నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

29, జూన్ 2022, బుధవారం

కన్హయ్యా లాల్ హత్య - ముస్లిం దేశాలు మాట్లాడవేంటి? మేధావులు మాట్లాడరేంటి?

రాజస్థాన్ లోని ఉదయపూర్ లో కన్నయ్యా లాల్ అనే పేద టైలర్ని ఇద్దరు ముస్లిం రాక్షసులు కిరాతకంగా గొంతు నరికి చంపేశారు. కారణం? నూపుర్ శర్మను సపోర్ట్ చేస్తూ అతను పేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ !  

అంతేకాదు ! ఆ హత్యను వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టి, ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు !

చాలా బాగుంది కదా !

పైగా, ఇస్లాంపైన జరిగిన దాడికి ప్రతీకారంగా ఈ పని చేస్తున్నామని వాళ్ళు చెప్పారు.

విచిత్రంగా, ఇప్పుడు ఒవైసీ ఏమీ మాట్లాడడు. గల్ఫ్ దేశాలైన, కతార్, ఇరాన్, కువైట్, బహ్రెయిన్, ఒమాన్, ఇరాక్, లిబియా, టర్కీలు ఏమీ మాట్లాడవు. మానవహక్కుల సంఘాలూ, కమ్యూనిస్టులూ, మేధావులూ, శాంతిదూతలైన క్రైస్తవులూ, ఎవరూ ఏమీ మాట్లాడరు. ఇది వాళ్లకు చాలా మానవత్వం ఉన్న చర్యగా, చాలా మంచిపనిలాగా కనిపిస్తుంది !

కన్నయ్యా లాల్ కి మాత్రం తన అభిప్రాయాలను శాంతియుతంగా వ్యక్తీకరించే హక్కు లేదు. ఈ ఇద్దరు ముస్లిమ్స్ కి మాత్రం సాటిమనిషిని మెడ నరికి చంపేసే హక్కు ఉంది.

షరియా న్యాయం ఇలా ఉంటుందేమో? భలే ఉంది కదూ !

మనం ఇండియాలో, ఒక రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నామా? లేక ఆటవిక షరియా అమలులో ఉన్న రాతియుగపు అరేబియాలో బ్రతుకుతున్నామా?

ఈలోపల బెంగాల్ ఇమామ్స్ అసోసియేషన్ పెద్దలొచ్చి, 'ఇది చాలా పాపం. సాటి మనిషిని చంపడాన్ని ఇస్లాం ఒప్పుకోదు. ఎవరో ఇద్దరు చేసిన పనికి ఇస్లాంను దూషించడం తప్పు' అని గొప్ప స్టేట్ మెంట్ ఇచ్చారు.

అవునా? నిజంగా?

మీ మాటే నిజమైతే, ఇస్లాం మూలపురుషులందరూ పాపులే కదా? ఇస్లాం చరిత్రే రక్తసిక్తమైన చరిత్ర. స్వయానా మహమ్మద్ ప్రవక్త కొన్ని వేలమందిని తన కత్తికి బలిచేశాడు. ఆయన మామగారు, అల్లుడు, అనుచరులూ ఒక్కొక్కరూ వేలాదిమందిని చంపేశారు. సుల్తానులందరూ యుద్ధాలలో లక్షలాదిమందిని చంపేశారు. భూమిని మానవరక్తంతో తడిపారు. ఇస్లాం ప్రకారం సాటిమనిషిని చంపడం పాపమైతే, మరి వీళ్లంతా చేసినది కూడా పాపమేగా?

ఒప్పుకుంటారా?

'అలాకాదు. వాళ్ళు ఇస్లాం కోసం చంపారు. అది ధర్మం' - అని మీరంటారు అంతే కదా !

అంటే, ఇస్లాం కోసం ముస్లిమ్స్ కానివారిని చంపవచ్చని ఖురాన్ చెబుతున్నది. ఆ సూరాలు మీకూ తెలుసుగా? మరి ఈ కోణంలో చూసినప్పుడు, ఈ ఇద్దరు ముస్లిమ్స్ చేసినది తప్పుకాదు. దీనినే పాకిస్తాన్ నమ్ముతున్నది. ఇతర ముస్లిం దేశాలన్నీ నమ్ముతున్నాయి. అందుకే ఖండించకుండా మౌనంగా ఉన్నాయి. అలాంటప్పుడు, మీరిచ్చిన ఈ స్టేట్ మెంట్ తప్పే కదా !

మరి, IPC ప్రకారం వీళ్ళిద్దరినీ శిక్షించడం తప్పా? రైటా? అసలు మన దేశంలో షరియా ఏంటి? మనకున్నది IPC, CRPC లే గాని, షరియా కాదు. అది ఆటవిక న్యాయం. ఏడో శతాబ్దంలో అరేబియాలో ఉండేది. 21 శతాబ్దంలో ఇండియాకూ దానికీ సంబంధం ఏమిటి?

ఎందుకీ విధంగా లోకాన్ని ఇంకా ఇంకా నమ్మించాలని చూస్తారు?

సాక్షాత్తూ ఒక దేశపు ప్రధానమంత్రికే వార్ణింగ్ ఇచ్చే స్థాయిలో ఒక కిరాణాకొట్టు నడిపేవాడూ, ఒక మసీదులో పనిచేసేవాడూ ఉన్నారు. వాళ్లకు నచ్చనివారిని నరికి చంపేస్తున్నారు. దీనిని మీ మతం సమర్ధిస్తున్నది. దానిని మీరు సమర్ధించుకుంటున్నారు. చాలా బాగుంది మీ మతం ! మేధావులు మాట్లాడరేంటి?

ఇది 21 వ శతాబ్దం. ఇంకా ఏడో శతాబ్ధాన్ని వదల్లేకుండా ఉన్నారట్టుంది మీరు. రాతియుగాన్ని దాటి కొంచం నవీనకాలం లోకి రండి. జంతువులుగా బ్రతకడం కాదు. మనుషులుగా బ్రతకడం నేర్చుకోండి.

శాంతిమతంలో ఎంత 'శాంతి' ఉందో అందరికీ తెలుస్తూనే ఉంది. రక్తం కారుతున్న మీ దైవగ్రంధాన్ని చూపిస్తూ, 'ఇది లోపల చాలా తెల్లగా ఉంటుంది' అని మీరు చెబితే నమ్మడానికి లోకం సిద్ధంగా లేదు !