రీలో సంచరిస్తున్నాడు. చావులకు కారకుడైన ప్లూటో (యమగ్రహం) మకరరాశిలో 2 వ డిగ్రీమీదున్నాడు. ఇద్దరికీ ఖచ్చితమైన సమసప్తక దృష్టి ఉన్నది. పాకిస్తాన్ దేశం ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్ కూ మధ్యలో ఉన్నది గనుక అది మకరం 3 వ డిగ్రీమీదున్నదని నా భావన. మకరం భూతత్వ రాశి గనుక పాకిస్తాన్లో భూపరమైన యాక్సిడెంట్ జరిగింది.

విచిత్రంగా ఇదే సమయంలో, శ్రీలంకలో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. కొన్ని వందల ఇళ్ళు దెబ్బతిన్నాయి. 245,000 మంది ఈ వర్షాలవల్ల దెబ్బతిన్నారు. సింహరాశి శ్రీలంకను సూచిస్తుందని వ్రాశాను. దానికి ద్వాదశంలో జలతత్వరాశిలో ఏర్పడిన ఈ యోగం వల్ల అక్కడ విపరీతమైన వర్షాలు పడ్డాయి. కర్కాటకం జలతత్వరాశిగా శ్రీలంకలో జలప్రమాదాన్ని సృష్టించింది.

ఈ రకంగా, ఒకే గ్రహయోగం, ఆ దేశాన్ని బట్టి, ఆ గ్రహాలను బట్టి రకరకాలైన ఫలితాలనిస్తుంది. మనుషులకైనా ఇంతే. చేసుకున్న కర్మ ఎవరినీ వదలదు కదా మరి !

read more " శనికుజుల ప్రభావం -2 - పాకిస్తాన్ రైలు ప్రమాదం - శ్రీలంకలో విపరీత వర్షాలు "

6, జూన్ 2021, ఆదివారం

శనికుజుల విధ్వంసం మొదలైంది - బుకీనా ఫాసో మారణకాండ

నాలుగో తేదీన వ్రాశాను. అయిదున మొదలైంది విధ్వంసం.

పశ్చిమ ఆఫ్రికాలోని బుకీనా ఫాసో అనే చిన్న దేశంలో ఇస్లామిక్ టెర్రరిస్టులు దాడిచేసి వందమంది అమాయకప్రజలను దారుణంగా చంపేశారు. వీరివెనుక ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ సంస్థలున్నాయి. ఒకప్పుడు నలభైఏళ్ల పాటు కాశ్మీర్లో జరిగిందే ఇప్పుడక్కడ జరుగుతోంది. దౌర్జన్యం, చంపడాలతో ఇస్లాంని ఎలా వ్యాప్తి చేస్తారో ఆ అల్లాయే జవాబు చెప్పాలి ! ఒకవైపు ఇస్లామంటే  శాంతి అంటారు, మరోవైపు ఇలా జనాన్ని చంపుతుంటారు. ఇదేం ఇస్లామో మరి? మతం కోసం జనాన్ని చంపడమేంట్రా దరిద్రుల్లారా! ఎవర్రా మీకు చెప్పింది?

ఆఫ్రికా దేశాలలో నల్లవాళ్ళెక్కువ, కనుక అవి శనిరాశులైన మకర కుంభాల పరిధిలో ఉంటాయి.  వీటిలో కొంచం సంపన్నదేశాలు కుంభరాశిలో ఉంటే, పేదదేశాలు మకరంలో ఉంటాయి. అసలు రాశిచక్రంలో ఏయే డిగ్రీలు ఏయే దేశాలను సూచిస్తాయి అన్న విషయం మీద నేను చేస్తున్న యాస్ట్రో రీసెర్చి పూర్తయ్యాక దానినొక పుస్తకంగా ప్రచురిస్తాము. 'మెడికల్ ఆస్ట్రాలజీ' లాగా జ్యోతిషశాస్త్ర విద్యార్థులకు అదొక టెక్ట్ బుక్ అవుతుంది. అప్పుడుగాని ప్రపంచ జ్యోతిష్యశాస్త్ర చరిత్రలో ఈ విషయంపైన ఉన్న అసందిగ్ధత సమసిపోదు.

ఆ విషయాన్ని అలా  ఉంచితే, బుకీనా ఫాసో అనేది మకరరాశిలో 1 డిగ్రీమీద ఉందని నేను భావిస్తున్నాను. దీనికి కారణమేమంటే, మకరం 2 వ డిగ్రీమీదున్న ప్లూటో మరియు కర్కాటకంలో ఇప్పుడే ప్రవేశించిన కుజులమధ్యన ఖచ్చితమైన సమసప్తక దృష్టి ఏర్పడింది. ప్లుటోను జ్యోతిష్యంలో యమగ్రహమంటారు.  అంటే,చావుకు సూచకుడు. వీరిద్దరి దృష్టివల్ల విధ్వంసం జరిగి జనం చనిపోతారు. కరెక్ట్ గా తేదీలుకూడా పొల్లుపోకుండా అదే జరిగింది చూడండి మరి !

read more " శనికుజుల విధ్వంసం మొదలైంది - బుకీనా ఫాసో మారణకాండ "

4, జూన్ 2021, శుక్రవారం

రాబోయే యాభై రోజులు

2-6-2021 నుండి కుజుడు కర్కాటకరాశిలో అడుగుపెట్టాడు. అదాయనకు నీచస్థితి. ఇప్పటికే శని మకరంలో కూర్చుని తమ ప్రపంచ ప్రణాలికను అమలుచేయడానికి  ఆయనకోసం ఎదురుచూస్తున్నాడు, . వీరిద్దరి మధ్యనా సమసప్తక దృష్టి జూలై 20 వరకూ, అంటే యాభై రోజులపాటు ఉంటుంది. ఈ యాభై రోజులూ ప్రపంచానికి, ముఖ్యంగా ఇండియాకు గడ్డురోజులు కాబోతున్నాయి.

నీచకుజుడు, శనులమధ్యన ఏర్పడుతున్న సమసప్తకదృష్టి వల్ల భూకంపాలు, వానలు, వరదలు రావడం, భవనాలు, వంతెనలు కూలడాలు, రవాణా ప్రమాదాలు మొదలైనవి జరుగుతాయి.

ఇవేగాక, కరోనా మూడోవిడత వడ్డన (థర్డ్ వేవ్) ఇదే సమయంలో వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రపంచంలోని మిగతాదేశాల సంగతెలా ఉన్నా, ఇండియాలో ఈ సూచన బలంగా ఉన్నది, మకరరాశి ఇండియాను సూచిస్తుంది గనుక. కాబట్టి మళ్ళీ వినాశనం తప్పదు !

ఇప్పటివరకూ వచ్చిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్ వరదలు, గల్ఫ్ లో, శ్రీలంక దగ్గర ఓడలు మునిగిపోవడం ఇవన్నీ రాబోయే వాటికి సాంపిల్స్ మాత్రమే. ఇండియా, మెక్సికో, కెనడా మొదలైన మకర - కర్కాటక దేశాలు ఈ యాభై రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇదిగాక ఇండియాకు శత్రువులు పెరుగుతారు. పాకిస్తాన్ నుంచి ఎదురుదాడి ఎదుర్కోవలసి వస్తుంది. అది కాశ్మీర్ పాటను మళ్ళీ అందుకుంటుంది.

ఈ యాభైరోజులలో వచ్చే పౌర్ణమి అమావాస్య పరిధులలో ఖచ్చితంగా దుర్ఘటనలు జరుగుతాయి. పరిధి అంటే ముందూ వెనుకా రెండు రోజులని అర్ధం. కనుక జాగ్రత్తలు చాలా అవసరం.

10th June 2021 - అమావాస్య + సూర్యగ్రహణం.

24th June 2021 - పౌర్ణమి

9th July 2021 - అమావాస్య

24th July 2021 - పౌర్ణమి

జాగ్రత్తపడండి మరి !

read more " రాబోయే యాభై రోజులు "

3, జూన్ 2021, గురువారం

శ్రీలంక తీరంలో మునిగిన ఓడ - జ్యోతిష్యం ఏమంటోంది?

20-5-2021 న 'X-Press Pearl' అనే సరుకుల ఓడ శ్రీలంక తీరంలో తగలబడిపోవడం మొదలుపెట్టింది. దానిలో కొన్ని వేల లీటర్ల నైట్రిక్ యాసిడ్ ఉన్నది. ఓడలో ఉండే నూనె ఎలాగూ ఉన్నది. అప్పటినుంచీ శ్రీలంక నేవీ, భారత కోస్ట్ గార్డ్, రెండూ కలసి విశ్వప్రయత్నం చేసినా ఆ ఓడలోని మంటలను ఆర్పలేకపోయారు. చివరకది నిన్న సముద్రంలో మునిగిపోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు శ్రీలంక వణికిపోతున్నది ఎందుకంటే - అందులో ఉన్న ఆయిలు, నైట్రిక్ యాసిడ్ సముద్రంలో కలిస్తే చేపలన్నీ హరీమంటాయి, బీచ్ లన్నీ విషపూరితం అవుతాయి. అక్కడి ప్రజల జీవనాధారమైన చేపల వ్యాపారం మాయమౌతుంది. జనజీవనం అల్లకల్లోలం అవుతుంది.

గ్రహాలేమంటున్నాయో చెప్పనా?

మామూలుగా శ్రీలంక లగ్నాన్ని కుంభంగా లెక్కిస్తారు జ్యోతిష్కులు. కానీ నేనది సింహమని నమ్ముతాను. దానికి కొన్ని కారణాలున్నాయి.
  • శ్రీలంక  అసలు పేరు సింహళదేశం. అంటే, సింహాలుండే  దేశమని అర్ధం.
  • శ్రీలంక జెండా మీద కత్తిని పట్టుకున్న సింహం ఉంటుంది.
కనుక శ్రీలంక లగ్నం సింహమని నేను విశ్వస్థిస్తాను. అక్కడనుంచి నా విశ్లేషణను చూడండి.
  • మే 20 న చంద్రుడు సింహరాశిలో ఉంటూ, నా లాజిక్ నిజమని చెబుతున్నాడు.
  • 4/10 ఇరుసులో ఉచ్ఛరాహుకేతువులతో సింహానికి అర్గళం పట్టింది. అంటే ఆ దేశానికి మూడిందని అర్ధం.
  • శత్రు రోగ ఋణ స్థానమైన షష్ఠంలో శని ప్లూటో లుంటూ, జలతత్వరాశి అష్టమమూ అయినా మీనాన్ని చూస్తున్నారు. అంటే, మత్స్యసంపద దెబ్బతింటుందని అర్ధం. ప్రస్తుతం ఈ ఓడ మునగడం వల్ల అదే జరగబోతున్నది.
  • శని ప్లూటో లు షష్టాష్టక దృష్టితో సింహచంద్రుడిని చూస్తున్నారు. రాహు శుక్రులను కోణదృష్టితో చూస్తున్నారు. రాహువు రసాయనాలకు, యాసిడ్స్ కు కారకుడని మనకు తెలుసు. శని ఆయిల్ కి సూచకుడు. శుక్రుడు నీటికి సూచకుడు.
  • రాహుశుక్రులు చంద్రునితో కేంద్రదృష్టిలో ఉన్నారు. జలప్రమాదం సూచితం.
  • అన్నింటినీ మించి, చతుర్ధమూ, జలతత్వరాశీ అయినా వృశ్చికంలో కుజుని సూచిస్తూ ఉచ్చ కేతువున్నాడు. దీనివల్ల నీటిలో అగ్ని సూచితమౌతున్నది.
ఎన్ని ప్రయత్నాలు చేసినా వినని ఈ ఓడ చివరకు నిన్న మునిగిపోవడం మొదలుపెట్టింది. సరిగ్గా నిన్ననే కుజుడు మరొక జలతత్వరాశి అయిన కర్కాటకంలోకి అడుగుపెట్టాడు. అది ద్వాదశమౌతూ నష్టాన్ని సూచిస్తున్నది.

ఈ మొత్తం ప్రహసనంలో ఒక విచిత్రం ఉన్నది. 20 వ తేదీన కుజునిపాత్రను జలతత్వరాశిలోని కేతువు పోషించాడు. నిన్న కుజుడే సముద్రాన్ని సూచించే కర్కాటకంలోకి అడుగుపెట్టాడు. వృశ్చికం, కర్కాటకం రెండూ జలతత్వరాశులే. వినాశనకారకులైన శని ప్లుటోలు చూస్తున్న మీనం కూడా జలతత్వమే. ప్రస్తుతం ఆ ఓడ తనలో ఉన్న 25 టన్నుల నైట్రిక్ యాసిడ్ తో, ఇతర ప్రమాదకర రసాయనాలతో సహా సముద్రంలో మునిగిపోతోంది.

గ్రహప్రభావం ఎంత విచిత్రంగా పనిచేస్తుంది !
read more " శ్రీలంక తీరంలో మునిగిన ఓడ - జ్యోతిష్యం ఏమంటోంది? "

న్యూజిలాండ్ వరదలు - బుధశుక్రుల ప్రభావం

గత నాలుగు రోజులనుంచీ న్యూజిలాండ్ వరదలతో సతమతమౌతోంది. మే 29 న మొదలైన ఈ వరదలు నేటికీ కొనసాగుతున్నాయి. 30 వ తేదీ ఆదివారం నాడు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఊళ్లకు ఊళ్లు జలమయమయ్యాయి, కరెంట్ లేదు, ఆహారపు కొరత, రవాణా కష్టాలు, కమ్యూనికేషన్ కష్టాలు కొనసాగుతున్నాయి. వందలాది ఇళ్లు వరదలలో మునిగాయి. మరొపక్కన వేలాదిమంది నీళ్లలో చిక్కుకున్నారు. ఇలాంటి వరదలను గత నూరేళ్లలో చూడలేదని అక్కడివారు అంటున్నారు. ముఖ్యంగా కెంటర్భరీ, సౌత్ ఐలాండ్ లు తీవ్రవర్షాలకు, వరదలకు గురౌతున్నాయి.
న్యూజిలాండ్లో గతంలో జరిగిన ప్రమాదాలు, వరదలు, ప్రకృతిపరమైన భీభత్సాలను జ్యోతిశ్శాస్త్రపు కోణం నుంచి, నేను పరిశీలించాను.  నా ఉద్దేశ్యం ప్రకారం న్యూజిలాండ్ లగ్నం, మీనం లేదా కన్య అవ్వాలి. ఈ రెంటిలో మీనమే ఎక్కువగా కావచ్చు. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి -  అది జలతత్వ రాశి. రెండు - చేపలను సూచిస్తుంది. ఈ రెండూ న్యూజిలాండ్ను గట్టిగా సూచిస్తున్నాయి. మ్యాప్ లో చూస్తే, న్యూజిలాండ్ దేశం, సముద్రంలో ఉన్న చేపలాగా ఉంటుంది. ఒకటే తేడా ఏంటంటే - మీనరాశిలో రెండు చేపలుంటాయి, న్యూజిలాండ్ ఒకటే ముక్కగా ఉంటుంది.నా ఉద్దేశ్యంలో, మీనరాశి అనేక ద్వీపాల సమూహాన్ని, ఉదాహరణకు జపాన్ లాంటి దేశాన్ని సూచిస్తుందిగాని, ఒకటే ముక్కగా ఉన్న దీవిని సూచించదు.  పైగా, మేషమంటే బ్రిటన్ గనుక, ఇప్పటికీ దాని అదుపులోనే ఉన్న న్యూజిలాండ్ మీనం కావడం తార్కికంగా ఉంటుంది.కానీ న్యూజిలాండ్ లో జరిగిన జరుగుతున్న అనేక భూకంపాలు గమనిస్తే, కన్యకు ఎక్కువ మార్కులు పడతాయి. ప్రస్తుతానికి మీనమే అనుకుని చూద్దాం.

29-5-2021 న బుధుడు శుక్రుడు మిధునరాశిలో ఒకే సున్నాడిగ్రీ మీదున్నారు. ఈ యుతి చతుర్దంలో జరిగింది. మీనం జలతత్వరాశి, మిధునం వాయుతత్వం గనుక, ఈ యోగం వల్ల భయంకర వర్షాలు, వరదలు ఆ దేశంలో వచ్చే సూచనుంది. అదీగాక, ఇంకొక జలగ్రహమైన చంద్రుడు ధనుస్సునుంచి వీరిని చూస్తున్నాడు. మూడు రోజుల క్రితమే 26 న చంద్రగ్రహణం వచ్చింది. కనుక చతుర్దంలో బుధశుక్రులు రాశిసంధిలోను దశమంలో చంద్రుడు ఉంటూ మీనానికి అర్గలదోషాన్ని పట్టిస్తున్నారు. కనుక జలం ఆ దేశాన్ని ముంచెత్తింది. 

చతుర్ధమంటే ఇల్లు, వసతులు, సుఖాలని  మనకు తెలుసు. ఆ దేశంలో ఇవన్నీ 29 నుంచి దారుణంగా దెబ్బతింటున్నాయి. న్యూజిలాండ్ ప్రజలు నరకాన్ని చవిచూస్తున్నారు.

పోనీ, లగ్నం కన్య అనుకున్నా కూడా, బుధశుక్రుల దృష్టి చతుర్దంలోని చంద్రునిమీద పడుతుంది. మళ్ళీ అదే ఫలితం వస్తుంది. అర్గలదోషం రెంటికీ సమానమే.

బుధశుక్రులు చండనాడి అయిన మృగశిరలో ఉన్నారు. చంద్రుడున్న పూర్వాషాఢ నక్షత్రం కూడా అదే. సంస్కృతంలో 'చండ' అంటే మహాతీవ్రమైన, కోపగ్రస్తమైన అని అర్ధం. జలగ్రహాలైన శుక్ర, బుధ, చంద్రులను చండనాడిని కలుపుకుని చూడండి. భయంకరమైన వర్షాలు, వరదలు గోచరించాయా లేదా? అదే మరి జ్యోతిశ్శాస్త్రమంటే ! ఇదర్ధం కావాలంటే కొంచెం బుర్రుండాలి మరి !

గర్గమహర్షి, వరాహమిహిరుడు మొదలైన ప్రాచీనులు చెప్పిన ప్రకారం వరదలు తుఫాన్లలో బుధశుక్రుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యచంద్రులెలాగూ ఉంటారు. బీవీ రామన్ గారు కూడా తన రీసెర్చిలో ఇదే గమనించారు, చెప్పారు కూడా !

కనుక జ్యోతిష్యం మళ్ళీ నిజమైంది !

read more " న్యూజిలాండ్ వరదలు - బుధశుక్రుల ప్రభావం "

ఇరాన్ యుద్ధనౌక మునక - నీచకుజుని ప్రభావం

2-6-2021 బుధవారం నాడు ఇరాన్ నేవీలో అతిపెద్ద యుద్ధనౌక 'ఖర్గ్' మంటల్లో చిక్కుకుని గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో మునిగిపోయింది.  తెల్లవారు ఝామున 2. 25 కి మొదలైన ఈ తంతు తెల్లవారి 8. 30 కి ముగిసింది.

విచిత్రంగా, అదే సమయంలో కుజుడు మిధునం నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. అది ఆయనకు నీచస్థానం. అదే సమయంలో ఈ ఓడ కాలిపోయి కూలిపోవడం ఎంత కరెక్టుగా జరిగిందో చూస్తే జ్యోతిశ్శాస్త్ర విద్యార్థులకే కాదు, అందులో లోతుపాతులు తెలిసినవారికి కూడా దిమ్మతిరిగిపోతుంది.

కుజుడంటే యుద్ధమని, అగ్ని యని మనకు తెలుసు. అదే విధంగా, కర్కాటకమంటే నీరని కూడా తెలుసు. ఈ రెంటినీ కలుపుకుని చూడండి ఏం కనిపిస్తుంది? తగలబడిపోతూ నీటిలో మునిగిపోతున్న యుద్ధనౌక కనిపించిందా లేదా?

నా పరిశోధన ప్రకారం మధ్యప్రాచ్యం ధనూరాశిలో ఉంటుంది. కనుక ధనుస్సును లగ్నంగా తీసుకుని చూస్తే, అష్టమం లోకి అంటే, నాశనంలోకి అడుగుపెడుతున్న కుజుడు కన్పిస్తాడు. మునిగిపోతున్న నౌక కనిపిస్తుంది.

గంటగంటకూ దృశ్యం ఎలా మారిందో చూద్దామా?

2.25 AM: కుజుడు మిధునం 29.57 డిగ్రీలో; బుధుడు కర్కాటకం 0.14 డిగ్రీలో.

3.25 AM: కుజుడు మిధునం 29.59 డిగ్రీలో; బుధుడు కర్కాటకం 0.14 డిగ్రీలో.

4.25 AM: కుజుడు మిధునం 00.00 డిగ్రీలో; వక్రబుధుడు కర్కాటకం 0.13 డిగ్రీలో

8.30 AM: కుజుడు మిధునం 00.07 డిగ్రీలో; బుధుడు కర్కాటకం 0.11 డిగ్రీలో, అంటే ఖచ్చితమైన యుతి అన్నమాట. సరిగ్గా అదే సమయానికి, ఓడమునక పూర్తయింది.

ఈ ఓడ పేరు ఖర్గ్. ఇందులోని 'ఖ' అనే అక్షరానికి కుజుడు అధిపతి. లెక్క సరిపోయిందా మరి?

ఇంతకీ, ఈ ఓడ మునిగిపోవడం ప్రమాదమా లేక ఇందులో ఎవరిదైనా హస్తం ఉందా? వెల్ ! అన్నీ చెప్పేస్తే ఎలా? కొన్ని ఎప్పటికీ రహస్యాలుగానే ఉండాలి మరి !

read more " ఇరాన్ యుద్ధనౌక మునక - నీచకుజుని ప్రభావం "

1, జూన్ 2021, మంగళవారం

కెనడాలో బయటపడిన విద్యార్థుల సామూహిక సమాధి - బుధుని రాశిసంధి చెప్పిన నిజం

28-5-2021 న కెనడాలో ఒక సమాధి బయటపడింది. అందులో 215 మంది పిల్లల అస్థిపంజరాలున్నాయి. పశ్చిమ కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో కాంలూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఒక స్కూలుంది. అది 1890 లో మొదలై 1969 దాకా నడిచింది. 1950 లో అందులో 500 మంది పిల్లలుండేవారు. ఇప్పుడుకూడా ఆ భవనం ఇంకా ఉంది. దాని ఆవరణలోనే ఈ నేలమాళిగ సమాధి బయటపడింది.

ఈ స్కూల్ పేరులో ఉన్న ఇండియన్ అనే పదం చూసి అదేదో మనదనుకోకండి. అదొక పొరపాటు. యూరోపియన్లు కెనడాని కనుక్కున్నపుడు దానిని ఈస్ట్ ఇండియా అనుకున్నారు. అందుకని, అప్పటికే అక్కడ ఉన్న ప్రజలను ఇండియన్స్ అన్నారు. కొలంబస్ అమెరికాను కనుక్కున్నపుడు కూడా దానిని ఇండియా అనుకున్నాడు. అందుకే అక్కడి వాళ్ళను రెడ్ ఇండియన్స్ అన్నారు. కెనడాలో ఈ పొరపాటును తరువాత సరిదిద్దుకున్నారు. ఎందుకంటే, తర్వాత్తర్వాత ఎంతోమంది మనవాళ్ళు కెనడాకెళ్లి స్థిరపడ్డారు గనుక.

బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించడం మొదలుపెట్టిన రోజులలో, లోకల్స్ కి చదువు, ఇంగిలీషు, పద్ధతులు నేర్పడానికి, క్రైస్తవం నూరిపోయడానికి రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టారు. నిజానికి అవన్నీ, ఆయా ప్రజల భాషను, సంస్కృతిని, మతాన్ని రూపుమాపడానికి చర్చి చేసిన ప్రయత్నాలు మాత్రమే. ఇది వాళ్ళాక్రమించిన ప్రతి దేశంలోనూ జరిగింది. కొన్ని చోట బాగా సక్సెస్ అయింది, కొన్నిచోట్ల కాలేదు,  అంతే తేడా. ఈ క్రమంలో వాళ్ళు చేసిన అనేక నేరాలు ఘోరాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి.

ఇకపోతే, ఈ స్కూళ్లలో బలవంతంగా చేర్చబడిన పిల్లల్లో అనేకమంది వెనక్కు తిరిగి రాలేదు. తల్లిదండ్రులు అడిగితే ఫాదర్లు జవాబు చెప్పేవారు కారు. ఆ రోజులలో ఒక కేథలిక్ ఫాదర్ (ప్రిన్సిపాల్) మాత్రం 'డబ్బు లేకపోవడం వల్ల పిల్లలకు తిండి పెట్టలేకపోతున్నాం' అని అన్నాట్ట. అప్పట్లో ఆ స్కూళ్లలో చదివి ప్రాణాలతో బయటపడిన కొందరు అదృష్టవంతులు చెబుతున్నదేమంటే 'ఆ స్కూళ్లలో ఆకలి, భయం, అవమానించబడటం, సెక్స్ హింసకు గురికావడం, రోగాలు వచ్చినా మందులు లేకపోవడం, సరియైన పోషణ లేకపోవడం' సర్వసాధారణంగా జరిగేదట. ఆయా స్కూళ్ల ఆవరణలలో సామూహికంగా పిల్లలను చంపి, లేదా, సాంక్రామిక రోగాలొచ్చినపుడు సరియైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా, అలా చనిపోయిన పిల్లలను అక్కడే పాతిపెట్టడం జరిగిందని కెనడాలో చాలా పుకార్లున్నప్పటికీ, ఇప్పటివరకూ ఎవరూ పరిశోధన చెయ్యలేదు. అక్కడున్న ఆదివాసీ ప్రజలు కొందరు పూనుకుని నేల లోపల ఏముందో చూచే రాడార్లు ఉపయోగించి ఈ పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో 215 మంది పిల్లల అస్థిపంజరాలు ఒక స్కూల్ ఆవరణలోని ఒక సమాధిలాంటి గుంటలో లభించాయి. కేథలిక్ ఫాదర్లే ఆ పిల్లలను చంపేసి సామూహిక ఖననం చేసేసి ఉంటారని నేడు భావిస్తున్నారు.

ఎంత దారుణమో కదా ! ప్రపంచానికి నీతులు బోధించే మతాల చీకటి గుహలలో ఎన్ని ఇలాంటి దారుణాలు దాగున్నాయో?

నేడు కెనడా అంతా విలపిస్తోంది. కెనడా ఆదివాసీలు తమను తాము 'ఫస్ట్ నేషన్' అని పిలుచుకుంటారు. ఇప్పుడు కెనడా అంతటా అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలోనూ ఇలాంటి రాడార్ తోనే పరిశోధన చెయ్యాలని అక్కడున్న సమాధులన్నీ తవ్వాలని వారు ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకంటే గత రెండువందల ఏళ్లలో, ఈ స్కూళ్లకెళ్లిన కొన్ని వేలమంది ఆదివాసీల పిల్లలు మాయమయ్యారట !

ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం ఏమంటున్నదో చూద్దాం !


28-5-2021 న ఈ వార్త వెలుగు చూసినప్పుడు, బుధుడు మిధునరాశి  సున్నా డిగ్రీలలో ఉన్నాడు. బుధుడు చిన్నపిల్లలను సూచిస్తాడని జ్యోతిష్యశాస్త్ర విద్యార్థులకు బాగా తెలుసు కదా ! అలాగే, మిధునరాశి కూడా పిల్లలను విద్యార్ధులను సూచిస్తుంది. రాశిసంధిలో ఉండటం ఒక దుర్ఘటనను, దానివల్ల కలిగే మానసిక వేదనను సూచిస్తుంది.

నా వ్రాతలు చదివేవారికి మరో విషయం కూడా తెలిసుండాలి. అదేంటంటే, మిధునరాశి అమెరికాకు సూచికని. కనుక దాని క్రిందనున్న కర్కాటక రాశి కెనడాను సూచిస్తుంది. జాతకంలో కర్కాటకరాశి బలంగా ఉన్నవారికి కెనడా దేశంతో తప్పనిసరిగా సంబంధం ఉంటుంది. వాళ్ళు అక్కడికి పోకపోతే కనీసం వాళ్ళ పిల్లలైనా అక్కడ సెటిలౌతారు. ఇది ఎన్నో జాతకాలలో చూశాను. కనుక కర్కటకాన్ని కెనడా లగ్నంగా తీసుకుంటాను. మిగతా జ్యోతిష్కులు వేరే లగ్నాలు తీసుకోవచ్చు. అది వారిష్టం. కానీ నా ఉద్దేశ్యంలో కర్కాటకరాశి లక్షణాలు కెనడాతో బాగా సరిపోతాయి. అవేంటంటే, మెత్తని మనస్తత్వం, జాలిగుండె, ఉదారస్వభావం, మంచితనం మొదలైన లక్షణాలు. ఈ లక్షణాలు కెనడాలో పుష్కలంగా ఉన్నాయి. కనుక, ఇప్పుడు కర్కాటకలగ్నం నుంచి గ్రహస్థితిని చూద్దాం.

  • చిన్నపిల్లలకు, ముఖ్యంగా విద్యార్థులకు కారకుడైన బుధుడు సున్నా డిగ్రీలలో చావుకు సూచికైన ద్వాదశభావంలో ఉన్నాడు. ఇది రాశిసంధి. అంటే, ఈ పిల్లలు చావుబ్రతుకుల మధ్యన ఊగిసలాడే దుర్భర పరిస్థితిని ఆ స్కూల్లో చవిచూశారని అర్ధం.
  • ద్వాదశభావంలో కుజబుధుల యుతి వల్ల, ఆ పిల్లలు హింసాత్మకంగా చంపబడ్డారని తెలుస్తోంది.
  • వక్రశని ధనుస్సులోకొచ్చి చందుని కలుస్తాడు. అంటే, మానసిక వేదనని అర్ధం. అది రోగస్థానం. అక్కణ్ణించి మిధునంలో ఉన్న కుజ బుధులను చూస్తున్నాడు. అంటే, అనేక రోగాలద్వారా పిల్లలు చనిపోయారని, నేడు ఆ పిల్లల బలవంతపు చావులు బయటపడి, సమాజానికి తెలిసి, దానివల్ల ఆయా  కుటుంబాలకు కలిగే దుర్భరవేదనకు సూచిక.
  • ఇకపోతే, ఉపాధ్యాయులకు సూచకుడైన గురువు, రహస్యాలను, చావులను సూచించే అష్టమంలో ఉంటూ, అక్కణ్ణించి సమాధులను సూచించే ద్వాదశరాశి మిధునాన్ని చూస్తున్నాడు. కనుక స్కూలు అధికారులైన కాథలిక్ ఫాదర్లే పిల్లల చావులకు సామూహిక సమాధికి కారకులని తెలుస్తోంది.
  • లాభస్థానంలో ఉన్న  రవి,శుక్ర, రాహువుల వల్ల విద్యార్ధినుల పైన జరిగిన సెక్స్ పరమైన అమానుషకాండ కనిపిస్తోంది. అప్పట్లో ఇవి చాలా జరిగాయని ఎందరో కెనడియన్లు అంటున్నారు కూడా.
  • సంతానాన్ని, శిష్యులను సూచించే పంచమస్థానమైన వృశ్చికంలో మరణాన్ని, సమాధులను సూచించే ఉచ్ఛకేతువున్నాడు. వృశ్చికం రహస్యప్రదేశానికి సూచిక.
  • ఇంతకంటే ఇంకే వివరాలు కావాలి? అని గ్రహాలడుగుతున్నాయి. ఇకచాలు, అంతా అర్థమైందని గ్రహాలకు చెప్పాను.
కెనడా ఆదివాసీలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగే, మానవతావాదిగా పేరున్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడ్ కి అభినందనలు, వెంటనే స్పందించి, తగిన చర్యలకు ఆదేశించినందుకు.

ఈ సంఘటనపై క్షమాపణ చెప్పాలని పోప్ ను కెనడా కోరింది. 2018 లో కూడా ఇలాంటి క్రైస్తవనేరాలకు కొన్నింటికి కెనడా క్షమాపణ కోరితే, పోప్ ఇంతవరకూ స్పందించలేదు. బహుశా ఇంకా నిద్రపోతున్న ప్రభువు అనుమతి కోసం వేచి చూస్తున్నాడేమో? ఆయన లేవాలి. పర్మిషన్ ఇవ్వాలి. కనీసం అప్పుడైనా పోప్ స్పందిస్తాడని ఆశిద్దాం.

శాంతిని బోధించే ఓ మతాల్లారా !
మీ పద్దుల్లో ఎన్ని రహస్య నేరచిట్టాలున్నాయో?
అడవిమనుషులకు నాగరికతను బోధించే
ఓ సమాజసేవకుల్లారా! మీ బీరువాలలో
ఎన్ని కంపుకొడుతున్న అస్థిపంజరాలున్నాయో?
read more " కెనడాలో బయటపడిన విద్యార్థుల సామూహిక సమాధి - బుధుని రాశిసంధి చెప్పిన నిజం "