ఇండియాలో చరిత్ర ఇదేవిధంగా వక్రీకరించబడింది. నెహ్రు కేబినెట్ లో విద్యాశాఖ మంత్రి అయిన అబుల్ కలాం ఆజాద్ ఒక పక్కా ప్లాన్ తో మనదేశ చరిత్రను పూర్తిగా వక్రీకరించాడు. దానికి నెహ్రు వంతపాడాడు. ఆ విధంగా మన చరిత్రను వక్రీకరించడం కోసమే ఆజాద్ ను కావాలని విద్యాశాఖ మంత్రిగా చేశాడు నెహ్రూ.
దీనిఫలితంగా ఏం జరిగింది? మనపైన దండెత్తి వచ్చి, నానాఘోరాలు చేసి, మన దేవాలయాలను, మన యూనివర్సిటీలను, మన శిల్పసంపదను, మన గ్రంధాలను నాశనం చేసిన అరబ్బులు, తుర్కులు, ముఘల్స్ మొదలైన రాక్షసులు చాలా గొప్పవాళ్ళని, బట్టలు కట్టుకోవడం కూడా రాకుండా ఆటవికులలాగా బ్రతుకుతున్న భారతీయులకు బట్టలు కట్టుకోవడం నేర్పించినది వాళ్లే అన్నట్టుగా పుస్తకాలలో వాళ్ళని గ్లోరిఫై చేసి, మన కాలేజీలలో, యూనివర్సిటీలలో గత 70 ఏళ్లుగా అబద్దాల చరిత్రను మనకు రుద్దుతూ వచ్చారు. అది నిజమని లక్షలాదిమంది అమాయకులైన విద్యార్థులు నేటికీ నమ్ముతున్నారు. ఇది నెహ్రు చేసిన, చేయించిన పాపాలలో ఒకటి.
గోబెల్స్ ప్రచారం ఎఫెక్ట్ ఇలా ఉంటుంది.
అదేవిధంగా, తనను తాను రక్షించుకోలేక, రోమన్ సైనికుల చేతులలో హతమై పోయిన జీసస్, లోకం మొత్తాన్ని రక్షిస్తాడని అబద్దాలు అల్లి ప్రచారం చేస్తూ, రెండువేల ఏళ్లుగా ప్రపంచాన్ని మోసం చేస్తూ వస్తున్నది చర్చ్. అది పక్కా అబద్దమని, ఏమాత్రం తెలివి ఉన్న మనిషికైనా ఎన్నో రుజువులు కనిపిస్తాయి.
జీసస్ తర్వాతనే ప్రపంచానికి రక్షణ వచ్చే పనైతే, అంతకు ముందున్న కోట్లాది ప్రజలకు రక్షణ లేదా? అప్పుడు దేవుడు నిద్రపోతున్నాడా? అనే ప్రశ్నకు జవాబు లేదు.
మరో ప్రశ్న !
ఇస్లాం ద్వారానే రక్షణ అని ఖురాన్ చెబుతుంది. ఇస్లామనేది జీసస్ తర్వాత 700 ఏళ్లకు వచ్చింది. మరి ఇస్లాం చెప్పేది నిజమైతే, క్రైస్తవం చెప్పేది అబద్దం కావాలి. క్రైస్తవం నిజమైతే ఇస్లాం అబద్దం కావాలి. ఈ రెండు మతాలకంటే ప్రాచీనమైన యూదుమతం చెప్పేది నిజమైతే, క్రైస్తవమూ, ఇస్లామూ రెండూ అబద్దాలు కావాలి. ఇదొక చిక్కుముడి. ఈ మూడు మతాలలో ఏది నిజం చెబుతున్నది? ఏది అబద్దం చెబుతున్నది?
ఈ ప్రశ్నకు జవాబు లేదు. ఈ సమస్యకు పరిష్కారం లేదు.
భారతీయులమైన మనమేమంటామంటే, ఈ మూడు మతాలూ చెబుతున్నది అబద్దమే అంటాం. కారణం? వీటిలోని ప్రతి ఒక్కటీ, మిగతా రెండు మతాలు అసత్యాలంటాయి. తమను నమ్మితేనే రక్షణ అని యూదుమతమూ, క్రైస్తవమూ, ఇస్లామూ బల్లగుద్ది మరీ చెబుతాయి. మరి, ఈ మూడింటిలో ఏది సత్యం? ఏది అబద్దం?
మూడూ అబద్ధాలే అని నేనంటాను. అసలు 'రక్షణ' అనే భావమే చాలా హాస్యాస్పదమైన భావన. ఉన్నది బంధము, మోక్షమే గాని, రక్షణ అనేది అసలు విషయం కానే కాదు. రక్షణ అనేది చాలా ప్రిమిటివ్ థింకింగ్. అది జ్ఞానవంతమైన భావన కాదు.
ఖురానును నమ్మి, అల్లాను నిరంతరం ప్రార్ధించే పాకిస్తాన్, అడుక్కుతినే స్థితికి వచ్చేసింది. ప్రపంచదేశాలన్నీ, ఒక గజ్జికుక్కను అసహ్యించుకున్నట్లు పాకిస్తాన్ను అసహ్యించుకుంటున్నాయి.
అల్లాను ఎపుడూ ప్రార్థిస్తూ, ఇండియాను అమితంగా ద్వేషించే సిరియా, తుర్కీయేలు నిన్నా మొన్నటి భూకంపంతో దిక్కుతెలీని స్థితిలో ఉన్నాయి. ఈ భూకంపాలలో 33,000 మంది (వీళ్ళలో ఎక్కువమంది ముస్లిములు) కేవలం పదే పది నిముషాలలో చనిపోయారు. మరి ఆ మహాభక్తులను అల్లా ఎందుకు రక్షించలేదు? ప్రతిరోజూ తాము ద్వేషించి, వ్యతిరేకించే కాఫిర్ భారతదేశం నుంచి సహాయాన్ని నేడు అడుక్కోవలసిన స్థితిలో ఎందుకున్నాయి ఈ దేశాలు? అల్లా ఎందుకు తన భక్తులను రక్షించడం లేదు?
సరే, ఇలాంటి చిక్కుప్రశ్నలను తెలివైన ఆలోచనాపరులకు వదలిపెట్టి, తెలివిలేని మనం మాత్రం ప్రస్తుతానికి, జీసస్ ని గుడ్డిగా నమ్ముదాం. జీసస్ లోకరక్షకుడే. కాసేపు ఒప్పుకుందాం. కానీ ఆ రక్షకుడికే రక్షణ లేకుండా పోయింది ఇప్పుడు.
ఈ మధ్యనే, దీనిని రుజువు చేసే ఓక సంఘటన జరిగింది
'రియో డి జనైరో' అని బ్రెజిల్లో ఒక సిటీ ఉంది. అక్కడ 'క్రీస్ట్ ద రిడీమర్' అని ఒక పెద్దవిగ్రహం ఉంటుంది. చేతులు చాచి ప్రపంచాన్ని తాను రక్షిస్తానని చెబుతున్నట్లుగా ఈ విగ్రహాన్ని ఒక కొండ మీద చెక్కారు. చెక్కించింది ఎవరు? విగ్రహారాధనను ఏమాత్రమూ ఒప్పుకోని క్రైస్తవ మతానుసారులు. అంటే, వేరేవాళ్ళ విగ్రహాలను వాళ్ళు ఒప్పుకోరు. జీసస్ విగ్రహాన్ని మాత్రం బాగా ఒప్పుకుంటారు.
అదేమరి, చెప్పేదొకటి చేసేదొకటి అంటే! అదేమంటే మేం కేథలిక్స్ అంటారు.
మొన్న 10 తేదీన ఈ విగ్రహం పైన ఒక పిడుగు పడింది. అంటే, రక్షకుడే మరొకసారి తనను తాను రక్షించుకోలేకపోయాడు. రెండువేల ఏళ్ళ క్రితమూ రక్షించుకోలేక పోయాడు. మళ్ళీ ఇప్పుడు కూడా రక్షించుకోలేక పోయాడు. చూడబోతే, రక్షకుడికే ఇంకా రక్షణ లభించనట్లుగా కనిపిస్తోంది !
పంచభూతాలను జీసస్ శాసించాడని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆయన గద్దిస్తే తుఫాన్ ఆగిపోయిందని న్యూ టెస్టమెంట్లో వ్రాశారు. మరి, పిడుగుకు తెలీదా, 'అది జీసస్ విగ్రహం, దానిమీద తను పడకూడదు' అని?
పిడుగుకు బుద్ధి లేదా అన్నది నా డౌటు?
పోనీ పిడుగుకు తెలివి లేదు. ఒప్పుకుందాం, మరి జీసస్ శక్తి ఏమైపోయింది? 'ఏయ్ నేనెవరనుకున్నావు? నామీదకి రాకు' అని పిడుగును జీసస్ ఎందుకు గద్దించలేదు? అంటే, ఆ విగ్రహంలో జీసస్ లేనట్టే కదా? మరి అలాంటప్పుడు వేలాదిమంది ప్రతిరోజూ ఆ విగ్రహాన్ని దర్శించి ఎందుకు మొక్కుతున్నారు? వాళ్ళు మొక్కుతున్నది ఉత్త రాతిబొమ్మకేనా? దానికి జీవం ఉందా లేదా? జీవం ఉంటే, పిడుగు దానినెలా తాకింది? జీవం లేకపోతే, అలాంటి విగ్రహాన్ని అసలెందుకు అంతమంది దర్శించడం?
ఏంటో? అన్నీ జవాబులు లేని ప్రశ్నలే. ప్రశ్నించేవాడికి క్రైస్తవంలో, ఇస్లాంలో జవాబులు ఎక్కడా దొరకవు.
అల్లా అంటూ రోజుకు అయిదుసార్లు మైకులో పెద్దగా అరిచే ఇస్లామిక్ టెర్రరిస్ట్ దేశాలేమో ఘోరమైన దెబ్బలు తిని చతికిలబడి, అడుక్కునే దేశాలైపోయాయి. జీసస్ విగ్రహాన్నేమో పిడుగు కొట్టేసింది.
అయినా సరే, ఈ రెండు మతాలూ ఏమాత్రమూ మారవు. తెలివి తెచ్చుకోవు.
మనుషుల అజ్ఞానానికి ఇవే లేటెస్ట్ ఉదాహరణలు !