Pages - Menu

Pages

23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

మూడవ అమెరికా యాత్ర - 23 (ఇస్లాం లోని మూఢాచారాలను తిరస్కరిస్తున్న ఇరాన్ మహిళలు)

మతమంటే ఒక భావజాలం. ఒక మార్గం. 'ఎన్ని మతాలో అన్ని మార్గాలు' అన్నారు శ్రీ రామకృష్ణులు. మతాలన్నీ ఒకే భగవంతుని చేరడానికి గల రకరకాల మార్గాలు. అయితే, అవి పుట్టినది మంచి ఉద్దేశంతోనైనా, రానురాను అవే మానవులకు సంకెళ్లయి కూచున్నాయి. శ్రీ రామకృషులు ఇంకా ఇలా అనేవారు, 'మతాలు పుట్టింది మనుషులను కలపడానికి, కానీ అవే వారిమధ్యన అడ్డుగోడలను కడుతున్నాయి'. ఆయనీ మాట అని నూట ఎనభై ఏళ్లయింది. కానీ నేటికీ పరిస్థితిలో పెద్ద మార్లు రాలేదు. దీనికి ఏ మతమూ మినహాయింపు కాదు. కాకుంటే కొన్ని ఎక్కువ, కొన్ని తక్కువ అంతే. 

ఇస్లామంటే ఏదో చాలా ఉదారవాదమతమని కొంతమంది చెబుతూ ఉంటారు. కానీ దానంత మూఢనమ్మకాల మతం ఇంకొకటి ఉండదు. మిగతా మతాలు కాలంతో మారుతున్నాయి. కానీ ఇస్లాం ఇంకా మధ్యయుగాల చీకట్లోనే కూరుకుపోయి ఉన్నది. బయటకు రానంటున్నది. బయటకు తెద్దామని ప్రయత్నించేవారిని కబళిస్తున్నది.

ఆడదానికి పరదా వెయ్యడం అనేది పదమూడొందల ఏళ్ల క్రితం అరేబియా ఎడారి దొంగల గుంపులలో అవసరం అయ్యి ఉండవచ్చు. నాగరిక సమాజంలో అది అవసరం లేదు. నేటి సైన్స్ సమాజంలో పరదా అనేది ఒక నవ్వులమారి పని. ఆడది పరదా వేసుకుని ఒక నల్లటి భూతం లాగా సమాజంలో తిరగవలసి పని నేడు లేనే లేదు. పరదాను సమర్ధించుకోడానికి ఇస్లామిక్ హింసావాదులు చెప్పే కారణాలన్నీ బూటకాలే. వాటికి సైన్స్ పరంగా కానీ, సమాజపరంగా కానీ ఏ విధమైన బలమూ లేదు.

హింసాత్మక ఇస్లాంకు కేంద్రబిందువైన ఇరాన్ లోనే నేడు పరదా మీద తిరుగుబాటు రేగుతున్నది. ఆడవాళ్లే దీనికి ఉద్యమిస్తున్నారు. పబ్లిక్ గా పరదాలను తీసేసి తగలబెడుతున్నారు. 'ఈ చీకటి యుగపు బానిసత్వ గుర్తు మాకొద్దు' అని నినదిస్తున్నారు. అరాచక  ఇరాన్ ప్రభుత్వం వారిని అణచివేస్తున్నది. 'పరదా మాకొద్దు' అని తిరగబడిన మహసా అమిని అనే 22 ఏళ్ల అమ్మాయిని ఇరాన్ మోరల్ పోలీసులు అరెస్ట్ చేసి బాగా కొట్టి చంపేశారు. దీనిమీద ఇరాన్ లో చాలాచోట్ల తిరుగుబాట్లు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా వంటి ఉదారవాద దేశాలు ఇరాన్ ను, ఇస్లాం ను తప్పుపడుతున్నాయి.

ఇస్లాం చాలా మారవలసి ఉన్నది. ఆ మార్పు దాని లోపలనుంచే రావాలి. ఎందుకంటే బయటవాళ్ళు చెబితే వినేటంత మానసిక పరిపక్వత దానిలో లేదు. ఈ మాటను పాకిస్తాన్ తో సహా ఎన్నో దేశాలలో ఉన్న ఇస్లామిక్ ఆలోచనాపరులు మేధావులే అంటున్నారు.

ఏ కట్టుబాటైనా, ఏ రూలైనా ఎన్నాళ్లుంటుంది? మారుతున్న కాలంతో అదీ మారక తప్పదు. ఇస్లాం అనేది కూడా కాలానికి అతీతమేమీ కాదు. అదీ కాలంలో పుట్టినదే, కాలంతో మారాల్సిందే.  'నేను మారను' అని కూచుంటే సాగదు. కోట్లాది సంవత్సరాల కాలగమనంలో ఇస్లాం లాంటి మతాలు ఎన్ని పుట్టాయి? ఎన్ని పోయాయి?

విచిత్రమేంటంటే, ఇస్లాం మతం పుట్టిన అరేబియాలోనే దానిపైన తిరుగుబాట్లు వెల్లువెత్తుతున్నాయి.  దీనికి ఆడాళ్లే ముందుకొచ్చి ప్రాణత్యాగాలు చేస్తున్నారు. కానీ, హిందూదేశంలో మాత్రం, చీకటి యుగాల ఇస్లాం ఇంకా ఇంకా ముదురుతోంది. దానిని మారనివ్వకుండా కొంతమంది సాయిబులే అడ్డుపడుతున్నారు. దానికి కొమ్ము కాస్తోంది మన రాజ్యాంగం.  ఎంత గొప్ప రాజ్యాంగాన్ని వ్రాసి మన నెత్తిన రుద్దిపోయారో మహానుభావులు? వారిని రోజూ తలుచుకుని కొబ్బరి కాయలు కొట్టాలి కదూ !

ఇరాన్ లోని ఒరిజినల్ ముస్లిములు 'బురఖా మాకొద్దు' అంటున్నారు. మతం మారి ముస్లిములైన ఒకప్పటి హిందువులు మాత్రం 'బురఖా మాక్కావాలి' అంటున్నారు. అక్కడ వద్దని ఉద్యమాలు చేస్తుంటే, ఇక్కడ కావాలని కోర్టులకెక్కుతున్నారు. భలే కామెడీగా ఉంది కదూ ! 

అది సరేగాని, నేటి కాలంలో కూడా ఆడవాళ్లకు బురఖాలు పరదాలు అవసరమా అసలు?  దీనికింత గోలెందుకు? చిన్నపిల్లాడిక్కూడా అర్ధమౌతుంటే?