28, ఆగస్టు 2021, శనివారం
మనుషుల తీరు
27, ఆగస్టు 2021, శుక్రవారం
నిజమౌతున్న జోస్యాలు
ప్రస్తుతం శుక్రుడు నీచస్థితిలో ఉన్నాడు. బుధుడు ఉచ్ఛస్థితిలోకి వచ్చాడు. ఇంకా నెలరోజులుంటుందని నేను చెప్పిన ట్రెండ్ బాగా కనిపిస్తోంది. చూడండి !
మైసూరులో యూపీ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కు గురైంది. ఆ వివరాలన్నీ నేను వ్రాయను. న్యూస్ ఛానల్స్ చూసుకోండి. ఇన్నాళ్లూ ఉత్తరభారతంలోనే ఇలాంటి నేరాలు ఘోరాలు, దక్షిణభారతం సురక్షితమని అనుకునేవాళ్లం. అది అబద్దమని అనిపిస్తోంది. దక్షిణాదిలో కూడా ఇలాంటి కేసులు తలెత్తుతున్నాయి. తగ్గుతున్న క్రమశిక్షణా, పెరుగుతున్న నెట్ కల్చరూ దీనిని కారణాలు. ఈ కేసులో ఇంతవరకూ ఏమీ క్లూస్ దొరకడంలేదు.
తుంకూరు లో ఒక పశువుల కాపరి రేప్ కు గురై చంపబడింది. ఇది కూడా కర్ణాటకలోని జరగడం గమనార్హం.
7-3-2018 న, ఉత్తరప్రదేశ్ లో, సమాజ్ వాదీ పార్టీకి చెందిన అతుల్ రాయ్ అనే MP తనను రేప్ చేశాడని ఒక 17 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టింది. అతన్ని అరెస్ట్ చేసి నైనీ జైల్లో పెట్టారు. అతని తమ్ముడు, అనుచరులు తమను వేధిస్తున్నారంటూ, ఈ అమ్మాయి, ఆమె స్నేహితుడు ఇద్దరూ పెట్రోల్ పోసుకుని సుప్రీం కోర్ట్ ముందు ఆత్మాహుతి చేసుకున్నారు. తరువాత ఆస్పత్రిలో చనిపోయారు. యూపీ పోలీసులు, అధికారులు, చివరకు జడ్జీలు కూడా నేరస్తులకు కొమ్ము కాస్తున్నారని వీళ్ళు ఆరోపిస్తూ, ఆత్మహత్యను ఫెస్ బుక్ లైవ్ పెట్టి మరీ చనిపోయారు. ఇదీ సమాజవాద పార్టీ చేస్తున్న సమాజశ్రేయస్సు !
ఇదిలా ఉంటే, కాబూల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి బాంబుదాడిలో 70 మంది దాకా హరీమన్నారు. వీళ్ళలో 15 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారట. ఇది కూడా జరుగుతుందని, 'తాలిబాన్ తో వ్యవహారం పులిమీది స్వారీ' అని ముందే వ్రాశాను. ఇప్పటికీ బుద్ధిరాకపోతే, ప్రపంచవినాశనమే. ముగించలేని యుద్ధాన్ని మొదలుపెట్టకూడదు అనే సూత్రాన్ని అమెరికా మరచిపోవడమే దీనికంతా కారణం. పాకిస్తాన్ని ఇరవై ఏళ్లపాటు నమ్మడమే కారణం. ఇప్పుడు తెలుస్తోందా నొప్పి? బుద్ధి కర్మానుసారిణి ! పడండి !
చేసేటప్పుడు నవ్వుతూ చేసి, పడేటప్పుడు ఏడుస్తూ పడడమంటే ఇదే మరి !
గ్రహప్రభావం స్పష్టంగా ఉందా లేదా?
26, ఆగస్టు 2021, గురువారం
ఆఫ్ఘనిస్తాన్ లో ఉద్యోగాలు - అప్లై చేసుకోండి
తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యబోతున్నారు. అందులో చాలా పదవులను అర్హులైనవారికి అందించడానికి యాడ్ ఇచ్చారు. వాళ్లకు మెరిట్ ముఖ్యం అంతేగాని మనలాగా కులాలు ముఖ్యం కాదు. కాబట్టి మెరిట్ ఉన్నవాళ్లు హాయిగా అప్లై చేసుకోండి. మంత్రి పదవులు కొట్టెయ్యండి. ఆలస్యం ఎందుకూ ! ముందుకు దూకండి మరి !
పదవులు - అర్హతల లిస్టు ఇప్పుడే తాలిబాన్ నుంచి నాకొచ్చింది. మీకోసం ఇదిగో !
రక్షణశాఖామంత్రి
చిన్నప్పటినుంచీ ఘోరమైన నేరచరిత ఉండాలి. విమానాల హైజాకింగ్, విదేశీయుల కిడ్నాపింగ్ మొదలైన అంతర్జాతీయ నేరాలమీద కనీసం ఇరవై ఏళ్ళనుంచీ జైల్లో మగ్గుతూ ఉండాలి. 'వీడు చాలా డేంజరస్ వీడిని పట్టిస్తే ఒక బిలియన్ డాలర్ల బహుమతి' అంటూ అమెరికా ప్రకటించి ఉండాలి. భూకబ్జాలలో ఆరితేరి ఉండాలి. ఇతరదేశాల వ్యవహారాలలో తలదూర్చి, అల్లకల్లోలం సృష్టించే తెలివీ అనుభవమూ రెండూ ఉండాలి.
మహిళాసంక్షేమశాఖా మంత్రి
ఎల్కేజీ స్థాయినుంచే మొదలుపెట్టి, ఇప్పటిదాకా లెక్కలేన్నని రేపులు చేసి ఉండాలి. ఆడదాన్ని ప్రాణంలేని వస్తువుగా వాడుకోవడంలో సిద్ధహస్తుడై ఉండాలి. ఆడదంటే తెలివిలేని ఒక జంతువన్న ఫిలాసఫీ బాగా తలకెక్కి ఉండాలి. ఇస్లాం పవిత్ర బోధనల ప్రకారం, నలుగురు ధర్మపత్నులను, 72 మంది అధర్మపత్నులను కలిగినవాడై ఉండాలి. వాళ్ళను ఏలుకోడానికి ప్రతిరోజూ ఒంటెమాంసం, ఒంటెరక్తం, ఒంటె మూత్రాలను తప్పకుండా సేవిస్తూ ఉండాలి. ఆడది కనిపిస్తే చాలు, కిడ్నాపో, రేపో, మర్దరో ఏదో ఒకటి చేసేవాడై ఉండాలి.
వాణిజ్యశాఖా మంత్రి
అంతర్జాతీయంగా నల్లమందు, డ్రగ్స్, దొంగసారా, అక్రమ ఆయుధాల వ్యాపారాలలో ఆరితేరినవాడై, విపరీతమైన అండర్ గ్రౌండ్ నెట్ వర్క్ ఉన్నవాడై ఉండాలి. హవాలా వ్యాపారాలలో దేశదేశాలకూ నల్లధనం లావాదేవీలు చేసేవాడై ఉండాలి. ముఖ్యంగా, జన్మలో ఒక్కసారికూడా టాక్స్ కట్టనివాడై ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన క్వాలిఫికేషన్.
క్రీడలశాఖా మంత్రి
చిన్నప్పటినుంచీ కనీసం కబాడీ కూడా ఆడకపోయినా, స్టెరాయిడ్స్ వాడకంలో ఆరితేరినవాడై ఉండాలి. డోపింగ్ టెస్టులలో దొరక్కుండా ఆటగాళ్లకు ట్రెయినింగ్ ఇవ్వడంలో కనీసం పాతికేళ్ల అనుభవం ఉండాలి. లంచాలు తీసుకొని, సత్తాలేని ఆటగాళ్లను సెలక్ట్ చేసి, ఒలింపిక్స్ కి పంపించిన గతచరిత్ర ఉండాలి.
విదేశీవ్యవహారాల శాఖామంత్రి
ఇస్లాం పేరుతో అన్ని దేశాలలోనూ చిచ్చుపెట్టి, తిరుగుబాట్లు రేపి, టెర్రరిస్టులను తయారుచేసి, బాంబుదాడులు చెయ్యడంలో కనీసం ఇరవై ఏళ్ల అనుభవం ఉండాలి. అబద్దాలు చెప్పి, అన్ని దేశాలనుండి పెట్టుబడులు తేగలగాలి. తరువాత వాటిని ఎగ్గొట్టాలి. తమదేశ వ్యవహారాలను పక్కనపెట్టి ఇతరదేశాలలో అనవసరంగా తలదూర్చి వాటి భూభాగాన్ని ఆక్రమించిన అనుభవం ఉండాలి.
మతశాఖా మంత్రి
ఎడాపెడా అబద్దాలు చెప్పాలి, నీతీనియమాలంటూ లేకుండా ఆంబొతులాగా బ్రతికినవాడై ఉండాలి. ఇస్లాం పేరుతో ప్రజలకు నరకాన్ని చూపించాలి. ఆడవాళ్లను కుక్కలకంటే హీనంగా చూడాలి. ఆడదాని ఒళ్ళేకాదు, కనీసం కళ్ళు బయటకు కనిపించినా సరే, దాన్ని స్పాట్లో కాల్చి పారెయ్యాలి. ప్రజలను చీకటి యుగాలలోకి తీసుకెళ్లాలి. జంతువులలాగా బ్రతకడం వారికి నూరిపొయ్యాలి. ఇతరమతాల ఆరాధనా మందిరాలను బాంబులేసి కూల్చెయ్యడంలో చిన్నప్పటినుంచే అనుభవం ఉండాలి. ఇస్లాం ఒక్కటే మతమని, మిగతావన్నీ సైతాన్లన్న ధోరణిని వేలాదిమందికి నూరిపోసి, జాతీయ అంతర్జాతీయ నేరస్తులను తయారుచేసిన ఘనత ఉండాలి.
విద్యాశాఖామంత్రి
స్కూళ్లన్నీ మూయించాలి. యూనివర్సిటీలను మసీదులుగా మార్చాలి. ఇంగిలీషు చదువులు ఆపి, మదరసాల సంఖ్యను పెంచాలి. మోడరన్ చదువులు పనికిరావు. ఖురాన్లో లేనిది సైన్సులో ఏముంది? కాబట్టి, ఖురాన్ చదువుకుంటే చాలు. విద్యనేది అంతవరకే ఉండాలి. అలా కాకుండా రహస్యంగా ఇళ్లలో చదువుకునేవారిని, రోడ్లమీదకు లాక్కొచ్చి ఉరితీసి చంపాలి. ఇంగ్లీషు వంటి ఇతరభాషలను, సైన్స్, ఇంజినీరింగ్, మెడిసిన్ చదివేవాళ్ళను ఆపించి, వారిని రోజుకూలీలుగా మార్చాలి.
ఆరోగ్యశాఖా మంత్రి
అందరూ విధిగా గడ్డాలు పెంచేలా శ్రద్ధ తీసుకోవాలి. స్వయంగా తను, జన్మలో ఒక్కసారికూడా గడ్డం చేసుకోనివాడుగా ఉండాలి. స్నానమనేది వారానికి ఒక్కరోజు మాత్రమే అదికూడా శుక్రవారమే చెయ్యాలి, ప్రజలందరితోనూ అదేవిధంగా చేయించాలి. ఒకవేళ ఆరోజున నీళ్లు రాకపోతే, మళ్ళీ శుక్రవారం దాకా ఆగాలిగాని, మధ్యలో చస్తే స్నానం చెయ్యకూడదు. అలా చేసినవాళ్లను, నడిరోడ్డులో కాల్చి చంపాలి. ఇంగ్లిష్ వైద్యం నిషేధించాలి. ఇస్లాంలో చెప్పబడిన నాటుమందులే వాడాలి.
ప్రధానమంత్రి
అసలు ఉన్నాడో లేడో తెలీకుండా ఉండాలి. పాకిస్తాన్లో పుట్టి పెరిగి అక్కడ ఘనమైన నేరచరిత్ర కలిగినవాడై ఉండాలి. పైన చెప్పిన అన్ని నేరాలలోనూ తిరుగులేని అనుభవం ఉండాలి. పైన చెప్పబడిన అందరు మంత్రులకంటే పది ఆకులు ఎక్కువ చదివినవాడై ఉండాలి.
వీళ్ళందరూ ఈ పనులన్నీ చేస్తూ, ప్రతిరోజూ అయిదుసార్లు నమాజ్ మాత్రం విధిగా చెయ్యాలి. నీతులు లోకానికి చెప్పాలి, తాముమాత్రం పాటించకూడదు. లేకపోతే డిస్క్వాలిఫై అవుతారు, గమనించండి.
ప్రస్తుతానికి ఈ పోస్టులను నింపబోతున్నాం. ముందు ముందు వచ్చే మరికొన్ని పోస్టుల కోసం, మా 'ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ వెబ్ సైట్' ను చూస్తూ ఉండండి. పైన చెప్పిన అర్హతలు కాక, ఇంకా చాలా ఎక్కువ అర్హతలున్నవారు, పరీక్షలూ పాడూ ఏవీ లేకుండా, డైరెక్ట్ గా వాకిన్ అయ్యి, ఉద్యోగాలలో చేరిపోవచ్చు.
మరి ఆలస్యం ఎందుకు? పరిగెత్తండి.
25, ఆగస్టు 2021, బుధవారం
వెలుగుచుక్క
కాలేజీ రోజుల్లో - అమాయకపు మోజుల్లో
నమ్మేవాణ్ణి ఎన్నెన్నో ఆదర్శాలను
ఈ లోకంలో ప్రేమే అసలైన దైవమని
లోకమంతా స్వచ్ఛంగా వెలుగుతోందని
మనుషులందరూ ఎంతో
మంచివాళ్ళని, మర్యాదస్తులని
మానవత్వమే అసలైన దైవత్వమని
ఆడదంటే అసలు సిసలైన దేవతేనని
ఆదర్శాల బ్రతుకే - అసలైన బ్రతుకని
అన్యాయమూ అమానుషమూ ఒక్కటేనని
అసత్యపు బ్రతుకుకంటే
అణగారిపోవడం మేలని
విద్యాభ్యాసం ఆపి అడుగుపెట్టాక
విశాలవిశ్వంలోకి - అడుసులాంటి బ్రతుకులోకి
మానవమృగాల దానవస్వరాల, అరణ్యంలోకి
అసలైన నిజాలను - అడుగడుగునా చూచాను
ఎంత దరిద్రమో మనిషి బ్రతుకు
ఎప్పటికప్పుడు గమనించాను
అబద్దాలూ అన్యాయాల - అసహ్యపు సమాజాన్ని
మోడుబారిన మోసపు బ్రతుకుల - మోటునిజాలను
అజ్ఞానపు జీవితాల - అవాస్తవ చిత్రాలను
అర్ధంలేని పరుగుల - ఆర్భాటపు అగచాట్లను
అద్దంలో చూచినట్లు
అచ్చంగా ఆస్వాదించాన
అన్ని మతాలూ - అన్ని కులాలూ
అన్ని వర్గాలూ - అన్ని వర్ణాలూ
అన్ని దేశాలూ - అన్ని ప్రాంతాలూ
అన్ని రోజుల్లోనూ - అన్ని ఋతువుల్లోనూ
అనుసరిస్తున్నదెవరినో
అర్ధం చేసుకున్నాను
ఆరాధనా మందిరాలన్నీ - ఆర్జనా మందిరాలేనని
అర్చనా విధానాలన్నీ - అర్భకుల ఆరాటాలేనని
నీతిబోధకులందరూ - నీటిమీది బుడగలేనని
మానవతా వాదులందరూ - మాటకారులు మాత్రమేనని
అబ్బురపరిచే వాస్తవంలోకి
అకస్మాత్తుగా మేలుకున్నాను
మానవసంబంధాలన్నీ - మాసిన చొక్కాలేనని
మనుషుల బంధాలన్నీ - మారుజాతి చెక్కలేలని
మనుషులందరూ నటనా సార్వభౌములేనని
మనసుల మూలాలన్నీ - మసిబారిన గోడలేనని
ముచ్చటైన నిజాలను
మునుగుతూ తెలుసుకున్నాను
జీవితమంటే ఒంటరి ప్రయాణమని
నీవారనబడేవారు - నిజానికెవరూ లేరని
ఉన్నారనుకోవడం నీ పిచ్చి భ్రమేనని
ఇక్కడెవరూ ఎవరికీ - అసలేమీ కారని
అసలు సత్యాన్ని
ఆలస్యంగా అవగతం చేసుకున్నాను
అందరూ దొంగలేనని - అన్నీ బుంగలేనని
అంతటా మోసమేనని - అన్నిటా మాయలేనని
అందరూ పరుగెత్తేది - డబ్బు వెంటేనని
డబ్బుంటే జీవితంలో - అన్నీ ఉన్నట్లేనని
చెప్పే డబ్బుగ్రంధాన్ని
తబ్బిబ్బు పడకుండా రుబ్బుకున్నాను
డబ్బుంటే మనుషులు ప్రేమిస్తారని
డబ్బుంటే మమతలు చూపిస్తారని
డబ్బుంటే కొండమీది దేవుడైనా సరే
కోతిలా దిగి నీ ముందుకొస్తాడని
కొండంత వాస్తవాన్ని - కొంచెంకొంచెంగా
కోతిలా నేర్చుకున్నాను
ఇన్ని తెలుసుకున్నా - ఇన్ని అర్థమైనా
ఏమూలో చావకుండా ఏదో ఆశ
మనిషన్నవాడు ఒక్కడైనా ఉన్నాడని
మనసన్నదాన్ని ఎక్కడైనా చూస్తానని
మరచిపోయిన దారి
మరునాటికైనా మరుగు వీడుతుందని
నిత్యం కనిపిస్తున్నది నిజం కాదని
సత్యం చస్తే బ్రతుకుకే అర్ధం లేదని
నిశిరాత్రి నీరవం శాశ్వతం కాదని
పసితనపు కలలన్నీ కల్లలు కావని
నా గుండె చప్పుడు బోధించడాన్ని
నాలోనే నానాటికీ కన్నాను
చీకటి ఉనికే - వెలుగుకు నిదర్శనమని
అబద్ధపు బ్రతుకే - నీతికి నిరూపణమని
స్వార్ధపు మనసే - నిస్వార్ధతకు దర్పణమని
అబద్దపు అవని నుండే - ఆకాశానికి తర్పణమని
అద్భుత స్వరమొకటి - అంతరంగంలో అనడం
అనవరతం విన్నాను
ఏదో ఆశ - లోలోపల మిణుకుతోంది
ఏదో శ్వాస - ఎదలోపల వణుకుతోంది
సాగుతున్నా - ఎడారిచీకట్లో కాళ్ళీడుస్తూ
తూర్పున జ్వలిస్తున్న - వెలుగుచుక్కను చూస్తూ
మనిషి కోసం, మనసుకోసం,
మౌనంగా ఎదురుచూస్తూ....
దీపపు పురుగులు
చంపేవాడొకడు, చచ్చేవాడొకడు
చంపమని ఆయుధాలిచ్చేదొకడు
చంపొద్దంటూ చాపచుట్టేదొకడు
ఈ వ్యాపారంలో లాభపడేదొకడు
ఎగద్రోసేదొకడు దిగదుడిచేదొకడు
ఎగబీల్చేదొకడు సగమయ్యేదొకడు
ఏరుదాటేదొకడు ఎనక పొడిచేదొకడు
ఎగాదిగా చూస్తూ ఎత్తేసేదొకడు
కులమంటూ కూతపెట్టేదొకడు
మతమంటూ మాయచేసేదొకడు
జాతంటూ వాతపెట్టేదొకడు
నీతంటూ నీరుగార్చేదొకడు
రాజకీయంతో రంగుపూసేదొకడు
ఆధ్యాత్మికమని ఆశరేపేదొకడు
నమ్మకంగా నాటకాలింకొకడు
స్నేహంగా చేయి నరికేదొకడు
అమాయకంగా అంతా దోచేదొకడు
ఘరానాగా గాయపరిచేదొకడు
మందుపూస్తానంటూ మంటపెట్టేదొకడు
బంధువున్నేనంటూ బండవేసేదొకడు
కులం, మతం, డాబూ, దర్పం
స్నేహం, మోహం, ప్రేమా, బంధం
వినయం, విశ్వాసం, భక్తీ, బంధుత్వం
అన్నీ మాయదారి నాటకాలే
అందరూ దొంగలే అన్నీ డ్రామాలే
తెరముందు నటనలు చూపిస్తారు
తెరవెనుక దర్శకులు దాక్కుంటారు
అందరూ హీరోలమేనంటారు
ఈ లోకంలో స్వార్ధమే పరమార్ధం
మిగతావన్నీ పైపై మెరుగులు
ఈ లోకంలో డబ్బొక్కటే సత్యం
ఆ దీపం చుట్టూ అన్నీ పురుగులు
18, ఆగస్టు 2021, బుధవారం
కర్ణపిశాచి చెప్పిన తాలిబాన్ అసలు కథ
అర్ధరాత్రి ఎవరో తలుపు కొడుతున్న చప్పుడైంది.
అసలే ఆఫ్ఘనిస్తాన్ న్యూస్ చూసి చాలా చిరాగ్గా ఉన్నానేమో, 'ఈ టయిములో ఎవరబ్బా మనింటి తలుపు కొడుతున్నది? అంత ధైర్యం ఎవరికుంది?' అనుకుంటూ లేచి తెలుపు తీశా.
ఎదురుగా బురఖా వేసుకుని ఒకమ్మాయి నిలబడి ఉంది.
నిద్రమత్తంతా ఒక్కసారి ఎగిరిపోయింది.
'ఎవరు నువ్వు?' అడిగా భయం భయంగా.
ముఖం మీద ముసుగు తొలగించి పకపకా నవ్విందా అమ్మాయి.
'ఓ నువ్వా? ఏంటీ ప్రాక్టికల్ జోక్స్? భయపడి చచ్చా ఎవరో అనుకుని' అన్నా నిట్టూర్పు విడుస్తూ'.
'లోపలికి రానిస్తావా లేదా?' అంటూ చొరవగా తోసుకుని లోపలకొచ్చేసింది కర్ణపిశాచి.
'ఏయ్ ఆగాగు. అవతల మా ఆవిడ నిద్రపోతోంది బెడ్రూమ్ లో' అన్నా కంగారుగా.
'ఆవిడని పడుకోనియ్, మనం హాల్లో కూచుందాం. చాలా విషయాలు చెప్పాలి నీకు' అంది.
'మొన్నేదో న్యూయార్క్ వెళ్లి వస్తానని అదే పోత పోయావ్, ఇప్పుడేమో అర్ధరాత్రి ఈ వేషంలో ప్రత్యక్షమయ్యావ్. ఏంటిది? అన్నా కోపంగా.
'ఏం చేయమంటావ్ చెప్పు. అటునించటే ఆఫ్ఘనిస్తాన్ కూడా వెళ్లి, అంతా చూసి వస్తున్నా. దారిలో నీ పోస్ట్ కూడా చదివా. పెద్ద సోది రాశావ్ లే గాని, అసలు సంగతులు నీకూ తెలియవు. వెర్రి నాగన్న ! చెప్తా కూచో' అంది సోఫాలో కూలబడుతూ.
'అసలు సంగతులా? అవేంటి?' అడిగా.
'చెప్తా కాస్త రిలాక్స్ అవనీయ్. అది సరేగాని, నీకసలు బుద్ధి లేకుండా పోతోంది. ఆడకూతురు అర్ధరాత్రి ఇంటికొచ్చిందే, కాస్త టీనో కాఫీనో ఇద్దామన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా పోతోంది నీకు' అంది కోపంగా.
కోరగా చూసి, వంటింట్లోకి దారితీశా, టీ పెట్టి తేవడానికి.
నేను టీ కలుపుకుని తెచ్చేసరికి, కాళ్ళు బారజాపుకుని కూచొని, టీవీ ఆన్ చేసి CNN న్యూస్ చూస్తోంది కర్ణపిశాచి. నన్ను చూస్తూనే ' పిచ్చి ఛానల్స్, పిచ్చి ప్రేక్షకులు. అన్నీ అబద్దాలే. అసలు నిజాలు ఎవరికీ తెలియవు' అంది నవ్వుతూ.
టీ కప్పు తనకందిస్తూ 'అలా ఊరించకపోతే ఆ నిజాలేంటో చెప్పి చావచ్చు కదా' అన్నాను, నా కప్పుతో నేనూ సోపాలో కూలబడుతూ.
'ఉండు ప్రశాంతంగా టీ త్రాగనీయ్. ఎప్పుడో రెండు గంటల క్రితం కాబూల్లో త్రాగా, నోరెండిపోతోంది' అంటూ టీ త్రాగడం మొదలుపెట్టింది.
నేనూ టీ త్రాగుతూ 'అవునే పిశాచి? నువ్వింత అందగత్తెవి కదా ! కరువుబట్టిన తాలిబన్లు, నిన్ను బ్రతకనిచ్చారే' అడిగాను.
చులకనగా నవ్వింది పిశాచి.
'మీ మనుషుల సత్తా మాకు తెలీకపోతే కదా. ఒంటూపిరిగాళ్లు ! నాకేం భయం లేదు. నేను పిశాచినని మర్చిపోకు' అంది కోరపళ్ళు కనిపించేలా నవ్వుతూ.
'బాబోయ్ ఆ టాపిక్ ఒద్దులే గాని, విషయాలు చెప్పు' అన్నా టీ కప్పు పక్కన పెడుతూ.
'అలా రా దారికి. ఇప్పుడు విను' అంటూ కర్ణపిశాచి చెప్పసాగింది.
నువ్వు నిన్న రాసిందంతా అబద్దాలే. నీకు అసలు విషయాలు తెవీవు. నీకేకాదు, ప్రపంచంలో ఎవరికీ తెలీవు. మీరు చూస్తున్న న్యుసంతా పైపైన ట్రాష్. అసలు విషయాలు వేరే ఉన్నాయి.
ఆఫ్గనిస్తాన్ లో జరిగిందంతా పెద్ద గ్లోబల్ కుట్ర. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వమూ, తాలిబాన్లూ, పాకిస్తానూ, అమెరికా, చైనా అందరూ ఈ కుట్రలో భాగస్వాములే. ఇదొక గ్లోబల్ వ్యాపారం. ఇందులో లాభం అందరికీ ఉంటుంది' అంది.
'వార్నీ నిజంగానా?' బోలెడు హాచ్చర్యపోయా నేను.
'అవును. ఇప్పుడు చూడు నీకొక చిన్న ఉదాహరణ చెబుతా. మీ దేశంలో ఒకడొక చర్చి పెడతాడు. వెంటనే అమెరికా నుంచి డబ్బులొస్తాయి. గుడిసె మేడౌతుంది. నడిచి తిరిగే పాస్టర్, కార్లో తిరుగుతుంటాడు. ఎలా జరుగుతుంది ఇది?' అడిగింది.
'ఏముంది? మతాన్ని చూపించి డబ్బులు పోగేసుకోడమే' అన్నా.
'అవునా. ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది కూడా అదే. అక్కడి ప్రభుత్వమూ తాలిబానూ ఇద్దరూ ఈ వ్యాపారంలో పార్ట్ నర్సే. తాలిబాన్ని చూపించి, అమెరికా దగ్గర, ఘనీ డబ్బులు లాగుతాడు. రాత్రికి ఇద్దరూ కూచుని, డబ్బులు పంచుకుని మందు కొడతారు. లేకపోతే, హెలీకాఫ్టర్లో డబ్బు సంచులు వేసుకుని ఘనీ ఎలా పారిపోతాడు? తాలిబన్లేమో, ఏదో ఖాళీగా ఉన్న ఇంట్లోకి అద్దెకొచ్చినట్లు తాపీ ధర్మారావుల్లాగా నడుచుకుంటూ ప్రెసిడెంట్ పేలస్ కొచ్చి , ప్రెస్ మీట్ ఎలా పెడతారు? ఆర్మీ ఏమైంది? అమ్రికా ఇచ్చిన 2 లక్షల కోట్ల డాలర్లేమయ్యాయి? చెప్పు' అడిగింది.
నాకు గుండాగినంత పనైంది.
'ఇంకా ఉంది విను. ఈ మొత్తం వ్యవహారంలో అమ్రికా వెఱ్ఱిపప్ప అయిందని అందరూ అనుకుంటున్నారు కదా. వెర్రిపప్పలయింది అమ్రికా ప్రజలు, ఇతర దేశాల ఉద్యోగులు. అమ్రికా ప్రభుత్వం కాదు. వాళ్ళు చెబుతున్న రెండు ట్రిలియన్లు ఆఫ్ఘనిస్తాన్ కి రాలేదు. అందులో సగం పైన అమ్రికా వాళ్ళే నొక్కేశారు. అదక్కడ బ్లాక్ మనీగా మారి, అమ్రికా పెద్దవాళ్ళ ఎకౌంట్ లోకి చేరిపోయింది', అంది మెల్లిగా టీ సిప్ చేస్తూ.
ఈ సారి నాకు బ్రెయినాగిపోయింది.
'మరేమనుకున్నావ్? యూట్యూబు చూసి పోస్టులు రాయడం కాదు. నిజాలు తెలుసుకో. ఆఫ్ఘనిస్తాన్ కొచ్చిన సగం డబ్బులో, ప్రభుత్వమూ, తాలిబానూ చెరిసగం నొక్కేశారు. ఆఫ్ఘన్ ప్రజలూ, అమ్రికా ప్రజలూ వెర్రిపప్పలయ్యారు' అంది.
నేను తేరుకుని ' మరి, ఇప్పుడేంటి ఈ డ్రామా?' అడిగా.
'ఒకే డ్రామా ఎన్నిరోజులని ఆడతారు? అక్కడ అమ్రికా ప్రజలు గోలపెడుతున్నారు? ఇంకెన్నాళ్లు ఈ యుద్దానికి మేము స్పాన్సర్ చెయ్యాలి? అని. వాటాలు రాని సెనేటర్లు గోలపెడుతున్నారు. అందుకని సైన్యాన్ని వెనక్కు రప్పించక తప్పదు. దానికోసం నాలుగు నెలలనుంచే ప్లాన్ చేసి, అందరూ కలసి మాట్లాడుకుని, అంచెలవారీగా పధకాన్ని అమలు చేశారు' అంది.
'ఏంటా పధకం?' అన్నా.
'విను. ముందు ఆర్మీకి జీతాలివ్వడం ఆపేశారు. దాంతో వాళ్ళు బ్రతకలేక, తాలిబాన్ కి అమ్ముడుపోయారు. ఆయుధాలు అప్పజెప్పారు. ఒక్కొక్క ఊరూ ఆక్రమించుకుంటూ తాపీగా కాబూల్ దాకా వచ్చారు. ఈలోపల మిగిలిన డబ్బు సంచులతో ప్రెసిడెంట్ ఘనీ హాయిగా ఎగిరిపోయాడు. ఇదంతా అమ్రికాకీ తెలుసు, పెద్దతలకాయలందరికీ తెలుసు. ప్లాన్ వేసింది వాళ్ళే అసలు. అందరూ కలసి ప్రపంచప్రజలని చూస్తూ, న్యూస్ ఛానళ్లలో వస్తున్న అబద్దాలను చూస్తూ, స్కాచ్ త్రాగుతూ విరగబడి నవ్వుకుంటున్నారు. ఇదీ అసలు నిజం' అన్నది.
'ఏమో నాకు నమ్మకం కలగడం లేదు' అన్నా.
'అంతేలే. నిజం చెబితే ఎవడు నమ్ముతాడు మీ మనుషుల్లో. మీరింతే, ఎప్పటికీ మారరు. ఈ గేమ్ అప్పుడే అయిపోలేదు. ఇప్పుడింకొడు తయారయ్యాడు. వాడి పేరు అమ్రుల్లా సాలే. నేనే ఆఫ్ఘనిస్తాన్ కు అసలైన ప్రెసిడెంట్ నంటున్నాడు. వీడు కూడా ఈ కుట్రలో కొత్త పావే, ఎందుకంటే, ఏదో ఒక రకంగా గొడవలు రగులుతూ ఉండాలి. విలన్ ఒకడుండాలి. బాధితులుండాలి. వాళ్లను చూచి బాధపడి డబ్బులిచ్చేవాళ్ళుండాలి, ఆ డబ్బుల్ని అందరూ కలసి పంచుకోవాలి. అవేమో ప్రజలు టాక్స్ కట్టిన డబ్బులు. ఇలా అయితేనే కదా, లక్షల కోట్లు తేరగా సంపాదించగలిగేది. నీలా జన్మంతా ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది చివరకు? ఇవన్నీ, ప్రజల సొమ్ము కాజెయ్యడానికి నాయకులేసే రకరకాల ప్లాన్సన్నమాట. ఎలా ఉంది వీళ్ళ ప్లాన్' అంది పిశాచి.
'వామ్మో' అంటూ కళ్ళు తిరిగినట్లు క్రింద పడబోయా.
'మరీ అంత నటించకు. నీ శిష్యులు కూడా నమ్మరు' అంది పిశాచి.
'ఏయ్ పిశాచి ! అంటే గింటే నన్నను పడతా, కానీ నా శిష్యులనంటే మాత్రం ఊర్కోను' అరిచా కోపంగా.
'ఈ యాక్షన్లే ఆపమని నీకు చెప్పేది. బయటకి ఉత్త అరుపులే గాని, నీలోపల ఏమీ ఉండదని నాకు బాగా తెలుసులే, కూచో' అంది కూల్ గా.
'నీక్కూడా తెల్సిపోయిందా? సరే ఇప్పుడేమంటావ్?' అడిగా కూచుంటూ.
'రగులుతోంది మొగలిపొద అన్నట్లు ఎప్పుడూ ఆఫ్ఘనిస్తాన్ రగులుతూనే ఉండాలి. ప్రపంచదేశాలు డబ్బులిస్తూనే ఉండాలి. వాళ్ళు పంచుకుంటూనే ఉండాలి. మొగలిపొద ఆరిపోతే డబ్బులెవడిస్తాడు? అందుకని, సాలేతో క్రొత్తడ్రామాకు తెరతీశారు ఆఫ్గీ-పాకీ మూక. పాకిస్తాన్ లో కూడా ఇదే జరుగుతోంది గత డెబ్భై ఏళ్లుగా. ముందున్న ప్రధానమంత్రిని తరవాతొచ్చిన ప్రధానమంత్రి చంపుతాడు. లేదా వాళ్ళే ఉరితీస్తారు. లేదా, వాడు పారిపోయి అప్పటిదాకా సంపాయించిన డబ్బుల్తో ఏ లండన్ లోనో తల దాచుకుంటాడు. ఈలోపల కొత్త ప్రెసిడెంటో, ప్రధానమంత్రో తన దోపిడీ మొదలుపెడతాడు. మధ్యలో నోరెత్తకుండా ముస్లిం తీవ్రవాదులకు కొన్ని కుక్కబిస్కెట్లు పడేస్తుంటారు. ఇదెప్పటినుంచో జరుగుతున్న డ్రామానే. ఇదంతా తెలీక, మీలాంటి దేశభక్తులు తెగబాధపడిపోతుంటారు. అసలు పిచ్చోళ్ళు మీరు. ఈసారి ఆఫ్ఘనిస్తాన్లో జరగబోతున్న కొత్త డ్రామాకి, ఏ దేశం వెర్రిపప్ప అవుతుందో చూద్దాం' అంది నవ్వుతూ.
'ఆమ్మో ! ఎంత ఘోరం ఎంత ఘోరం', అంటూ పాత సినిమాలలో సూర్యకాంతం లాగా గుండెలు బాదుకుందామని అనిపించినా, బాగోదని ఆగిపోయా.
ఇంతలో మావిడ బాత్రూంకని లేచి, హాల్లోకొచ్చి, గాల్లో మాట్లాడుతూ గుండెలు బాదుకోబోయి ఆగిపోయిన నన్ను చూడనే చూసింది. ముందు అనుమానంగానూ తరువాత జాలిగానూ నావైపు చూచి బాత్రూం వైపు వెళ్ళిపోయింది. ఇలాంటి సీన్లు తానెన్ని చూసిందో ఈ ముప్పై ఏళ్లలో పాపం !
నా అవస్థ చూచి నవ్వుతూ, 'కంగారుపడకు, నేనావిడకు కనిపించన్లే. అబ్బ ! నాల్రోజుల్నించీ రెస్టు లేక ఒళ్ళంతా పులిసిపోయింది. ఇక రెస్టు తీస్కుంటా, నువ్వూ పడుకో ఒక గంట, మళ్ళీ ఆఫీసు కెళ్ళి నిద్రపోవాలి కదా?' అంది కర్ణపిశాచి, బురఖా తీసేసి ఒళ్ళు విరుచుకుంటూ.
ఆమె బురఖా తీసేసరికి, నేనప్పటిదాకా విన్నదంతా గాలిలోకి ఆవిరైపోయింది 'ఏమైనా పిశాచాలు మంచి అందగత్తెలే' అనుకున్నా మనసులో.
యధావిధిగా నా వైపు గుర్రుగా చూసి బురఖాను విసిరేసి మాయమైపోయింది పిశాచి. ఆ బురఖా సరిగ్గా హాలు మధ్యలో పడుంది.
ఇప్పుడు మావిడకి ఈ బురఖామీద ఏమి సంజాయిషీ ఇచ్చుకోవాలో దేవుడా? అనుకుంటూ నేనూ ఇంట్లోకి దారితీశా.
17, ఆగస్టు 2021, మంగళవారం
ఎవరీ తాలిబాన్? ఏమా ఆఫ్ఘనిస్థాన్ కధ?
ఆఫ్ఘనిస్తాన్ నేడు మళ్ళీ తాలిబాన్ వశమైంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే, పాకిస్తాన్ వశమైంది. తాలిబాన్ని, గత ఇరవై ఏళ్లుగా పెంచిపోషించింది పాకిస్తానేనన్నది ప్రపంచంలో అన్ని దేశాలకూ తెలుసు. పాకిస్తాన్ దొంగనాటకాలని నమ్మినంతకాలం ప్రపంచానికి వినాశనం తప్పదు. 'ఆఫ్ఘనిస్తాన్ లో బానిసత్వం అంతమైంది' అని పాకిస్తాన్ ప్రధానమంత్రి అనడమే దీనికి నిదర్శనం.
ప్రెసిడెంట్ ఘనీ తజికిస్తాన్ కి పారిపోయాడు. వేలాది ప్రజలు దేశం విడిచి ఏ దేశానికి వీలైతే ఆ దేశానికి చీమల్లా పారిపోతున్నారు. వాళ్ళూ ముస్లింసే. మరి విమానాలనుంచి పిట్టల్లా రాలిపోతూ కూడా ఎందుకు ఒక ఇస్లామిక్ దేశం నుంచి పారిపోతున్నారు? మన దేశంలో చదువుకుంటున్న ఆఫ్ఘన్ విద్యార్థులు పాకిస్థానీలని బండబూతులు ఎందుకు తిడుతున్నారు? పాకిస్తాన్నీ, ఇస్లాంనీ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అందరూ అసహ్యించుకుంటున్నారు?
విడుదలైన వేలాది ఉగ్రవాదులు
ఆఫ్ఘనిస్తాన్ జైళ్లలో ఏళ్లగా మగ్గుతున్న కరుడుగట్టిన వేలాది తీవ్రవాదులని, దాదాపు 5000 మందిని తాలిబాన్లు మొన్న విడుదల చేశారు. ఇది ముందు ముందు ఏ దేశానికీ మంచిది కాదు. తాలిబాన్ సపోర్ట్ తోనే కదా, 2001 లో 9/11 జరిగింది. ఒసామా బిన్ లాడెన్ అనే ఒక్క టెర్రరిస్టుతో అంత జరిగింది. ఇప్పుడలాంటివాళ్లు 5000 మంది జైళ్లలోనుంచి బయటకొచ్చారు. వినాశనం ముందుంది. ప్రపంచదేశాలకు మళ్ళీ మూడబోతున్నది. ఎవరికి ఎలా మూడుతుందో కాలం నిర్ణయిస్తుంది. అసలు సినిమా రేపట్నించీ మొదలౌతుంది. అమెరికా, రష్యా, అరబ్ దేశాలకు, ముఖ్యంగా ఇండియాకు ఇక గడ్డుకాలమే.
ఇంకొక తీవ్రవాద యుగం ఇవాల్టినుంచీ మొదలౌతున్నది. యుద్ధం అయిపోలేదు. అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. అది మనతోనే. ఈ పరిస్థితిని ఇండియాకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలన్నది భారతప్రభుత్వం ముందున్న అతిపెద్ద సమస్య.
అసలీ ఆఫ్ఘనిస్తాన్ గొడవేంటి? చూద్దాం.
చరిత్ర
అతిప్రాచీనకాలం నుంచీ, చాలాకాలం పాటు, ఆఫ్ఘనిస్తాన్ ఇండియాలో భాగంగా ఉండేది. లేదా మనతో దానికి సంబంధాలుండేవి. క్రీ పూ 3000 ప్రాంతంలో మహాభారతం జరిగింది. ధృతరాష్ట్ర మహారాజు భార్య గాంధారి ఆఫ్ఘన్ వనితే. ఆమె, నేటి కాందహార్ (గాంధార దేశపు) వనిత. మహాభారత యుద్ధానికి కారకుడైన శకుని ఆఫ్ఘనిస్తాన్ వాడే. గాంధారితో బాటు హస్తినాపురం (నేటి ఢిల్లీ) కి వచ్చి ఇక్కడ చిచ్చు పెట్టాడు. అంటే, లక్షలాది మంది చనిపోయిన భారతయుద్ధం కూడా ఆఫ్ఘన్ల వల్లే జరిగింది. ఇక్కడికొచ్చి, ఇక్కడ రాజులమధ్యన చిచ్చు పెట్టి అంత యుద్ధానికి 5000 ఏళ్ల నాడే వాళ్ళు కారకులయ్యారు.
అంతకంటే ముందు, అంటే, క్రీ. పూ 6000 ప్రాంతంలో జరిగిన రామాయణంలో చూస్తే, అది శ్రీరాముని కుమారుడైన లవుడు పరిపాలించిన ప్రాంతం. ఆయన పేరుమీద లవహోర్ (నేటి లాహోర్) పుట్టింది. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా దశరధుని ఏలుబడిలోనే ఉండేది.
మొదట్లో అక్కడంతా జొరాష్ట్రర్ మతం ఉండేది. అగ్ని ఆరాధన ఉండేది. వైదిక సంస్కృతి ఉండేది. తరువాత బౌద్ధం అక్కడ వ్యాపించింది. తాలిబాన్లు నాశనం చేయకముందు, బమియాన్ లో ఉన్న నిలువెత్తు బుద్ధవిగ్రహమూ, మనకు స్వాతంత్య్రం రాకముందు పాకిస్తాన్లో ఉన్న అనేక హిందూ దేవాలయాలూ దీనికి నిదర్శనాలు. అది క్రమేణా క్షీణించింది. అప్పుడు రాక్షస ఇస్లాం వచ్చి హింసకు పరాకాష్ట అయిన వారి రకం ఏకేశ్వరారాధనను తెచ్చింది. అది వారి పబ్బం గడుపుకోవడానికి పెట్టుకున్న మతమే గాని, అందులో ఉన్నతమైన మానవత్వపు భావాలేమీ లేవు. ఇప్పుడీ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒప్పుకుంటున్నారు. ఇస్లాం అనేది ప్రపంచంలో అందరూ అసహ్యించుకునే మతంగా మారింది.
సరే, ఇస్లాం వచ్చాక ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో పరిస్థితి వేగంగా మారిపోయింది. ఖురాన్ ఇచ్చిన ఆసరాతో, యుద్ధమూకలు విజృంభించి, దారుణాలు, దౌర్జన్యాలు, రేపులు, ప్రాంతాలను దేశాలను ఆక్రమించుకోవడాలు మొదలుపెట్టాయి. ఇంకోవిధంగా చెప్పాలంటే, తమ రాజ్యకాంక్షకు, దురాక్రమణలకు, ఇస్లాంను, ఖురాన్ను, ఒక ఆసరాగా, ఒక సాకుగా వాడుకున్నారని చెప్పాలి. ఈ మధ్యలో రకరకాల రాజులు ఇక్కడ పరిపాలించారు. కానీ, ఆఫ్ఘనిస్తాన్ అనేది ఎప్పుడూ కూడా, రకరకాల యుద్ధతెగల యుద్ధరంగమే. అక్కడ నిత్యయుద్ధమే ఎప్పుడూ జరుగుతూ వచ్చింది. అందుకే, ఆఫ్ఘనిస్తాన్ ను, 'రాజ్యాల స్మశానం' అని అంటారు. అనేక రాజ్యాలు అక్కడ తలలెత్తి నశించిపోయాయి. ప్రతి తరంలోనూ ఒక క్రొత్త రాజు, క్రొత్త వ్యవస్థ రావడం, కుట్రలు కుతంత్రాలు జరగడం, మారణహోమం, యుద్ధం, నాశనం - ఇవే అక్కడ గత 5000 ఏళ్లుగా జరుగుతున్నవి.
ఇండియా శాపం
మహమ్మద్ ఘోరీ, ఘజనీలు ఇండియా మీద దండెత్తి, సోమనాధ్ ఆలయాన్ని అన్నిసార్లు ధ్వంసం చేసి, ప్రజల మీద నానా ఘోరాలూ చేసి, దోచుకుని ఆ సంపదనంతా ఆఫ్ఘనిస్తాన్ కు, ఇరాన్ కు తీసుకుపోయారు. ఒకసారి దండయాత్ర చేస్తే, ఆ డబ్బుతో, వారి రాజ్యంలో మూడేళ్లపాటు పనులన్నీ రద్దు చేసేవారట. అంత దోపిడీసొమ్ము ఒక్క దండయాత్రలో వారికి లభించేది. మన రాజులేమో, ఐకమత్యం లేకుండా, విలాసాలకు అలవాటు పడి, గొప్పలకు పోయి, సరిహద్దులను పట్టించుకోకుండా, ఘోరీ గజనీల చేతా, ముఘల్స్ చేతా, తుక్కు రేగ్గొట్టించుకున్నారు.
అన్నిసార్లు శివాలయాలను ధ్వంసం చేసి, సోమనాధ శివలింగాన్ని బూటుకాళ్లతో తన్ని, పలుగులతో పగులగొట్టిన పాపమే, ఇన్ని వందల ఏళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ పాలిట శాపమైంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ ఎప్పటికీ బాగుపడదు. పాకిస్తాన్ ఎప్పటికీ బాగుపడదు. ఎప్పటికైనా, ఈ రెండు దేశాలూ సర్వనాశనం కావాల్సిందే. అవుతాయి కూడా. అందుకే ఈ పోకడలు కనిపిస్తున్నాయి. చివరకు వాళ్లలో వాళ్ళే కొట్టుకు చస్తారు. కానీ ఈ మధ్యలో మిగతా వాళ్ళని కూడా లాగుతారు. అదే అసలు సమస్య.
అయితే, ప్రస్తుత ఆఫ్గాన్స్ లో చాలామందికి వారి పూర్వీకులు నార్త్ ఇండియా నుంచి వచ్చిన హిందువులేనన్న విషయం తెలుసు. వారి తాతముత్తాతలను మెడమీద కత్తిపెట్టి ఇస్లాంమతంలోకి మార్చారు. మన ఇండియా నల్ల ముస్లిమ్స్ లాగా, వాళ్ళు ఒకప్పుడు హిందువులే. ఆ విషయం వాళ్లకూ తెలుసు, అందుకే వాళ్ళు ఇండియా అంటే ఎంతో ప్రేమగా ఉంటారు. తాలీబన్స్ మాత్రమే ఇండియాను ద్వేషిస్తారు. కారణం? వాళ్ళకు పాకిస్తానీ పందుల సపోర్ట్ ఉంది గనుక.
నేటి మారణహోమాలకి రష్యా అమెరికాలే కారకులు
ఈ విధంగా సోవియెట్ విప్లవం వరకూ చరిత్ర నడిచింది. 1919 తర్వాత సోవియెట్ బలపడి పక్కదేశాలపైన ఆధిపత్యం మొదలుపెట్టింది. అప్పటికే మన దేశాన్ని బ్రిటన్ ఆక్రమించింది. సరిహద్దు గీతను డురాండ్ అనే సివిల్ సర్వెంట్ చేత గీయించింది. అది డురాండ్ లైన్ అయింది. తర్వాత, మనకు స్వతంత్రం వచ్చి పాకిస్తాన్ ఏర్పడింది. అప్పుడు దురాండ్ లైన్, ఆఫ్గనిస్తాన్ కూ పాకిసాన్ కూ సరిహద్దయింది.
ఆఫ్ఘనిస్తాన్ రష్యా అదుపులో ఉందని, పాకిస్తాన్ కు ఆయుధాలమ్మడం మొదలు పెట్టింది అమెరికా. ఇక ఆఫ్ఘన్ పాకిస్తాన్ గొడవలు మొదలయ్యాయి. రక్షణకోసం ఆఫ్ఘనిస్తాన్, ఇండియాకు రష్యాకు దగ్గరైంది. 1962 చైనా యుద్ధంలో ఇండియా ఓడిపోయింది. అప్పుడు చైనా, పాకిస్తాన్ దగ్గరయ్యాయి. అమెరికానేమో, ఇరాన్ నూ, పాకిస్తాన్ నూ సపోర్ట్ చేసేది.
1933 నుండి 1973 వరకూ నాదిర్షా కొడుకైన జహీర్షా అనేవాడు ఆఫ్ఘనిస్తాన్ ను రాజుగా పరిపాలించాడు. ఆ తరువాత, దావూద్ ఖాన్ అనేవాడు ప్రజాస్వామ్య నినాదంతో కుట్రచేసి రష్యా సపోర్ట్ తో అధికారంలోకి వచ్చాడు. ఆ పార్టీకి, విప్లవ తెగల మూకలకు (అప్పట్లో వీటిని ముజాహిదీన్ల అనేవారు) జరిగిన గొడవలలో, 1978 లో జరిగిన ఏప్రియల్ విప్లవంలో, దావూద్ చంపబడ్డాడు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పుట్టింది. ఈ గొడవలన్నింటిలో, అమెరికా, పాకిస్తాన్, చైనా కలసిమెలసి అప్పటి తాలిబాన్లకు బాగా సాయం చేశాయి. ఆఫ్ఘనిస్తాన్ రేప్ కు గురైంది.
రష్యా డబ్బులు ఆఫ్ఘనిస్తాన్ దగ్గరుండేవి. అమెరికా డాలర్లు పాకిస్తాన్ దగ్గరుండేవి. ఈ రెండు దేశాలూ ఒకదానిలో మరొకటి కుట్రలు కుతంత్రాలు, విప్లవాలను రేకెత్తించడాలు చేస్తూ ఉండేవి. ఈ మోసపు కుట్రలలో పాకిస్తాన్ పైచేయి సాధించింది. మంచిగా నటిస్తూనే వెన్నుపోటు పొడవటం ఇస్లామిక్ దేశాలకు వెన్నతో పెట్టిన విద్య. ఇండియాలో కూడా ముఘల్ సామ్రాజ్యం అలాగే ఎదిగింది. సరే అది వేరే విషయం.
ఈ విధంగా తెగల మధ్యన యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. మనుషులు చస్తూనే ఉండేవారు, రేపులు, లూటీలు జరుగుతూనే ఉండేవి. వీటికి యధావిధిగా పాకిస్తాన్, రష్యా, చైనా, అమెరికా ఆజ్యం పోస్తూనే ఉండేవి. ఈలోపల, 'ఇదంతా కాదు, ఇస్లాం రాజ్యం వస్తేనే మళ్ళీ అంతా బాగుపడుతుంది. అప్పుడే మళ్ళీ మనం చీకటి యుగాలలోకి పోయి హాయిగా అడివిమనుషులలాగా ఉండగలం' అంటూ తుపాకీలతో అమాయక జనాలను భయపెట్టిన తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ లో బలపడటం మొదలుపెట్టారు. దానికి అమెరికా సపోర్ట్ చేసింది.
ఆ విధంగా హింసతో, ధ్వంసంతో, 1997 లో తాలిబాన్లు విజయం సాధించి వాళ్ళ పాలన మొదలుపెట్టారు. 2001 కూ వారి పాలన సాగింది. పాముకు పాలుపోస్తే ఏమౌతుంది? పోసినవాడినే కాటేస్తుంది. అదే అమెరికాకూ జరిగింది. తాము సహాయం చేసిన తాలిబాన్ సపోర్ట్ తో పుట్టిన లాడెన్, అమెరికా ట్విన్ టవర్స్ ని కూల్చేశాడు. దిక్కుతోచని అమెరికా రంగంలోకి దిగి, ఆఫ్ఘనిస్తాన్ లో తన సైన్యాన్ని దించింది. ఆ సపోర్ట్ తో, 20 ఏళ్ళు సాగిన శాంతియుత పరిపాలన, ఇప్పుడు ముగిసింది. మళ్ళీ తాలిబాన్లు అధికారం లోని వచ్చారు. ఆఫ్గనిస్తాన్ లో చీకటి యుగం మొదలైంది. ప్రపంచానికి, ముఖ్యంగా ఇండియాకు, మళ్ళీ ప్రమాదం మొదలైంది.
తాలిబాన్లకు డబ్బులెక్కడినుంచి వస్తున్నాయి?
ఒక ప్రభుత్వంతో 20 ఏళ్లపాటు యుద్ధం చెయ్యాలంటే సామాన్యమైన విషయం కాదు. ఎన్నో ఆయుధాలు కావాలి, డబ్బు ఫండింగ్ ఉండాలి, వాహనాలు, కమ్యూనికేషన్లు, నెట్ వర్క్ ఇదంతా సమకూర్చుకుని 20 ఏళ్ళు నడపాలంటే ఊహించనంత ఖర్చువుతుంది. పెద్ద ఎత్తున ఎవరో డబ్బు సహాయం చెయ్యకపోతే తాలిబానే కాదు ఎవ్వరూ దీనిని చేయలేరు. మరి ఇంత డబ్బు తాలిబాన్లకు ఎక్కడనుంచి వస్తోంది?
నల్లమందు వ్యాపారం వీరి మొదటి మార్గం. పాపీ సీడ్స్ పండించి వాటిని దేశదేశాలకు ఎగుమతి చేసి ఆ డబ్బుతో ఆయుధాలు కొంటారు. ఇది నీతిగల పనేనా? ఇదేనా ఇస్లాం? ఇలాంటి దొంగవ్యాపారాలు చెయ్యమని మహమ్మద్ చెప్పాడా?
గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న విరాళాలు ఇంకో మార్గం. సౌదీ అరేబియా, ఇరాన్ లు తాలిబాన్ లకు పెద్దఎత్తున డబ్బులిస్తాయి. దేనికి? మనుషులని చంపమని. ఇది తప్పు కాదా? ఇస్లాం ఇలాంటి పనులు చెయ్యమని చెప్పిందా?
తమ ఏలుబడిలో ఉన్న ప్రాంతాలలో పన్నుల వసూలు, ఇంకొక మార్గం. ప్రతిదానిమీదా ఘోరంగా పన్నులేసి ప్రజలను నానా హింసా పెట్టి డబ్బులు వసూలు చేస్తారు తాలిబాన్లు. ఇది తప్పు కాదా? ఇదేనా ఇస్లాం చెప్పింది?
పాకిస్తాన్ సపోర్ట్ చాలా ముఖ్యమైన మార్గం. పాకిస్తానే ఒక బెగ్గర్ కంట్రీ. దానిదగ్గర డబ్బులెక్కడివి మరి? స్మగ్లింగ్, డ్రగ్స్, చైనా దగ్గర కొట్టేసిన డబ్బులు, మొన్నటిదాకా అమెరికా దగ్గర కొట్టేసిన డబ్బులు - వీటితో తాలిబన్లను 20 ఏళ్లపాటు పోషించింది పాకిస్తాన్. మరి ఇలాంటి పనులు చెయ్యమని ఖురాన్ చెప్పిందా?
ఇలాంటి అనైతిక పనులు చేసి, మళ్ళీ జనానికి మాత్రం, ఖురాన్ నీతులు చెబుతారు వీళ్ళు. ఇది సరైన పనేనా? పైనుంచి క్రిందిదాకా రక్తంతో తడిసి, బురదతో నిండి ఉన్న వీళ్ళు, శాంతిరాజ్యం స్థాపిస్తారట. వినడానికి ఎంత గొప్పగా ఉందో? అది నిజంగా శాంతి రాజ్యమే అయితే, ఇస్లాం అంటే నిజంగా శాంతే అయితే, వేలాదిమంది ఆఫ్ఘన్ ముస్లిమ్స్ ఎందుకు దేశాన్ని వదలి కట్టుబట్టలతో పారిపోతున్నారు? మమ్మల్ని చంపినా పరవాలేదు గాని, ఈ దేశంలో మేముండం అని ఆఫ్ఘన్ ఆడవాళ్ళు ఎందుకు అరుస్తున్నారు? వాళ్ళు ముస్లిమ్స్ కారా? ఒక్క పాకిస్తాన్ కూ, తాలిబాన్ కూ మాత్రమే ఖురాన్ తెలుసా? మిగిలినవాళ్లకు తెలీదా? అసలు ఖురాన్నే అందరూ ఎందుకు పాటించాలి? అంతకు ముందూ తర్వాతా గ్రంధాలు లేవా? వాటిల్లో ఇంతకంటే మంచి విషయాలు లేవా? ఇస్లాం కి ముందూ తర్వాతా దేవుడు నిద్రపోతున్నాడా?
ఆఫ్ఘనిస్తాన్ వల్ల అమెరికాకు ఎంత నష్టం జరిగింది?
గత ఇరవై ఏళ్లలో, జరిగిన నష్టం ఇది.
- మరణించిన ఆఫ్ఘన్ సైనికులు - 69,000
- మరణించిన ఆఫ్ఘన్ పౌరులు - 51,000
- మరణించిన తాలిబాన్లు - 51,000
- మరణించిన అమెరికా సైనికులు - 2500
- మరణించిన అమెరికా కాంట్రాక్టర్లు - 3800
- గాయపడిన అమెరికా సైనికులు - 20,000
- మరణించిన పారామెడిక్స్ - 450
- మరణించిన జర్నలిస్టులు - 72
- అమెరికాకు అయిన ఖర్చు - 2 ట్రిలియన్ డాలర్లు, అంటే, 2 లక్షల కోట్ల డాలర్లు. వడ్డీతో కలిపి ఇది 2050 కల్లా 6. 5 లక్షల కోట్ల డాలర్లు అవుతుందట. అంటే, 390 లక్షల కోట్ల రూపాయలన్నమాట. ఈ డబ్బంతా ఏమైంది? తాలిబాన్ చేతుల్లోకి చేరింది. ఆయుధాలుగా మారింది. ఇప్పుడీ డబ్బంతా ఎవరు కట్టాలి? ఈ అప్పు ఎవరు తీర్చాలి? అమెరికా పౌరులు, అమరికాలో పనిచేస్తూ టాక్స్ కడుతున్న 27 లక్షలమంది ఇండియన్లు, 25 లక్షలమంది చైనావాళ్లు, వీళ్లంతా ఈ అప్పును తీరుస్తున్నారు. అంటే, అక్కడ ఉద్యోగాలు చేస్తున్న మనవాళ్లే, మన పిల్లలే ఈ యుద్ధానికి పరోక్షంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. తాలిబాన్ చేతిలో ఉన్న ప్రతి ఏకే - 47 లోనూ నీదీ నాదీ జీతం ఉంది. అర్థమైందా?
చైనా - పాకిస్తాన్ - తాలిబాన్ అనైతిక కూటమి
ఈ మూడు దేశాలూ ఇప్పుడు ఒక్కటయ్యాయి. ఇన్నాళ్లూ తాలిబాన్లకు వేరే పని లేదు, ఆఫ్ఘనిస్తాన్ లో కుట్రలు దౌర్జన్యాలు చేయడం తప్ప, ఇప్పుడు వాళ్లకు పని కావాలి, తప్పకుండా వాళ్ళను కాశ్మీర్ మీదకు ఉసిగొల్పుతుంది పాకిస్తాన్. దీనికి చైనా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇండియా చాలా గట్టిగా లేకపోతే మళ్ళీ కాశ్మీర్ అట్టుడికే ప్రమాదం ఉంది. అందుకే నేనంటాను, ఇంకో నూరేళ్లు మోడీగారే మనకు ప్రధానమంత్రిగా ఉండాలని. ఎందుకంటే, గాంధీ నెహ్రూలు అంటించి పోయిన మంటల్ని ఆర్పిన ఘనత బీజేపీదే కాబట్టి. ప్రపంచదేశాలలో మన దేశం తలెత్తుకుని నిలబడేలా చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఆయనే కాబట్టి. కాశ్మీర్ మాదే అని ధైర్యంగా గర్జించిన సింహం ఆయనే కాబట్టి, మోడీగారే మనకు ఇంకా నూరేళ్ళపాటు ప్రధానమంత్రిగా ఉండాలి.
అణ్వస్త్రాలు తాలిబాన్ చేతుల్లోకి వస్తే?
ఊరకే భుజానికి ఒక తుపాకీ ఉన్నంతమాత్రాన, తాలిబాన్ ఒకడు నిన్న ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు 'ఆఫ్ఘనిస్తాన్ లో అడుగుపెడితే మీకు మంచిది కాదు' అంటూ. కొన్నాళ్ళకు చైనా, పాకిస్తాన్ రూట్లో వాళ్లకు అణ్వస్త్రాలు సమకూడితే? ఏమౌతుంది? ఒక్కసారి ఊహించండి. ఎంత విధ్వంసం జరుగుతుంది? ఎంత మారణహోమం జరుగుతుంది? ఎటుపోతోంది మానవజాతి? దీనికంతా కారణం పాకిస్తాన్ కాదా మరి?
ఇండియన్ ముస్లిమ్స్
వీళ్ళు పాకిస్తాన్ కు వంతపాడటం మానుకోవాలి. మీ మాతృభూమి ఇండియా అన్నది మర్చిపోకండి. పాకీదేశం మీ దేశం కాదు. ఇక్కడి తిండి తింటూ, ఇక్కడి గాలి పీలుస్తూ, ఇక్కడి నీళ్లు త్రాగుతున్న మీరు, ఈ దేశం పట్ల భక్తితో ఉండాలి. ఇస్లాం పిచ్చిలోనుంచి బయటపడండి. మానవత్వంతో ఆలోచించడం నేర్చుకోండి. ప్రపంచంలో అందరూ ఇప్పుడు ఇస్లాం ను అసహ్యించుకుంటున్నారు. ఎందుకు? మీరు చేస్తున్న పనులవల్లనే. ఇస్లామంటే శాంతి అని నోటితో చెప్పడం కాదు, మీ చేతల్లో అది కనిపించాలి. అప్పుడే లోకం మిమ్మల్ని నమ్ముతుంది. లేకుంటే కష్టం. మానవతా వాదులుగా ముద్రపడతారో, హింసావాదులుగా ముద్రపడతారో మీ ఇష్టం.
పులిమీద స్వారీ
తాలిబాన్ విజయం చూచి పాకిస్తాన్ గర్వపడుతూ ఉండవచ్చు. కానీ ఇది పులిమీది స్వారీ అని ముందు ముందు తెలుస్తుంది. పాకిస్తాన్ పతనం తాలిబాన్ లాంటి మూకల చేతిలోనే ఉంది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళు పడటం చరిత్ర చెబుతున్న సత్యం. అంతేకాదు, తాలిబాన్ వల్ల చైనాకు కూడా ముప్పే. ఆఫ్ఘనిస్తాన్నీ, పాకిస్తాన్ నీ, ఆక్రమించడానికి చైనా చూస్తోంది. వాడుకున్నంత కాలం వాడుకుని, చివర్లో చైనాలో ఇస్లాం పిచ్చిని రెచ్చగొట్టి, చైనాను ముంచుదామని ఈ రెండూ చూస్తున్నాయి. చివరకు ఇదెటు పోతుందో చెప్పడం కష్టం.
వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు
ఏదేమైనా, నిన్నటినుంచీ ప్రపంచ రాజకీయ సమీకరణాలు మళ్ళీ మారాయని చెప్పక తప్పదు. అన్ని దేశాలూ తమతమ ఫారిన్ పాలసీని సమీక్షించుకోవలసిన తరుణం వచ్చేసింది. అగ్రరాజ్యాలు చిత్తశుద్ధితో పనిచేయకపోతే, ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్- చైనాలనే క్రొత్త ప్రపంచ విలన్ల వల్ల మూడో ప్రపంచయుద్ధం వచ్చినా రావచ్చు. అప్పుడు, ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితే ముందు ముందు ఎన్నో దేశాలలో రావచ్చు.
ఇలా జరుగకుండా ఉండాలంటే, ముందుగా పాకిస్తాన్ ను "రోగ్ నేషన్" గా ముద్రించాలి. సరైన చర్యలు తీసుకోవాలి. ఆ దేశానికి ధనసహాయం చెయ్యడం వెంటనే ఆపాలి. అందరూ కలసి ఆ దేశాన్ని బహిష్కరించాలి. లేకుంటే ముందుముందు మానవజాతికి వినాశనం తప్పదు.
14, ఆగస్టు 2021, శనివారం
'ఇతనెలా చనిపోయాడు?' - ప్రశ్నశాస్త్రం
ఈరోజు ఉదయం ఏడున్నరకి, స్నేహితుడొకాయన ఫోన్ చేశాడు. అతని గొంతులో ఆదుర్దా ధ్వనించింది.
'ఒక ముఖ్యమైన విషయం పైన నీ సహాయం కావాలి' అన్నాడు.
'చెప్పు' అన్నా ఇదేదో జ్యోతిష్యప్రశ్నే అయి ఉంటుందని ఊహిస్తూ.
నేనూహించినదాన్ని నిజం చేస్తూ తనిలా అడిగాడు, 'మా ఫ్రెండ్ బాబాయొకాయన నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. ఎందుకు చనిపోయాడో మాకు తెలియాలి. కాస్త ప్రశ్న చూచి చెప్పు'
నేను నవ్వుతూ, 'ఎవరైనా ఎందుకు పోతారు. కాలం తీరితే తప్ప. ఆయనా అందుకే పోయాడు. దీనికి ప్రశ్న చూడటం అవసరమా?' అన్నాను.
'బాబ్బాబు. అదికాదు. ఇది చాలా ముఖ్యం. వాళ్ళ ఫెమిలీకి మా ఫెమిలీకి కూడా' అన్నాడు బ్రతిమాలుతూ.
సరే ఇంతగా బ్రతిమాలుతున్నాడు కదా చూద్దాంలే అనుకుని, ప్రశ్న చక్రం వేసి చూచాను.
'ఇంటిదగ్గర కాకుండా దూరప్రాంతంలో ఇతను చనిపోయాడు', అన్నా చార్ట్ చూస్తూనే.
'నిజమే' అన్నాడు.
'ఇతనొక యాక్సిడెంట్ లో పోయాడు' అన్నా.
'అవును' అన్నాడు.
'చనిపోయిన సమయంలో ఇతను త్రాగి ఉన్నాడు' అన్నా.
'అవును' అన్నాడు.
'ఆ సమయంలో అతను తన అఫీషియల్ పనిమీద ఎక్కడికో పోతున్నాడు' అన్నాను.
'అవును' అన్నాడు.
'వీళ్ళ కుటుంబంలో ఒక అక్రమసంబంధపు గొడవ ఉంది' అన్నాను.
'అదేగా ఇప్పుడు గోల. అందుకే నిన్నీ ప్రశ్న అడగడం' అన్నాడు.
'ఇతనికి చెడు స్నేహాలున్నాయి. వాళ్ళే ఇతని చావుకు కారణమయ్యారు' అన్నాను.
'అదే మేమూ అనుమానిస్తున్నాం. కానీ ప్రూవ్ చేయలేము' అన్నాడు.
'వాళ్ళతన్ని తెలివిగా త్రాగించి, ఈ యాక్సిడెంట్ లో ఇరికించారు. తరువాత తప్పుకున్నారు. నిరూపించడం మీ వల్లకాదు' అన్నాను.
'కావచ్చు' అన్నాడు.
'ఇతను చాలా మూర్ఖుడు. ఎవరు చెప్పినా వినే రకం కాదు. బాగుపడటానికి ఎన్ని అవకాశాలొచ్చినా కాలదన్నుకొని చివరకు ఇలా చనిపోయాడు' అన్నాను.
'నిజమే. మహా మొండి మనిషి' అని ఒప్పుకున్నాడు.
నువ్వడగక పోయినా ఇంకో విషయం చెబుతా విను. వీళ్ళ వంశంలో భయంకరమైన గురుదోషం ఉన్నది. వీళ్ళ పూర్వీకులొక గుడిని కట్టించి దాని ఆలనా పాలనా చూడకుండా వదిలేశారు. ఆ శాపం వీళ్ళను వెంటాడుతున్నది. అందుకనే వీళ్ళు ధర్మభ్రష్టులుగా జీవితాలను గడుపుతూ, చివరకు అర్ధాంతరంగా చస్తుంటారు' అన్నాను.
అవును. వీళ్ళ పేమిలీలో అన్నీ అలాంటి చావులే. వీళ్ళ తాతలెప్పుడో శివాలయం కట్టించి తరువాత ఆ ఊరొదిలేశారు. ఇప్పుడది పాడుపడిపోయిన స్థితిలో ఉంది. వీళ్ళ బ్రదర్ కూడా సూయిసైడ్ చేసుకుని చనిపోయాడు. అందుకే అడుగుతున్నాము. ఇది కూడా అలాంటి కేసేనా అని' అన్నాడు.
'ఇది సూయిసైడ్ కాదు. హత్య, తెలివిగా చెయ్యబడిన హత్య. ఇతనికి అక్రమసంబంధాలున్నాయి. చెడుస్నేహాలున్నాయి. త్రాగుడు అలవాటుంది. స్నేహితులే ఇతని చావుకు కారకులు. చెప్పా కదా, మీరు ప్రూవ్ చెయ్యలేరు' అన్నాను.
'చివరగా మరో ప్రశ్న. ఇవన్నీ ఎలా చెప్పావు?' అడిగాడు.
'ఎలా చెప్పగలననుకొని అడిగావో అలాగే చెప్పా' అన్నాను.
'మరిప్పుడేం చెయ్యాలి? రెమెడీస్ ఏమైనా ఉన్నాయా?' అడిగాడు.
'అవి నీకెందుకు? రెమెడీస్ చెయ్యడం నీపని కాదు. అతనికి సంతానం ఉందా?' అడిగాను.
'ఉన్నారు. ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు' అన్నాడు.
'ఆ అబ్బాయిని వచ్చి నన్ను కలవమని చెప్పు. అతన్ని పరిశీలించి, అతను మంచివాడనుకుంటే, చెయ్యగలడనుకుంటే, అతనికి చెబుతాను. నీకు చెప్పను. ఆ అబ్బాయి కూడా అంత తేలికగా నన్ను కలవలేడు. ఎన్నో ఆటంకాలొస్తాయి. దాటి రావాలి. వచ్చినప్పుడు చూద్దాం' అన్నాను.
'సరే ఉంటా. థ్యాంక్స్' అంటూ ప్రెండ్ ఫోన్ పెట్టేశాడు.
అదీ సంగతి. ఎప్పుడో జరిగిన సంఘటనల గురించి కూడా ఈ విధంగా ప్రశ్నశాస్త్రాన్ని ఉపయోగించి తెలుసుకోవచ్చన్నమాట !
13, ఆగస్టు 2021, శుక్రవారం
బ్రిటిష్ యువరాజు ఆండ్రూ పై రేప్ కేసు
గ్రహప్రభావం లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకూ ఎవరినీ వదలడం లేదు.
ఆంధ్రా ఎమ్మెల్యే ఒకాయనపైన ఒక వివాదాస్పద ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో తిరుగుతోంది. మసాజ్ చెయ్యడానికి ఒకమ్మాయిని పంపమంటూ అడగడం, ఇతర సంభాషణ దాంట్లో ఉంటుంది. దానికాయన 'ఇదంతా నా ప్రత్యర్దుల కుట్ర. ఆ గొంతు నాదికాదు. వాళ్ళమీద కేసులు పెడతాను' అంటూ వివరణ కూడా ఇచ్చుకున్నాడు. లోకల్ లీడర్స్ పైన గ్రహప్రభావం ఇలా ఉంటే, అంతర్జాతీయ ప్రముఖులపైన ఇంకెలా ఉందొ చూద్దాం.
బ్రిటిష్ యువరాజు ఆండ్రూ, 20 ఏళ్ళక్రితం తనకు 17 ఏళ్ళున్న సమయంలో తనను రేప్ చేశాడని, తనకు న్యాయం కావాలని, వర్జీనియా గిఫ్రీ అనే ఒక 38 ఏళ్ల అమెరికన్ వనిత న్యూయార్క్ కోర్టులో ఇప్పుడు కేసేసింది. ఇది గ్రహప్రభావం కాకపోతే మరేమిటి?
అప్పట్లో, ఎస్టీన్ అనే ఒక మహానుభావుడు ఇలా టీనేజీ అమ్మాయిలను చాలామందిని ట్రాప్ చేసి, సెలెబ్రెటీలకు వాళ్ళను సప్లై చేసేవాడట. అతనికి ఒక ప్రయివేట్ ద్వీపమే ఉండేది అప్పట్లో. అనేక అలాంటి సెక్సువల్ నేరాలమీద, రెండేళ్ల క్రితం ఇతన్ని అరెస్ట్ చేసి మన్ హాటన్ జైల్లో పెట్టారు. అందులో ఉన్నపుడే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
రెండో ఎలిజబెత్ రాణి రెండో కొడుకైన ప్రిన్స్ ఆండ్రూకు ఇప్పుడు 61 ఏళ్ళు. ఆయన యధావిధిగా 'ఎస్టీన్ ఎవరు? అలాంటి వ్యక్తిని కలుసుకున్న గుర్తే నాకు లేదు. ఈ అమ్మాయెవరో నాకేమీ తెలీదు' అంటున్నాడు. కానీ కేసును ఎదుర్కోవాల్సిందే.
ఏదేమైనా, బ్రిటిష్ రాయల్ పేమిలీ పరువుకు ఇది చాలా నష్టం కలిగించే విషయమే. 20 ఏళ్ల క్రితం ఎప్పుడో జరిగిన చీకటిభాగోతం తీరికగా ఇప్పుడు బయటపడటం, నేను చెబుతున్న గ్రహస్థితికి నిదర్శనమా కాదా మరి?
సామాన్యుడైనా, సెలబ్రిటీ అయినా మనిషి మనిషేగా. సామాన్యుడు పచ్చడి మెతుకులు తింటే, సంపన్నుడు యాభై డిషెస్ తో తినవచ్చు. కానీ ఆకలి ఇద్దరికీ ఒకటే. సామాన్యుడికి కేసులుండవు. సంపన్నుడికి అనేక కేసులుంటాయి. అంతే తేడా. అవి నిజాలో కాదో కాలం నిర్ణయిస్తుంది.
ఏమంటారు?
12, ఆగస్టు 2021, గురువారం
GSLV F-10 రాకెట్ ఫెయిల్ - జ్యోతిష్య కారణాలు
ఏ ముహూర్తానికైనా సూర్యోదయ లగ్నం మంచిది కాదు. దానిని సూర్యలగ్నదోషమంటారు. సూర్యుడు లగ్నంలో ఉండటం వల్ల ఆ లగ్నం దగ్ధమైపోతుంది. అంటే కాలిపోతుంది. ఈ ముహూర్తానికి లగ్నము సూర్యుడూ చాలా దగ్గరగా ఉన్నారు. కనుక, రాకెట్ ప్రయోగానికి ఇది మంచి సమయం కాదు.
ఈ రాకెట్ ఆకాశంలో చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది. నవమస్థానాధిపతి అయిన గురువు అష్టమంలో ఉంటూ, అక్కడనుంచి వక్రించి సప్తమమకరంలోకి వచ్చినట్లు అవుతాడు. అది ఆయనకు నీచస్థితి. అక్కడనుంచి ఆయన దృష్టి సూటిగా కర్కాటక లగ్నాన్ని చూస్తుంది. కనుక దూరప్రయాణం ఫెయిల్ అవుతుందన్న సూచన ఈ ముహూర్తంలో ఉంది.
విమానాలకు రాకెట్లకు కారకగ్రహం శుక్రుడు. ఈ శుక్రుడు ఇప్పుడే, సింహాన్ని వీడి, కన్య సున్నా డిగ్రీలలోకి అడుగుపెడుతూ నీచస్థితిలో చాలా బలహీనంగా ఉన్నాడు. కనుక రాకెట్ ప్రయోగానికి ఇది మంచి సమయం కాదు.
ఈ సమయంలో ఉన్న, అన్నింటినీ మించిన చెడు గ్రహయోగం ఏమిటో చెబుతా వినండి.
యమగ్రహం అనబడే ప్లూటో మకరం సున్నా డిగ్రీలలో ఉంటూ శుక్రుడితో ఖచ్చితమైన కోణదృష్టిని కలిగి ఉన్నాడు. యముడంటే నాశనమే కదా? పైగా ప్లూటో, సౌరమండలంలో అత్యంత బయటగా కటికచీకటిలో ఉన్న గ్రహం. అది యమలోకమే. అక్కడ మైనస్ 240 సెంటీగ్రేడ్ డిగ్రీల చలి ఉంటుంది. కనుక అది స్వతహాగా క్రయోజెనిక్ స్థితిలో ఉన్న గ్రహమే. ఈ యమగ్రహం దృష్టి, రాకెట్లకు కారకుడైన నీచ బలహీన శుక్రునిమీద ఉన్నపుడు, క్రయోజెనిక్ ఇంజన్ స్టేజి ఫెయిల్ అవక ఇంకేం జరుగుతుంది? ఖచ్చితంగా అదే జరిగింది చూడండి మరి !
పైగా, అష్టమాధిపతిగా నాశనాన్ని సూచిస్తున్న శనియొక్క దశమ దృష్టి శుక్రునిమీద ఉంది. ఇది ప్లూటో దృష్టికి ఆజ్యం పోస్తుంది.
ఇప్పుడు దశను చూద్దాం. ముహూర్తంలో దశ ఏంటని కొంతమంది కుహనా జ్యోతిష్కులు సందేహం లేవనెత్తవచ్చు. మీకు శాస్త్రం తెలీకపోతే నా దగ్గర నేర్చుకోండి. ఇదే వారికి నా సమాధానం.
పోతే, ఆ సమయానికి, రవి - శుక్ర - రవి - శని - శుక్రదశ జరుగుతున్నది. రవి శుక్రుల ప్రాముఖ్యత స్పష్టంగా కన్పిస్తున్నది. రవి ఏ విధంగా లగ్నాన్ని పాడుచేశాడో పైన చెప్పాను. శుక్రుడు ఏ విధంగా నీచ బలహీన స్థితిలో ఉన్నాడో, ఏ విధంగా యమగ్రహ దృష్టికి లోనయ్యాడో చెప్పాను. ఇక శని, ఆరింటిలోకి వచ్చి దశమదృష్టితో శుక్రుడిని చూస్తున్నాడు. మరి ఈ సమయంలో చేసిన పని విఫలమవక, ఎలా విజయవంతమౌతుందో చెప్పండి?
ఇప్పుడు సందేహాసుందరాలకు మరో సందేహం రావచ్చు. మరి గతంలో సక్సెస్ అయిన ప్రతి ప్రయోగమూ సక్సెస్ ఎందుకయింది? అపుడు కూడా వారు ముహూర్తం చూసుకుని లాంచ్ చెయ్యలేదు కదా? అని. వినండి.
ఆయా సమయాలలో, అనుకోకుండా వారికి మంచి ముహూర్తాలు కలసి వచ్చాయి. అదే కాలం కలసి రావడమంటే. ప్రస్తుతం అది ఎదురు తిరిగింది. అందుకే ఇలా జరిగింది.
ఎప్పుడైనా సరే, మనం చేసే పని ఒక్కదానివల్లనే మనం సక్సెస్ అవ్వం. దానికి దైవానుగ్రహం తోడైనప్పుడే ఆ సక్సెస్ మనకు అందుతుంది. సక్సెస్ వెనుక మన కృషి ఒక్కటే కాదు, ఇంకా చాలా కనిపించని అంశాలుంటాయి. అవన్నీ కలసివచ్చినపుడే సక్సెస్ అనేది చేతికి అందుతుంది. దానినే మనవాళ్ళు యోగం అనీ, విధి అనీ, దైవం అనీ అన్నారు. మరి ముహూర్తబలమంటే ఏమిటి? ముహూర్తబలమంటే మనకు చేతనైనంతలో మంచి సమయాన్ని ఎన్నుకోవడం మాత్రమే.
మనం సౌరమండలంలో ఉన్నాం. సౌరమండలంలోని గ్రహాలు మనమీద ప్రభావం చూపించవనడం, 'భూమ్యాకర్షణ శక్తి నామీద పనిచేయదు' అనడంలా ఉంటుంది.
11, ఆగస్టు 2021, బుధవారం
న్యూయార్క్ గవర్నర్ ని కూడా వదలని గ్రహాలు
చాలామంది ఇలా అనుకుంటుంటే చాలాసార్లు విన్నాను, 'గ్రహాలు లేవు గిహాలు లేవు అంతా ట్రాష్ రా, అవి మనలనేం చేస్తాయ్?'. అలా అన్నవాళ్ళే కొన్ని నెలల తర్వాతో, కొన్నేళ్ల తర్వాతో విధి కొట్టిన దెబ్బకు గింగిరాలు తిరిగి నేలకూలిపోయారు. ఇలాంటి వాళ్ళను నా జీవితంలోనే చాలామందిని చూచాను. ఒకప్పుడు విర్రవీగుతూ తిరిగినవాళ్ళు తర్వాత బికారిమొహాలు వేసుకుని తిరగడమూ చూచాను. అందుకే అంటారు - ఈరోజు అంతా బాగుందని గర్వం అహంకారం పనికిరాదని. ఎందుకంటే, రేపు మన చేతిలో లేదన్నది వాస్తవం. కాలందెబ్బకు మహారాజులే దిక్కూ దివాణమూ లేకుండా పోయారు మనమెంత?
మహారాజులంటే గుర్తొచ్చింది, న్యూయార్క్ గవర్నర్ యాండ్రూ కోమో రాజీనామా చేశాడు. ఎందుకూ అంటే, సెక్సువల్ హరాస్ మెంట్ అట. ఆయన గురవలేదు. గురిచేశాడట. ఇప్పటికి పదకొండు మంది తనక్రింద పనిచేసే అమ్మాయిల్ని ఇలా వేధించాడట. వాళ్లంతా ఊరుకున్నాళ్ళు ఊరుకుని, చివరకు తిరగబడి కంప్లెయింట్ చేశారు. ఈయన రాజీనామా చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడింది.
అమెరికాలో ఈయన చాలా పాపులర్ రాజకీయ నాయకుడు. 2011 నుంచి గవర్నర్ గా ఉన్నాడు. అందులోనూ ప్రస్తుతం న్యూయార్క్ కు. అలాంటివాడు చివరకిలాంటి అల్లరిపాలై రాజీనామా చేశాడు. యధావిధిగా ఆయనిలా అన్నాడు.
'నేనే తప్పూ చెయ్యలేదు. ఇదంతా కుట్ర. అందరితో సరదాగా ఉన్నాను, జోకులేసేవాణ్ని. అంతే. అదే నేరమైతే సరే కానివ్వండి. తప్పుకుంటాను. ప్రభుత్వం కొనసాగనీ'.
పనిచేసేచోట జోకులెయ్యడం కూడా తప్పైతే ఎలా మరి? కళ్ళెత్తి చూడకూడదు, నవ్వకూడదు, మాట్లాడకూడదు, జోకెయ్యకూడదు, మరమనిషిలాగా బిగుసుకుని ఉండాలి. పోనీ అలా ఉంటే కూడా కోపాలే. "నేనింత బాగా తయారై వస్తే కనీసం కన్నెత్తి చూడలేదు, కనీసం ఒక కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు" అంటారు. ఇస్తే నేరమౌతుంది. ఇవ్వకపోయినా నేరమే. ఇలాంటి చట్టాలతో ఎలా? పాపం పెద్దాయన్ని ఎలా దించేశారో చూడండి అన్యాయంగా !
ఇదంతా చూస్తుంటే నాకొక సామెత గుర్తొస్తోంది. ఈ సామెత నేను సృష్టించినదే. అదేంటో తెలుసా?
'దొరకని దొంగలందరూ కలసి, దొరికిన దొంగని 'దొంగ దొంగ' అన్నారట' ఎలా ఉంది నా సామెత? లేదా, కొంచం మార్చి కూడా చెప్పుకోవచ్చు. 'తెలివైన దొంగలందరూ కలసి, తెలివిలేని దొంగని 'దొంగ దొంగ' అన్నారట', ఇది కొంచం బెటర్ గా ఉంది కదా? పోన్లే ఏదో ఒకటి. మీకు నచ్చింది తీసుకోండి.
ఈ న్యూన్ చూస్తుంటే, పొద్దున్నే కర్ణపిశాచి చెవిలోజేరి ఇలా అంటోంది 'చూశావా కలికాలం? అమ్మాయిల్ని వేధించవచ్చునా అలా?'
నాకు నవ్వొచ్చింది.
'ఒసే పిశాచీ, మీ పిశాచాలకు అస్సలు తెలివి లేదే. నిరూపించావ్ మళ్ళీ ' అన్నాను.
అలిగింది.
మళ్ళీ ఎటుపోయి ఎటొస్తుందో అనుకుంటూ, 'బాబ్బాబు అలక్కు. నా ఉద్దేశ్యం ఏంటో చెబుతా విను' అంటూ ఇలా చెప్పా దానికి.
'అందరూ కలికాలం కలికాలం అంటారు, నువ్వుకూడా అదే అంటే ఎలా? కలికాలం ఇలా ఉండదు. కలికాలంలో అయితే, 11 మంది అబ్బాయిలను సెక్సువల్ గా వేధించిందని అమ్మాయి రాజీనామా చెయ్యాలి. అదీ కలికాలమంటే. అలాంటి కలికాలం ఇంకా రాలేదు. ముందు ముందొస్తుంది. అప్పటిదాకా ఆ డైలాగు అట్టేపెట్టుకో. మొన్న చూశావా, బిజీ ట్రాఫిక్ లో రోడ్డు దాటుతూ, తనది తప్పయినా, టాక్సీ డ్రైవర్ని 11 సార్లు కొట్టిన లక్నో అమ్మాయిలాగా అన్నమాట. అదీ కలికాలమంటే.
ఇదసలు కలికాలమూ కాదు, న్యూసూ కాదు. అందులోనూ అమెరికాలో. నేను చెప్పినదైతే న్యూసౌతుంది. అప్పుడను కలికాలమని, ఒప్పుకుంటాను. సరేనా?' అన్నాను.
'సరే నాయనా తప్పుతుందా? న్యూయార్క్ లో పరిస్థితి ఎలా ఉందో పాపం. యాండ్రూ ఇంటికెళ్లి చూసొచ్చి నీకు చెబుతా' అంది.
'వెళ్తే వెళ్ళావ్ గాని, కొంచం దూరంగా ఉండి చూసిరా. మరీ ఆయన దగ్గరకెళ్ళకు' అన్నా.
గుర్రుగా చూసి మాయమైపోయింది కర్ణపిశాచి.
గ్రహాలు పనిచేస్తున్నాయా లేదా మరి? చెప్పినవి జరుగుతున్నాయా లేదా మరి?
9, ఆగస్టు 2021, సోమవారం
ఈ అమావాస్య ఏమేం చేసింది?
4, ఆగస్టు 2021, బుధవారం
సెక్స్ పరమైన నేరాలు - ఇవిగో గ్రహప్రభావానికి రుజువులు
సింహరాశిలో కుజశుక్రుల వల్ల ఏమేం జరుగుతాయో వ్రాశాను. ఊహించినట్లే జరుగుతోంది గమనించండి.
హైదరాబాద్ లో పోష్ హోటల్లో దిగిన ఒక ప్రేమజంటలో అమ్మాయిని చంపి అబ్బాయి ఉరేసుకుని చనిపోయాడు. ఆ హోటల్ రూము హాంటెడ్ రూమయింది.
కేరళలో ఒక 24 ఏళ్ల మెడికోని, ప్రేమికుడినంటూ వెంటపడిన ఒకడు తుపాకీతో కాల్చేసి, తరువాత తనూ చనిపోయాడు. మంచి సినిమా తీసుకోవచ్చు చోటా డైరెక్టర్లు.
ఢిల్లీలో తొమ్మిదేళ్ల అమ్మాయిని శ్మశానంలోనే చంపేసి చడీచప్పుడు కాకుండా పూడ్చేశారు ముగ్గురు దుండగులు. వాళ్లలో ఒక పూజారిగాడు కూడా ఉన్నాట్ట. స్మశానంలో పూజారేంటో మరి? ఆ అమ్మాయి రేప్ కు గురైందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. అమ్మాయి శవానికి మళ్ళీ పరీక్షలు చెయ్యబోతున్నారు.
కావాలనే ఈ అమ్మాయి కులాన్ని నేను వ్రాయడం లేదు. మన మీడియాలో ఒక దరిద్రపు అలవాటుంది. ఒకే నేరంలో, కొన్ని కులాలనేమో ఎత్తి చూపుతారు. మిగతావాళ్ల కులాలగురించి మాట్లాడరు. దానివల్ల, ఆ ఒక్క కులంపైన సానుభూతి, మిగతా కులాలపట్ల బాధితులకు ద్వేషమూ పెరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. నేరం ఎవరు చేసినా నేరమే. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఏమాత్రం సమాజానికి మంచిని చెయ్యవు. కనుకనే నేను కులాన్ని చెప్పడం లేదు.
ఎవరైతే ఆ అమ్మాయిని అలా చంపేశారో, వాళ్ళకి ఉరే సరియైన శిక్ష. ఆ పూజారిగాడిని మాత్రం రెండుసార్లు ఉరి తియ్యాలి. ఎందుకంటే, పూజారై ఉండి అలాంటి పనిచేసినందుకు. అది హిందూ పూజారే కానక్కరలేదు. కేరళలోని కేథలిక్ ఫాదరైనా, మిడిల్ ఈస్ట్ లోని ముల్లాగాడైనా ఎవరైనా సరే, వాడికి మామూలు నేరస్తుడికంటే డబల్ శిక్ష పడాలి.
'గ్రహాలు అలా చేయిస్తున్నాయి మేమేం చెయ్యం?' అనే సొల్లు మాట్లాడకూడదు. అలా మాట్లాడేవాళ్ళని గ్రహాలతో తన్నించాలి. రేప్ చెయ్యమని గ్రహాలు మీకు చెప్పవు. గ్రహాలు ఒక సాధారణమైన ప్రభావాన్ని సృష్టిస్తాయి. దానిని ఎలా వాడుకోవాలో మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు, మబ్బులు కమ్మి వాన పడేటట్లుగా, హాయిగా ఉంటుంది. ఆ సమయంలో, ఒకడికి త్రాగాలనిపిస్తుంది. ఇంకొకడికి వేడివేడిగా ఏదో తినాలనిపిస్తుంది. మరొకడికి ఏదో విధంగా గొడవపెట్టుకుని ఎవడినైనా తన్నాలనిపిస్తుంది. కవిగాడికి కవిత్వం వ్రాద్దామనిపిస్తుంది. ఇంకొకడికి కళ్ళు మూసుకుని ధ్యానం చేద్దామనిపిస్తుంది.
మబ్బులు అందరికీ ఒకటే ఇచ్చాయి. దానిని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది మన సంస్కారాన్ని బట్టి, విచక్షణను బట్టి ఉంటుంది. సంస్కారం ఉన్నవాడు అలా చెయ్యడు, విచక్షణ ఉన్నవాడూ చెయ్యడు. సంస్కారమే విచక్షణనిస్తుంది. అవి రెండూ లేనప్పుడు చట్టభయమైనా ఉండాలి.
సంస్కారమూ, విచక్షణా, ధర్మం నుంచి వస్తాయి. ఇవి ఉన్నవాడు స్వతహాగానే తన హద్దుల్లో తానుంటాడు. వాడు దైవానికి భయపడతాడు గనుక. అవి లేనివాడు మనుషులు పెట్టిన చట్టానికైనా భయపడాలి. ఈ రెండూ లేనప్పుడు ఇలాంటి నేరాలే జరుగుతాయి.
వాతావరణం చల్లగా ఉందని, గ్రహప్రభావమని, మనిష్టం వచ్చినట్లు మనం చెయ్యకూడదు. చట్టానికైనా భయపడాలి, ధర్మానికైనా భయపడాలి. అప్పుడే మనిషి బ్రతుకు సరియైనదారిలో నడుస్తుంది.
దురదృష్టవశాత్తూ మన దేశంలో చట్టభయం లేదు. ఆ విధంగా ఇన్నాళ్లూ మనల్ని భ్రష్టుపట్టించిన పాపం ఇప్పటివరకూ పాలించిన ప్రభుత్వాలది, నాయకులది. చట్టభయం లేకుండా చేసి, వ్యవస్థను భ్రష్టుపట్టించింది నాయకులే. అమెరికాలో చట్టభయం చాలా ఎక్కువ. అక్కడేమీ మనకంటే ధర్మాత్ములేమీ లేరు. కానీ చట్టానికి భయపడి రుజువుగా ఉంటారు.
ఇకపోతే, తమంతట తాముగా ధర్మాన్ని అనుసరించేవారు, మన పుణ్యభూమిలో నైనాసరే, ఎందరున్నారు? చాలా తక్కువ. అందుకే ఇలాంటివి జరుగుతున్నాయి.
ఎదురుగా సమాధులు కనిపిస్తున్నా కూడా మనిషికి చట్టమూ గుర్తురాదు, ధర్మమూ గుర్తు రాదు. ఎంత విచిత్రం?
గ్రహప్రభావం అంటే ఇదేనేమో మరి? సారీ, ఈ మాటంటే గ్రహాలకు కోపమొస్తుంది. మనిషి దిగజారుడుతనానికి పరాకాష్ట అంటే సరిపోతుంది.
నిర్భయకేసులాగా ఎనిమిదేళ్లు తాత్సారం చెయ్యకుండా, ఈ కేసునైనా త్వరగా తేలిస్తే దేశం ఊరటపడుతుంది.
2, ఆగస్టు 2021, సోమవారం
టర్కీలో కార్చిచ్చులు
బుధవారం మొదలైనాయి కార్చిచ్చులు. ఇప్పటిదాకా 98 కార్చిచ్చులను గుర్తించారు. వీటి దెబ్బకు అడవులు తగలబడిపోతున్నాయి. ఊళ్లలోకి కూడా వ్యాపించిన మంటలు ఇళ్లను కూడా తగలబెట్టేస్తున్నాయి. అడవి జంతువులు సజీవదహనం అవుతున్నాయి.
ముఖ్యంగా మెడిటరేనియన్ తీరంలో ఈ దహనకాండ ఎక్కువగా జరుగుతోంది. బుధసూర్యులిద్దరూ కర్కాటకంలో ఉంటూ సముద్రతీరాన్ని సూచిస్తున్నారని ఈ సందర్భంగా గమనించాలి.
సరిగ్గా బుధవారం నాడే బుధుడు సూరుడికి నాలుగుడిగ్రీల దూరంలోకి వస్తూ తీవ్ర అస్తంగత్వదోషానికి గురయ్యాడు. ధనూరాశి 5 వ డిగ్రీమీద టర్కీ ఉంటుంది. ధనుస్సుకు ఇంకా పాపార్గలదోషం పోలేదు. సింహరాశి అగ్నితత్వ రాశి, కుజుడు అగ్నితత్వ గ్రహం. రెండూ కలసినప్పుడు అగ్ని ప్రజ్వరిల్లుతుంది. కుజుని కోణదృష్టి సరిగ్గా టర్కీమీద పడుతున్నది. మరేం జరగాలి? జరగాల్సిందే జరుగుతుంది.
సింహరాశి అడవులనూ, జంతువులనూ సూచిస్తుందని గుర్తుంటే అడవులూ జంతువులూ ఎందుకు తగలబడుతున్నాయో అర్ధమౌతుంది.
విర్రవీగడానికి మానవజన్మలో ఎటువంటి అవకాశమూ లేదన్న విషయమూ, కర్మకు ఎవరూ అతీతులు కారన్న విషయమూ, డబ్బులున్నంత మాత్రాన కర్మను తప్పుకోవడం సాధ్యం కాదన్న విషయమూ, మన అనుభవంలోనే ఇప్పటికి కొన్ని వేలసార్లు రుజువైంది.
టర్కీలో ఇదే మళ్ళీ రుజువైంది.