Once you stop learning, you start dying

2, ఆగస్టు 2021, సోమవారం

టర్కీలో కార్చిచ్చులు

టర్కీ తగలబడుతోంది.

బుధవారం మొదలైనాయి కార్చిచ్చులు. ఇప్పటిదాకా 98 కార్చిచ్చులను గుర్తించారు. వీటి దెబ్బకు అడవులు తగలబడిపోతున్నాయి. ఊళ్లలోకి కూడా వ్యాపించిన మంటలు ఇళ్లను కూడా తగలబెట్టేస్తున్నాయి. అడవి జంతువులు సజీవదహనం అవుతున్నాయి. 

ముఖ్యంగా మెడిటరేనియన్ తీరంలో ఈ దహనకాండ ఎక్కువగా జరుగుతోంది. బుధసూర్యులిద్దరూ కర్కాటకంలో ఉంటూ సముద్రతీరాన్ని సూచిస్తున్నారని ఈ సందర్భంగా గమనించాలి.

సరిగ్గా బుధవారం నాడే బుధుడు సూరుడికి నాలుగుడిగ్రీల దూరంలోకి వస్తూ తీవ్ర అస్తంగత్వదోషానికి గురయ్యాడు. ధనూరాశి 5 వ డిగ్రీమీద టర్కీ ఉంటుంది. ధనుస్సుకు ఇంకా పాపార్గలదోషం పోలేదు. సింహరాశి అగ్నితత్వ రాశి, కుజుడు అగ్నితత్వ గ్రహం. రెండూ కలసినప్పుడు అగ్ని ప్రజ్వరిల్లుతుంది. కుజుని  కోణదృష్టి సరిగ్గా టర్కీమీద పడుతున్నది. మరేం జరగాలి? జరగాల్సిందే జరుగుతుంది.

సింహరాశి అడవులనూ, జంతువులనూ సూచిస్తుందని గుర్తుంటే అడవులూ జంతువులూ ఎందుకు తగలబడుతున్నాయో అర్ధమౌతుంది.

విర్రవీగడానికి మానవజన్మలో ఎటువంటి అవకాశమూ లేదన్న విషయమూ, కర్మకు ఎవరూ అతీతులు కారన్న విషయమూ, డబ్బులున్నంత మాత్రాన కర్మను తప్పుకోవడం సాధ్యం కాదన్న విషయమూ, మన అనుభవంలోనే ఇప్పటికి కొన్ని వేలసార్లు రుజువైంది.

టర్కీలో ఇదే మళ్ళీ రుజువైంది.